మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్
గురూజీగా ప్రసిద్ధులైన మాధవ్ రావ్ సదాశివ రావ్ గోల్వల్కర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు రెండవ సర్ సంఘ్ చాలక్.
ప్రారంభ జీవితం
[మార్చు]గోల్వల్కర్ మహారాష్ట్ర లోని నాగపూర్ సమీపానగల రాంటెక్ పట్టణంలో ఫిబ్రవరి,19-1906 న జన్మించారు. ఈయన తండ్రి పేరు సదాశివ రావ్. ఈయన ఒక స్కూలు టీచర్. తల్లి లక్ష్మీబాయి. గోల్వల్కర్ తన బాల్యాన్ని నాగపూర్ లో గడిపారు.
ఈయన జంతుశాస్త్రం లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో పూర్తి చేసారు. తరువాత అదే యూనివర్సిటీలో ఆచార్యునిగా పనిచేసారు. ఆ సమయంలోనే ఈయనకు గురూజీ అనే పేరు సిద్ధించింది. ఇక ఆయన జీవితాంతం అదే పేరుతో పిలువ బడ్డారు.
ఆర్.యస్.యస్.తో సంబంధం
[మార్చు]బెనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యార్థి అయిన భయ్యాజీ దాణే ద్వారా ఈయన ఆర్.యస్.యస్. సర్ సంఘ్ చాలక్ అయిన కె.బి.హెడ్గేవార్ ను కలిసి ఆర్.యస్.యస్. లో చేరారు. హెడ్గేవార్ అనతికాలంలోనే గోల్వల్కర్ లోని అంకితభావాన్ని గమనించి, అతనిని తన వారసునిగా గుర్తించారు. గోల్వల్కర్ 1939లో ఆర్.యస్.యస్. సర్ కార్య వాహ్ గా నియమించబడ్డారు. హెడ్గేవార్ జబ్బుపడి జూన్, 21-1940 న మరణించారు. దానితో గోల్వల్కర్ ఆర్.యస్.యస్. సర్ సంఘ్ చాలక్ అయ్యారు.
సంఘ్ పరివార్ లోని అన్ని సంస్థల వెనుక గోల్వల్కర్ కృషి ఉంది. 2006-07లో సంఘ్ పరివార్ ఈయన శతజయంతి ఉత్సవాలను జరుపుకున్నది.
వివాదం
[మార్చు]మరణం
[మార్చు]గోల్వల్కర్ గురూజీ జూన్, 5-1973 న నాగపూర్ లో కాన్సర్ తో మరణించారు.