బాలి (చిత్రకారుడు)

వికీపీడియా నుండి
(మేడిశెట్టి శంకరరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మేడిశెట్టి శంకర రావు
బాలి
జననంమేడిశెట్టి శంకర రావు
సెప్టెంబరు 29, 1941
విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లి
మరణంఏప్రిల్ 17,2023 2023 ఏప్రిల్ 17(2023-04-17) (వయసు 81)
విశాఖపట్టణం
మరణ కారణంఅనారోగ్యం
నివాస ప్రాంతంవిశాఖపట్టణం
ఇతర పేర్లుబాలి
వృత్తిచిత్రకారుడు, కార్టూనిస్ట్
భార్య / భర్తధనలక్ష్మి
పిల్లలుకుమార్తె వైశాలి, కుమారుడు గోకుల్
తండ్రిమేడిశేట్టి లక్ష్మణరావు
తల్లిమేడిశేట్టి అన్నపూర్ణ
సంతకం

బాలి (1941 సెప్టెంబరు 29 - 2023 ఏప్రిల్ 17) వ్యంగ్య చిత్రకారుడు. వీరు వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశారు. వీరి అసలు పేరు ఎం. శంకర రావు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

బాలి తండ్రి మిలిటరీలో పని చేసేవారు. తన చిన్నతనంలోనే బాలి తన తండ్రిని కోల్పోయారు. తల్లి పెంపకంలో పెరిగి పెద్దయ్యి, తన తల్లి ముగ్గులు వేస్తూండగా గమనిస్తూ, చిత్రకళ మీద ఆసక్తిని పెంచుకున్నారు. చదువు అనకాపల్లిలోనే జరిగింది. చదువుకునే రోజులలో డ్రాయింగ్ క్లాసంటే ఎక్కువ ఇష్టపడేవారు. ఇంటర్మీడియెట్ వరకు చదివారు. చిత్రకళ మీద కలిగిన ఆసక్తితో సాధన చేశారు. వీరి వివాహం ధనలక్ష్మితో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె వైశాలి, కుమారుడు గోకుల్. పిల్లలిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వీరి భార్య మరణించారు. బాలి ప్రస్తుత నివాసం విశాఖపట్టణం.

చిత్రకారునిగా జీవనం[మార్చు]

వీరు మొదట్లో ఎం.శంకరరావు అన్న పేరుతో కార్టూన్లు వేసేవారు. ఆ రోజులలో (1970లలో) ఆంధ్రపత్రిక వారు ఔత్సాహిక కార్టూనిస్టులను ప్రొత్సహించటానికి పోటీలు పెట్టారు . వీరికి మూడువారాలు వరుసగా మొదటి బహుమతి వచ్చిందట. ఈ బహుమతులుతో వచ్చిన ధైర్యంతో, మరింత సాధన చేసి తన నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. బొమ్మలను మంచి సమతూకంతో వెయ్యటం అలవడింది. కొంతకాలం పి.డబ్ల్యు.డి. (Public Works Department)లో గుమాస్తాగా పనిచేసినా, చిత్రకళ మీద ఉన్న మక్కువతో 1974 లో ఈనాడు దిన పత్రికలో కార్టూనిస్ట్ గా చేరి, రెండేళ్ళ తర్వాత 1976 లో ఆంధ్రజ్యోతి స్టాప్ ఆర్టిస్ట్ గా చేరారు."అమ్మే కావాలి" అన్న నవల చిన్న పిల్లల కోసం వ్రాసి, తానే బొమ్మలు వేసి, ఆంధ్రజ్యోతి వారపత్రికకు పంపారు. ఈ నవల, ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా ప్రచురించబడి పాఠకుల మన్నన పొందినది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరిని ఎంతగానో ప్రొత్సహించి కథలు వ్రాయించి, బొమ్మలు కూడా వేయించేవారు.

పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరి పేరును బాలి గా మార్చి దీవించారు. అప్పటినుండి, అదే పేరుతో ఎన్నో బొమ్మలు, కార్టూన్లు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

సంపాదకునిగా[మార్చు]

బాలి చందు అనే బాలల సాహిత్య పత్రికకు సంపాదకత్వం వహించారు.[2]

మరణం[మార్చు]

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న 81 ఏళ్ల బాలి 2023 ఏప్రిల్ 17న విశాఖపట్టణంలో కన్నుమూసాడు. ఆయన భార్య ధనలక్ష్మి గతంలోనే మరణించగా ఇటీవలే కుమారుడు గోకుల్ అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఆయనకు కుమార్తె వైశాలి ఉంది.[3]

మూలాలు[మార్చు]

  1. "Different strokes of a deft brush". The Hindu (in Indian English). 2016-09-13. ISSN 0971-751X. Retrieved 2022-06-07.
  2. బాలి (2004). చందు. హైదరాబాదు: విశాలాంధ్ర. Retrieved 2020-07-13.
  3. "ప్రముఖ చిత్రకారుడు బాలి కన్నుమూత |". web.archive.org. 2023-04-19. Archived from the original on 2023-04-19. Retrieved 2023-04-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)