మినీ కవిత

వికీపీడియా నుండి
(మినీ కవిత్వం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తెలుగు సాహిత్యంలో మినీకవితది ఒక ప్రత్యేకమైన స్థానం. వేమనలాగా తక్కువ పదాలలో, తక్కువ పాదాలలో ఎలాంటి అక్షర నియమాలు లేకుండా కవిత్వం చెప్పే పద్ధతి ఇది. స్పష్టంగా, సూటిగా కవి చెప్తాదు. మూడు పాదాల హైకు, నాలుగు పదాల నానీ, ఆరు పాదాల రెక్కలు... ఇవి మినీకవితలు కావు.

వీటికి అతీతంగా స్వేచ్ఛగా కవిత్వం రాసే ప్రక్రియ ఇది.

ఉదాహరణకు ఒక మినీకవిత.

"కాపలా" (డా. రావి రంగారావు)

 డబ్బు
  దేవుడయ్యేసరికి
 ఇనుము
  పెట్టయింది,
 రాయి
  గోడయింది,
 చెక్క
  తలుపయింది,
 చివరికి
  ప్రాణం
    కుక్కయింది...

మరొక ఉదాహరణ

"జీవితం" (చంద్రసేన్.)

 కన్ను తెరిస్తే జననం
 కన్ను మూస్తే మరణం
 రెప్పపాటే కదా ఈ ప్రయాణం.

మరొక ఉదాహరణ.

"కోపం" (కవి పేరు "భాస్వరం").

 పులిని
   సృష్టించావనుకో,
 ముందది
   నిన్నే
 మింగుతుంది."

మరి కొన్ని మినీకవితలు (డా.రావి రంగారావు రచనలు).

"నైట్ డ్యూటీ"
తోచినపుడొచ్చి/వెన్నెల లాటీ తిప్పి/చీకట్ల దొంగలతో లాలూచిపడి/కనుమరుగయ్యే చందమామ/పోలీసు మామ"
"సెన్సార్"
గోడమీద/వలువ లూడదీసుకుంటున్న/నాగరికతను/నమిలేయటానికొచ్చింది ఆవు/ కాని, విచిత్రం/గుడ్లప్పగించి చూస్తోంది".
"చట్టం"
క్రూరమృగాల్ని/ బంధించామని అనుకుంటుండగానే/పారిపొతున్నాయి/పన్నిన వలకు/ అన్నీ కన్నాలే.
"బానిస"
పసి పిల్లవాడు/ పొట్టను/ నేలమీద పెట్టి/తలను పైకెత్తుతాడు/వయసొచ్చినవాడు/తలను/ నేలమీద పెట్టి/పొట్టను పైకెత్తుతున్నాడు".
"నాలుక"
ఎన్ని వంకర్లు తిరుగుతుందో/ఎన్ని చీలికలు సాగుతుందో/ఎన్ని మడతలు పడుతుందో/
ఎంత విషం చిమ్ముతుందో/పచ్చనోటుకోసం/పామవుతుంది.
"కన్యాదానం"

"డబ్బుకు/ కులానికి/అధికారానికి/అన్యాయానికి/ అమ్మలేను/ఓటనేది/నా కూతురులాంటిది".

"అవినీతి"
"పాము పబ్లిగ్గా తిరుగుతుంటే/కర్రెత్తుకురాబొయాను/మధ్యలో పెద్దమనుషు లడ్డుపడి/ గడ్డపలుగులు తెస్తామన్నారు/ఇంతలో అది/తప్పించుకెళ్ళిపోయింది"
"పెద్ద మనిషి"--
"సూర్యుడు లేని సందు చూచి/చీకటి దొంగను పంపించేది రాత్రి/తెల్లారేదాకా నక్షత్రాల కళ్ళతో/కాపలా కస్తున్నానని/ మళ్ళీ బుకాయించేదీ రాత్రే".

ఇలాంటి మినీకవితలు 1227, 579 మంది కవుల సంకలనం "వెయ్యినూట పదహార్లు"పేరుతో మినీకవిత పితామహుడు డా.రావి రంగారావు ప్రచురించారు. ప్రతి సంవత్సరం అలాంటి మినీకవితల సంకలనం ఒకటి చొప్పున ప్రచురిస్తున్నారు. మినీకవితలు ఎలా రాయాలో తెలిపే "మినీకవిత శిల్ప సమీక్ష", "మినీకవితలలో మెనీ భావాలు", "పిల్లలలో మినీకవిత్వరచనానైపుణ్యాలు" "ఏది మినీకవిత"...మొదలైన పుస్తకాలు ప్రచురించారు.

ఎన్.వాణి రాసిన మినీకవిత ఛూద్దాం. కవిత పేరు "కన్య".
"బోగీ కన్య 
          స్టేషనులో
          సిద్ధంగా ఉంది,
    ఇంజను వరుడు
         ఇంకా రాలేదు,
    ఇంధనం కొరత కాబోలు". 
వక్కలంక వెంకటరామకృష్ణ రాసిన మినీకవిత"దోపీడీ".
    "వర్తమానంలో బాంకులు 
         పేదలు దాచుకోడానికి కాదు,
    ఉన్నోళ్ళూ దోచుకోవడానికి" అన్నారు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మినీ_కవిత&oldid=2766558" నుండి వెలికితీశారు