తెలుగులో యాత్రా రచనలు
Appearance
పలువురు తెలుగు రచయితలు తాము చేసిన యాత్రలను వర్ణిస్తూ, తమ అనుభవాలను, అనుభూతులను, తెలుసుకున్న విశేషాలను క్రోడీకరిస్తూ, ఆయా ప్రాంతాల చరిత్రను, ప్రత్యేకతలను వివరిస్తూ గ్రంథాలను వెలువరించారు. ఈ యాత్రా సాహిత్యం వలన పాఠకులకు ఆయా ప్రాంతాల విశేషాలు, అక్కడి ప్రజల సాంఘిక, సాంస్కృతిక జీవన పరిస్థితులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాలను దర్శించే వారికి ఈ పుస్తకాలు మార్గదర్శకమౌతాయి.
తెలుగు సాహిత్యంలో వెలువడిన కొన్ని యాత్రా రచనలు
[మార్చు]- కాశీయాత్ర చరిత్ర (1838) - ఏనుగుల వీరాస్వామయ్య
- నీలగిరి యాత్ర (1953) - కోలా శేషాచలం
- యాత్రా చరిత్ర(రెండు భాగాలు - 1915) - మండపాక పార్వతీశ్వరశాస్త్రి
- నా దక్షిణ భారత యాత్రా విశేషాలు - పాటిబండ్ల వెంకటపతిరాయలు
- నా ఉత్తర భారత యాత్రా విశేషాలు - పాటిబండ్ల వెంకటపతిరాయలు
- కైలాస దర్శనం (బ్రహ్మమానస సరోవరయాత్ర) - పి.వి.మనోహరరావు
- తిరుమలై తిరుపతి యాత్ర - ఎస్.వి.లక్ష్మీనారాయణరావు
- శివమెత్తిన చికాగో - కసిరెడ్డి వెంకటరెడ్డి
- ఆంగ్ల సీమలో ఆమని వీణలు - ఆవంత్స సోమసుందర్
- నా మహారాష్ట్ర యాత్ర - జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి
- నా విదేశీ పర్యటన అనుభవాలు - ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
- కన్యాకుమారీయాత్ర - బూరుగుల గోపాలకృష్ణమూర్తి
- కాశీయాత్ర - చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి
- ప్రశ్నించే జ్ఞాపకం - శాంతి నారాయణ
- మా బదరీ, కేదార్ యాత్ర - కొమరగిరి అన్నపూర్ణ
- "ఆటా "జనికాంచె... - ఎండ్లూరి సుధాకర్
- మలేషియా మధురస్మృతులు - ఆర్.రంగస్వామిగౌడ్
- కాశీయాత్ర (1914) - ఆకుండి పరబ్రహ్మశాస్త్రి
- నా యాత్ర - ప్రాతూరి వేంకట శివరామశర్మ
- కాశీయాత్ర (కావ్యం - 1934) - వాజపేయయాజుల రామసుబ్బారాయుడు
- మా ఉత్తర భారత యాత్ర (1966) - ముళ్ళపూడి కమలాదేవి
- నా దక్షిణ దేశ యాత్రలు - బులుసు వేంకటరమణయ్య
- నా ఉత్తర దేశయాత్ర - బులుసు వేంకటరమణయ్య
- కాశ్మీర దీపకళిక (1978) - నాయని కృష్ణకుమారి
- ఇనుపతెర వెనుక (1985) - రావూరి భరద్వాజ
- అంతేవాసులతో హంపీ విహారయాత్ర - ముమ్మన్నేని లక్ష్మీనారాయణ
- నవభారత సందర్శనం - కె.వి.సుబ్బయ్య
- కళ - ప్రకృతి - సూరాబత్తుల సుబ్రహ్మణ్యం
- నవభారతి - మాలతీ చందూర్
- నెల్లూరు మండల యాత్ర - మల్లంపల్లి సోమశేఖరశర్మ
- నా శ్రీశైల యాత్ర (1950 పద్యకావ్యం) - చివుకుల పెద వేంకటాచలపతి
- శ్రీశైల మహాక్షేత్ర యాత్రాదర్శిని - ఓరుగంటి వేంకటరమణయ్య
- నా తీర్థయాత్ర (1948) - అడివి బాపిరాజు
- మా విజ్ఞానయాత్ర - వేగుంట కనక రామబ్రహ్మం
- సుందర భారత యాత్ర - బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి
