Jump to content

వికీపీడియా:రచ్చబండ (వార్తలు)/పాత చర్చ 1

వికీపీడియా నుండి

పాత చర్చ 1 | పాత చర్చ 2

Stewards election

[మార్చు]

Hello,

The stewards election has started on m:Stewards/elections 2005. Anyone can vote provided that he has a valid account on meta with a link to at least one user page, on a project where the editor is a participant, with at least 3 months participation to the project. Stewards can give sysop right on projects where there are no local bureaucrate. Please vote ! Yann 16:32, 18 May 2005 (UTC)

PS: Please translate this and put it in the Village Pump. Thanks. Yann 16:32, 18 May 2005 (UTC)

వార్తల్లో వికీ

[మార్చు]
  • వికీపీడియా గురించి 2006 నవంబర్ 5 న ఈనాడు ఆదివారం పుస్తకంలో వ్యాసంగా వచ్చింది. ఇది తెవికీ ప్రస్థానంలో ఓ మలుపు. ఈ వ్యాసానికి స్పందనగా ఎన్నడూ లేనంత ఎక్కువ మంది కొత్త సభ్యులు ఈ ఒక్క రోజే చేరారు. ఈనాడు దండకవిలలో పాత పత్రికలను మూడు నెలల పాటే ఉంచి తరువాత తొలగించడం వలన ప్రస్తుతం ఈ వ్యాసం ఈనాడు వెబ్సైటులో ఉండదు. ఆ వ్యాసం యొక్క పూర్తి పాఠం ఇక్కడ చూడవచ్చు.

మరోసారి ఈనాడులో వికీపీడియా!

[మార్చు]

2007, జూన్ 10 ఆదివారం నాడు ఈనాడు ఆదివారం పుస్తకంలో వెబ్ లో తెలుగు వెలుగులు పేరిట వచ్చిన వ్యాసంలో వికీపీడియా గురించి ప్రస్తావించారు. భారతీయ భాషల్లో కెల్లా అతి పెద్ద వికీపీడియాగా తెవికీని వర్ణించారు. వ్యాసం ఇలా అన్నది.. "..వికీపీడియా తెలుగు వెబ్‌సైట్‌లో 27వేలకు పైగా తెలుగు వ్యాసాలున్నాయి, చూడొచ్చు. మరే భారతీయభాషలోనూ ఇన్ని ఆర్టికల్స్‌లేవు." తెవికీ గురించి ఈనాడు ఇంకా ఇలా రాసింది..

"తెవికీ ...అంటే తెలుగు వికీపీడియా. భారతీయ భాషలన్నిటిలోకి అత్యధిక వ్యాసాలున్న వెబ్‌సైట్‌ (http://te.wikipedia.org)ఇది. 2003, డిసెంబరు 9న ఇందులో తెలుగు వ్యాసాలుంచడం మొదలైంది. 2007 ఫిబ్రవరి నాటికి దాదాపు 27వేలకు పైగా తెలుగు వ్యాసాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దాదాపు రెండువేల మందికి పైగా ఉన్న తెలుగు బ్లాగర్ల కృషి ఫలితమే ఇన్ని వ్యాసాలు. రాష్ట్రంలోని ప్రతిఊరికీ ఒక పేజీ కేటాయించి దానిగురించి రాయాలనేది తెవికీ సభ్యుల బృహత్తర లక్ష్యాల్లో ఒకటి."

స్వాగతం

[మార్చు]

నేను ఇప్పుడే వికిపిడియా లొ తెలుగు విభాగంను చూసి చాల సంతొషిస్తున్నాను, దీని వలన ఎంతొ మందికి విషయ పరిజ్ఞానము పెరుగుతుంది.

దీని వలన తెలుగు ప్రజానికానికి ఎంతొ ఉపయొగకరం.

శ్రీనివాస్, హైద్రాబాద్, ఇండియ.

నా పీరు సత్య0. నెను తెవీకీ గురి0చి ఈనాడు లొ చదివాను. తెవీకీ ఒక అద్భుత0. నెను కూడా వ్యాసాలు రాయడానికి నా వ0తు ప్రయత్న0 చెయాలి అనుకు0టున్నాను.

సత్య0. సత్తెనపల్లె, గు0టూరు

"మన తెలుగు...వెబ్‌లో బహుబాగు" - ఈనాడు వార్త!

[మార్చు]

ఈనాడు పత్రిక మరోసారి తెవికీ గురించి రాసింది. 2008 ఫిబ్రవరి 3 ఆదివారం పుస్తకంలో తెవికీ గురించి సమగ్రమైన వ్యాసం ప్రచురించింది. తెవికీ ఎలా మొదలైందనే విషయంతో మొదలుపెట్టి, దాని ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ అందులో కృషి చేసిన ప్రముఖ వికీపీడియనుల గురించి రాసారు. ఆ వ్యాసంలోని ఒక భాగం..

"...అలా పద్మ ప్రాజెక్టుతో బాగా వెలుగులోకి వచ్చిన నాగార్జునను వికీ నిర్వాహకుల్లో ఒకరైన మార్క్‌ విలియంసన్‌ సంప్రదించారు. ఆసక్తి ఉంటే, నిర్వహించగలరన్న నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియా(ఉచిత విజ్ఞాన సర్వస్వం)ను రూపొందించి ఇస్తామని టపా రాశారు. దాన్నో ఛాలెంజ్‌గా భావించిన నాగార్జున సానుకూలంగా స్పందించారు. అదీ మన తెలుగులో ఒక విజ్ఞానసర్వస్వం ఏర్పడటానికి తొలిమెట్టు."

కొత్త్గగా లా కమీషన్ తన ప్రతిపాదనలలొ ప్రస్తుత అబ్బయిల కనిస వివాహ వయస్సును 21 ను0ది 18 స0వత్సరాలకు తగ్గి0చాలని పెర్కొ0ది.అలాగె 16 ఎల్ల లొపు ఆడవారితొ (ఆమె భార్య ఐనా సరె) వారి ఇష్ట ప్రకార0 సెక్స్ చెసిన కూదా అది అత్యాచార0 క్రి0దకి వస్తు0దని పెర్కొ0ది.

Search Suggest in media wiki projects

[మార్చు]

ఇప్పుడు "వెతుకు" పెట్టెలో ఏదయినా టైపుచేయడం మొదలుపెడితే, మీరు టైపుచేసిన అక్షరాలతో మొదలైయ్యే వ్యాసాల చిట్టాను చూపించేస్తుంది. మీసొంత వికీపీడియాలలో కూడా ఇటువంటి సదుపాయాన్ని పొందుపరచాలని అనుకుంటే మీడియా వికీలో ఉన్న సర్చ్ సజస్ట్ పేజీని చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:50, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది నా కంప్యూటర్‌లో కొంచెం కొంచెం పని చేస్తున్నది. బహుబాగు. - పాత చర్చే అయినా మళ్ళీ వ్రాస్తున్నాను. "వెతుకు" ఇదివరకు, అంటే షుమారు ఒక యేడాది క్రితం, ఒకమాదిరి బాగానే పని చేసేది. ఆ తరువాత అర్ధం పర్ధం లేని ఫలితాలను ఇవ్వసాగింది. కనుక గూగుల్ వాడసాగాను. ఈ మధ్య మళ్ళీ "వెతుకు" కొంచెం సంబంధం ఉన్న ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టిందనిపించింది --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:34, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]



అకాల మరణాలు

[మార్చు]

ఈ రోజు రాష్ర్టంలో రెండు కోల్డ్ బ్లడడ్ మర్డర్లు జరిగాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి దగ్గర ఒకటి, విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతం దగ్గర ఒకటి. ప్రజల కోసం సర్వస్వం త్యాగంచేసి నూతన ప్రజాస్వామ్య భారత నిర్మాణానికి కృషి ఛేస్తున్న నలుగురు బూటకపు ఎన్కొంటర్లలో మరణించారు. వారు వెల్లే మార్గంపై ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నా వారి త్యాగం గుర్తించే మనసుండాలి. మీమీ భద్రమయ జీవితాలకు ఎటువంటి ముప్పు లేదు. అందరకు మంచిని కోరుకుంటూనే వాళ్ళు ఆ మార్గం లో ఉన్నారు. వారి చావులతో ఈ రోజు దీపావలి జరుపుకున్న వారికి ధన్యవాదాలు. ़~~़జంఝావతి.

