మోతుకూరు

వికీపీడియా నుండి
(మోత్కూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


మోత్కూరు
—  మండలం  —
యాదాద్రి - భువనగిరి జిల్లా జిల్లా పటములో మోత్కూరు మండలం యొక్క స్థానము
యాదాద్రి - భువనగిరి జిల్లా జిల్లా పటములో మోత్కూరు మండలం యొక్క స్థానము
మోత్కూరు is located in Telangana
మోత్కూరు
మోత్కూరు
తెలంగాణ పటములో మోత్కూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°27′00″N 79°16′00″E / 17.4500°N 79.2667°E / 17.4500; 79.2667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి - భువనగిరి జిల్లా
మండల కేంద్రము మోత్కూరు
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,694
 - పురుషులు 27,911
 - స్త్రీలు 27,783
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.56%
 - పురుషులు 67.59%
 - స్త్రీలు 41.42%
పిన్ కోడ్ 508277

మోత్కూరు తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి - భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508277. ఎస్.టి.డి. కోడ్: 08694.

పేరు చరిత్ర[మార్చు]

పూర్వం ఈ ప్రాంతంలో మోదుగ చెట్లు అధికంగా ఉండడం వల్ల దీనిని మోదుగుల ఊరు అని పిలిచేవారు. అది కాలక్రమేణా మొదుగూరు, మొతుకూరుగా పిలువబడి చివరకు మోత్కూర్ గా మారింది.

గ్రామపంచాయతి కార్యాలయం

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 102 కి. మీ దూరంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది. మోత్కూర్ మండల పరిదిలో 42 గ్రామాలు మరియు 28 పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో చిన్నపడిశాల చిన్న గ్రామం, మోత్కూర్ అతిపెద్ద గ్రామము. ఇది సముద్ర మట్టానికి 322 m ఎత్తులో (ఎత్తు) ఉంది. తెలుగు ఇక్కడ స్థానిక భాష. కొంతమంది ప్రజలు ఉర్దూ కూడా మాట్లాడుతారు. మోత్కూర్ కు ఉత్తర దిశగా గుండాల, దేవరుప్పుల మండలాలు, తూర్పు వైపు అడ్డగూడూర్ మండలం, పశ్చిమ ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. జనగాం, భువనగిరి, సూర్యాపేట, వరంగల్ మొదలైన నగరాలు మోత్కూర్ కు సమీపంలో ఉన్నాయి. మోత్కూర్, ఆత్మకూర్, గుండాల మూడు మండలాలకు కలిపి ఇది ఒక ప్రాంతీయ వర్తకకేంద్రంగా ఉంది. మోత్కూర్ కి ఆనుకొని బిక్కేరు (కృష్ణానదికి ఉపనది) ప్రవహిస్తుంది. ఈ ఊరిలో ఉన్న అనేక దుకాణాలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు అవసరాన్ని తీరుస్తున్నాయి. మోత్కూర్ మూడు భాగాలుగా ఉంటుంది. అవి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, పోతాయిగడ్డ. అంతేకాక చుట్టుపక్కల కొద్దిదూరంలో పద్మశాలీకాలనీ, డ్రైవర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ, లూర్థు నగర్, వెంకటేశ్వర కాలనీ మరియు సుందరయ్య కాలనీ వంటి అనేక నివాస కాలనీలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ ఊరిలో అభివృద్ధికి నోచుకోని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రామములో రక్షిత మంచినీటి సరఫరా సమస్యగా ఉంది.

