భారత ప్రభుత్వ కమిషన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • భారత ప్రభుత్వం, తన పరిపాలనా విధానం మెరుగు పరుచుకోవటానికి, కాలానుగుణంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించటానికి, మెరుగైన సమాజానికి, ప్రజల సమస్యలను పరిష్కరించటానికి, అనేకమైన కమిటీలను, కమిషనులను, ఆయా రంగాలలో, నిష్ణాతులైన మేధావులను, నియమించి, వారి ద్వారా, విలువైన సలహాలతో కూడిన నివేదికలను, పొందింది. సమస్యలకు పరిష్కారాలను కనుగొన్నది. అటువంటి, కొన్ని నివేదికలను ఈ క్రింద పట్టికలో చూడండి.
సంవత్సరం కమిటీ పేరు వివరాలు
మురారి కమిటీ విచ్చల విడిగా విదేశీ ట్రాలర్లు మన జలాలలో మత్స్య సంపదను వేటాడుతుండడాన్ని నిషేధించాలని మురారి కమిటీ ఇచ్చిన సిఫారసుతో 1996-2002 మధ్య వీటిని నిషేధించారు. తర్వాత అనుమతి లేఖ్హ (ఎల్.ఓ.పి - లెటర్ ఆఫ్ పెర్మిషన్) పేరుతో అనుమతించారు.
శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ - ఆంధ్ర రాష్ట్రాలను రెండు రాష్ట్రాలుగా విడదీయాలా, వద్దా అన్న వివాదం తీర్చటానికి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ. ఈ కమిటీ రిపోర్టును ఇచ్చింది.
భార్గవ కమిటీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బోర్డుల (ప్రస్తుత పాలక మండళ్ళ)ను రద్ధు చేసే ఆలోచన గాని, ప్రణాళిక గాని లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ల పునర్వ్యవస్థీకరణ, పనితీరుపై భార్గవ కమిటీ చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
1953 జనవరి 29 కాకా కలేల్కర్ కమిషన్ మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ 1955 అని కాకా కలేల్కర్ కమిషన్ అని పేరు పెట్టారు. భారత రాజ్యాంగం లోని 340 అధికరణాన్ని అనుసరించి, మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ను, కాకా కలేల్కర్ అధ్యక్షునిగా, 1953 జనవరి 29 నాడు భారత రాష్ట్రపతి ఆదేశంతో ఏర్పడింది.
మురళీధర రావు కమిషన్ ఆంధ్రప్రదేశ్ లోని వెనుక బడిన తరగతుల గురించి పరిశీలించమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మురళీధర రావు కమిషన్ ని నియమించింది. ఈ కమిషన్ తన రిపోర్టును ఇచ్చింది.
1979 మండలం కమిషన్ కేంద్ర ప్రభుత్వం, భారతదేశంలోని వెనుక బడిన తరగతుల గురించి అధ్యయనం చేయమని నియమించింది. మండలం కమిషన్ తన రిపోర్టును ఇచ్చింది.
పుట్టు స్వామి కమిషన్ ఆంధ్రప్రదేశ్ లోని వెనుక బడిన తరగతుల గురించి పరిశీలించమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పుట్టు స్వామి కమిషన్ ని నియమించింది. ఈ కమిషన్ తన రిపోర్టును ఇచ్చింది.
1943 సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ కేంద్రప్రభుత్వం 1943లో నియమించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ తన నివేదికలో ఉన్నత విద్యా లక్ష్యాలు విశదీకరించింది. జ్ఞానాన్వేషణకు సైన్సు కోర్సులు, జీవిత పరమార్ధం వెలికితీయడానికి ఆర్టు కోర్సులు, వృత్తి నైపుణ్యాల కోసం ఇంజినీరింగ్, వైద్యం వంటి కోర్సులు విశ్వవిద్యాలయాల్లో ప్రారంభించాలని సూచించింది.