తెలుగు భాషకు ప్రాచీన హోదా

[మార్చు]

తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం అందరూ హర్షించదగ్గ వార్తాంశం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంనకు ఒక రోజు ముందుగా ఉత్తర్వులు వెలువడడం తెలుగు ప్రజలకు అపురూపమైన కానుక. నాలుగేళ్ళుగా ఎదురుచూస్తున్న మనకల ఈరోజు నెరవేరినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు మన తెలుగు టాస్క్ ఫోర్స్ కు మనమంతా ఋణపడి వుంటాం. ఇన్నాళ్ళుగా ఈ నిర్ణయానికి అడ్డుపదుతూ వచ్చిన తమిళ దురహంకార తమ్ముళ్ళకు ఈ నిర్ణయం చెంపపెట్టు వంటిది. యితర భాషల ఔన్నత్యన్ని గుర్తించడం నేర్చుకుంటే తమిళ తంబిలకు గౌరవం పెరుగుతుంది. ప్రాంతీయ కుళ్ళు రాజకీయాల వలన యిన్నాళ్ళు మనం ఎంతో నష్టపోయాం. ప్రాచీన హోదా వలనమన తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. 1500 సం.లకు పైగా లిపికలిగి ఉన్న భాషను యిన్నాళ్ళు మరుగున పడేయడం దారుం.ఇకనైనా కలిసికట్టుగా మనమంతా ముందుండి తెలుగు వెలుగును విశ్వం నలుమూలల వ్యాప్తిచెందేందుకు కృషి చేద్దామని ప్రతినబూనాల్సిన తరుణమిదేనని అందరకూ సవినయంగా మనవి చేస్తూ అందరకూ ఆంధ్ర్ ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేసుకుంటున్నాను.

़~~़జంఝావతి.

మీడియ ప్రభావమ్ - యువతులు

[మార్చు]

ఇటీవలి కాలములో మీడియ ప్రభావమ్ వలన ఛాలా మంది కాలేజి విద్యార్ధినులు మోసపోతున్నారు.ఈ మధ్య ఆంధ్ర ప్రదేష్, స్రీకాకులమ్ జిల్ల, పలాస లోని ఒక కాలేజి నుండి ముగ్గురు ఇంటర్ విద్యార్ధినులు హైదరాబాద్ పారిపొయారు. 10 రోజులు తరువాత వఛి ఉద్యోగమ్ కోసమ్ వెల్లామని ఛెప్పి పేరెంట్స్ ని మోసం ఛేసరు. అయితె అది వారి తప్పు కాదు మీడియ తప్పు అవుతుంది. కాదంటరా? 117.198.151.246 15:02, 11 డిసెంబర్ 2008 (UTC) నరహరి, కాసిబుగ్గ.

వికీపీడియన్ల కలయిక(బెంగుళూరు 16 ఆగస్టు 2009)

[మార్చు]

http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Bangalore/Bangalore4 బెంగుళూరులోని తెలుగు వికీపీడియన్లు కలవడానికి ప్రయత్నించండి. అర్జున 16:32, 26 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా మంది వికీపీడియన్లు హాజరయ్యారు. అయితే తెలుగు వికీపీడియన్లు నేను తప్ప ఇంకెవరు లారేదు. ఇది ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతుంది. సుందర్ తమిళ వికీపీడియా అభివృధ్ధి, అరుణ్ ఓపెన్ స్ట్రీట్ మాప్ గురించి మాట్లాడారు. ఈ సారి, బోట్ల గురించి ఉపన్యాసం వుండ వచ్చు. వికీ అకాడమీలు నిర్వహించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బెంగుళూరులో వారందరం కలిసి త్వరలో ఒక వికీ అకాడమీ నిర్వహించుదాము.అర్జున 15:48, 17 ఆగష్టు 2009 (UTC)

మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న 'ఈ వారం వ్యాసం' శీర్షిక

[మార్చు]

'ఈ వారం వ్యాసం' శీర్షిక మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టింది. 2007, 23 వారంలో సుడోకు తో ప్రారంభమైన శీర్షిక సుదీర్ఘ యాత్రకి సహకరించిన, నిర్వహించిన వారికి హృదయపూర్వక అభివందనలు. ఇది ఈ రోజు వ్యాసం గా మారే రోజుకోసం మనమందరం కృషి చేద్దాం. అర్జున 10:33, 7 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ వార్త మొదటి సంచిక విడుదల

[మార్చు]

ఆలోచన తర్వాత మూడు నెలలకి తెవికీ వార్త, రవిచంద్ర రచన వికీపీడియా వెక్టర్ రూపం, వైజాసత్య తో ఇంటర్వూతో విడుదలయ్యింది. సహకరించిన అందరికి ధన్యవాదాలు . అసలు పని కొనసాగించడమే. అది ఇప్పుడే మొదలవుతుంది, మీ వ్యాఖ్యలతో, రచనలతో. మీ రచనలతో నన్ను కాని రవిచంద్ర ని కాని సంప్రదించండి. అర్జున 06:58, 1 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాద ప్రాజెక్టు గురించి సంప్రదింపులు

[మార్చు]

నేను గూగుల్ ట్రాన్స్లేట్ కిట్ ప్రొడక్ట్ మేనేజర్ని రేపు తమిళ వికీ సోదరులతో బెంగుళూరులో కలుస్తాను.వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు చూసి,ఈ ప్రాజెక్టు గురించి మీ అనుమానాలు, సంప్రదింపులకి సలహాలు తెలపండి. బెంగుళూరులో వున్న తెవికీ సభ్యులు పాల్గొనాలంటే నన్ను సంప్రదించండి--అర్జున 11:39, 13 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ వార్త రెండవ సంచిక విడుదల

[మార్చు]

తెవికీ వార్త, వికీమేనియా 2010 అనుభవాల వ్యాసంతో విడుదలయ్యింది. తరువాతి సంచికలకొరకు మీ రచనలతో, నన్ను కాని రవిచంద్ర ని కాని సంప్రదించండి. --అర్జున 06:53, 26 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీ మరల బలపడుతోంది

[మార్చు]

గణాంకాల ప్రకారం తెలుగు వికీ మరల బలపడుతోంది. నెలలో వంద మార్పులు చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో తొలి సారిగా 10 కి చేరింది. ఇది జనవరి 2010 లో కనిష్టంగా 3 దగ్గర వుంది. దీనికి కారకులైన అందరికి ధన్యవాదాలు--అర్జున 12:08, 19 సెప్టెంబర్ 2010 (UTC)

తెవికీ వార్త మూడవ సంచిక విడుదల

[మార్చు]

తెవికీ వార్త, టి.సుజాత గారి విక్షనరీ అభివృద్ధి, కాసుబాబుతో మాటామంతీ వ్యాసాలతో విడుదలయ్యింది. చదివి, వ్యాసం దగ్గర స్పందించండి. తరువాతి సంచికలకొరకు మీ రచనలతో, నన్ను కాని రవిచంద్ర ని కాని సంప్రదించండి. --అర్జున 18:47, 23 సెప్టెంబర్ 2010 (UTC)

వికీమీడియా ఇండియా కమ్యూనిటీ న్యూస్ లెటర్ మొదటి సంచిక

[మార్చు]

24 సెప్టెంబరు, 2010న బెంగుళూరులో వికీ సముదాయ సమావేశంలో బేరీ న్యూస్టేడ్, వికీమీడియా ఫౌండేషన్, ప్రధాన ప్రపంచ అభివృద్ధి అధికారి, తొలి వికీ భారత సముదాయ వార్తాపత్రిక (Wikimedia India Community Newsletter) విడుదల చేశారు. దీనిలో 8 భారతీయ భాషలలో వికీ సముదాయ కృషిని వివరించే వ్యాసాలున్నాయి. తెలుగు విభాగా వ్యాస సమాచార సంకలనంలో నాకు తోడ్పాటు ఇచ్చి పాలు పంచుకున్న వైజాసత్య, వీవెన్, టి సుజాత, సిబిరావు, రవిచంద్రలకు ధన్యవాదాలు. మీరు చదివి స్పందించండి.-- అర్జున 12:58, 25 సెప్టెంబర్ 2010 (UTC)

హైదరాబాదులో వికీపీడియా సమావేశం (ఆదివారం, అక్టోబర్ 10, 2010)

[మార్చు]

హైదరాబాదులో మొట్టమొదటి వికీపీడియా సమావేశం, చారిత్రక 10-10-10 తేదీన (ఉదయం 10 గంటలకు) జరగబోతూంది. మరిన్ని వివరాలకై Hyderabad1ని చూడండి. తప్పక హాజరవండి! — వీవెన్ 13:49, 7 అక్టోబర్ 2010 (UTC)

