పుష్ప 2: ది రూల్
పుష్ప 2: ది రూల్ | |
---|---|
దర్శకత్వం | సుకుమార్ |
రచన | సుకుమార్ శ్రీకాంత్ విస్సా (డైలాగ్స్) |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | మిరోస్లా కుబా బ్రోజెక్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 5 డిసెంబరు 2024 |
సినిమా నిడివి | 200 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹400–500 కోట్లు[2] |
పుష్ప 2: ది రూల్, 2024లో వచ్చిన యాక్షన్ డ్రామా తెలుగు సినిమా. ఈ సినిమా 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు.
‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో రిలీజైన తొలిరోజే రూ.294 కోట్లు వసూళ్లు రాబట్టి, భారత సినీ చరిత్రలో తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.[3][4]
తారాగణం
[మార్చు]- అల్లు అర్జున్ - పుష్ప రాజ్
- ఫహద్ ఫాసిల్ - ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్, ఐపీఎస్
- రష్మిక మందన్న [5][6] - శ్రీవల్లి, పుష్ప భార్య
- జగదీష్ ప్రతాప్ బండారి - కేశవ, పుష్ప స్నేహితుడు
- జగపతి బాబు [7] - కొగటం వీర ప్రతాప్ రెడ్డి, కేంద్ర మంత్రి
- సునీల్ - మంగళం శ్రీను
- అనసూయ భరద్వాజ్ - దాక్షాయణి "దక్ష", మంగళం శ్రీను భార్య
- రావు రమేష్ - భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు, ఎంపీ
- షణ్ముఖ్ - జక్కా రెడ్డి
- అజయ్ - మొల్లేటి మోహన్ రాజ్, పుష్ప అన్నయ్య
- శ్రీతేజ్- మొల్లేటి ధర్మ రాజ్, పుష్ప రెండవ అన్నయ్య
- కల్పలత - పార్వతమ్మ, పుష్ప తల్లి
- తారక్ పొన్నప్ప[8]- కోగటం బుగ్గిరెడ్డి, ప్రతాప్ రెడ్డి మేనల్లుడు
- సత్య - జపనీస్ అనువాదకుడు
- పావని కరణం, మొల్లేటి కావేరి, పుష్ప అన్న కూతురు
- సౌరభ్ సచ్‌దేవా - హమీద్
- ఆదిత్య మీనన్ - కొగటం సుబ్బారెడ్డి, ప్రతాప్ రెడ్డి సోదరుడు, బుగ్గిరెడ్డి తండ్రి
- మైమ్ గోపి - చెన్నై మురుగన్
- బ్రహ్మాజీ - కుప్పరాజు, సబ్ ఇన్స్పెక్టర్
- ఆడుకలం నరేన్ - సీఎం నరసింహారెడ్డి
- దయానంద్ రెడ్డి - మునిరత్నం, శ్రీవల్లి తండ్రి
- బిందు చంద్రమౌళి - కావేరి తల్లి, మోహన్ భార్య
- దివి వడ్త్యా - మిన్ను ఉమా దేవి, టీవీ రిపోర్టర్
- శ్రీలీల - "కిస్సిక్" పాటలో (అతిధి పాత్ర)
- ధనంజయ - జాలి రెడ్డి (అతిధి పాత్ర)
- ఐరేని మురళీధర్ గౌడ్
పాటలు
[మార్చు]సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "పుష్ప పుష్ప" | నకాష్ అజీజ్, దీపక్ బ్లూ | 4:16 |
2. | "సూసేకి[9]" (కపుల్ సాంగ్) | శ్రేయ ఘోషాల్ | 4:20 |
3. | "కిస్సిక్" | సుబ్లాషిణి | 4:08 |
4. | "పీలింగ్స్" | శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాస[10][11][12][13][14] | 4:07 |
5. | "గంగో రేణుక తల్లి" | వీఎం మహాలింగం | 3:28 |
తొక్కిసలాట
[మార్చు]2024 డిసెంబరు 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించిన హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. దీనికి అధిక సంఖ్యలో అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవ్వడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. నగరానికి చెందిన ఒక కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. ఈ దుర్ఘటనలో ఒక మహిళ మరణించగా, ఆమె 13 ఏళ్ల కుమారుడూ తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని కూడా నిందితుల లిస్ట్ లో చేర్చారు.[15][16] ఈ కేసు విషయం లో అల్లు అర్జున్ ను 2024 డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.[17] రిమాండ్ రిపోర్టులో అల్లు అర్జున్ ని ఏ-11గా పేర్కొన్న పోలీసులు నాంపల్లి కోర్టులో అదే రోజు హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.[18] దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.[19]
అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో డిసెంబరు 13 రాత్రంతా జైలులోనే ఉన్న అనంతరం 2024 డిసెంబరు 14న ఉదయం 6.45 గంటలకు అల్లు అర్జున్‌తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని చంచల్‌గూడ జైలు నుండి విడుదల చేశారు.[20]
విమర్శకుల మాటలలో
[మార్చు]న్యూస్18 యొక్క నిషాద్ థైవలప్పిల్ 5/5 నక్షత్రాలు ఇచ్చారు. డిఎన్ఎ ఇండియా యొక్క సిమ్రన్ సింగ్ 4.5/5 నక్షత్రాలు ఇచ్చారు. ఫస్ట్‌పోస్ట్ యొక్క గణేశ్ ఆగ్లావే 4/5 నక్షత్రాలు ఇచ్చారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క పాల్ నికోడెమస్ 3.5/5 నక్షత్రాలు ఇచ్చారు.