1964 కొఠారి కమిషన్ ఉన్నత విద్యారంగంలో అభివృద్ధిని సమీక్షించడానికి 1964లో కొఠారి కమిషన్ను ఏర్పాటు చేశారు. జాతీయ జీవనంలో గుణాత్మక మార్పునకు, సుఖ జీవనానికి ఉన్నత విద్య దోహదపడాలి అని కొఠారి కమిషన్ కచ్చితంగా చెప్పింది. దాంతో, వృత్తి విద్యా కోర్సులకు ప్రాముఖ్యం, ప్రఛారం పెరిగాయి. దాన్ని ఆధారం చేసుకొనే కేంద్రం 1968లో 'జాతీయ విద్యా విధానం' రూపొందించింది. 'సాంకేతిక విద్య, పారిశ్రామిక అవసరాల' పట్ల విద్యారంగం ప్రత్త్యేక శ్రద్ధ చూపించాలని చెప్పింది. 1986లో 'జాతీయ విద్యావిధానాని' కి కొద్దిపాటి సవరణలు చేశారు. ఇంజినీరింగ్, సాంకేతిక విద్యకు ఎక్కడ లేనంత ప్రాముఖ్యం ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో, ప్రపంచ వ్యాప్త పోటీని ఎదుర్కోవాలి అంటే, కంప్యూటర్ సాంకేటీక విద్యకు పెద్ద పీట వేసి అభివృద్ధి పరచడం అత్యవసరమని కూడా తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగా, ఉన్నత విద్యారంగాన్ని తీర్చిదిద్దారు. ఆ ప్రవాహంలో, సంప్రదాయ డిగ్రీ కోర్సులు, తమ ప్రాముఖ్యాన్ని కోల్పోయాయి. వాటితో పాటు ఎంతో కీలకమైన సైన్సూ, వెనక్కి వెళ్ళి పోయింది. దానివల్ల ఉన్నత విద్యారంగానికి కీడే జరిగింది. పరిశోధనలు, పరిశోధనపత్రాలు తగ్గిపోయాయి.
2010 సిన్హా కమిషన్ ఇతర కులాల స్థితిగతుల అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది. రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదికను బయట పెట్టాలని ఓ.సి. సంక్షేమ సంఘం 2010 నవంబరు 15 న డిమాండ్ చేసింది. సామాజిక, మతపరంగా అమలు చేస్తున్న రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేసి, ఆర్థిక వెనుక బాటు ప్రాతిపదికన అన్ని వర్గాలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు అగ్రవర్ణ పేదల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు.
దేవ్ కార్ రిపోర్ట్ 1948 నుంచి 2008 వరకూ (40 సంవత్సరాలు)భారత దేశంనుంచి ఇతర దేశాలకు తరలిపోయినధనం, భారత దేశ స్థూల జాతీయోత్పత్తి (జీ.డి.పి) లో 50% వరకూ ఊంటూమ్దని అంచనా. ఈ చీకటి సామ్రాజ్యుం మొత్తం విలువలో దాదాపు 72% వరకూ దేశం వెలుపలే ఉండిపోతోంది అని దేవ్ కార నివేదిక తెలిపింది.
బిలాల్ జమాన్ కమిటీ (రిజర్వ్ బాంక్ మాజీ గవర్నర్)నివేదీక్> స్టాక్ ఎక్స్చేంజిల గురించిన అధ్యయనం.
లిబర్హన్ అయోధ్య కమిషన్
కోనేరు రంగారావు కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీని, రాష్ట్రంలోని భూమి పంపిణీకి సంబంధించిన విషయాలను గురింఛి అధ్యయనం చేయటానికి నియమించింది. రెపోర్టు ఇచ్చింది
శివరామన్ కమిటీ చేనేత సమస్యల అధ్యయనం.
అబిద్ హుసేన్ చేనేత సమస్యల అధ్యయనం.
మీరా సేధ్ కమిటీ చేనేత సమస్యల అధ్యయనం.
రోశయ్య కమిటీ చేనేత సమస్యలని అధ్యయనం చేయటానికి, ఆంధ్ర్హ ప్రదేశ్ ప్రభుత్వం నియమించింఇద్. రెపొర్ట్ ఇచ్చింది గడి పాఠ్యం
షుంగ్లూ కమిటీ కామన్వెల్త్ ఆటల పోటీలలో జరిగిన అక్రమాలను వెలికి తీయటానికి నియమించిన కమిటీ.
జస్టిస్ శ్రీవాస్తవ కమిటీ
జస్టిస్ డి.పి వాధ్వా కమిటీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అధ్యయనం కోసం
నానావతి కమిషన్ 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల మీద జరిపిన విచారణ. నివేదిక సమర్పించారు.