  • అందరికీ ఆహ్వానము మరియు శుభాకాంక్షలు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:25, 7 అక్టోబర్ 2010 (UTC)

ఫొటోలు(ఒకటవ, రెండవ).సారాంశం (ఆంగ్లంలో) --అర్జున 04:23, 18 అక్టోబర్ 2010 (UTC)
ప్రాజెక్టు పేజీ--అర్జున 01:21, 22 అక్టోబర్ 2010 (UTC)

ఫేస్ బుక్ సమూహం

[మార్చు]

తెవికీ ఫేస్ బుక్ సమూహం మొదలైంది. --అర్జున 01:22, 22 అక్టోబర్ 2010 (UTC)

విద్య, ఉపాధి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి

[మార్చు]

దాదాపు ఆరు నెలలుగా నడిచిన విద్య, ఉపాధి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి అయింది. సమీక్ష-1చూసి ప్రాజెక్టు లేక చర్చా పేజీలలో స్పందించండి. రెండవ ప్రణాళికలో భాగం పంచకోదలిస్తే(కనీసం వారానికి అరగంట), మీ పేరు ప్రాజెక్టు పేజీలో నమోదు చేయండి.--అర్జున 03:34, 23 అక్టోబర్ 2010 (UTC)

meeku telusa

[మార్చు]

మీకు తెలుసా.. 7 వ నంబర్ జెతీయ రహదారి నంబర్ ని. తొలగించారు. ఇప్పుడు 44 వ నంబర్ గా పిలుస్తున్నారు.

వికీ మొబైల్ వీక్షణలు

[మార్చు]

వికీ మొబైల్ వీక్షణలు లో తెలుగు వీక్షణలు 647రోజువారీగా 22 (అక్టోబరు 2010 ) నమోదయ్యాయి.--అర్జున 04:21, 1 డిసెంబర్ 2010 (UTC)

గూగుల్ యాంత్రిక అనువాదాల పథకం -సముదాయ స్పందన

[మార్చు]

గూగుల్ పథకం ద్వారా ఇప్పటికి అనువాదం చేయబడిన, లేక అనువాదానికి ప్రతిపాదించిన వ్యాసాల జాబితా ఇతర వివరాలు తెలుగువికీ గూగుల్ గుంపు సభ్యులకు పంచబడినది. http://groups.google.com/group/teluguwiki/browse_thread/thread/50f4dae9d0fd6f1f. స్పందన ఈ నెలాఖరులోగా తెలపమని కోరుతున్నాను. తమిళ వికీ వారి అనుభవం ప్రకారం మార్చిన విధానం (http://lists.wikimedia.org/pipermail/wikimediaindia-l/2010-December/001376.html) పై కూడా స్పందనలు గూగుల్ ప్రాజెక్టు పేజీలో తెలపండి. -- అర్జున 12:24, 13 డిసెంబర్ 2010 (UTC)

  • తమిళ వికీపీడియా వారు అవలంబిస్తున్న పద్ధతి బాగున్నది. మనం కూడా అదే విధంగా మన తెలుగువారికి ముఖ్యమైన వ్యాసాల్ని అనువాదం కోసం ప్రతిపాదించి వాటి అనువాదానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఒక నిర్ధిష్టమైన ప్రమాణాలు లేని వ్యాసాల్ని అసలుకేమాత్రం పనికిరాని వ్యాసాల్ని తొలగించాలి. అనువాదకులకు గూగుల్ మేనేజర్లకు ఈ విషయాల్ని తెలియజేసి అదే పద్ధతి అమలుజరిగేటట్లు చూడడం అవసరం. లేకుండా ఇది మన చేయిదాటిపోతుంది.Rajasekhar1961 13:47, 13 డిసెంబర్ 2010 (UTC)
నేరుగా ఆన్లైన్ లో మార్పులు చేయటానికి ఈ లింకు వాడండి. ముఖ్యంగా ఇప్పటి వరకు చేసిన వ్యాసాల నాణ్యత నిర్ణయం, కావలసిన కొత్త వ్యాసాలను గుర్తించితే బాగుంటుంది. https://spreadsheets.google.com/ccc?key=0AtVHTVzubonwdGJIMGhvWGpWN0dNdGtQU3M2TzNPUmc&hl=en#gid=0 --అర్జున 09:25, 20 డిసెంబర్ 2010 (UTC)

తెవికీ వార్త నాలుగవ సంచిక విడుదల

[మార్చు]

తెవికీ వార్త, అర్జున రావు గారు గుంటూరు లో నిర్వహించిన తెవికీ అవగాహనా సదస్సు గురించి విశేషాలతో విడుదలయ్యింది. చదివి, వ్యాసం దగ్గర స్పందించండి. తరువాతి సంచికలకొరకు మీ రచనలతో, నన్ను కాని అర్జునరావు గారిని కానీ సంప్రదించండి.--రవిచంద్ర (చర్చ) 04:09, 18 డిసెంబర్ 2010 (UTC)

వికీమేనియా 4-7 ఆగష్టు 2011 నమోదు,ఉపకారవేతనాల అభ్యర్థనలు

[మార్చు]

వికీమేనియా 4-7 ఆగష్టు 2011 కొరకు నమోదు,ఉపకారవేతనాల అభ్యర్థనలు స్వీకరించటం మొదలైంది. ఉపకారవేతనాల అభ్యర్థనలకు చివరితేది జనవరి 31. తెవికీపై ఆసక్తికలవారందరికి, ఈ సమావేశం చాలా వుపయోగం.వివరాలకు క్రిందటి సంవత్సరపు సమావేశముపై నివేదిక చూడండి. తెవికీ నుండి కనీసం ముగ్గురైనా హాజరవ్వాలని కోరుకుంటున్నాను. ఏమైనా సందేహాలుంటే నన్ను సంప్రదించవచ్చు.--అర్జున 00:10, 2 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

2010 రెండవ అర్థభాగంలో తెలుగు వికీ పేజీవీక్షణలలో భారీ తగ్గుదల

[మార్చు]

తెలుగు వికీ పేజీవీక్షణ లను పరిశీలిస్తే దాదాపు గత 6 నెలలుగా వికీ వీక్షణలు 1.5 నుండి 2.1 మిలియన్ స్థాయిలో వున్నాయి.ఫిభ్రవరి 2010 లో అత్యధిక వీక్షణలు (4.5మి కన్నా ఎక్కువ అంచనా)వుండి ఆ తరువాత ఇలా పడిపోవటం విచారించదగ్గ పరిణామం. ఇదే సమయంలో ఇతర భారతీయ భాషల వికీలతో పోల్చితే మనం వెనకబడుతున్నామని గమనించాలి.--అర్జున 05:13, 10 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా దశాబ్ది వుత్సవాలు

[మార్చు]

బెంగుళూరు

[మార్చు]

బెంగుళూర్లొ వికీపిడియా దశాబ్ది ఉత్సవాలులొ తెలుగు కార్యక్రమం ఇక్కడ IISc Campus లొని National Institute of Advanced Studies Auditorium లొ జరిగింది. ఇందులో పాల్గొన్న వారు :-

  1. అర్జున రావు చెవల
  2. ఉమా కాంత్ జొన్నల
  3. కార్తిక్
  4. లక్ష్మి నరసింహ కుమార్. కె

It was indeed great meeting "Arjuna Rao" gaaru. Learnt a Lot about Telugu Wikipedia from him. ----GodsMustBeCrazy 11:04, 15 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా 2010 ప్రజంటేషన్

[మార్చు]

ముఖ్యాంశాలు మరియు ప్రజంటేషన్ కొరకు చూడండి.తెలుగు వికీపీడియా#2010

2010 లో అధికంగా మార్పులు చేసిన పదిమంది సభ్యులు

[మార్చు]

2010లో అత్యధిక వ్యాస మార్పులు చేసినవారిలో మొదటి 10 ర్యాంకులుగల వికీపీడియన్లు వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:T.sujatha, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:C.Chandra_Kanth_Rao, వాడుకరి:Nrahamthulla, వాడుకరి:వైజాసత్య, వాడుకరి:Mukteshvari, వాడుకరి:కాసుబాబుమరియు వాడుకరి:Veera.sj. వీరిలో అత్యధికంగా 4776 అత్యల్పంగా 309 మార్పులు చేసినట్లు నమౌదైంది. వీరి సభ్యపేజీలలో వికీవాడుకరుల తరపున కృతజ్ఞతా సూచకంగా కొత్త 2010 బార్న్ స్టార్ గుర్తింపు పతకం చేర్చడమైనది.--అర్జున 09:53, 30 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

