Jump to content

మంగళమహశ్రీ

వికీపీడియా నుండి
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మంగళమహాశ్రీ

[మార్చు]

చిత్తములఁ జూపులను జిత్తజునితండ్రి పయి జెంది గజదంతియతు లొందన్
వృత్తములతోడఁ దరుణీ మణులు గానరుచులింపుగను మంగళమహాశ్రీ
వృత్తములఁ బాడిరి సువృత్త కుచకుంభముల వింత జిగి యెంతయుఁ దలిర్పన్
మత్తిలించు నబ్భజిసనంబు లిరుచోటులఁదనర్పఁగఁ దుదన్గగ మెలర్పన్.

గణ విభజన

[మార్చు]
మంగళమహాశ్రీ వృత్త పాదము నందు గణవిభజన
UII IUI IIU III UII IUI IIU III UU
గగ
చిత్తము లఁజూపు లనుజి త్తజుని తండ్రిప యిజెంది గజదం తియతు లొందన్

లక్షణములు

[మార్చు]
మంగళమహాశ్రీ వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.
26
ప్రతిపాదంలోని గణాలు: భ, జ, స, న, భ , జ, స, న, గగ
యతి : ప్రతిపాదంలోనూ 9వ, 17వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి చెల్లదు

ఉదాహరణ 1:

[మార్చు]

పోతన తెలుగు భాగవతంలో వాడిన మంగళమహాశ్రీ వృత్త పద్యాల సంఖ్య: 1

పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/అజామిళోపాఖ్యానము|(భా-6-184-మంగ.)
ఈవిధమున న్విబుధు లేకతమ చిత్తముల నేకతము లేక హరి నీశు న్
భావమున నిల్పి తగు భాగవతయోగ పరిపాకమున నొందుదరు వారిం
దేవలదు దండనగతిం జనదు మాకు గుఱుతింప నఘము ల్దలఁగు మీఁదన్
శ్రీవరుని చక్రము విశేష గతిఁ గాచు సురసేవితులు ముక్తిఁ గడుఁ బెద్దల్.