లా కమిషన్ నివేదికలు 2009 సంవత్సరం వరకు 18 లా కమిషన్లు, భారతీయ చట్టాలను, న్యాయ వ్యవస్థ పనితీరును పరిశీలించి, 236 నివేదికలను (రిపోర్టులను ) ఇచ్చాయి. 19వ లా కమిషన్, జస్టిస్ పి.వి రెడ్డి అధ్యక్షతన పనిచేస్తుంది. 19వ లా కమిషన్ పదవీ కాలం 2009 నుంచి 2012 వరకు. లా కమిషన్ ఆఫ్ ఇండియా చూడు.
1834 లా కమిషన్ (మొదటి లా కమిషన్) నివేదిక (బ్రిటిష్ ఇండియా) మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబర్ 25 మరణం 1859 డిసెంబరు 28)). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు) మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలులోకి వచ్చింది.లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంథాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'చిత్తుప్రతి' ని తయారుచేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిని కూడా నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆ నాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారత దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తుతో 'ఇండియన్ పీనల్ కోడ్' చిత్తుప్రతి తయారు చేశాడు. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈ నాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు. చూడు: భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్.
1853 లా కమిషన్ (రెండవ లా కమిషన్) నివేదిక (బ్రిటిష్ ఇండియా) రెండవ లా కమిషన్ ఛైర్మన్
1861 లా కమిషన్ (మూడవ లా కమిషన్) నివేదిక (బ్రిటిష్ ఇండియా) మూడవ లా కమిషన్ ఛైర్మన్
1879 లా కమిషన్ (నాలుగవ లా కమిషన్) నివేదిక (బ్రిటిష్ ఇండియా) నాలుగవ లా కమిషన్ ఛైర్మన్. మొదటి లా కమిషన్ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్చె కోడ్, మరికొన్ని చట్టాల గురించి సిఫార్సు చేసింది. ఇండియన్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, ఇండియన్ కంట్రాక్ట్ చట్టం, ఇండియన్ ఎవిడెన్స్ చట్టము, ఆస్తి బదలాయింపుచట్టము వంటి చట్టాలు ఈ నాలుగు లా కమిషన్ల కృషి మాత్రమే.
1955-1958 లా కమిషన్ (మొదటి లా కమిషన్) నివేదిక మొదటి లా కమిషన్ ఛైర్మన్. అప్పటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండీయా ఎమ్.సి. సెతల్వాడ్.
1958-1961 లా కమిషన్ (రెండవ లా కమిషన్) నివేదిక రెండవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice T. V. Venkatarama Aiyar.
1961-1964 లా కమిషన్ (మూడవ లా కమిషన్) నివేదిక మూడవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice J. L. Kapur
1964-1968 లా కమిషన్ (నాలుగవ లా కమిషన్) నివేదిక నాలుగవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice J. L. Kapur
1968-1971 లా కమిషన్ (ఐదవ లా కమిషన్) నివేదిక ఐదవ లా కమిషన్ ఛైర్మన్

Mr. K. V. K. Sundaram, I. C. S.