వికీబుక్స్ లో ఉబుంటు

[మార్చు]

తెలుగు ఉబుంటు వాడుకరుల పుస్తకం వికీబుక్స్ లో పని మొదలైంది. మీరు పాలుపంచుకోండి.--అర్జున

మొదటి విడుదల ఎలెక్ట్రానిక్ పుస్తకం రూపం విడుదలైంది.--అర్జున 06:04, 1 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Wikipedia meetup in Hyderabad on May 15, 2011

[మార్చు]

Hi, Wikipedia meetup is proposed to be held at Hyderabad on May 15, 2011. Hope to see lots of Telugu Wikipedians for the event. Please spread the news to other language Wikipedians in Hyderabad too. Thanks. --Ravidreams 16:17, 8 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా సముదాయ పత్రిక కు సహకరించండి

[మార్చు]

వికీపీడియా:తెవికీవార్త/ఇసుకపెట్టె/2011 జూన్ పేజీలో గత కొద్ది నెలలుగా, తెలుగువికీలో జరిగిన, లేక త్వరలో జరగబోతున్న వికీమీడియా ప్రాజెక్టుల సమాచారాన్ని చేర్చండి. ఈ సమాచారం ఇంగ్లీషులో కి అనువాదమై వికీమీడియా ఇండియా న్యూస్ లెటర్ లో వస్తుంది. మొదటి సంచికకు సమాచారం చేర్చటానికి మే 23 అంతిమ తేది. ధన్యవాదాలు --అర్జున 15:28, 17 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీవార్త సంచిక 5 విడుదల

[మార్చు]

చూడండి: వికీపీడియా:తెవికీ వార్త/2011-05-29, స్పందించండి. అర్జున 06:15, 29 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/తెవికీ మారథాన్ 1, జులై 10, 2011

[మార్చు]

వికీపీడియా:సమావేశం/తెవికీ మారథాన్ 1 చూడండి. పాల్గొనండి. నెట్ ద్వారా కూడా పొల్గొనవచ్చు. -- అర్జున 15:58, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీవార్త సంచిక 6 విడుదల

[మార్చు]

చూడండి: వికీపీడియా:తెవికీ వార్త/2011-07-10, స్పందించండి. అర్జున 02:12, 10 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల ప్రదర్శన నియంత్రించు ఉపకరణము అభిప్రాయసేకరణ పిలుపు

[మార్చు]

ట్రస్టీల బోర్డు తరపున, వికీమీడియా ఫౌండేషన్ ఐచ్ఛికంగా చేర్చుకొనే వ్యక్తిగత బొమ్మల ప్రదర్శన నియంత్రించు ఉపకరణం తయారి మరియ ఉపయోగం పై సముదాయ సభ్యుల అభిప్రాయ సేకరణ నిర్వహించుతున్నది. దీనివలన చదువరులు వారి ఖాతాతో వికీపీడియా వాడుతున్నప్పుడు, కొన్ని రకాల బొమ్మల ప్రదర్శన నిలిపివేయవచ్చు. మరిన్ని వివరాలు మరియు పత్రాలు త్వరలో అందుబాటు చేయబడతాయి. అభిప్రాయసేకరణ 12-27 ఆగష్టు, 2011,ప్రజోపయోగ సాఫ్ట్వేర్ సంస్థ వారి సర్వర్ లపై ఇదినిర్వహించబడుతుంది.. అభిప్రాయసేకరణ వివరాలు, అధికారులు, వోట్ చేయుటకు అర్హతలు, మరియు ఇతర వివరాలు ఇక్కడ త్వరలో చూడవచ్చు.

సమన్వయసమితి తరపున
Philippe
Cbrown1023
Risker
Mardetanha
PeterSymonds
Robert Harris

సమితికి సహాయపడదలచినట్లయితే సందేశం ఇవ్వండి here (or email philippe@wikimedia.org).

ఉపకరణం అనుకూలత లేక ప్రతికూలతపై స్పష్టమైన ఆధిక్యత ఫలితాలలో కనబడలేదు. అర్జున 10:35, 25 సెప్టెంబర్ 2011 (UTC)

Invite to WikiConference India 2011

[మార్చు]

Hi రచ్చబండ (వార్తలు),

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.


But the activities start now with the 100 day long WikiOutreach.

As you are part of WikiMedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011


Please forward to relevant folks in the community. If you want the bot to do the job please sign up at [1] --Naveenpf 05:38, 6 ఆగష్టు 2011 (UTC)

వికీమీడియా చాప్టర్ సర్వసభ్యసమావేశం మరియు కార్యవర్గ ఎన్నికలు

[మార్చు]

సెప్టెంబరు 24 న భారతదేశం వికీమీడియా చాప్టర్ సర్వసభ్యసమావేశం మరియు కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. కార్యవర్గంఎన్నికలలో నవీన్ ఫ్రాన్సిస్, టినూచెరియన్ మరియు సుధాన్వా విజయంసాధించారు. --అర్జున 10:39, 25 సెప్టెంబర్ 2011 (UTC)

తెవికీ గణాంకాలు కొత్త రూపులో

[మార్చు]

చూడండి. వీటిని మెరుగుపరచడానికి సహాయం చేయండి --అర్జున 08:53, 27 సెప్టెంబర్ 2011 (UTC)

ఇటీవలి కాలంలో తెవికీలో చురుకైన సభ్యుల కొరత కనిపిస్తోంది. ఫిబ్రవరి 2008 తర్వాత మళ్ళీ ఆ దరిదాపుల్లోకి రాలేకపోతున్నాం. ఇతర భారతీయ భాషా వికీలతో పోలిస్తే మనం తిరోగమనంలో ఉన్నాము. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:07, 27 సెప్టెంబర్ 2011 (UTC)
దీనికి క్రమబద్దమైన జాల మరియు భౌతిక సమావేశాలు, వికీఅకాడమీ ద్వారా ప్రచారాలు, సమిష్ఠి కృషి అవసరం. సంవత్సరానికి ఒకసారి జరిగే సమావేశాలు, మాధ్యమాల వార్తలతో పురోగతి కష్టం. వికీమీడియా చాప్టర్ తరపున నా సహాయం తప్పకవుంటుంది.--అర్జున 00:33, 28 సెప్టెంబర్ 2011 (UTC)

తెవికీవార్త 2011-10-03 సంచిక విడుదల

[మార్చు]

ఈ సంవత్సరపు మూడవ సంచిక విడుదలైంది. ముఖ్య వ్యాసం:యాంత్రిక అనువాద వ్యాసాల సంస్కరణ , రచయిత టి సుజాత. చదవండి, వ్యాఖ్యానించండి.--అర్జున 05:48, 3 అక్టోబర్ 2011 (UTC)

‌విశిష్ట వికీమీడియన్ గుర్తింపు

[మార్చు]

తెలుగు వికీప్రాజెక్టల నుండి విశేషకృషి చేసిన వారిని విశిష్ట వికీమీడియన్ గుర్తింపుకు ప్రతిపాదించండి. గడువు 13 నవంబర్ 2011-- అర్జున 17:08, 9 నవంబర్ 2011 (UTC)

తెలుగు వికీ ప్రాజెక్టు ప్రతిపాదనలలో రాజశేఖర్ మరియు టి సుజాత విశిష్ట వికీమీడియన్ 2011 గుర్తింపుకి ఎంపిక అయ్యారు. ఈ వివరాలు 20 నవంబర్ నాటి చాప్టర్ సమర్పణల విభాగంలో ప్రకటించారు. వారి కృషి గురించి నేను కొన్ని మాటలు ముచ్చటించాను. వారికి తెవికీ తరపున అభివందనలు. అధికారికంగా ఈ వార్త త్వరలో వెలువడనుంది. మరియు వారి సభ్యత్వ పేజీలలో విశేష పతకం చేర్చనున్నారు -- అర్జున 08:57, 23 నవంబర్ 2011 (UTC)

ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ వుపకరణం

[మార్చు]

మీ దగ్గర తెలుగు చూపించగల ఆండ్రాయిడ్ v2.2 లేక ఆ పై ఫోన్ వుంటే తెలుగు టైపు చేయడానికి మల్టిలింగ్ కీ బోర్డు (multiling keyboard) ఉపకరణం వాడవచ్చు. దీనిలో ఇన్స్క్రిప్ట్ ను కొద్దిగా మార్చి వాడారు. -- అర్జున 06:29, 11 నవంబర్ 2011 (UTC)

తెవికీ ప్రాజెక్టుల స్థితి

[మార్చు]

