అల్లు అర్జున్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 26: పంక్తి 26:


==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
[[File:Allu Arjun at 62nd Filmfare awards south.jpg|thumb|అల్లు అర్జున్ at 62nd Filmfare awards south]]
{| class="wikitable sortable" class="wikitable"
{| class="wikitable sortable" class="wikitable"
|- style="background:#ccc; text-align:center;"
|- style="background:#ccc; text-align:center;"

18:02, 19 ఆగస్టు 2016 నాటి కూర్పు

అల్లు అర్జున్

వైశాలి సినిమా పాటల విడుదల వేడుకలో అల్లు అర్జున్
జన్మ నామంఅల్లు అర్జున్
జననం (1983-04-08) 1983 ఏప్రిల్ 8 (వయసు 41)
India చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లు బన్ని
ప్రముఖ పాత్రలు ఆర్య, బన్ని

అల్లు అర్జున్ ఒక దక్షిణాది నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. మరియు చిరంజీవి మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు.

బాల్యం

అల్లు అర్జున్ చెన్నైలో పుట్టాడు. పద్దెనిమిదేళ్ళ వరకు అక్కడే పెరిగాడు. అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లల్లో ఒకడు. పెద్దన్నయ్య వెంకటేష్, తమ్ముడు శిరీష్. చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. కష్టపడి చదవినా మార్కులు అంతగా వచ్చేవి కావు. చిన్నప్పుడే విజాత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో ఓ చిన్నపిల్లవాడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. ఎనిమిదో తగరతిలో ఉండగా కొన్నాళ్ళు పియానో కూడా నేర్చుకున్నాడు. [1]

వ్యక్తిగత జీవితం

చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్, అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది.ఇతని వివాహము హైదరాబాద్ కు చెందిన స్నేహారెడ్డి తో జరిగినది.[2][3]. వీరికి అయాన్ అనే కుమారుడు ఉన్నాడు.

నట జీవితం

అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి.అల్లు అర్జున్ ఫాషన్ మరియు స్టైల్ కు పెట్టింది పేరు అని చెప్పవచ్చు.

ఇతర భాషల్లో అర్జున్

అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళం లోకి అనువదించ బడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు అల్లు అర్జున్ కేరళ లో మల్లు అర్జున్ అని పిలుస్తారు.[4].

నటించిన చిత్రాలు

అల్లు అర్జున్ at 62nd Filmfare awards south
సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
2003 గంగోత్రి సింహాద్రి అదితి అగర్వాల్ విజేత, సిని"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు (2004)
2004 ఆర్య ఆర్య అనురాధా మెహతా విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2004)
2005 బన్ని రాజా/బన్ని గౌరీ ముంజల్
2006 హ్యాపీ బన్ని జెనీలియా
2007 దేశముదురు బాల గోవిందం హన్సికా మోట్వాని, రంభ పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2007)
2008 పరుగు కృష్ణ షీలా విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2008)
విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2008)
2009 ఆర్య 2 ఆర్య కాజల్ అగర్వాల్ పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2009)
2010 వరుడు సందీప్ భానుశ్రీ మెహ్రా
వేదం కేబుల్ రాజు అనుష్క శెట్టి, దీక్షా సేథ్ విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2010)
2011 బద్రీనాధ్ బద్రీనాధ్ తమన్నా
2012 జులాయి రవీంద్ర నారాయణ్ ఇలియానా
2013 ఇద్దరమ్మాయిలతో సంజు రెడ్డి అమలా పాల్, కేథరీన్ థెరీసా
2014 ఎవడు సత్య కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ తో పాటు అతిథి పాత్రలో నటించాడు
రేసుగుర్రం శృతి హాసన్ విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2014)

బయటి లింకులు

మూలాలు

  1. ఈనాడు ఆదివారం, ఏప్రిల్ 17, 2016, శరత్ కుమార్ బెహరా వ్యాసం
  2. http://www.greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4
  3. http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక
  4. http://www.saakshi.com/main/weeklydetails.aspx?newsId=46295&subcatid=26&Categoryid=2 కేరళ లో అల్లు అర్జున్ చిత్రాల గురించి సాక్షి దినపత్రిక వ్యాసం

ఇతర లింకులు