Jump to content

రుక్మి

వికీపీడియా నుండి
రుక్మిని వదిలివేస్తున్న శ్రీకృష్ణుడు

రుక్మి విదర్భ దేశాన్ని పరిపాలించే భీష్మకుడు అనే రాజు యొక్క పెద్ద కుమారుడు. ఇతనికి రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే నలుగురు సోదరులు, రుక్మిణి అనే సోదరి ఉంది.

శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవి ఒకరినొకరు ఇష్టపడతారు. రుక్మి మాత్రం తన సోదరిని శిశుపాలుడు కిచ్చి చేయాలని తీర్మానిస్తాడు. ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. వివాహ సమయంలో అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగర పొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. రుక్మి తన సేనతో వెళ్ళి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచి పెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించి సన్మానం చేస్తాడు.

రుక్మి తన కూతురైన శుభాంగిని ప్రద్యుమ్నునికిచ్చి వివాహము చేసెను. వివాహ సమయంలో ఇతడు బలరాముని అవమానింప దలచి జూదము నాడుటకు పిలిచెను. మూడు సార్లు అసత్యము లాడి బలరాముని కోపానికి పాత్రుడై యుద్ధంలో అతని చేత చంపబడ్డాడు.

మూలాలు

[మార్చు]
  • పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో, ఏలూరు, 2007, పేజీ:348.
"https://te.wikipedia.org/w/index.php?title=రుక్మి&oldid=2988176" నుండి వెలికితీశారు