1971-1974 లా కమిషన్ (ఆరవ లా కమిషన్) నివేదిక ఆరవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice Dr. P. B. Gajendragadkar
1974-1977 లా కమిషన్ (ఏడవ లా కమిషన్) నివేదిక ఏడవ లా కమిషన్ ఛైర్మన్

Mr. Justice Dr. P. B. Gajendragadkar

1977-1979 లా కమిషన్ (ఎనిమిదవ లా కమిషన్) నివేదిక ఎనిమిద లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice H. R. Khanna
1979-1980 లా కమిషన్ (తొమ్మిదవ లా కమిషన్) నివేదిక తొమ్మిదవ లా కమిషన్ ఛైర్మన్

Mr. Justice P. V. Dixit

1981-1985 లా కమిషన్ (పదవ లా కమిషన్) నివేదిక పదవ లా కమిషన్ ఛైర్మన్

Mr. Justice K. K. Mathew

1985-1988 లా కమిషన్ (పదకొండవ లా కమిషన్) నివేదిక పదకొండవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice D. A. Desai
1988-1991 లా కమిషన్ (పన్నెండవ లా కమిషన్) నివేదిక పన్నెండవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice M. P. Thakkar
1991-1994 లా కమిషన్ (పదమూడవ లా కమిషన్) నివేదిక పదమూడవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice K. N. Singh
1995-1997 లా కమిషన్ (పదునాలుగవ లా కమిషన్) నివేదిక పదునాలుగవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice K Jayachandra Reddy
1997-2000 లా కమిషన్ (పదిహేనవ లా కమిషన్) నివేదిక పదిహేనవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice B. P. Jeevan Reddy
2000-2001 2002-2003 లా కమిషన్ (పదహారవ లా కమిషన్) నివేదిక పదహారవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice B. P. Jeevan Reddy. Mr. Justice M. Jagannadha Rao
2003-2006 లా కమిషన్ (పదిహేడవ లా కమిషన్) నివేదిక పదిహేడవ లా కమిషన్ ఛైర్మన్ Mr. Justice M. Jagannadha Rao
2006-2009 లా కమిషన్ (పద్దెనిమిదవ లా కమిషన్) నివేదిక పద్దెనిమిదవ లా కమిషన్ ఛైర్మన్ Dr. Justice AR Lakshmananన్
2009-2012 లా కమిషన్ (పంతొమ్మిదవ లా కమిషన్) నివేదిక పంతొమ్మిదవ లా కమిషన్ ఛైర్మన్ Shri Justice P. V. Reddi
అడ్మినిస్ట్రేటివ్ రిపార్మ్స్ కమిషన్ నివేదికలు మురార్ఝి దేశాయి అధ్యక్షుడు.
2005 రెండవ అడ్మినిస్ట్రేటివ్ రిపార్మ్స్ కమిషన్ నివేదికలు. వీరప్ప మొయిలీ మొదటి అధ్యక్షుడు. రాజీనామా తరువాత వి. రామచంద్రన్ రెండవ అధ్యక్షుడు.ఈ కమిషన్ 2005 లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పడింది. 2009 ఏప్రిల్ 01 వీరప్ప మొయిలీ రాజీనామా చేసాడు. అప్పుడు వి. రామచంద్రన్ ని అధ్యక్షునిగా చేసారు. 2009 మే 29 న తన 15వ నివేదికను (చివరి నివేదికను) ఇవ్వటంతో, ఈ కమిషన్ పదవీ కాలం పూర్తి అయ్యింది. ఈ నాలుగు సంవత్సరాల సమయంలో 15 రిపోర్టులను తయారుచేసి, ప్రభుత్వానికి ఇచ్చింది.
1946 - 1947 సెంట్రల్ పే కమిషన్లు (1 నుంచి 6 వరకు) మొదటి పే కమిషన్ మొదలైంది మే 1946. రిపోర్ట్ ఇచ్చింది మే 1947. సమయం ఒక్క సంవత్సరం
1957 - 1959 సెంట్రల్ పే కమిషన్లు (1 నుంచి 6 వరకు) రెండవ పే కమిషన్ ఆగష్టు 1957 లో ఏర్పడింది. ఆగష్టు 1959 లో రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. సమయం 2 సంవత్సరాలు.
1970-1973 సెంట్రల్ పే కమిషన్లు (1 నుంచి 6 వరకు) మూడవ పే కమిషన్ 1970 ఏప్రిల్ లో ఏర్పడింది. 1973 మార్చి నెలలో, ప్రభుత్వానికి, రిపోర్టు ఇచ్చింది. సమయం 3 సంవత్సరాలు.
1983-1987 సెంట్రల్ పే కమిషన్లు (1 నుంచి 6 వరకు) నాలుగవ పే కమిషన్జూన్ 1983 లో ఏర్పడింది. ఈ పే కమిషను, మూడు రిపోర్టులను జూన్ 1986 లో మొదటి రిపోర్టు (సమయం 3 సంవత్సరాలు), డిసెంబరు 1986 లో రెండవ రిపోర్టు (సమయం 3 సంవత్సరాల 6 నెలలు), మే 1987 లో మూడవ రిపోర్టు (సమయం 4 సంవత్సరాలు)ను ప్రభుత్వానికి సమర్పించింది. అంటే నాలుగవ పే కమిషన్ కి, అన్ని రిపోర్టులు సమర్పించటానికి, రమారమి 4 సంవత్సరాలు పట్టింది .
