పెదయెరుకపాడు గ్రామీణ

వికీపీడియా నుండి
(పెదయెరుకపాడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పెదయెరుకపాడు గ్రామీణ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడివాడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 128
 - పురుషులు 65
 - స్త్రీలు 63
 - గృహాల సంఖ్య 47
పిన్ కోడ్ 521301
ఎస్.టి.డి కోడ్

పెదయెరుకపాడు, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామము.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]

పెదయెరుకపాడు నుండి గుడివాడ పట్టణం 2 కి.మీ. దూరంలో ఉంది.

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

విద్యుత్తు[మార్చు]

ఈ గ్రామములో రు. 1.8 కోట్ల వ్యయంతో, 4 ఫీడర్లుగల 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రానికి 2015, ఆగస్టు-12వ తేదీనాడు ప్రయోగాత్మక పరీక్ష (ట్రయల్ రన్) నిర్వహించారు. ఈ కేంద్రం నిర్మించుటవలన, హెడ్ వాటర్ వర్క్స్ కు 24 గంటలూ విద్యుత్తు సరఫరా లభించుటయేగాక, పరిసరప్రాంతాలయిన తట్టివర్రు, పెద యెరుకపాడు, మందపాడు గ్రామాలకు గూడా, అంతరాయం లేకుండా, నాణ్యమైన విద్యుత్తు సరఫారా జరుగును. [1]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలోని ఒక ఉపాలయం. ఈ ఆలయంలో 2015, డిసెంబరు-20వ తేదీ ఆదివారంనాడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం వేదపండితుల అధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో మంటపారాధన, నవగ్రహపూజలు, బాబాకు లక్ష తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. ప్రతిష్ఠ విగ్రహానికి ధాన్యధివాసం, క్షీరాధివాసం, జలధివాసం నిర్వహించారు. అనంతరం పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. [3]
  2. శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం మరియు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2016, ఫిబ్రవరి-28వ తేదీ ఆదివారంనాడు నిర్వహించెదరు. [5]
  3. శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం:- గ్రామములోని శతాబ్దాల కాలంనాటి, ఈ పురాతన ఆలయ జీర్ణోద్ధరణ పనుల కొరకు, 2016, నవంబరు-20వతేదీ ఆదివారంనాడు శంకుస్థాపన నిర్వహించారు. [6]
  4. శ్రీ షిర్డీ సాయి మందిరం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీమతి బేతపూడి సుధాంశకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, డాక్టరేట్ పట్టా ప్రదానం చేసారు. రసాయనశాస్త్రంలో, Studies of molicular inter actions in bainary mixtures combining benzine derivetives అను అంశంపై ఈమె సమర్పించిన పరిశోధనా వ్యాసానికి ఈమెకు డాక్టరేట్ లభించింది. [4]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 128 - పురుషుల సంఖ్య 65 - స్త్రీల సంఖ్య 63 - గృహాల సంఖ్య 47

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 199.[1] ఇందులో పురుషుల సంఖ్య 104, స్త్రీల సంఖ్య 95, గ్రామంలో నివాస గృహాలు 56 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-13; 27వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-21; 25వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016, జనవరి-28; 27వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, ఫిబ్రవరి-28; 2వపేజీ. [6] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, నవంబరు-21; 1వపేజీ.