వికీపీడియా:వికీప్రాజెక్టు/గ్రోత్ ప్రాజెక్టు/గురువుల చర్చావేదిక
ఈ ప్రాజెక్టులో పాల్గొనే గురువుల చర్చావేదిక ఇది. తాము చేస్తున్న్న కృషిలో భాగంగా ఎదురైన, ఎదురు కాగల వివిధ సందేహాలు, సమస్యలు, ఊహించని సందర్భాల గురించి చరించుకునే ప్రదేశం ఇది. ఇక్కడి చర్చలు ప్రాజెక్టులో కృషి చేస్తున్న, చేయదలచిన గురువులకు మార్గదర్శకంగా, చేదోడుగా ఉంటాయి.
ఫలానా శిష్యునికి గురువెవరు?
[మార్చు]వాడుకరి:Chaduvari, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Svpnikhil, వాడుకరి:Kasyap లకు ఒక గమనిక:
ఫలానా శిష్యునికి గురువెవరో తెలుసుకోవడానికి ఈ పార్సరు ఫంక్షను వాడవచ్చు: {{#mentor:వాడుకరిపేరు}}
కొందరి గురువులెవరో తెలుసుకుందాం:
- రవిచంద్ర: Pranayraj1985
- యర్రా రామారావు: Nskjnv
- ప్రణయ్ రాజ్: Kasyap
- చదువరి: రవిచంద్ర
- నిఖిల్: Kasyap
- కశ్యప్:
- పవన్: Pranayraj1985 (ఏమీ రాలేదంటే దానర్థం ఈయన ఇంకా తన హోంపేజీని చేతనం చేసుకోలేదన్న మాట)
- రాజశేఖర్: (ఏమీ రాలేదంటే దానర్థం ఈయన ఇంకా తన హోంపేజీని చేతనం చేసుకోలేదన్న మాట)
__చదువరి (చర్చ • రచనలు) 10:02, 23 మార్చి 2021 (UTC)
- ఈ పార్సరు ఫంక్షన్ను వాడుతూ వాడుకరుల స్వాగత సందేశాన్ని మార్చాను నేరుగా స్వాగతం మూసలో కాకుండా, {{tl:స్వాగతం/ప్రయోగశాల}} అనే మూస ప్రయోగశాలలో మార్చాను. ఆ కొత్త సందేశాన్ని నా చర్చ పేజీలో అడుగున (రెండవ స్వాగత సందేశం చూడండి, మొదటిది కాదు) చూడవచ్చు. అందులో "వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు" అనే వాక్యం తరువాతి పేరాయే ఈ కొత్త సందేశం. మార్పులేమైనా చెయ్యాలంటే సూచించండి. మీరు సరేనంటే దాన్ని {{tl:స్వాగతం}} మూసలో చేరుస్తాను. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 11:08, 23 మార్చి 2021 (UTC)
- చదువరి గారూ నేను ఈ దిగువ సూచనలు చేస్తున్నాను.
- అన్ని రకాల సహాయం తరువాత, "అందించటానికి" అని ఉంటే బాగుంటుంది.
- ప్రతి ఊరికి ముందు "దాదాపుగా" అని ఉంటే బాగుంటుంది.
- సూపర్‌స్టార్ కృష్ణ కన్నా ముందు తరం నటులు అక్కినేని లేదా ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరిదో ఒకరి పేరు ఉంటే బాగుంటుంది.సూపర్‌స్టార్ కృష్ణ పేరే ఉండాలనుకుంటే పొగడ్తలు, బిరుదులు ముందు మన శైలికి పనికిరావుకనుక "సూపర్‌స్టార్" పదం తొలగించాలి.
- కొండారెడ్డి బురుజు,.. తరువాత "ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి" అని ఉంటే బాగుంటుంది.