భారత వికీ సమావేశంలోవికీ స్థితిగతులు సమర్పణలో తెలుగు విభాగం 95-103 స్లైడులు చూడండి. -- అర్జున 09:45, 23 నవంబర్ 2011 (UTC)

హైద్రాబాదులో వికీపీడియన్ల కలయిక 3

[మార్చు]

హైద్రాబాదులో వికీపీడియన్ల కలయిక 3 27 నవంబర్ న జరగనున్నది. ఇదే ఆహ్వానం.-- అర్జున 09:03, 23 నవంబర్ 2011 (UTC)

తెలుగు వికీపీడియన్లతో షిజూ అలెక్స్ సర్వే

[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగి షిజూ అలెక్స్ (ఇంతకు ముందు ప్రముఖ మళయాళ వికీపీడియన్ మరియు వికీ ప్రచార కార్యకర్త) తెలుగు వికీ సభ్యులతో జరిపిన సమాలోచన వివరాలు చూడండి. మీరు స్పందించండి. -- అర్జున 11:18, 1 డిసెంబర్ 2011 (UTC)

కేవలం నలుగురు సభ్యులు మాత్రమే వారి అనుభవాలు పేర్కొన్నారు. తెవికీకి పురోగతి కి మనం ఏం చెయ్యాలి, వ్యక్తిగతంగా ఏమి చెయ్యగలరు పంచుకుంటే బాగుంటుంది. ప్రచారానికి నియమబద్ధంగా వారానికి కొంత సమయం కేటాయించి పనిచేసే వారికి సహాయం ఇవ్వగలను. నా వరకు వికీ మీడియా చాప్టర్ తరపున వికీ అకాడమీలకు ఇతర ఆన్లైన్ అకాడమీలకు సహాయం అందించటానికి సిద్ధం. అలాగే ఇతరులు నా కిష్టమైన ప్రాజెక్టు విద్య, ఉపాధి లో చేయి కలిపితే దానిని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయగలను. తెవికీ వార్త ని వచ్చే సంవత్సరంలో నిర్వహించడానికి సంపాదకులను కొత్త వారిని ఆహ్వానిస్తున్నాను. -- అర్జున 11:28, 1 డిసెంబర్ 2011 (UTC)

హైద్రాబాదులో వికీఅకాడమీ

[మార్చు]

హైద్రాబాదులో వికీ అకాడమీ డిసెంబర్ 23 న జరగునున్నది.-- అర్జున 11:32, 1 డిసెంబర్ 2011 (UTC)

డిసెంబర్ 23 న జరుపుట వీలవలేదు.తేదీలలో మార్పుకి పై పేజీ చూస్తుండండి లేక వికీ మెయిలింగ్ లిస్టులు గమనించండి. -- అర్జున 06:21, 22 డిసెంబర్ 2011 (UTC)

తెవికీవార్త 2012-12-09 సంచిక విడుదల

[మార్చు]

ఈ సంవత్సరపు నాలుగవ సంచిక వికీ భారత సమావేశం 2011 ప్రత్యేక సంచికగా విడుదలైంది. సమావేశ వివరాలు, తెవికీ నుండి విశిష్ట వికీమీడియన్ గుర్తింపు పొందిన రాజశేఖర్, సుజాత గార్ల ఇంటర్వ్యూలు చదవండి, వ్యాఖ్యానించండి.-- అర్జున 06:52, 9 డిసెంబర్ 2011 (UTC)

తెలుగు ప్రత్యేక ఆసక్తి జట్టు అధ్యక్షునిగా రహ్మనుద్దీన్ నియామకం

[మార్చు]

భారత వికీమీడియా చాప్టర్ యొక్క తెలుగు ప్రత్యేక ఆసక్తి జట్టు అధ్యక్షునిగా చాప్టర్ సభ్యుడు రహ్మనుద్దీన్ నియమించబడ్డారు. -- అర్జున 05:59, 10 డిసెంబర్ 2011 (UTC)

భాషా మరియు నగరాల ప్రత్యేక ఆసక్తి జట్టు అధ్యక్షుల వివరాలు చూడండి. -- అర్జున 06:11, 10 డిసెంబర్ 2011 (UTC)

Statistical report of Indian language wiki projects - 2011 October

[మార్చు]

Dear All,

I am sharing the statistical report of Indian language wiki projects for the month of 2011 October. It is available here. https://blog.wikimedia.org/2011/12/12/indian-language-wikipedia-statistics-october-2011/


One interesting facts from this report is:

  • Nearly 4.3 crore readers are there for all Indic language wikipedias! This number is huge and increased by nearly 1/3 in just 1 month! So Indic wikis has huge existing reader base.

You can find more interesting facts about Telugu wikipedia and community from the report at https://blog.wikimedia.org/2011/12/12/indian-language-wikipedia-statistics-october-2011/

--Shiju Alex 11:43, 13 డిసెంబర్ 2011 (UTC)


Summary and perspectives from Discussions with Indic language wikimedians - 2011

[మార్చు]

Dear All,

I have sent a detailed note to the various local language and India community mailing lists summarizing my discussions with various Indic editors. In this note, I have also shared my perspectives on a series of issues related to community building (keeping existing editors, welcoming back old editors, attracting newbies, improving outreach, encouraging communication, collaborating on articles, and celebrating success), project quality (discouraging the use of bots for content creation and being more selective in adoption of English wikipedia policies) as well as on readership. It is a long post but I request you to go through this page in meta wiki. Please share your comments and feedback as a reply below this, or on the meta talk page of my post, or directly to me. I am really keen on hearing from as many of you as I can - and to start working together. --Shiju Alex 13:22, 16 డిసెంబర్ 2011 (UTC)

Shiju, thanks for your message. We have stated webchat sessions every Saturday from 8 PM to 9PM starting on 17 Dec 2011. We plan to discuss your proposals in the next weeks meeting. Please join the #wikipedia-te chat. -- అర్జున 08:52, 18 డిసెంబర్ 2011 (UTC)

Sure. I will join this discussion. --Shiju Alex 16:22, 18 డిసెంబర్ 2011 (UTC)

అనువాదం

[మార్చు]

ఈ కింద ఉన్నది సభ్యుడు షిజు అలెక్స్ ఆంగ్ల సందేశానికి తెలుగు అనువాదం అని గమనించగలరు.t.sujatha 13:40, 18 డిసెంబర్ 2011 (UTC)

అభిమాన సభ్యులందరికి,

నేను వివిధ ప్రాంతూఈయ భాషలకు, భారతీయ సమాజ సందేశ జాబితాలకు వివిధ ఇండిక్ భాషా సంపాదకులతో చేసిన చర్చల సంక్షిప్తరూప సమాచారవివరణను పంపాను. ఈ సందేశంలో సమాజ నిర్మాణం, ఇప్పుడు ఉన్న సంపాదకులను కొనసాగించేలా ప్రోత్సహించడం, పాత సభ్యులను వెనుకకు పిలవడం, కొత్తవారిని ఆకర్షించడం, సభ్యుల సేవలను వృద్ధి చేయడం, సభ్యుల మద్య చర్చలను ప్రోత్సహించడం, సహకార విధానంలో వ్యాసాలను వృద్ధి చేయడం, విజయానందాన్ని కలిసి పంచుకోవడం వంటి నా భవిష్యత్తు ప్రణాళికా కార్యక్రమాలను కూడా పంచుకున్నాను. ఈ గమ్యము దూరమైనదైనా మనము గమ్యం వైపు అడుగులు వేద్దాము. this page in meta wiki.

దయచేసి మీ అభిప్రాయాలను ఈ సందేశం కిందగానీ మెటావీకీ చర్చాపేజీలలోగానీ లేకుంటే నేరుగా నాకు గాని సమాధానంగా తెలియజేయండి. నేను నిజంగా నాకు వీలైన మంది అభిప్రాయాలను శ్రద్ధగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను - అలాగే మనంతా కలసి పనిచేయడం ప్రారంభింస్తాము.

--Shiju Alex

వెబ్ ఛాట్

[మార్చు]

ప్రతి శనివారం సాయంత్ర 8 నుండి 9 గంటలకు (భాకాప్రా) జరిగే వెబ్ ఛాట్ లో పాల్గొనండి. తెవికీ సమిష్ఠి కృషికి తోడ్పడండి. -- అర్జున 10:02, 18 డిసెంబర్ 2011 (UTC)


Spreading the wings of Telugu community

[మార్చు]

Dear Telugu wikipedians,

For many years, Telugu has been a pioneer among all Indic language Wikipedias. You were the first community to cross 3000 registered users way back in 2007, were the first wiki community to integrate typing tool in 2006. Over the past few years, things have slowed down a little bit as far as community growth is concerned. I think if this is corrected, Telugu can easily regain the position as one of the most innovative and visionary Indic language communities.

