బేతవోలు గ్రామీణ (గుడివాడ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేతవోలు గ్రామీణ (గుడివాడ)
—  రెవిన్యూ గ్రామం  —
బేతవోలు గ్రామీణ (గుడివాడ) is located in Andhra Pradesh
బేతవోలు గ్రామీణ (గుడివాడ)
బేతవోలు గ్రామీణ (గుడివాడ)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°25′49″N 80°58′49″E / 16.430282°N 80.980200°E / 16.430282; 80.980200
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడివాడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,983
 - పురుషులు 1,531
 - స్త్రీలు 1,452
 - గృహాల సంఖ్య 805
పిన్ కోడ్ 521301
ఎస్.టి.డి కోడ్ 08674

బేతవోలు, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 301., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తుTime zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]

హనుమాన్ జంక్షన్, వెంట్రప్రగడ, నందివాడ. బేతవోలు నుండి గుడివాడ పట్టణం 2 కి.మీ. దూరంలో ఉంది.

సమీప మండలాలు[మార్చు]

నందివాడ, గుడివాడ, పెదపారుపూడి, బాపులపాడు

రవాణా సౌకర్యాలు:[మార్చు]

గుడివాడ, వెంట్రప్రగడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. ఇది రైల్వే జంక్షన్ విజయవాడ రైల్వేస్టేషన్: 44 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఎస్.జి.వి.ఎస్.జి. పురపాలకసంస్థ ఉన్నత పాఠశాల[మార్చు]

శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్పాఠశాల పూర్వ విద్యార్థి.

ఈ పాఠశాల ఆవరణలో గజల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీ గజల్ శ్రీనివాస్, 2.5 లక్షల వ్యయంతో చేపట్టి, నిర్మించిన నీటి శుద్ధికేంద్రం (ఆర్.వో.ప్లాంట్) 2017,ఆగస్టు-24న ప్రారంభమైనది. [8]

మండల ప్రజాపరిషత్ హైస్కూల్[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

శాంతి వృద్ధాశ్రమం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం బేతవోలు గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ఆనందేశ్వర స్వామి ఆలయం[మార్చు]

ప్రణవాశ్రమం[మార్చు]

(1) ఈ ఆశ్రమ ప్రాంగణంలో, శ్రీ బాలత్రిపురసుందరి, శ్రీ ఓంకారేశ్వరస్వామివారల ఆలయం, అత్యంతసుందరంగా నిర్మితమైనది. 2015,మే-29వ తేదీనాడు, ఉదయం 9-21 గంటలకు విగ్రహ, శిఖర, బింబ, యంత్ర, ప్రతిష్ఠా మహోత్సవాన్ని, అత్యంత వైభవంగ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, విశిష్ట దర్శనం, పూర్ణాహుతి, పండిత సత్కారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 31వ తేదీ ఆదివారంనాడు, స్వామివారికి శాంతికళ్యాణం, అనంతరం అన్నదానం నిర్వహించారు. [3]

(2) ఈ ఆశ్రమంలో ప్రణవానందస్వామి 47వ ఆరాధనా మహోత్సవాన్ని, 2017,మే-25వతేదీ గురువారంంనాడు ఘనంగా నిర్వహించారు. [5]

(3) ఈ ఆశ్రమం ప్రారంభించి 100 సంవత్సరాలయిన సందర్భంగా, 2017,జులై-6న ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి స్థైర్యానందస్వామి పర్యవేక్షణలో గోపూజ, గురువందనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చండీ పారాయణం, చండీ హోమం నిర్వహించారు. సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్ధప్రసాదాల వితరణ జరిగింది. [6]

భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలోని కార్మికనగర్‌లోని ఈ ఆలయంలో, 2017,ఆగస్టు-22 నుండి స్వామివారి ఆరాధన మహోత్సవాలను నిరవహించుచున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని, 24వతేదీ గురువారంనాడు ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 జ్యోతులతో, మంగళ వాయిద్యాల మధ్య, కోలాటాలతో, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [7]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వరి, మినుము, పెసలు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, చేతిపనులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ బోయిన మల్లిఖార్జరావు, శతజన్మదినోత్సవ వేడుకలను, 2015,మార్చ్-22వ తేదీ ఆదివారం రాత్రి, వారి కుమారులు, ఆనందేశ్వరస్వామి కళ్యాణమండపంలో, అత్యంత ఘనంగా నిర్వహించారు. [2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1252.[2] ఇందులో పురుషుల సంఖ్య 633, స్త్రీల సంఖ్య 619, గ్రామంలో నివాస గృహాలు 303 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 2,983 - పురుషుల సంఖ్య 1,531 - స్త్రీల సంఖ్య 1,452 - గృహాల సంఖ్య 805

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Gudivada/Bethavolu". Retrieved 1 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-24; 11వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,జూన్-1; 29వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-27; 27వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మే-26; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,జులై-7; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,ఆగస్టు-25; 1వపేజీ. [8] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,ఆగస్టు-25; 2వపేజీ.