1994 1997 సెంట్రల్ పే కమిషన్లు (1 నుంచి 6 వరకు) ఐదవ పే కమిషను ఏప్రిల్ 1994 లో ఏర్పడింది. 1997 జనవరిలో ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. సమయం 4 సంవత్సరాలు.
2006 - 2008 సెంట్రల్ పే కమిషన్లు (1 నుంచి 6 వరకు) ఆరవ పే కమిషన్ . 1. 2006 అక్టోబర్ 5 నాడు జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పడింది. 18 నెలలలో, రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర సభ్యులు ప్రొఫెసర్ రవీంద్ర ధోలకియ, జె.ఎస్.మాథుర్, మెంబర్-సెక్రటరీగా శ్రీమతి సుష్మ నాథ్. 2008 మార్చి 24 నాడు ఈ ఆరవ పే కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసే సెంట్రల్ పే కమిషన్లు, ఎన్ని సంవత్సరాలకి అన్నది స్పష్టంగా లేదు. ఏర్పాటు చేసిన ఆరు సెంట్రల్ పే కమిషన్లను పరిశీలిస్తే, 10 నుంచి 13 సంవత్సరాలకి ఒక సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంట్రల్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత, భత్యములు, రిటైర్మెంటు అయినప్పుడు ఇచ్చే గ్రాట్యుటి, పింఛను, ఇన్సురెన్స్, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాలను, సర్వీసు కండిషన్లు, ప్రమోషను పద్ధతిని, ఉద్యోగులకు ఇచ్చే శెలవులు, స్త్రీలకు ఇచ్చే పురిటి శెలవులు (మెటర్నిటీ లీవులు), వారి గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం, పిల్లల ఛదువులకు అయ్యే ఖర్చులో కొంత ప్రభుత్వం భరించటం, లీవు ట్రావెల్ కన్సెషను, ట్రాన్స్ పోర్టు బత్తెం, బట్టలు ఉతుక్కోవటానికి ఇచ్చే బత్తెం (నాలుగవ తరగతి ఉద్యోగులకు) వంటివన్నీ పరిశిలిస్తుంది.
భారత దేశంలోని రాష్ట్రాలు వారి వారి ఉద్యోగులకోసం ఎర్పాటు చేసిన పే కమిషన్లు
1919 హంటర్ కమిషన్ 1919 లో జలియన్ వాలా బాగ్ లో జరిగిన హత్యాకాండ మీద జరిగిన విఛారణ కమిషన్
10 మే 2007 రంగనాధ్ మిశ్రా కమిషన్ 2007 మే 10 న నివేదికను సమర్పించింది ముస్లింల స్థితిగతుల అధ్యయనం. చూడు: భారతదేశంలో ఇస్లాం.పూర్తి నివేదిక కోసం ఇక్కడ నొక్కు. సచార్ కమిటీ నివేదికను కూడా చూడు.
1953 సయ్యద్ ఫజల్ ఆలి కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై, సయ్యద్ ఫజల్‌ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం (స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిషన్ - ఎస్.ఆర్.సి) ఏర్పడింది. ( 1953 డిసెంబరు 29 చూడు).
ఫైనాన్స్ కమిషన్లు 1 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 2 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 3 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 4 (1 నుంచి 6 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 5 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 6 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 7 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 8 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 9 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 10 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 11 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 12 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ఫైనాన్స్ కమిషన్లు 13 (1 నుంచి 13 వరకు) 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు
ముఖర్జీ కమిషన్ సుభాస్ ఛంద్ర బోస్ మరణంపై దర్యాప్తు.
పటాస్కర్ కమిషన్ 1960 ఈ కమిషన్ నిర్ణయం మూలంగా, ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని ఛాలా భూభాగాన్ని కోల్పోయింది.
అశోక్ మెహతా కమిటీ
ఖోస్లా కమిటీ
జాతీయ ఆదాయ కమిటీ ఛైర్మన్ పి.సి. మహలనొబిస్.
జాతీయ పతాకం బెర్లిన్ కమిటి జండా
యశ్‌పాల్ కమిటీ భారత దేశంలో ఉన్నత విద్య
జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది) జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది) ఈ వెబ్ సైట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫేమిలీ వెల్ఫేర్) లో 9 రిపోర్ట్లు ఉన్నాయి.