Over the past few weeks we have discussed the current state and the future of Indic wiki projects - and quite a few of you have helped me get a richer understanding of Telugu community and projects. And I have provided the summary of discussions and my ideas about taking Indic wiki projects forward here. During our discussion many of you have asked for clear ideas to improve the strength of the community and quality of projects. I have been thinking about what would be most appropriate for Telugu community and I want to share some specific suggestions for Telugu wikipedia. I am recommending these based on ideas from Telugu editors as well as learnings from other communities which have relevance for Telugu.

As of now we have around 30 active wikipedians for Telugu wikipedia and we have close to 50,000 articles. Soon we will reach the 50,000 article landmark. I think the single most powerful way of achieving the huge potential for Telugu wiki projects is to build the community. Increase communication and collaboration between editors is one way of doing this since that will retain existing editors and attract more users to Telugu wiki. Telugu community may consider working on more frequent interaction (online and face-to-face), increasing the spirit of common purpose and bonding amongst editors and last, but not least, attracting newbies.

Below are some points that I request Telugu wiki community to consider.

Community Building

WikiProjects

As most of you know WikiProjects are informal groups of wiki editors who work work together as a team to improve Wikipedia. These groups often focus on a specific topic area (for example, articles related to Telugu language or a interest area like Telugu movies or regional politics or Telugu literature or global topics like medicine) or a specific kind of task (for example, expanding stub articles). It allows editors to work with other editors - all of whom share a passion for the subject or task. It has worked really well in many languages across India. (For example, Odia wikipeida has a project on "Odia Literature", “Ollywood" and so on. Group of 2 or 3 Odia wiki community members interested in these projects are actively collabrating on these articles to enhance it.). The idea I want to emphasis is, along with working on articles on our interest it will be nice if we could start collabrating with other community members. That will enhance our wiki editing experince and is good for the growth of community. That will help more existing users to continue in wiki for a long time.

Some suggestions for wiki projects are:

  • Start a wiki project to create/expand all articles related to Telugu language
  • Start a wiki project to create/expand articles about districts/villages of Andhra Pradesh and other states of India.
  • Start a wiki project to expand the stubs
  • Start a wiki project to identify and remove potential copyright violated images and move rest of the free images to commons
  • Start a project on an area which 2-3 editors feel passionate about - whatever the subject might be.

In fact if we could get to know the interest of users we could easily design various small wiki projects as is happening in English wikipedia. The point I want to emphasis is that collaboration between editors will ensure a healthy community so that we can do more programs. The best way of collaboration is doing what we all love best - editing. So let us collaborate on what we love doing most.

Wiki meetups

Physical meetings between wikipedians is a really strong way to help the growth of Indic wikipedias. Meetups connect us with like-minded people, build friendships, help share ideas and plan initiatives. For small communities, there is always the feeling that we are all alone - and meetups help to correct this perception and this is a source of inspiration. We should have meetups of Telugu wikipedians anywhere and everywhere in the world where there 2-3 of you in the same town. In the NCR area (Delhi/Gurgaon/Noida/Faridabad), please feel free to use the office in Hauz Khas for meetups. I am not sure whether there is any Telugu wikipedian in the NCR area. Please do let us know if we can meet up. For other areas please plan and meetup. I am sure atleast in Hyderabad we can easily do a Telugu wikipedian meetup. Physical meetings between wikipedians is very much required to grow a healthy wiki community in any indic langauge wikipedia. I will help in every way to support all the initiatives regarding this.


Outreach


To encourage users to start editing in wiki some of us need to take initiative for some outreach activities. Outreach can be of 3 types - offline, online, and using media.

Offline Outreach: Wiki workshops

Wiki workshop is the best way to attract more users to wikipedia. We should start doing more workshops to attract more users to wiki editing. Again in Delhi, we have the required space and infrastructure so please feel free to use it whenever Telugu wikipedians require it. For other locations if any one is interested to conduct wiki workshops please let us all know and we will work out some way of supporting for this. More important is community members need to come forward.

Online Outreach: Social Networking

Use social networking sites to reach out to people (Facebook, Twitter, and many others.) You can publicise your workshops through these sites or you can invite people to join the community or you can announce major achievements (like crossing the 50,000 article count.). Already many Indic wiki communities are doing this. We shall think about start using Social Networking sites for Telugu wiki projects also.

Online Outreach: Telugu Blogs

Use Telugu blogs to reach out to the Telugu online community. Telugu blogs are massive and increasing in popularity. It would be very useful to get in touch with popular bloggers and ask them to inform their readers about Telugu Wikipedia and other wiki projects, encourage more people to consider editing and point interested people


Telugu Newspapers & TV Channels

Telugu newspapers and TV channels have mass outreach among Telugu people. Can we establish contacts with journalists and ask for their support in covering Telugu Wikipedia. Journalists alway look for news items that are directly relevant to their audience and something like Telugu Wikipedia crossing 50,000 articles is a perfect story. Any further achievement of Telugu community like when you cross the 100 active editor mark, and the 500 editor mark, when you do an offline release etc. - will all get you good media coverage. This will help in building the community, increasing motivation of existing editors and attract new editors.

Can I request as many Telugu wikipedians to share you thoughts about these ideas. Do you think they are the right ideas for Telugu? If so and if not, why? Would you suggest any alternate ideas? If you like these ideas, which ones would you like to work on? Is there any help you need? Would you be interested in getting connected to other community members who might also be interested? Please share your ideas.

The reason I am asking everyone to participate is it will help us all as a community to identify people who have similar interests and to start interacting and working closely on these interests. The ideal outcome of this post is for the community to start planning some of these activities as a group. There are two ways of doing this. One is, if community members start discussing on this page and form groups interested in particular ideas. Another way, if you don’t know who to contact or would prefer to reach out separately is to email me at shiju@wikimedia.org and I will help connect you with the right people.

I am really excited by the potential of Telugu wiki community. I want you all to know that I am here to help you. Please feel free to reach out for any help you might need. Please also engage with me in this discussion as it will help you connect with other community members. We can discuss some of these points in tomorrow's IRC meet also--Shiju 10:25, 23 డిసెంబర్ 2011 (UTC)

తెలుగు సముదాయ విస్తరణ

[మార్చు]

ఇది (Spreading the wings of Telugu community) మళయాళ వికీ సభ్యుడు మరియు వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టులో భారతీయ భాషా వికీపీడియాల సలహదారు అయిన షిజూ అలెక్స్ సందేశానికి అనువాదమని తెలుసుకోండి.t.sujatha 04:29, 24 డిసెంబర్ 2011 (UTC)

అభిమాన తెలుగు వీకీపీడియన్లకు,

చాలా సంవత్సరాలుగా తెలుగు వికీపీడియా ఇండిక్ భాషా వికీపీడియాలకు మార్గదర్శిగా ఉంటూ వచ్చింది. 2007 నాటికి 3,000 నమోదు చేసుకున్న సభ్యులును కలిగి అలాగే ఇంటిగ్రేటెడ్ టైపింగ్ టూల్‌ను ప్రవేశపెట్టిన మొదటి ఇండిక్ వికీపీడియా మీది. వికీసమాజంలో గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు కొంచం నెమ్మదించడంతో అభివృద్ధి గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. దానిని సరి చేసినటైతే ఇండిక్ భాషలలో తెలుగు వికీపీడియా తిరిగి చైతన్యవంతమైన స్థితికి చేరుకుని అలాగే వీక్షణలు కలిగిన వికీపీడియాగా మారగలదని నేను అభిప్రాయపడుతున్నాను.

కొన్ని వారాల నుండి మనం ప్రస్థుత పరిస్తితులను భవిష్యత్తు ప్రణాళికలను గురించిన చర్చలు జరుపుతున్నాము. వికీసమాజము వారి ప్రణాళికలను గురించిన నాణ్యమైన సమాచారం తెలుసుకోవడానికి నాకు సహకరించారు. ఇక్కడ నేను సేకరించిన చర్చల సంక్షిప్త రూపానికి సంభందించిన విషయాలను మీకు అందిస్తున్నాను. ఈ క్రింది లింకులను వీక్షించండి.

and quite a few of you have helped me get a richer understanding of Telugu community and projects. నేను జరిపిన చర్చల సంక్షిప్తరూపం.
the summary of discussions and my ideas about taking Indic wiki projects forward here.