- నా రష్యా పర్యటన (1977) - నెక్కొండ వేంకట జనార్ధనరావు
- ప్రథమ సోషలిస్టు దేశంలో పర్యటన-పరిశీలన (1980) - చుక్కపల్లి పిచ్చయ్య
- చైనాలో మా పర్యటన అనుభవాలు - చుక్కపల్లి పిచ్చయ్య
- సోవియట్ రష్యాలో పదిరోజులు (1980) - సి.నారాయణరెడ్డి
- మధురస్మృతులు - కాంచనపల్లి వెంకటరామారావు
- రష్యాలో స్నేహయాత్ర - వాసా ప్రభావతి
- భూప్రదక్షుడు భార్యకు వ్రాసిన లేఖలు - అత్యం నరసింహమూర్తి
- మా మహారాజుతో దూరతీరాలు - కురుమెళ్ళ వెంకటరావు
- గాలిమేడల అమెరికాలో - లక్ష్మీనారాయణరావు
- నేను చూసిన అమెరికా - అక్కినేని నాగేశ్వరరావు
- నా అమెరికా పర్యటన - ఆవుల గోపాలకృష్ణమూర్తి
- అంతా కలిస్తే అమెరికా (1977) - కొడాలి వెంకటేశ్వరరావు
- నా అమెరికా యాత్ర - పరమాత్ముని రుక్మిణమ్మ
- ప్రాక్-పశ్చిమములు - ఎక్కిరాల కృష్ణమాచార్య
- సీమకు స్టీమరులు - డి.వి.సుబ్బారెడ్డి
- కాంగ్రెసు వైద్య దళము మలయాయాత్ర - చింతలపాటి శివరామశాస్త్రి
- సువర్ణ సుందర మలేషియా - త్రిపురనేని వేంకటేశ్వరరావు
- చైనాయానం - శ్రీరంగం శ్రీనివాసరావు
- నవ వెన్నెల మధ్యధరా - పి.వి.మూర్తిరాజు
- మరో ప్రపంచం - పడాల రామారావు
- హెనోయి విశేషాలు కాంబోడియా కబుర్లు - క్రొవ్విడి లక్ష్మన్న
- సిల్క్‌రూట్‌లో సాహసయాత్ర - పరవస్తు లోకేశ్వర్
- ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర - పరవస్తు లోకేశ్వర్
- యాత్రా దీపిక - వరంగల్ జిల్లా - పి.యస్.యమ్. లక్ష్మి
- యాత్రా దీపిక - హైదరాబాద్ నుంచి ఒక రోజులో (దర్శించదగ్గ 72 ఆలయాలు) - పి.యస.యమ్. లక్ష్మి
- యాత్రా దీపిక - 6 శ్రీ నరసింహ క్షేత్రాలు - పి.యస్.యమ్. లక్ష్మి
- యాత్రా దీపిక - 7 మెదక్ - పరిసర ప్రాంతాలు - పి.యస్.యమ్. లక్ష్మి
- యాత్రా దీపిక - 8 కుంభకోణం యాత్ర - పి.యస్.యమ్. లక్ష్మి
- యాత్రా దీపిక - 9 మంత్రపురి మంధని - పి.యస్.యమ్. లక్ష్మి
- మట్టినైపోతాను(2019) -కేరళ రాష్ట్ర యాత్ర కవిత్వ సంపుటి - జాని_తక్కెడశిల (అఖిలాశ)
- సుందర భారతదేశ యాత్రాదర్శిని (2019 ) - షేక్ అబ్దుల్ హకీం జాని
- ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ యాత్రా దర్శిని (2011 ) - షేక్ అబ్దుల్ హకీం జాని
అనువాద గ్రంథాలు
[మార్చు]- కానీ ఖర్చులేకుండా కాలినడకన ప్రపంచయాత్ర - వేమూరి రాధాకృష్ణమూర్తి
- ప్రయాణానికే జీవితం - కొల్లూరి సోమశంకర్
పరిశోధన
[మార్చు]"తెలుగులో యాత్రాచరిత్రలు" అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎన్.గోపి పర్యవేక్షణలో మచ్చ హరిదాసు అనే వ్యక్తి పి.హెచ్.డి. పట్టా కోసం పరిశోధన చేసి 1989లో సిద్ధాంత వ్యాసం సమర్పించాడు[1].
మూలాలు
[మార్చు]- ↑ మచ్చ, హరిదాసు (1992). తెలుగులో యాత్రాచరిత్రలు (1 ed.). కరీంనగర్: ఇందు ప్రచురణలు. pp. 1–608. Retrieved 17 November 2017.