వనమయూరము
స్వరూపం
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| స్రగ్ధర, మహాస్రగ్ధర |
| ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
| లయగ్రాహి, లయవిభాతి |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
వనమయూరము
[మార్చు]ఉన్నతములై వనమయూర కృతు లోలిన్
ఎన్నగ భజంబులపయి న్సనగగంబుల్
చెన్నొదవ దంతియతి జెంది యలవారున్
వెన్నుని నుతింతురు వివేకు లతి భక్తిన్.
పదునాల్గవశక్వరీచ్ఛందంబునందు వనమయూరము
గణ విభజన
[మార్చు]| UII | IUI | IIU | III | UU |
| భ | జ | స | న | గగ |
| ఉన్నత | ములైవ | నమయూ | రకృతు | లోలిన్ |
లక్షణములు
[మార్చు]| • | పాదాలు: | నాలుగు |
| • | 14 | |
| • | ప్రతిపాదంలోని గణాలు: | భ, జ, స, న, గగ |
| • | యతి : | ప్రతిపాదంలోనూ 9వ అక్షరము |
| • | ప్రాస: | పాటించవలెను |
| • | ప్రాస: యతి | ప్రాస యతి చెల్లదు |
ఉదాహరణ 1:
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో వాడిన వనమయూర వృత్త పద్యాల సంఖ్య: 1
పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/వృత్రాసుర వృత్తాంతము|(భా-6-378-వన.)
అంత సుర లేయు నిబి డాస్త్రముల పాలై
పంతములు దక్కి హత పౌరుషముతో ని
శ్చింత గతి రక్కసులు సిగ్గుడిగి భూమిం
గంతుగొని పాఱి రపకార పరు లార్వన్.