ఈ చర్చలలో మిమ్మల్ని మీలో అనేక మందిని వికీసమాజాన్ని బలపచడానికి నాణ్యమైన ప్రణాళికలను అందించడానికి స్పష్టమైన సహాలను తెలమని కోరాము. నేను తెలుగు సమాజానికి అత్యంత అవసరమైనది ఏమని ఆలోచిస్తున్నాను. అలాగే నేను కొన్ని ప్రత్యేక సలహాలను తెలుగు వికీపీడియాతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఈ సలహాలను తెలుగు దిద్దుబాటుదారుల నుండి రావాలని సిఫారసు చేస్తున్నను. అలాగే తెలుగుతో సంబంధమున్న ఇతర సమాజముల నుండి నేర్చుకోలను కుంటున్నాను.

ప్రస్తుతానికి మనం తెలుగు వికీపీడియాకు 30 చురుకైన సభ్యులను కలిగి ఉన్నాము. అలాగే తెలుగు వికీపీడియా 50,000 వ్యాసాల లక్ష్యానికి సమీపించాము. త్వరలో మనం 50,000 వ్యాసాల మైలురాయికి చేరుకుంటాము. తెలుగు సమాజనిర్మాణం అన్నది బృహత్తర తెలుగు వికీ ప్రణాళికకు శక్తినిచ్చే ఏకైక మార్గమని నేను భావిస్తున్నాను. సభ్యుల మద్య పరస్పర సంప్రదింపులు మరియు సహకారం అభివృద్ధిచేయడం వలన ప్రస్తుతం ఉన్న సభ్యులను నిలబెట్టుకోవడానికి అధికమైన వీక్షకులను తెలుగు వికీకి రప్పించడానికి ఒక మార్గమని అలాగే అనుకుంటున్నాను. తెలుగు సమాజము సభ్యులతో పరస్పర సంభంధాలను మెరుగుపరచుకోవడానికి అన్ లైన్ సంభాషణలు - ముఖాముఖిగా మాట్లాడుకోవడం వంటి మార్గాలను ఎంచుకొని సభ్యులను ఉత్సాహపరచాలని అభిప్రాయపడుతున్నాను. అలాగే కొత్తవారిని ప్రోత్సాహం అందించి వికీ వైపు ఆకర్షించడి.

ఈ కింది విషయాలను పరిశీలించి తెలుగు వికీ సమాజము ఆలోచించాలని కోరుకుంటున్నాను.

వికీ ప్రణాళికలు

మీలో చాలా మందికి తెలుసు WikiProjectsవికీ ప్రణాళికలు అంటే ఒకే విషయంపై ఏకాభిప్రాయం ప్రాయం కలిగిన సభ్యులు సమిషిష్టిగా కృషిచేసి సమాచారాలను అందించడమని. (ఉదాహరణగా తెలుగు భాషకు సంబంధించిన వ్యాసాలు అలాగే తెలుగు చలనచిత్రాలు లేకపోతే ప్రాంతీయ రాజకీయాలు లేక తెలుగు సాహిత్యం వైద్యం వంటి భౌగోళికమైన సమాచారాలు ) అలాగే ప్రత్యేత కలిగిన వ్యాసాలు. (ఉదాహరణగా మొలకలను అభివృద్ధి చేయడం). ఇది సభ్యులను ఇత్ర సభ్యులతో కలిసి పనిచేసేలా చేస్తుంది. ఒకే విషయము కోసం అందరూ ఒకే విధమైన ఆసక్తి కలిగిన వారు సమిష్టిగా కృషిచేయడానికి ది అవకాశం కలిగిస్తుంది. భారతదేశమంతా ఇది చక్కగా పని చేసింది. (ఉదాహరణకు ఓడియా సాహిత్యం, ఊలీ వుడ్స్ లాంటివి) ఒడియా వికీ సమాజ సభ్యులు బృందం 2 లేక బృందం 3 ఈ ప్రణాళికలో ఆసక్తిగా పాల్గొని చురుకుగా సహకరించుకుని వాటిని పరిపుష్టం చేసారు). వారు అనుసరించిన ఈ మార్గాన్ని మనం అనుసరించి మనకు ఆసక్తి ఉన్న వ్యాసాలను వ్రాస్తూ అలాగే ఇతర సమాజాల సభ్యులతో కూడా సహకారంగా పని చేయడం ప్రారంభించ వచ్చు. అది మన వికీ సంపాదక అనుభవాలను అభివృద్ధి చేయడం కాక వికీసమాజ అభివృద్ధికి దోహదం ఔతుంది.


వికీ ప్రణాళికలకు కొన్ని సలహాలు.

  • వికీ ప్రణాళిక ఆరంభించడం / అభివృద్ధిచేయడం. అంశం:- తెలుగుభాషకు సంబంధించిన అన్ని వ్యాసాలు.
  • వికీ ప్రణాళిక ఆరంభించడం / అభివృద్ధిచేయడం. అంశం:- ఆంద్రప్రదేశ్ లేక ఇతర భారతీయ రాష్ట్రాల జిల్లాలు/గ్రామాలు.
  • వికీ ప్రణాళిక ఆరంభించడం / అభివృద్ధిచేయడం. అంశం:- మొలకలు.
  • వికీ ప్రణాళిక ఆరంభించడం / అభివృద్ధిచేయడం. అంశం:- కఫీ హక్కుల నియమాలను ఉల్లంఘించిన దస్త్రాలను తీసివేయడం మిగిలిన ఉచిత దస్త్రాలను వికీ కామన్స్‌కు తరలించడం.
  • వికీ ప్రణాళిక ఆరంభించడం / అభివృద్ధిచేయడం. అంశం:- ఇద్దరు లేక ముగ్గురు ఆసక్తిగా చేసే ఏవిషయమైనా గమనించి దానిని ఒక ప్రణాళికగా గుర్తించి వారిని సంఘటిత పరచడం.

వాస్తవంగా వాడకందారుల ఆసక్తిని కనిపెట్టి మనము చిన్న చిన్న ప్రణాళికల రూపకల్పన చేయ వచ్చు. ఇలాంటివి ఆంగ్లవికీపీడియాలో జరుగుతుంది. నేను గట్టిగా చెప్పేదేమిటంటే సభ్యులమద్య సహకారం అరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అది అధికంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. మనమేదైతే ఆసక్తిగా చేస్తామో దానిని సమిష్టిగా చేయడం ఉత్తమమైన మార్గం. వికీ సమావేశాలు వికీపీడియన్లు సమావేశాలు ఇండిక్ సమావేశాలు నిజంగా ఇండిక్ భా వికీల అభివృద్ధికి బలవత్తరంగా తోడ్పడుతుంది. ఈ సమావేశాలు సభ్యులకు ఏకాభిప్రాయం కలిగిన వారిని కలుసుకునే అవకాశం ఇస్తుంది, స్నేహాలు కలిగించడం, ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడం, కొత్త వాటికి రూపకల్పనచేయడం వంటి అవకాశం కల్పిస్తుంది. చిన్న సమాజాలకు వారు ఒంటరి వారు అన్న భావనను ఈ సమావేశాలు తొలగించి వికీలో చురుకుగా పాల్గొనడానికి ప్రేరణ కలిగిస్తుంది. తెలుగు వికీపీడియన్లు అంతర్జాతీయంగా ఎక్కడ ఉన్నా అన్ని ప్రదేశాలలో 2-3 సభ్యులు ఒకే ఉరులో ఉన్నా మనం తప్పకుండా సమావేశాలు జరపాలి. ఇతర ప్రదేశాలకు కూడా సమావేశాలకు ప్రణాళిక వేయండి. ఎన్ సి ఆర్ ఏరియాలో (ఢిల్లీ, గర్గ్యాన్, నొయిడా, జరీదాబాద్)హౌజ్ ఖాస్(Hauz Khas) కార్యాలయంలో సమావేశాలను జరపడానికి అనుకూలమైనదిన గ్రహించండి. నాకు ఎన్ సి ఆర్ ఏరియాలో ఎవరైనా వికీపీడియన్ ఉన్నారా అన్నది నాకైతే తెలియదు. దయచేసి మనం సమావేశం కాగలమేమో నేను తెలుసుకునేలా చేయండి. హైదరాబాద్‌లోనైనా మనం వికీపీడియా సమావేశాన్ని సులువుగా నిర్వహించ వచ్చు అని విశ్వసిస్తున్నాను. వికీపీడియన్ల మద్య జరిగే ఈ భతిక సమావేశాలు ఏ ఇండిక్ వికీపీడియాకైనా అభివృద్ధికి ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదం చేస్తుంది. ఈ విషయంలో నేను నాకు వీలైనంత సహకరించగలను.

