"వర్షం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (Wikipedia python library)
 
== వ్యవసాయంపై ప్రభావం ==
[[అవపాతం]], అందునా వర్షం [[వ్యవసాయం|వ్యవసాయన్ని]] చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాలచాలా ఉపయోగకరమైనది. సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో తరచూ పడే వర్షాలు మొక్కలు ఆరోగ్యముగా పెరగటానికి అవసరం కానీ [[అతివృష్టి]], [[అనావృష్టి]] రెండూ [[పంట]]లకు ముప్పును కలుగజేస్తాయి. [[కరువు]] పరిస్థితులు పంటలను పెద్ద ఎత్తులో నాశనం చేస్తాయి. విపరీతమైన తడి వలన హానికరమైన శిలీంధ్రాలు ఎక్కువవుతాయి. వివిధ మొక్కలు బతకటానికి వివిధ మొత్తాలలో వర్షపాతం అవసరం. ఉదాహరణకు, [[కాక్టస్]] మొక్కలకు అతి తక్కువ నీరు అవసరం కానీ వరి లాంటి ఉష్ణమండల మొక్కలు జీవించటానికి వందలాది అంగుళాల వర్షం అవసరం.
 
అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతోకొంత వరకైనా వర్షంపై ఆధారపడుతుంది. ఉదాహరణకు, భారతీయ వ్యవసాయరంగము (స్థూల జాతీయ ఆదాయములో 25% వాటా కలిగి, 70% జనాభాకు ఉపాధి కల్పిస్తున్నది) వర్షంపై భారీగా ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా [[పత్తి]], [[వరి]], [[నూనెదినుసులు]] మరియు ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నవి. ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా, అది 1990వ దశకములో సంభవించిన కరువులలో లాగా దేశ ఆర్ధికరంగాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1291907" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