- ఫేస్బుక్ బదులు "ఫేస్‌బుక్" (ఇది అంత ముఖ్యం కాదు) యర్రా రామారావు (చర్చ) 14:40, 23 మార్చి 2021 (UTC)
- @యర్రా రామారావు గారూ , మీరు చేసిన సూచనలకు ధన్యవాదాలు.
- మొదటి సూచనకు సంబంధించి అవసరమైన మార్పు ముందే చేసేసానండి. అందుకే "అడుగున", "రెండవ స్వాగత సందేశం చూడండి, మొదటిది కాదు" అని రాసాను. మీరు చెప్పిన స్థానంలో "చేసేందుకు" అని చేర్చాను, చూడండి. మిగతా సూచనలను స్వాగతం చర్చ పేజీలో రాస్తే బాగుంటుంది. మీ సూచనలన్నీ సరైనవే అనిపిస్తున్నాయి నాకు. అంచేత చర్చలో రాసే బదులు, నేరుగా స్వాగతం మూసలోనే ఆ మార్పులు చేసెయ్యవచ్చు, పరిశీలించండి. సినిమా నటుల పేజీల్లో కృష్ణ పేజీ చక్కగా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ పేజీని చేర్చాను. __ చదువరి (చర్చ • రచనలు) 02:24, 24 మార్చి 2021 (UTC)
- చదువరి గారూ నేను ఈ దిగువ సూచనలు చేస్తున్నాను.
శిష్యుల ఇంటర్‌ఫేసును పరీక్షిస్తున్నవారందరికీ ఒక గమనిక
[మార్చు]వాడుకరి:Chaduvari, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Svpnikhil, వాడుకరి:Kasyap లు గమనించండి: మీ అభిరుచుల్లో కింది సెట్టింగును కూడా చేసుకోండి:
- అభిరుచులు పేజీలో, "దిద్దుబాట్లు" ట్యాబులో ఉన్న "ఎడిటరు సహాయ ప్యానెల్‌ను చేతనం చెయ్యి" అనే అభిరుచిలో టిక్కు పెట్టండి.
దీంతో, మీరు ఏదైనా పేజీని దిద్దుబాటు చేసేటపుడు మీకొక సహాయ ప్యానెల్ కనిపిస్తుంది (లేదా తెరకు కుడివైపు కింద ఒక "?" మార్కు తేలుతూ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే సహాయ ప్యానెల్ తెరుచుకుంటుంది). దీని ద్వారా అక్కడికక్కడే గురువు గారిని సందేహం అడగవచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 08:27, 24 మార్చి 2021 (UTC)
- చేశానండి. కనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:33, 24 మార్చి 2021 (UTC)
నా శిష్యులు
[మార్చు]ఇప్పటి దాకా ఓ ముగ్గురు శిష్యులకు నేను గురువుగా కేటాయించబడినట్లు స్వాగత సందేశాల్లో కనిపించింది. కానీ ఇంకా ఎవరూ సందేహాల కోసం నా దగ్గరకు రాలేదు. ఇంకెవరైనా గురువులను మీ శిష్యులు సంప్రదించారా? - రవిచంద్ర (చర్చ) 09:14, 30 మార్చి 2021 (UTC)
- నన్నెవ్వరూ సంప్రదించలేదండి. __ చదువరి (చర్చ • రచనలు) 09:28, 30 మార్చి 2021 (UTC)
- నేను ఇద్దిరికి గురువుగా నమోదయ్యాను. నన్నెవ్వరూ ఇంతవరకు సంప్రదించలేదు. యర్రా రామారావు (చర్చ) 10:06, 30 మార్చి 2021 (UTC)