1946 1. భోర్ కమిటీ 1946 జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)వాల్యూం 1;

- వాల్యూం 2; వాల్యూం 3

1962 2. ఎ.ఎల్. ముదలియార్ కమిటీ 1959 -1962 ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)[permanent dead link]డా. ఎ.లక్ష్మణస్వామి ముదలియార్ (మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్) కమిటీ-1959 (రిపోర్ట్ ఆఫ్ ది హెల్త్ సర్వే అండ్ ప్లానింగ్ కమిట్టే - ఆగష్టు 1959 - అక్టోబర్ 1961) ఈ రెండు వెబ్ సైటు లింకులు ఒకటే నివేదికను చూపిస్తున్నాయి.
1963 3. ఛడ్డా కమిటీ 1963 జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)
1965 4. ముఖర్జీ కమిటీ 1965 జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)
1966 5. ముఖర్జీ కమిటీ 1966 జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)
1967 6. జుంగావాలా కమిటీ 1967 జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)
1973 7. కర్తార్‌సింగ్ కమిటీ 1973 జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)
1975 8. శ్రీవాస్తవ కమిటీ 1975 జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)
1986 9. బజాజ్ కమిటీ 1986 జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)
1996 మొదటి జుడీషియల్ పే కమిషన్ 1996 మార్చి 21న ఏర్పడింది. జస్టిస్ జగన్నాధ్ షెట్టి అధ్యక్షుడు.
1926 1926 రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ వ్యవసాయం మీద
1880 1880 ఫెమైన్ కమిషన్ - ఆర్. స్ట్రాచే, అధ్యక్షుడు (భారత దేశంలో 1880లో ఏర్పడిన కరువు గురింఛి)
మషేల్కర్ కమిటీ [1] పేటెంట్ లాకి సంబంధించిన సమస్యలు. చూడు: హాథీ కమిటీ [2]
ప్రొఫెసర్ అజీజ్ కమిటీ కొల్లేరు చేపల చెరువు గురించి
భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ
బాంకింగ్ కమిటీ సిఫార్సులు' మోక్షగుండం విశ్వేశ్వరయ్య, స్టేట్ బాంక్ ఆఫ్ మైసూర్.
2010 సచార్ కమిటీ భారతదేశంలో ఇస్లాం.భారతదేశంలో ఇస్లాం.సచార్ కమిటీ పూర్తి నివేదిక కోసం ఇక్కడ నొక్కు. [www.mfsd.org/mishrareport/NCRLM%201E.pdf రంగనాధ మిశ్రా కమిటీ నివేదిక]ను కూడా చూడు. జూలై 2010 లో, సచార్ కమిటీ తన నివేదికను సమర్పించింది.
1975 హాథీ కమిటీ [3] మందులు, ఔషధ పరిశ్రమల మీద కమిటీ రిపోర్ట్. చూడు: మషేల్కర్ కమిటీ [4]
1946 డిసెంబరు 9 నుంచి నవంబరు 1949 రాజ్యాంగ సభ లోని కమిటీలు రాజ్యాంగ సభ లోని కమిటీలు
2009 టెండుల్కర్ కమిటీ - భారత దేశంలో ఉన్నటువంటి పేదరికంను అంచనా వేయటం చూడు
1993 వఘుల్ కమిటీ * వఘుల్ కమిటీ ని, 1993 లో నియమించారు. ఆ కమిటీ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్షేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) యొక్క నియంత్రణ అధికార పరిధి నుండి తప్పించకూడదని సిఫార్సు చేసింది. ప్రస్తుతం, నడుస్తున్నటువంటి 73 దేశీయ పథకాలలో, 67 పథకాలు సెబి అజమాయిషీలో ఉన్నాయి. మిగిలిన 4 పథకాలలో, (యు.ఎస్-64, సుస్-99 పథకాలు తప్ప), కొన్ని అమ్మటం లేదు మరికొన్నింటి కాలపరిమితి అయిపోవచ్చింది. మాలెగాం రిపోర్ట్ - అక్టోబర్ 2001 పేరా 1.1 లో పేర్కొంది. దీని తరువాత మరొక మాలెగాం రిపోర్టు 19 జనవరి 2011 కూడా ఉంది.
