సీపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీపూడి
—  రెవిన్యూ గ్రామం  —
సీపూడి is located in Andhra Pradesh
సీపూడి
సీపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′52″N 80°57′26″E / 16.414375°N 80.957101°E / 16.414375; 80.957101
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడివాడ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 898
 - పురుషులు 454
 - స్త్రీలు 444
 - గృహాల సంఖ్య 260
పిన్ కోడ్ 521301
ఎస్.టి.డి కోడ్

సీపూడి, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారి ఆలయం:- శిధిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని, శ్రీ చిట్టాప్రగడ వెంకటకృష్ణారావు కుటుంబీకులు, గ్రామస్థుల సహకారంతో పునఃప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు 2015,ఆరవ తేదీ శనివారం ప్రారంభమైనవి. ఈ సందర్భంగా, శనివారం ఆలయంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, వాస్తు మండపార్చన, వాస్తుబలి, వాస్తుక్షీరాభి, ప్రధాన హోమాలు నిర్వహించారు. సాయంత్రం నూతన విగ్రహాలతో గ్రామోత్సవం, గ్రామ బలిహరణ, అనంతరం ధాన్యాధివాసం, పంచసయ్యాదివాసం, పుష్పసయ్యాదివాసం, ప్రధాన హోమం, మండపార్చనలు విశేషంగా నిర్వహించారు. 7వతెదీ ఆదివారం ఉదయం 8-49 గంటలకు ధ్వజస్థంభ ప్రతిష్ఠ నిర్వహించెదరు. [1]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయాన్ని, శ్రీ మందల కుటుంబరావు, గ్రామస్థుల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దినారు. అనంతరం ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలను, 2015,జూన్-6వ తేదీ శనివారం వైభవంగా నిర్వహించారు. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, దేవతార్చన, అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠ, ప్రధాన హోమాలు నిర్వహించారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 898 - పురుషుల సంఖ్య 454 - స్త్రీల సంఖ్య 444 - గృహాల సంఖ్య 260

సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]

సీపూడి నుండి గుడివాడ పట్టణం 11 కి.మీ. దూరంలో ఉన్నది.

గ్రామ పంచాయతీ[మార్చు]

భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది.

మూలాలు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015,జూన్-7; 25వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=సీపూడి&oldid=3315240" నుండి వెలికితీశారు