పోతాయిగడ్డ

అధిక సంఖ్యలో హిందువులు ఉన్నప్పటికీ, ముస్లీంలు మరియు క్రిస్టియన్లు కూడా ఉన్నారు. వీరంతా ఎలాంటి విద్వేషాలు లేకుండా కలసికట్టుగా ఉంటారు. మోత్కూర్ కాకతీయుల కాలంలో మధ్యయుగ భారతదేశంగా పిలువబడిందని ప్రాచూర్యంలో ఉంది. ఈ ఊరిలో ఉన్న రామలింగేశ్వరాలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారని ప్రతీతి. ప్రతి సంవత్సరం అగ్ని గుండాలు ప్రముఖ హిందూ పండుగ హోలీ తర్వాత నిర్వహిస్తారు. చాలా మంది సమీపంలోని గ్రామాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అంతేకాకుండా గ్రామదేవతలు చాలా మంది అక్కడక్కడ వెలిసారు. వీరందరికి చిన్నచిన్న గుళ్ళు నిర్మించి గ్రామస్థులు పూజలు నిర్వహిస్తుంటారు. కొత్త బస్టాండ్ దగ్గర పెద్దమ్మ ఆలయం, పోతాయిగడ్డ సాయినగర్ లో సాయిబాబా దేవాలయం ఒక మసీదు మరియు ఒక మిషనరీ రన్ చాపెల్ ఉన్నాయి.

తడి వరి ప్రధాన పంట, ఇతర పంటలు ఎండు మిరపకాయలు, పత్తి, ఆకుపచ్చ గ్రామ, కాస్టర్ మరియు ఇతర కూరగాయలు మరియు పప్పుధాన్యాలు. ఇది ఒక చిన్న తరహా ఆహారం ప్రాసెసింగ్ పరిశ్రమ, ముఖ్యంగా వరి మిల్లులు, మరియు కూరగాయల నూనె మిల్లులు ఉన్నాయి. సహజ వస్తువుల మార్కెటింగ్ ప్రధాన ఆధారం. వరి మార్కెటింగ్ ప్రధాన వనరు.

దేవాలయాలు[మార్చు]

రామలింగేశ్వరస్వామి దేవాలయం[మార్చు]

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం

సాధారణంగా గుడుల యొక్క ముఖద్వారాలు తూర్పువైపుకు ఉంటాయి. కాని ఈ గుడి ముఖద్వారం మాత్రం పడమరవైపుకు ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక కథ ప్రాచూర్యంలో ఉంది. కాకతీయ మహారాజు గుడిని నిర్మించదలచి ఆ గ్రామంలో ఉన్న ఒక శిల్పికి నిర్మాణబాధ్యతను అప్పగించాడు. దానికి ప్రతిఫలంగా కోరినంత ధనం ఇస్తానని వాగ్దానం చేశాడు. అనుకున్న సమయంలో అనుకున్న విధంగా శిల్పి గుడిని నిర్మించాడు. అనంతరం మహారాజు వద్దకి వెళ్లి ధనం గురించి అడుగగా, ‘‘ధనం లేదు ఏమిలేదు. ఇవ్వను ఏంచేసుకుంటావో చేసుకో, (గుడి తీసుకెళ్ళలేడనే ఉద్దేశ్యంతో) అంతగా అవసరమైతే నీవు నిర్మించిన ఆ గుడిని నీవే తీసుకుపో’’ అని అన్నాడు. దాంతో కోపగించిన ఆ శిల్పి గుడికి నాలుగు వైపులా, నాలుగు చక్రాలను అమర్చి తీసుకోనిపోతుండగా, మహారాజు వచ్చి, ‘‘నన్ను క్షమించండి. మీ శక్తిని గ్రహించక అపరాధంచేశాను. ధనం తీసుకొని గుడిని ఇక్కడే ఉండనీయండి’’ అని వేడుకున్నాడు. దానికి ఆ శిల్పి అంగీకరించాడు. ఆ విధంగా తూర్పువైపుకు ఉండాల్సిన ముఖద్వారం, పడమరవైపుకు తిరిగింది.

