వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కార్యక్రమము
[మార్చు]

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్ల యూజర్‌గ్రూపు
1  · 2  · 3  · 4  · 5  · 6  · 7  · 8
9  · 10

తేదీ: 14.04.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.30 వరకు
శిక్షణాంశం: '"తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" - ప్రధానంగా వర్గాలకు సంబంధించి నేర్చుకోవాల్సిన విషయాలు
శిక్షకులు: చదువరి గారు
వేదిక: జిట్సీ మీట్ (Jitsi Meet)

పాల్గొనేవారు: (సభ్యనామం /సంతకం)

  1. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:24, 7 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --Rajasekhar1961 (చర్చ) 12:10, 13 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --A.Murali (చర్చ) 12:56, 13 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --A.Murali (చర్చ) 12:57, 13 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. వి.జె.సుశీల --VJS (చర్చ) 13:37, 13 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Mothiram 123 (చర్చ) 06:35, 14 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. చదువరి (చర్చరచనలు) 06:39, 14 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. యర్రా రామారావు (చర్చ) 07:14, 14 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  9. Kasyap (చర్చ) 08:11, 14 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  10. Palagiri (చర్చ) 08:27, 14 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక
[మార్చు]

శిక్షణ[మార్చు]

శిక్షణాంశం:వర్గాలకు సంబంధించి నేర్చుకోవాల్సిన విషయాలు

వ్యాసంలో వర్గాన్ని చేర్చేందుకు

  1. వ్యాస విషయాన్ని నిర్వచించే ముఖ్యమైన అంశాలకు చెందిన వర్గాన్ని ఎంచుకోవాలి.
  2. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న వర్గాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అనే వర్గాన్ని ఎంచుకునే బదులు, చిత్తూరు జిల్లా క్రీడాకారులు ఎంచుకోవాలి.
  3. ఏ వర్గాన్ని చేర్చాలి అనే విషయాన్ని నిశ్చయించుకునేందుకు కింది అంశాలను పరిశీలించవచ్చు
    1. "ఇక్కడికి లింకున్న పేజీలు" చూడండి. ఒక ఐడియా రావచ్చు
    2. ఈ వ్యాసం పేరుతో తెవికీలో వెతకండి. ఏయే పేజీల్లో ఈ పేరు ఉందో ఆయా పేజీలకు దీనితో ఉన్న సంబంధం ఏమిటో చూడండి, ఒక ఐడియా రావచ్చు
    3. "ఇవి కూడా చూడండి" విభాగంలో ఉన్న లింకులు చూడండి. ఒక ఐడియా రావచ్చు
    4. ఇంగ్లీషు పేజీలో ఉన్న వర్గాలను చూడండి, దానితో ఒక ఐడియా రావచ్చు
    5. ఇంగ్లీషు వికీలో "వాట్ ల్లింక్స్ హియర్" చూడండి. ఒక ఐడియా రావచ్చు
    6. ఇంగ్లీషు పేజీలో "సీ ఆల్సో" విభాగంలో ఉన్న లింకులు చూడండి. ఒక ఐడియా రావచ్చు
  4. ఏ వర్గాన్ని చేరుస్తున్నారో దానికి చెందే సంబంధ సమాచారం వ్యాసంలో ఉండితీరాలి.

