Jump to content

వాడుకరి చర్చ:భవానీశంకర్ శర్మ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
భవానీశంకర్ శర్మ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

భవానీశంకర్ శర్మ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Pranayraj1985 గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Pranayraj1985 గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 15:28, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 16:38, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]


కొత్త వ్యాసం రాయడంలో సూచనలు

[మార్చు]

@భవానీశంకర్ శర్మ గారూ, మీరు బులుసు పాపయ్యశాస్త్రి పేరుతో వ్యాసాన్ని సృష్టించారు. అయితే, బులుసు పాపయ్య శాస్త్రి పేరుతో ఇదివరకే వికీలో వ్యాసం ఉంది, గమనించగలరు. ఒక కొత్త వ్యాసాన్ని రాయడానికి ముందు, వివిధ పేర్లతో ఆ వ్యాసాన్ని వికీలో వెతకాలి. మీరు రాయలనుకుంటున్న వ్యాసం వికీలో లేదు అనుకున్న తరువాతనే, కొత్త వ్యాసం ప్రారంభించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:21, 30 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తి పేరుతో వ్యాసం వెతికి లేదనుకున్నాకనే స్రుష్టించు అని జవాబు దొరికినాక చేయడం జరిగింది. చూసుకొంటాను. భవానీశంకర్ శర్మ (చర్చ) 10:30, 30 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
భవానీశంకర్ శర్మ గారూ, వికీలో వ్యాసాన్ని వెతకడంలో అనేక విధాలుగా వెతకాల్సివుంటుంది. ఉదా: బులుసు పాపయ్యశాస్త్రి వ్యాసం కావాలంటే బులుసు పాపయ్య శాస్త్రి, పాపయ్యశాస్త్రి బులుసు, పాపయ్య శాస్త్రి బులుసు, బి. పాపయ్యశాస్త్రి, బి. పాపయ్య శాస్త్రి వంటి పేర్లతో వ్యాసాన్ని వెతకాలి అన్నట్టు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:38, 30 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండీ. ఇప్పుడు చిలుకూరి పాపయ్య శాస్త్రి గారి పేజీని ఎలా వెతకాలో చెప్పగలరు
~~~శంకర్ శర్మ భవానీశంకర్ శర్మ (చర్చ) 10:48, 30 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చిలుకూరి పాపయ్య శాస్త్రి, చిలుకూరి పాపయ్యశాస్త్రి పేర్లతో వెతకాలి. వికీలో నేను వెతికాను, దొరకలేదు. చిలుకూరి పాపయ్యశాస్త్రి పేరుతో వ్యాసం రాయోచ్చు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 13:19, 30 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985, @భవానీశంకర్ శర్మ గార్లకు, గూగుల్ కాని, వికీపీడియా శోధనా యంత్రాలు పదాలు శీర్షికలోనే కాక, వ్యాసంలో ఎక్కడ కనబడిన పట్టి చూపుతాయి, అన్ని పదాలు వుండకపోయినా పరవాలేదు. కావున చిలుకూరి పాపయ్య శాస్త్రి అని వెతికితే చాలావరకు ఉపయోగంగా వుంటుంది. అదే పదబంధం కావాలంటేనే మీ వెతుకు పదబంధాన్ని కొటేషన్ మార్కులతో పెట్టి వెతకాలి. మరింతగా తెలుసుకోవాలంటే వికీమీడియా బ్లాగు పోస్టుల శ్రేణి చదవండి. అర్జున (చర్చ) 07:20, 2 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండీ .. భవానీశంకర్ శర్మ (చర్చ) 11:52, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీ రచనలు

[మార్చు]

@భవానీశంకర్ శర్మ గారు, అనగానిపాలెం లో మీ రచనలు వికీవ్యాస శైలిలో లేవు, ప్రచార దృక్పధంతో వున్నందున రద్దు చేశాను. స్వాగత సందేశంలో లింకుల ద్వారా వికీగురించి మరింత తెలుసుకోండి. మొదటి పేజీలో ప్రదర్శించిన వ్యాసాలను కొంతవరకు మెరుగైనవి కనుక వాటిని చదివి కూడా వికీవ్యాసాల శైలి గురించి తెలుసుకోవచ్చు. సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 01:26, 6 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మరి లింకులు ప్రచురితం అవడం వలన గ్రామ దేవాలయానికి చెందిన సమాచారం ఉంచవచ్చు కదండీ (మూలాల మాదిరి) మా పేరు లేకుండా ? భవానీశంకర్ శర్మ (చర్చ) 07:51, 6 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@భవానీశంకర్ శర్మ గారు,తెవికీలో క్రియాశీలక సభ్యులు, నిర్వాహకులు తక్కువగా వున్నారు, కావున తక్కువ వీక్షణలు పొందే గ్రామాల, వ్యక్తుల వ్యాసాలలో దోషాలపై శ్రద్ధ పెట్టటం అంత విలువైన పని కాదు. మీకు వికీగురించి మరింతగా తెలుసుకోవడానికి ఒక రెండొందలు మార్పులు ఇప్పటికే అధిక వీక్షణలు పొందుతున్న వ్యాసాలలో చేయండి. అప్పుడు మీకు అనుభవం మెరుగువతుంది. ఆ తరువాత మీరే మరింత మెరుగుగా ఇతర వ్యాసాలలో మార్పులు చేయగలుగుతారు. అర్జున (చర్చ) 04:39, 7 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
మాకు ఇప్పటికి హోంపేజి లో వస్తున్న సూచనలలోనున్న వ్యాసాల లిస్ట్ ని బట్టి వాటిలో చేయగలిగిన మార్పులను చేస్తున్నాను. భవానీశంకర్ శర్మ (చర్చ) 06:51, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నందనవనం శేషగిరిరావు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

నందనవనం శేషగిరిరావు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

విషయ ప్రాముఖ్యత లేదు, మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నందనవనం శేషగిరిరావు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:21, 7 ఏప్రిల్ 2022

మీ వాడుకరి పేజీ నిర్వహణలో అభ్యంతరాలు

[మార్చు]

మీ వాడుకరి పేజీ మీ గురించి క్లుప్తంగా రాసుకోవాలి.అంతేగానీ అమ్మాయిని అందంగా పొగడటం ఎలానో చెప్పింది నా తెలుగు,అందాన్ని అందంగా రాయడం ఎలాగో చెప్పింది నా తెలుగు,అనే కవితలు, మీ స్వంత బ్లాగు ప్రచారం కోసం బ్లాగు లింకు రాసుకోవటం, మీ స్వంత రచనలు ఇ-బుక్ : "కినిగె" , "పొతీ" లింకులు ఇవ్యటం, గతమెంతో ఘనకీర్తి అని మిమ్మల్ని మీరు పొగడుకోవటం వికీనియమాలకు విరుద్దం.ఇంకా ఇలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి.కావున పేజీని వెంటనే తిరిగి సవరించి రాసుకొనగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:01, 8 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీ అభ్యంతరాలను తీసివేయటం జరిగింది. భవానీశంకర్ శర్మ (చర్చ) 06:40, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 06:46, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]