భవిష్యత్తు
[మార్చు]చిత్రం యొక్క పోస్ట్-క్రెడిట్స్ సీన్ దాని మూడవ భాగం వస్తుందని, పేరు పుష్ప 3: ది రాంపేజ్ అని వెల్లడించింది.
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (28 November 2024). "అఫీషియల్.. 'పుష్ప2' రన్‌టైమ్ ఇదే.. అత్యధిక నిడివి గల తెలుగు చిత్రాలివే". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ "Rs 100 crore for Allu Arjun, Rs 200 crore in production cost! Pushpa 2's budget will blow your mind". India Today. Retrieved 11 May 2022.
- ↑ Eenadu (6 December 2024). "భారతీయ సినీ చరిత్రలో 'పుష్ప2' రికార్డు.. ఫస్ట్ డే వసూళ్లు ఇవే". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ NT News (6 December 2024). "ఆర్ఆర్ఆర్ ను దాటేసిన అల్లు అర్జున్.. 'పుష్ప 2' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.!". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ "Sai Pallavi reportedly joins Allu Arjun, Rashmika Mandanna in Pushpa 2; fans can't keep calm". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-03-08. Archived from the original on 2023-03-10. Retrieved 2023-03-10.
- ↑ FocusWay (2024-06-25). "Pushpa 2 Sooseki Song Lyrics in Telugu". FocusWay (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-03.[permanent dead link]
- ↑ "EXCLUSIVE: Jagapathi Babu confirms entry in Allu Arjun's Pushpa 2, says 'Sukumar gives me the best characters'". 20 April 2023.
- ↑ Chitrajyothy (18 November 2024). "Pushpa 2: సినిమా స్వరూపాన్నే మార్చే పాత్ర.. తారక్". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ Chitrajyothy (29 May 2024). "వీడు మొరటోడు.. మొండోడు..పసిపిల్లవాడు నా వాడు." Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
- ↑ ABP News (2 December 2024). ""పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ Prabha News (6 December 2024). "ఆరింటికోసారి అంటూ అదరగొట్టిన తెలంగాణ పల్లెగళం లక్ష్మీ దాస". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ హెచ్ఎం డిజిటల్ (5 December 2024). "పుష్ప2 సినిమాలో ఫీలింగ్స్ పాట పాడిన లక్ష్మీదాస.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ Disha (4 December 2024). "పల్లె నుండి పాన్ ఇండియా స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన తన పాట ప్రయాణం". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ Telangana Today (6 December 2024). "Pushpa 2 song 'Peelings' brings Nirmal's folk singer Laxmi Dasa into limelight" (in ఇంగ్లీష్). Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
- ↑ "Allu Arjun: పోలీసుల అదుపులో అల్లు అర్జున్.. | allu-arjun-detained-by-hyderabad-police". web.archive.org. 2024-12-13. Archived from the original on 2024-12-13. Retrieved 2024-12-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Allu Arjun Non Bailable Case: అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ కేస్.. సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది? – News18 తెలుగు". web.archive.org. 2024-12-13. Archived from the original on 2024-12-13. Retrieved 2024-12-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Murali (2024-12-13). "బిగ్ బ్రేకింగ్..అల్లు అర్జున్ అరెస్ట్". TeluguBulletin.com. Retrieved 2024-12-13.
- ↑ "Allu Arjun Remand : అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు-nampally court sent allu arjun to 14 days remand ,తెలంగాణ న్యూస్". web.archive.org. 2024-12-13. Archived from the original on 2024-12-13. Retrieved 2024-12-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Allu Arjun: అల్లు అర్జున్ రిలీజ్.. హైకోర్టు సంచలన తీర్పు.. | High Court Give Bail to Allu Arjun Amar". web.archive.org. 2024-12-13. Archived from the original on 2024-12-13. Retrieved 2024-12-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Eenadu (14 December 2024). "చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.