2005 పాటిల్ కమిటీ నివేదిక 2005 "కార్పొరేట్ బాండ్స్ అండ్ సెక్యూరిటైజేషన్" ని పరిశీలించి తగు సలహాలు ఇవ్వటానికి, ఒక, '''ఉన్నత స్థాయి నిపుణుల సంఘం,''' ని భారత ప్రభుత్వం ( డిపార్ట్‌మెంట్ ఆప్ ఇకనమిక్ అపైర్స్, స్టాక్ ఎక్షేంజి సెక్షన్), యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (యు.టి.ఐ) ఛైర్మన్ గా ఉన్న డా. ఆర్.హెచ్. పాటిల్ ని, అధ్యక్షునిగా, 2005 జూలై 5 తేదీన, నియమించింది. ఈ సంఘం 2005 డిసెంబరు 23 నాడు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
2007 దీపక్ పరేఖ్ రిపోర్ట్ -"మౌలిక సౌకర్యాలు కల్పించటానికి కావలసిన ఆర్ధిక వసతులు" . భారత ప్రభుత్వం (డిపార్ట్‍మెంట్ ఆఫ్ ఇకనామిక్ అపైర్స్), హౌసింగ్ డెవలప్‍మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ (హెచ్.డి.ఎఫ్.సి) ఛైర్మన్ అయిన దీపక్ పరేఖ్ని అధ్యక్షునిగా 2006 డిసెంబరు 26 నాడు నియమించి, "మౌలిక సౌకర్యాలు కల్పించటానికి కావలసిన ఆర్ధిక వసతులు" ( ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్) మీద సిఫార్సులు చేయమని ఆదేశించింది. ఇంతకు ముందు, ఇదే విషయం మీద ( ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ ) ఉన్నటువంటి పాటిల్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా దృష్టిలో ఉంచుకోమని కూడా ఆదేశించింది. ఆ ప్రకారంగా, అతడు, మే 2007 నాడు నివేదికను సమర్పించాడు.
2010 డాక్టర్ బిమల్ జలాన్ కమిటీ నివేదిక భారతదేశం యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్,

డాక్టర్ బిమల్ జలాన్ Archived 2011-08-29 at the Wayback Machine అధ్యక్షతలో, (మాజీ గవర్నర్, భారతదేశపు రిజర్వ్ బ్యాంక్ Archived 2008-02-18 at the Wayback Machine) ఒక కమిటీని 2010 జనవరి 6 నాడు, ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి - "రివ్యూ అఫ్ ఓనర్‍షిప్ అండ్ గవర్నేన్స్ ఆఫ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇన్‍స్టిట్యూషన్స్ (ఎమ్.ఐ.ఐ.లు) వలన తల ఎత్తే అంశాలను పరిశీలించమని" బాధ్యత అప్పగించారు. "రివ్యూ ఆఫ్ ఓనర్‍షిప్ అండ్ గవర్నేన్స్ ఆఫ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇన్‍స్టిట్యూషన్స్" (మార్కెట్ లోని "మౌలిక వసతులను కల్పించే ఆర్ధిక సంస్థల యాజమాన్యము, పాలన " మీద పరిశీలన నివేదిక) ను, బిమల్ జలాన్ Archived 2011-08-29 at the Wayback Machine 2010 నవంబరు 22 నాడు భారతప్రభుత్వానికి సమర్పించాడు.

2011 జస్టిస్ శివరాజ్ వి. పాటిల్ 2జి స్కామ్ నివేదిక [5] Archived 2011-02-25 at the Wayback Machine జస్టిస్ శివరాజ్ వి. పాటిల్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, తన 2జి స్కామ్ నివేదికను [6] Archived 2011-02-25 at the Wayback Machine (2001-2009 సంవత్సరాల మధ్య టెలికాం డిపార్ట్‌మెంటు, స్పెక్ట్రం అమ్మకం, కేటాయింపులలో పాటించిన పద్ధతులను పరిశీలించిన నివేదిక), 2011 జనవరి 31 సోమవారం నాడు, టెలికామ్ మంత్రి, కపిల్ సిబాల్ కి సమర్పించాడు. ఈ నివేదికలో మాజీ టెలికాం మంత్రి, ఎ.రాజా, టెలికాం స్పెక్ట్రంని అమ్మినప్పుడు, బాధ్యతగా వ్యవహరించలేదని ఈ నివేదికలో వెల్లడించారు. భారత ప్రభుత్వం, 2010 డిసెంబరు 13 నాడు, జస్టిస్ శివరాజ్ వి. పాటిల్ ని "ఒక్క మనిషి సంఘం”గా నియమించింది.