పండుగలు[మార్చు]

బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవాలు[మార్చు]

2014 ఫిబ్రవరి 17 నుండి 21 వరకు బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాలు జరిగాయి. దీనికోసం స్థానిక చెరువు కట్ట వద్ద సుమారు రూ. 12 లక్షల వ్యయంతో నూతనంగా ముత్యాలమ్మ గుడిని నిర్మించారు. అంతేకాకుండా శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో రూ. 50వేలతో భద్రకాళి విగ్రహాన్ని, గ్రామ పంచాయతీ కార్యలయం సమీపంలో రూ. 2 లక్షల వ్యయంతో గ్రానైట్ బండలతో బొడ్రాయి గద్దెను నిర్మించారు.

మోత్కూర్ స్టేట్ బ్యాంక్

17న గణపతి పూజా, ఊరికి నాలుగు బాటలు కట్టుకట్టే కార్యక్రమం... 18న ఆవుపేడతో అలికి శుద్ధిచేసి దీపం పెట్టే కార్యక్రమం క్షీరాధివాసనము, హోమమలు... 19న నవధాన్యాలు కలిపే కార్యక్రమం ధాన్యాధివాసము, పుష్పాధివాసము, పాలాధివాసము, శయ్యాధివాసము... 20న విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం బలిజల్లే కార్యక్రమం, పూర్ణాహుతి, మహానివేదన, హరతి, ప్రసాద వితరణ, పండిత సత్కారము... 21న బోనాల ఉత్సవంతో దేవతలకు నైవేద్యం సమర్పించారు.

20వ తేదీన ధ్వజస్తంభం, దేవతామూర్తుల విగ్రహాలు, బొడ్రాయిని రామలింగేశ్వరస్వామి దేవస్థానం నుండి ట్రాక్టర్ పై ఉంచి పట్టణ కేంద్రంలోని వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అడపడుచులు బిందెలతో నీళ్లు తెచ్చి ధ్వజస్తంభం, దేవతామూర్తుల విగ్రహాలపై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

21వ తేదీన గ్రామంలోని మహిళలు నూతన వస్త్రాలు ధరించి వడిబియ్యం పోసుకొని బొడ్రాయి, ముత్యాలమ్మ ఆలయాల వద్ద బోనాలను సమర్పించి పూజలు నిర్వహించారు. బొడ్రాయి, ముత్యాలమ్మలకు బోనాలు సమర్పించడంతో ఉత్సవాలు ముగిసాయి.

ఉగాది[మార్చు]

వర్షకాలం రోడ్ల పరిస్థితి

మోత్కూర్‌లో ఉగాది వేడుకలు విభిన్నంగా జరుగుతాయి. గ్రామస్థులకు వ్యాధులు రాకుండా ఉండాలంటే ఉగాది రోజు కోళ్లను బలి ఇచ్చే ఆచారం కొనసాగుతోంది. ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా సంవత్సరాదిని షడ్రుచులతో స్వాగతం పలుకుతుంటే, మోత్కూర్ లో రివర్స్‌. గత 80 ఏళ్లుగా నాన్ వెజ్‌తో స్వాగతం పలుకుతున్నారు గ్రామస్థులు. అటు తర్వాత రైతులు ఎడ్ల బండ్ల పోటీని నిర్వహించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇలా చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని స్థానికుల విశ్వాసం. గత 80 ఏళ్లుగా వెరైటీగానే సాగుతున్నాయి. స్వాతంత్ర్యం రాక ముందు నుంచి మోత్కూర్ గ్రామస్తులకు కలరా, మశూచి వ్యాధులు వచ్చాయి. అప్పట్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో చాలామంది చనిపోయారు. దీంతో గ్రామం నలువైపులా ముత్యాలమ్మ దేవతలను ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. అందులోభాగంగా గ్రామ దేవతకు బోనం సమర్పించి, ఉగాది రోజు కోళ్లను బలి ఇచ్చి మళ్లీ బోనం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

గ్రామంలోని మహిళలంతా డప్పు చప్పుళ్లతో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణంలోకి చేరుకుంటారు. అక్కణ్నుంచి గ్రామ దేవత వద్దకు చేరుకుంటారు. అటు గ్రామంలోని పురుషుల సంఖ్య తమ శక్తికి తగ్గట్లు వాహనాలను అందంగా అలంకరించి ఎడ్ల పోటీలు నిర్వహిస్తారు. మోత్కురు వాసులు ఎక్కడ స్థిరపడ్డా ఉగాది రోజు గ్రామానికి చేరుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని, ఎలాంటి వ్యాధుల బారిన గ్రామస్థులు పడరని స్థానికుల నమ్మకం.

