భుజంగప్రయాతము
స్వరూపం
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| స్రగ్ధర, మహాస్రగ్ధర |
| ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
| లయగ్రాహి, లయవిభాతి |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
భుజంగ ప్రయాతము
[మార్చు]భుజంగేశ పర్యంక పూర్ణానురాగన్
భుజంగప్రయాతాఖ్యఁ బూరించు చోటన్
నిజంబై ప్రభూతావనీ భృద్విరామం
బజస్రంబుగాఁ గూర్ప యా ద్వంద్వ మొప్పన్.
గణ విభజన
[మార్చు]| IUU | IUU | IUU | IUU |
| య | య | య | య |
| భుజంగే | శపర్యం | కపూర్ణా | నురాగన్ |
నాలుగు యగణములు
IUU IUU IUU IUU య య య య
లక్షణములు
[మార్చు]| • | పాదాలు: | నాలుగు |
| • | 12 | |
| • | ప్రతిపాదంలోని గణాలు: | య, య, య, య (నాలుగు యగణములు) |
| • | యతి : | ప్రతిపాదంలోనూ 8వ అక్షరము |
| • | ప్రాస: | పాటించవలెను |
| • | ప్రాస: యతి | చెల్లదు |
ఉదాహరణ 1:
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో వాడిన భుజంగ ప్రయాత వృత్త పద్యాల సంఖ్య: 1
పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/పరీక్షిజ్జన్మంబు|(భా-1-295-భు.)
హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్
భరించు న్ధర న్రామభధ్రుండుఁ బోలెన్
జరించు న్సదా వేదశాస్త్రానువృత్తిన్
వరించు న్విశేషించి వైకుంఠుభక్తిన్.