కృషి వాడకందారులు దిద్దుబాట్లౌ చేయడంలో పాల్గొనేలా ప్రోత్సహించడం.

ఆఫ్‌లైన్ కృషి : వర్క్‌షాప్ నిర్వహించడం

అధికమైన వాడకందార్లు వికీ దిద్దుబాట్లను చేయడానికి కావలసిన వర్క్‌షాపులను నిర్వహించండం. తిరిగి చెప్తున్నాను ఢిల్లీలో మనకు కావలసినంత చోటు లభిస్తుంది. సమావేశానికి కావలసిన భవనం కూడా లభిస్తుంది. దయచేసి తెలుగు వికీపీడియన్లు మీకు ఎప్పుడు కావాలన్నా సంశయించకుండా వాడుకోవచ్చు. ఇతర ప్రదేశాలలో వికీవర్క్‌షాప్ నిర్వహించే సమయంలో మనమంతా కలసి వీలైన మార్గం అన్వేషించ వచ్చు. చాలా ముఖ్యమైన విషయమేమిటంటే మనము ఇందుకు ముందుకు రావడమే.

ఆన్‌లైన్ కృషి : సోషల్ నెట్‌వర్క్

సోషలు నెట్‌వర్క్ సైట్స్‌ను (ట్విట్టర్, ఫేస్ బుక్ మరియు ఇతరాలు)సభ్యుల కలయికకు వాడుకోవడం. వీటి ద్వారా మీరు మీ వర్క్‌షాపుల వివరాలను ప్రకటించడం, ఇతరులను దీనిలో పాల్గొనడానికి ఆహ్వానించడం, ప్రజలను వికీ సమాజానికి అహ్వానించడం, ప్రధాన సాధనలను ప్రకటించడం(50,000 వేల వ్యాసాల మైలు రాయిని చేరడం వంటివి). ఇప్పటికే అన్ని ఇండిక్ భాషా వికీపీడియాలు దీనిని చేస్తున్నాయి. తెలుగు వికీ ప్రణాళికల కొరకు ఒక సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి మేము ఆలోచిస్తున్నాము.

ఆన్‌లైన్ కృషి : బ్లాగులు

తెలుగు బ్లాగులు ఇప్పటికే ప్రజల మన్ననలంది ప్రాబల్యాన్ని అభివృద్ధిచేసుకుంటున్నది. చాలా ప్రబలమైన బ్లాగర్లతో పరిచయాలను పెంచుకోవడం ఉపయోగకరమైనది. వారిని తెఉలు వికీపీడియా గురించి ఇతర వికీపీడియాల గురించి, వికీప్రణాళికల గురించిన వారి అభిప్రాయాన్ని తెలపమని కోరండి. అలాగే ఎక్కువమంది ప్రజలు వికీ దిద్దుబాట్లను చేయడంలో ప్రోత్సహించమని కోరండి.

తెలుగు వార్తా పత్రికలు & టి వి చానల్స్

ప్రజలకు త్వరగా సమాచారాన్ని అందించి ప్రజలకు దగ్గరకావడంలో తెలుగు వార్తా పత్రికలు & టి వి చానల్స్ ముందుంటాయి. మనం జర్నలిస్ట్‌లతో సత్సంబంధాలను ఏర్పరచుకొని తెలుగు వికీపీడియా కార్యక్రమాలకు వారి ప్రసారాలలో మరియు పత్రికలలో చోటు కల్పించమని కోరాలి. జర్నలిస్టులు సహజంగా వారి ప్రేక్షకులకు మరియు పాఠకులకు సంబంధమున్న విషయాల పట్ల దృష్టి కేంద్రీకరిస్తుంటారు(తెలుగు వికీపీడియా 50,000 వ్యాసాల లక్ష్యాన్ని చేరడం లాంటి ప్రత్యేక విషయాలు ఇందుకు సరి అయినదే). అలాగే ప్రత్యేక సాధనలు ఏవైనా (100 దిద్దుబాట్లను దాటడం 500 దిద్దుబాట్లను పూర్తిచేయడం వంటివి అలాగే మీరు ఆఫ్‌లైన్ విడుదల వంటివి ) ఇలాంటివి మీడియా కవరేజికి తగినవే. వికీ సమాజ నిర్మాణానికి, ప్రస్తుతం పని చేస్తున్న సభ్యుల లక్ష్యాన్ని అధికం చేయడానికి అలాగే కొత్తవారిని ఆకర్షించడానికి ఇవి ఉపకరిస్తాయి.

నా ఈ సలహాలను గురించి తెలుగు వికీ సభ్యులు ఆలోచించాలని కోరుకుంటాను. మీరు ఇవి సరి అయిన సలహాలు అనుకుంటున్నారా ? సరి అయినవి అనుకుంటే అవి ఎందుకు సరి అయినవో లేకుంటే ఎందుకు కావో ? మీరు కొత్తగా ఏవైనా సలహాలు చెప్పాలనుకుంటున్నారా ? మీకు ఈ సహాలు నచ్చినట్లైతే ఏది సరిగా పని చేస్తుందో ? మీకు ఏదైనా సహాయం అవసరమనుకుంటున్నారా ? మీరు ఇతర వికీపీడియాలకు చెందిన సభ్యులతో పరస్పర సంబంధాలు ఏర్పరుచుకోవాలని అనుకుంటున్నారా ? అలా అయితే ఎవరిపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు ? దయచేసి మీ అభిప్రాయాలను మరియు సలహాలను ఇతరులతో పంచుకోండి.

అందరినీ ఈ విషంపై ఆలోచించి పాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నను. ఎందుకంటే ఇది ఈ అభిప్రాయాలతో ఏకీభవించే వారిని గుర్తించేలా చేస్తుంది. అలాగే ఏకాభిప్రాయం కలిగిన వారందరితో చేరి పనిచేయడానికి వీలౌతుంది. వికీ సమాజానికి ఈ సందేశం పంపించిన కారణమేమిటంటే మనలో కొంత మంది కలసికట్టుగా ప్రణాళికా బద్ధమైన కార్యక్రమాలను రూపొందించి ఉపక్రమించడానికి వీలౌతుందనే. దానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి తెవికీ సభ్యులు ఈ విషయమై చర్చలు జరిపి అలాగే ఆసక్తి కలిగిన సభ్యులు బృందాలుగా ఏర్పడి ఆభివృద్ధి కొరకు పని చేయడం. ఒకవేళ మీకు ఎవరితో సంప్రదింపులు జరపాలో తెలియకుంటే shiju@wikimedia.org కు సందేశం పంపండి. నేను మీకు సరి అయిన సభ్యులతో సంప్రదింపులు జరపడానికి కావలసిన సహాయం చేస్తాను.

నేను నిజంగా తెలుగు వికీపీడియా సమాజం యొక్క శక్తిని నన్ను ఆశ్చర్యపరుస్తుంది. నేను ఇక్కడ మీకు సహకరించడానికి సంసిద్ధంగా ఉన్నాను. మీరు నిసంశయంగా ఏ సహాయానికైనా నన్ను కోరవచ్చు. దయచేసి ఈ చర్చలలో పాల్గొని నాన్ను దానిలో భాగస్వామ్యుని చేయండి. అది ఇతర వికీపీడియన్లతో కలిసే అవకాశం మీకు కలిగిస్తుంది. మనం రేపటి ఐ ఆర్ సి సమావేశంలో వీటిలో కొన్ని పాయింట్లను గురించి చర్చిదాము.---- Shiju 10:25, 23 డిసెంబర్ 2011 (UTC),

క్యాలెండరు మూసలు పునరుద్ధరింపు

[మార్చు]

క్యాలెండరు మూసలు పనిచేయటంలేదు. ఇంగ్లీషు వికీలో 2037 వరకు నిర్వహణ అవసరం లేని కొత్త మూసలు 2008 లో తయారైనా అవి క్లిష్టంగా వుండడంతో వాటిని తెలుగులో కి చేర్చటానికి ప్రయత్నాలు పూర్తికాలేదు. ఈ రోజు నేను అది పూర్తి చేశాను. తేదీల పేజీలలో పాత మూసలు తీసివేసి కొత్త వి పెట్టాను. ఇంకా కొన్ని మెరుగులు చేయాలి. తెవికీలో సాంకేతికపై ఆసక్తిగలవారు చేపట్టమని మనవి. -- అర్జున 13:13, 28 డిసెంబర్ 2011 (UTC)