మోటూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోటూరు
—  రెవిన్యూ గ్రామం  —
మోటూరు is located in Andhra Pradesh
మోటూరు
మోటూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°26′53″N 81°02′54″E / 16.448167°N 81.048242°E / 16.448167; 81.048242
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడివాడ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,092
 - పురుషులు 2,127
 - స్త్రీలు 1,965
 - గృహాల సంఖ్య 1,234
పిన్ కోడ్ 521323
ఎస్.టి.డి కోడ్ 08674

మోటూరు, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 323., ఎస్.ట్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

పూర్వం పంచాయతి సమితిగా కొనసాగి ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతిగా ఉన్న ఈ గ్రామం ముదినేపల్లి నియోజకవర్గంలో భాగము.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం మండల కేంద్రమైన గుడివాడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]

మోటూరు నుండి గుడివాడ పట్టణం 8 కి.మీ. దూరంలో ఉంది.

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

మోటూరుకు ఇది వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. కాని ఇప్పుడు ఆటోల కారణంగా బస్సు సర్వీసులను నిలిపివేశారు. మోటూరు ప్రజలు అధిక శాతం ఆటోలలోనే ప్రయాణిస్తుంటారు. ఈ గ్రామానికి రైలు మార్గం కూడా ఉంది. భీమవరం వెళ్ళే వైపు గుడివాడ తరువాత స్టేషనే మోటూరు. గుడివాడ జంక్షన్ కావడంతో మోటూరు స్టేషనుకు లూప్ లైన్ ఉంది. కాని దూర ప్రాంతాలకు వెళ్ళే వారు తప్ప ఎక్కువ మంది ఈ రైలు సౌకర్యం వినియోగించుకోరు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. ఈ గ్రామంలో జిల్లా పరిషత్తు పాఠశాల 10వ తరగతి వరకు విద్య అందుబాటులో ఉంది. మూడూ ప్రాథమిక పాఠశాలలు కూడా ఈ గ్రామంలో ఉన్నాయి. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ ప్రైవేటు పాఠశాలలో తమ పిల్లలను చదివించడానికే ఇక్కడి ప్రజలు ఇష్టపడుతుంటారు
  2. ఆంధ్ర ప్రదేశ్ పభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల.
  3. మోటూరు-1 ప్రాథమిక పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

  1. గ్రామంలోని ఈ సంఘంలో, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 100% ఋణాలు వసూలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. [4]
  2. ఈ గ్రామంలో, కేంద్రప్రభుత్వ పథకం ఆర్.కె.వి.వై. క్రింద, 100% రాయితీతో, 24.75 లక్షల రూపాయల నిధులతో, 550 మెటిక్ టన్నుల సామర్ధ్యంగల నూతనంగా నిర్మించిన గిడ్డంగులను, 2015, నవంబరు-16న ప్రారంభించారు. [5]

వైద్య సౌకర్యాలు[మార్చు]

ఈ ఊరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండటంతో పాటు ఆర్.ఎం.పి డాక్టర్ల వైద్యం అందుబాటులో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు వైద్యం అందుబాటులో ఉంటుంది.

బ్యాంకులు[మార్చు]

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఫోన్ నం. 08674/236235. సెల్ = 8019480197.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చీకటి పుణ్యస్త్రీ సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