1964 సంతానం కమిటీ (అవినీతి మీద) సంతానం కమిటీ (భారత దేశంలోని అవినీతి మీద 1963లో వేసిన సంఘం.) 1963 లో లో, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, ఈ సంతానం కమిటీని నియమించారు. కె. సంతానం చూడు. 1964 లో, నివేదిక సమర్పించింది.
28 మార్చి 2003 మాలిమత్ కమిటీ క్రిమినల్ జస్టిస్ సిస్టం సంస్కరణలపై ఏర్పడిన మాలిమత్ (డా. జస్టిస్ వి.ఎస్. మాలిమత్) కమిటీ నివేదికను 28 మార్చి 2003 నాడు సమర్పించింది. పూర్తి నివేదిక కోసం ఇక్కడ నొక్కండి
17 ఆగష్టు 1860 పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 బ్రిటిష్ ప్రభుత్వం 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. ఈ, పోలీస్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
30 అక్టోబర్ 2006 సోలి సొరాబ్జి కమిటీ 2005 అక్టోబర్ లో, కేంద్ర ప్రభుత్వము "పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ (పిఏడిసి),ని ఏర్పాటు చేసింది. దీనినే సోలి సొరాబ్జి కమిటీ అని అంటారు. పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, ప్రభుత్వానికి 30 అక్టోబరు 2006 న, సమర్పించింది. అతిపురాతనమైన, పోలీస్ ఏక్ట్ 1861 ని, నేటి కాలానికి, అనుగుణంగా, మార్చవలసిన అవసరం ఉంది. మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, చదవాలంటే, ఇక్కడ నొక్కండి. ఇది హోమ్ మంత్రిత్వశాఖ వెబ్‍సైట్ లో ఉంది.
1998 రిబీరో కమిటీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా (రిట్ పిటిషన్ (సివిల్) నెంబరు 310/1996), మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫెయిర్స్, పోలీసు సంస్కరణలపై, కమిటీ[permanent dead link]ని (రిబిరో కమిటీ) ని, నియమించింది.రిబీరో కమిటీ 1998 అక్టోబరులో మొదటి నివేదిక, రెండవ నివేదికను, మార్చి 1999 లోను ఇచ్చింది.
జనవరి 2000 పద్మనాభయ్య కమిటీ శ్రీ పద్మనాభయ్య (విశ్రాంత ఐ.ఎ.ఎస్ అధికారి) ఈ, "పోలీసు సంస్కరణల కమిటీ"కి నాయకత్వం వహించాడు. ఈ కమిటీ ఉద్దేశం పోలీసు వ్యవస్థ పనితీరును, పోలీసు సంస్ధను, మరొకసారి పరిశీలించి, సంస్కరణలను సిఫార్సు చేయటం; పోలీస్ వ్యవస్థను, రాజకీయవాదుల పలుకుబడి నుంచి, నేరస్థుల పలుకుబడి నుంచి నుంచి, కాపాడటానికి కావలసిన సిఫార్సులను చేయటం. 2000 ఆగష్ట్లో నివేదిక అందజేసింది. కానీ, అవి వెలుగు చూడలేదు. అంతర్జాలంలో కూడా, ఆ నివేదిక, దొరకటంలేదు.
9 జూలై 1993 వోరా కమిటీ రాజకీయ నాయకులతోను, ప్రభుత్వ అధికారుల తోను, సత్సంబంధాలతో మెలుగుతున్న నేరసమాజాలు/మాఫియా సంస్థల గురించిన సమాచారం, అటువంటివారు చేస్తున్న పనుల గురించిన వివరాలు సేకరించటానికి, ప్రభుత్వం, ఒక కమిటీని 9 జూలై 1993 తేదీన, ఏర్పాటు చేసింది. ఎన్.ఎన్.వోరా, హోమ్ సెక్రటరీ, ఈ కమిటీకి అధ్యక్షుడు. అందుకే, ఈ కమిటీకి, వోరా కమిటీ అని పేరు వచ్చింది.. 5 అక్టోబర్ 1993 న, ఈ వోరా కమిటీ నివేదికను సమర్పించింది.


జాతీయ ఆరోగ్య కమిటీలు 9 - వాటి రిపోర్టులు 9