మోత్కూర్ ఏరు

బోనాలు[మార్చు]

శ్రావణమాసంలో గ్రామ దేవతలకు బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. గ్రామంలో మ హిళలు గ్రామ దేవతలకు బోనాలు వండి పసుపు, కుంకుమలతో బోనం కుండలను అలంకరించి, బోనం కుండలపై దీపాలు వెలిగించుకుని డప్పు చ ప్పుళ్లతో ప్రదర్శనగా తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో గ్రామదేవతలకు నైవేధ్యం సమర్పిస్తారు. టెంకాయలు కొట్టి మొ క్కులు తీర్చుకుంటారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
సుమంగళి గార్డెన్స్

ఇతర సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అంతేకాకుండా అన్ని రకాల సౌకర్యాలతో ప్రైవేట్ ఆసుపత్రులు చాలానే ఉన్నాయి.

ఎల్.ఎన్ గార్డెన్స్

పాఠశాలలు[మార్చు]

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలు (మహాత్మా గాంధీ నగర్, పద్మశాలీ కాలనీ, ధర్మపురం, ఇందిరా నగర్, ఆరెగూడెం, రాజన్నగూడెం, జామచెట్లబావి). హరి విద్యాలయం, సెక్రెడ్ హార్ట్స్ ఉన్నత పాఠశాల, వివేకానంద విద్యా మందిర్, శ్రీ శివ శివాని కాన్సెప్ట్ పాఠశాల, ప్రగతి విద్యాలయం, అక్షర కాన్సెప్ట్ స్కూల్, శ్రీ విద్యా నికేతన్, సెయింట్ ఆన్స్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, సాయి చైతన్య స్కూల్, విశ్వ భారతి స్కూల్ మరియు మదర్సా జామియా వంటి ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.

మోత్కూర్ చెరువు

కళాశాలలు[మార్చు]

ఇక్కడ ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలలు (శాంతినికేతన్, ఎస్.వి), రెండు డిగ్రీ కళాశాలలు (శ్రీ సంతోషి, సాయిరాం) ఉన్నాయి.

ప్రయాణ ప్రాంగణం

మంచినీటి వ్యవస్థ చాలా దయనీయంగా ఉంది. వేసవికాలం వచ్చిందంటే నీరు దొరకదు. చుట్టుప్రక్కల బావులు, చెరువులు, బోర్లు అన్ని ఎండిపోతాయి.

రోడ్డు వసతి[మార్చు]

వెంకటేశ్వర టాకీస్

హైద్రాబాద్ నుండి తొర్రుర్ వెళ్ళుటకు మోత్కూర్ మార్గం దగ్గరిది. కానీ సరైన రోడ్డుమార్గం లేదు. సుమారు 120 బస్సలు మోత్కూర్ మీదుగా రాకపోకలు సాగిస్తూ, ప్రతిరోజూ 5000 నుండి 10000 మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.

జనరల్ పోస్టాఫీస్ ఉంది. ప్రతి ఆదివారం మార్కెట్ (అంగడి) జరుగుతుంది.చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఈ మార్కెట్ లో వ్యవసాయం, కూరగాయలు, బట్టలు మరియు సాధారణ కిరాణా, జంతువుల అమ్మకాలు నిర్వహిస్తారు. మూడు మండలాల్లో అతిపెద్ద స్థానిక మార్కెట్ ఇది.