మోటూరును అపర భద్రాద్రి అని అంటారు. ఈ ఊరిలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక రామాలయం ఉంది. భద్రాచలంలో మాదిరిగా ఇక్కడ కూడా రాముని కళ్యాణం అత్యంత ఘనంగా ప్రతియేటా జరుపుతారు. సీతారామస్వామి పుట్టినరోజున ఆయన కళ్యాణం జరిపించటం వలన సర్వపాపాలూ నశించిపోతాయని, వేదాలు చెబుతున్నాయని వేదపండితుల ఉవాచ. శ్రీరామ నవమికి రథోత్సవం ముఖ్య ఆకర్షణ. కళ్యాణం రోజు భద్రాచలం వెళ్ళలేక పోయినవారు మోటూరు వస్తుంటారు. మోటూరులో పుట్టినవారంతా, దేశవిదేశాలలో స్థిరపడినవారు, కుటుంబసమేతంగా సీతారాముల కళ్యాణాన్ని చూడటానికి మోటూరు విచ్చేస్తారు. వారి రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. గుడివాడ చుట్టుప్రక్కల నుండి, సుమారు 25 వేలమంది దాకా భక్తులు కళ్యాణం చూడటానికి విచ్చేస్తారు. వీరందరికీ వీలుగా, గుడివాడ నుండి మోటూరుకు ఉచిత బస్సు సౌకర్యం కలుగజేస్తారు. స్వామివారి కళ్యాణం పూర్తయిన తరువాత, ఆయనకు వినియోగించిన ముత్యాల తలంబ్రాలను, ప్రత్యేక కౌంటరు ద్వారా భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ ముత్యాల తలంబ్రాలను పలు జంటలు వివాహ సమయంలో ఉపయోగించి, స్వామివారి ఆశీస్సులు తమకు లభించినట్లు అనుభూతి పొందుతారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత భోజన వసతిఏర్పాటు చేస్తారు. ఇపుడు ఈ కళ్యాణమహోత్సవాన్ని, సిటీ కేబుల్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం, చైత్ర శుక్ల సప్తమి నుండి ప్రారంభించి, ఏడు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమాలలో, సప్తమి రోజున ధ్వజారోహణ, అష్టమి రోజున పెళ్ళి కుమారుని ఉత్సవం, నవమి రోజున మద్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాంస్వామివారి తిరు కళ్యాణం, దశమి నాడు పొన్నవాహనోత్సవం, ఏకాదశి రోజున రథోత్సవం, ద్వాదశి రోజున వసంతోత్సవం, త్రయోదశి రోజున పవళింపుసేవ నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయుదురు. రామాలయం ఉన్న ప్రదేశమును ప్రత్యేకంగా 'గోదాపురి' అని పిలుస్తారు. [2]

శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం[మార్చు]

శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలోనే నూతనంగా మరొక రామాలయం నిర్మించారు. అది సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దేవస్థానం.

శ్రీ ఆంజనేయస్వామి ఆలయం[మార్చు]

మూడు చర్చిలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఇంత పెద్ద ఊరికి కూడా తాగునీరు పెదచెరువు గట్టు పక్కన ఉన్న నూతులే అందిస్తున్నాయి. ఇటీవల "నాంది వాటర్ హెల్త్ ఫౌండేషన్" ఏర్పాటు చేసి మంచి నీరును అందిస్తున్నారు. ఊరిలో ఐదు అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. ఊరిలో అధిక శాతం రైతులే కనిపిస్తారు. ఉద్యోగాల కొల్లేరు అయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని జన సరస్సుకు వలస పోతుంటారు. ఊరిలో చదివే పిల్లల డ్రాపవుట్స్ ఎక్కువగానే ఉన్నాయి. ప్రధాన సమస్య మంచి నీరైతే మరో సమస్య బస్సు సౌకర్యం రద్దవడం.
  2. మోటూరు గ్రామానికి చెందిన శ్రీ సాయిబాబా గారి నాలుగు సంవత్సరాల వయసు గల కుమారుడు, చి. భవనేశ్వర్ సత్య, తిరుపతిలోని శ్రీవారి మెట్టు నుండి తిరుమలకు నడక సాగించి, ఏ మాత్రం విరామం లేకుండా, 40 నిమిషాల వ్యవధిలోనే తిరుమలకు చేరుకొని, శ్రీవారిపై తనకున్న భక్తిని చాటి, అందరినీ ఆశ్చర్య చకితులను చేసాడు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,092 - పురుషుల సంఖ్య 2,127 - స్త్రీల సంఖ్య 1,965 - గృహాల సంఖ్య 1,234

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4030.[1] ఇందులో పురుషుల సంఖ్య 2033, స్త్రీల సంఖ్య 1997, గ్రామంలో నివాస గృహాలు 1078 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014, ఏప్రిల్-6; 16వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014, ఆగస్టు-14; 10వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, జూలై-1, 30వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-17; 26వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మోటూరు&oldid=3314674" నుండి వెలికితీశారు