కొత్త వర్గాన్ని సృష్టించేటపుడు

  1. పేజీలో ఏదైనా కొత్త వర్గాన్ని చేర్చేటపుడు, ఆ వర్గం లోకి ఇంకా ఏమైనా ఇతర పేజీలు వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి. అవకాశం లేదనిపిస్తే ఆ వర్గాన్ని సృష్టించరాదు. ఉదాహరణకు "గుంటూరు జిల్లా వైద్యులు" అనే వర్గం లోకి అనేక ఇతర పేజీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పేరుతో వర్గాన్ని సృష్టించవచ్చు. కానీ "వంకాయలపాడు వైద్యులు" అనే వర్గం లోకి మరిన్ని పేజీలు చేరే అవకాశం బహు తక్కువ. అంచేత ఆ పేరుతో వర్గాన్ని సృష్టించరాదు
  2. వ్యాసం పేజీ లాగానే వర్గం పేరు కూడా ప్రజాబాహుళ్యంలో వ్యాప్తిలో ఉన్న పేరునే వాడాలి
  3. భాష, జాతీయత/ప్రాంతీయతల మధ్య తేడా తెలిసేలా స్పష్టంగా రాయాలి ఇంగ్లీషు/ఇంగ్లాండుకు చెందిన పోలిష్/పోలండు, మలయాళీ/కేరళ (పొట్టెక్కాట్ మలయాళీ రచయిత, శశిథరూర్ కేరళ రచయిత, మలయాళీ రచయిత కాదు), తమిళ/తమిళనాడు వగైరాలు
  4. వర్గం పేరును సాధారణంగా బహువచనంలో రాయండి. సినిమాలు వర్గంలో వివిధ సినిమాల పేజీలను చేరుస్తాం. సినిమా వర్గంలో సినిమాకు సంబంధించిన సామాన్య విషయాల పేజీలను చేరుస్తాం. అంటే సినిమా దర్శకత్వం అనే వ్యాసం సినిమాలు వర్గం లోకి రాదు, సినిమా అనే వర్గం లోకి వస్తుంది.
  5. ప్రసిద్ధ, ప్రఖ్యాత లాంటి విశేషణాలు వాడరాదు. "ప్రసిద్ధ వ్యక్తులు", "ప్రఖ్యాత వజ్రాలు" - ఇలా!
  6. వర్గాల పేర్లు జరిగిపోయినదాన్ని సూచించేలా ఉండాలి. భవిష్యత్తును సూచించేవిగా/ ఉండకూడదు. "ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు" అని ఉండాలి. "ఆసియా క్రీడల్లో పతకాలు సాధించే క్రీడాకారులు", "ఆసియా క్రీడల్లో పతకాలు సాధించు క్రీడాకారులు" అని ఉండకూడదు. "కాబోయే", "రాబోయే", "జరగబోయే" వంటి భవిష్యత్తు వర్గాలు పెట్ట కూడదు
  7. వికీపీడియా నిర్వహణకు సంబంధించిన వర్గాల పేర్లలో ముందు "వికీపీడియా" అని పెట్టాలి. వర్గం:వికీపీడియా నిర్వహణ, వర్గం:వికీపీడియా వ్యాసాల నిర్వహణ - ఇలాగ.
  8. వికీప్రాజెక్టు వర్గాల పేర్లలో ముందు వికీప్రాజెక్టు అని రావాలి. వర్గం:వికీప్రాజెక్టు తెలుగు, వర్గం:వికీప్రాజెక్టు భారతదేశ చరిత్ర - ఇలాగ
  9. వ్యక్తుల వర్గాలలో భౌగోళిక+వృత్తి కలిసిన వర్గాలను చేర్చాలి. మహిళలైతే భౌగోళిక+వృత్తి+మహిళ అనేవి కలిసి ఉండాలి
    1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యక్తుల కోసం భౌగోళిక స్థాయి - జిల్లా, పట్టణ స్థాయి వరకు ఉండవచ్చు. ఉదాహరణకు "చిత్తూరు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు‎", "తిరుపతి ఆసుపత్రులు" - ఇలాగ
    2. భారతదేశం లోని ఇతర రాష్ట్రాల వ్యక్తుల కోసం భౌగోళిక స్థాయి - రాష్ట్రం, ముఖ్య నగరం స్థాయి వరకు ఉండవచ్చు. ఉదాహరణకు "తమిళనాడు రచయితలు", "చెన్నై సినిమా నటులు"
    3. ఇతర దేశాల వ్యక్తులకు దేశస్థాయి, మహానగరాల స్థాయి ఉండాళి. ఉదాహరణకు "అమెరికా పారిశ్రామికవేత్తలు", "న్యూయార్క్ రచయితలు"
    4. పై వర్గాలన్నింటి లోనూ మహిళలకు ఉప వర్గాలుండాలి. ఉదాహరణకు అమెరికా మహిళా వ్యాపారవేత్తలు, భారతీయ రచయిత్రులు, తెలంగాణ మహిళా శాసన సభ్యులు వగైరా. ఇవన్నీ సంబంధిత భౌగోళిక+వృత్తి వర్గం లోకి వెళ్తాయి. అంటే, పై మహిళా వర్గాళూ ఈ వర్గాల లోకి వెళ్తాయి: అమెరికా వ్యాపారవేత్తలు, భారతీయ రచయితలు, తెలంగాణ శాసన సభ్యులు గమనిక: పైన చూపిన భౌగోళిక స్థాయి పరిమితులు సూచనామాత్రమే. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతానికి సంబంధించి ఎక్కువ వ్యాసాలుంటే మరింత తక్కువ స్థాయి వర్గం కూడా పెట్టుకోవచ్చు.
  10. వర్గాలకు సంబంధిత ఇతర భాషా లింకులు ఇవ్వండి. దాంతో పేజీలను అనువదించేటపుడు మూలవ్యాసం ఏయే వర్గాల్లో ఉందో తెలుగు వ్యాసం కూడా తెలుగులోని సంబంధిత వర్గాల్లోకి ఆటోమాటిగ్గా చేరిపోతుంది.

పాల్గొన్న వారు[మార్చు]

సుమారు 10 మంది. ప్రణయ్‌రాజ్ వంగరి; వి.జె.సుశీల; చదువరి; యర్రా రామారావు; ఏ.రాజశేఖర్;రెహ్మానుద్దీన్; స్వరలాసిక; Palagiri; భాస్కర్; బి.వి.ప్రసాద్

వచ్చేవారం[మార్చు]

తేదీ 21.7.2024 సమయం మధ్యాహ్నం 2.00 నుంచి

  • శిక్షణా కార్యక్రమం-3 లో ఇదే శిక్షణాంశం కొనసాగుతుంది.
  • 7.4.2024న చెప్పుకున్న అంశాలకు సంబంధించి వాడుకరులందరూ కనీసం మూడు వ్యాసాలపై పనిచేసి, వాటి గురించి రెండు వారాల తరువాత జరిగే శిక్షణా తరగతిలో చెప్పాలి.