ఫంక్షన్ హాల్స్[మార్చు]

 1. జి.యం.ఆర్ ఫంక్షన్ హాల్
 2. సుమంగళి ఫంక్షన్ హాల్ (ప్రొ . పోచం సోమయ్య, ఫోన్: 9441165347)
 3. ఎల్.ఎన్ గార్డెన్స్
 4. వై. జె. గార్డెన్స్

సినిమా టాకీస్[మార్చు]

 1. వెంకటేశ్వర టాకీస్
అంబేడ్కర్ చౌరస్తా

పెట్రోల్ బంక్స్[మార్చు]

రెండు (భువనగిరి రోడ్డులో ఒకటి, అమ్మనబోల్ రోడ్డులో ఒకటి) ఉన్నాయి.

బ్యాంకులు[మార్చు]

 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్
 2. గ్రామీణ వికాస్ బ్యాంకు
 3. District co-operative Bank

విగ్రహాలు[మార్చు]

 1. జ్యోతి రావు పూలే
 2. అంబేడ్కర్
 3. మహాత్మా గాంధీ
 4. బాబు జగ్జీవన్ రామ్
 5. సర్ధార్ సర్వాయి పాపన్న

ముఖ్యమైన వ్యక్తులు[మార్చు]

మోత్కూర్ గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. ప్రముఖ వ్యక్తులు:

 1. కీ.శే. కల్వల ప్రభాకర్ రావు, పార్లమెంట్ రాజ్యసభ (1986-1992)
 2. కీ.శే. ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు.
 3. కీ.శే. మద్ది రంగారెడ్డి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మరియు BCCI కి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసాడు.
 4. కంచర్ల శంకర్ రెడ్డి,
 5. ఎస్.ఎన్. చారి, చిత్రకారుడు, రంగస్థల నటుడు, దర్శకుడు మరియు పాత్రికేయుడు.
 6. అభినయ శ్రీనివాస్, ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకులు, రంగస్థల నటులు, దర్శకులు.

2013 లో గెలుపొందిన గ్రామ పంచాయితి సభ్యులు[మార్చు]

 • సర్పంచ్. బయ్యని పిచ్చయ్య (వై. సి. పి )
 1. 1వ వార్డ్ మెంబర్.
 2. 2వ వార్డ్ మెంబర్.
 3. 3వ వార్డ్ మెంబర్.
 4. 4వ వార్డ్ మెంబర్.
 5. 5వ వార్డ్ మెంబర్.
 6. 6వ వార్డ్ మెంబర్.
 7. 7వ వార్డ్ మెంబర్.
 8. 8వ వార్డ్ మెంబర్.
 9. 9వ వార్డ్ మెంబర్. ఎలగందుల అమరేందర్ (టి. అర్.ఎస్ )
 10. 10వ వార్డ్ మెంబర్.
 11. 11వ వార్డ్ మెంబర్.
 12. 12వ వార్డ్ మెంబర్.
 13. 13వ వార్డ్ మెంబర్.
 14. 14వ వార్డ్ మెంబర్.
 15. 15వ వార్డ్ మెంబర్.
 16. 16వ వార్డ్ మెంబర్.

మండల పరిషత్ ఎన్నికలు (2014)[మార్చు]

మోత్కూరు మండల పరిషత్‌ అధ్యక్ష పీఠం తెరాస వశమైంది. జానకిపురం ఎంపీటీసీ స్థానం నుంచి గెలిచిన ఓర్సు లక్ష్మీ (తెరాస)ను ఎంపీపీ అధ్యక్షురాలిగా, పొడిచేడు ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన వంగాల లలిత(కాంగ్రెస్‌)ను ఎంపీపీ ఉపాధ్యక్షురాలిగా, దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఎండీ అశ్రఫ్‌జానీ (తెరాస)ను కోఆప్షన్‌ సభ్యునిగా ఎన్నుకయ్యారు.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 55,694 - పురుషులు 27,911 - స్త్రీలు 27,783

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]

ఉత్సవాల చిత్రమాలిక[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూస:యాదాద్రి జిల్లా మండలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=మోతుకూరు&oldid=2268764" నుండి వెలికితీశారు