నేను గమనించినంతలో కొత్తవారెవరూ సంప్రదించినట్లు లేదు. గత గంటలో చేరిన నలుగురిని వారి చర్చపేజీలో పలకరించాను. వారేమైనా సంప్రదిస్తారేమో చూద్దాం. __చదువరి (చర్చ • రచనలు) 11:18, 30 మార్చి 2021 (UTC)
- నాకు ఇద్దరు శిష్యులు లింకుచేయబడ్డారు. నాకు ఎవరినుండి ప్రశ్నలు రాలేదు.--Rajasekhar1961 (చర్చ) 11:39, 30 మార్చి 2021 (UTC)
- నాకు ఒకరిని కేటాయించినట్టుగా సందేశం ఉంది. ఆ సభ్యుని నుండి స్పందన లేదు..B.K.Viswanadh (చర్చ) 06:15, 2 ఏప్రిల్ 2021 (UTC)
- నాకు ఇద్దరు కొత్త సభ్యులను శిష్యులుగా లింకు చేయబడ్డారు. నాకు వారి నుండి ఎలాంటి స్పందన రాలేదు. నేను కూడా వారి చర్చాపేజీలో రాశాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:56, 2 ఏప్రిల్ 2021 (UTC)
- నాకు ఒకరిని కేటాయించినట్టుగా సందేశం ఉంది. ఆ సభ్యుని నుండి స్పందన లేదు..B.K.Viswanadh (చర్చ) 06:15, 2 ఏప్రిల్ 2021 (UTC)
- నాకు ఇద్దరు శిష్యులు లింకుచేయబడ్డారు. నాకు ఎవరినుండి ప్రశ్నలు రాలేదు.--Rajasekhar1961 (చర్చ) 11:39, 30 మార్చి 2021 (UTC)
మానవికంగా శిష్యుని స్వీకరించే పద్ధతి
[మార్చు]శిష్యులకు ఆటోమాటిగ్గా గురువును కేటాయించడం జరుగుతున్న సంగతి మనందరం ఎరిగిన సంగతే. అయితే, ఎవరైనా వాడుకరిని గురువు మానవికంగా తన శిష్యునిగా స్వీకరించే విధానం కూడా ఉంది. ప్రత్యేక:శిష్య స్వీకారం అనే ఈ ప్రత్యేక పేజీని పరిశీలించండి. పరీక్షించండి. రాజశేఖర్ గారూ, మీరన్న పాత వాడుకరి కోసం దీన్ని ప్రయత్నించి చూడవచ్చు.
నేను ఈ పద్ధతిలో యర్రా రామారావు గారిని శిష్యునిగా చేర్చుకున్నాను (సారీ రవిచంద్ర గారు :-) ). ఎవరి అనుమతినీ అడక్కుండానే గురువును మార్చేసింది! __చదువరి (చర్చ • రచనలు) 05:23, 3 ఏప్రిల్ 2021 (UTC)
- ఓహో ఈ పద్దతి కూడా ఉందన్నమాట.మంచిది.దీనికి పదును పెట్టే భాద్యత (అంటే ఉపయోగించుకునే భాద్యత) మనందరిమీద ఉంది.చదువరి గారూ నన్ను మీ శిష్యునిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:43, 3 ఏప్రిల్ 20త్సాఝం1 (UTC)
- ఈ పద్ధతి భలే బాగున్నది. శిష్యునితో మాట్లాడి చేర్చుకుంటాను.--Rajasekhar1961 (చర్చ) 06:15, 4 ఏప్రిల్ 2021 (UTC)
నెల రోజుల అనుభవం తరువాత మన కర్తవ్యం - అభిప్రాయాలు, సూచనలు
[మార్చు]ఈ ప్రాజెక్టును చేర్చి నెల రోజులైంది. ఏప్రిల్ 27 వరకు 137 మంది కొత్త వాడుకరులు ఇందులో చేరారు. అందులో నాలుగింటిని నేను పరీక్షార్థం సృష్టించినవే. వీరిలో తమ గురువును సంప్రదించినది ముగ్గురో నలుగురో.. అంతే. అందులో సీరియస్‌నెస్ ఉన్న ప్రశ్నలు ఒకటి రెండే ఉన్నట్టున్నాయి. నిరాశ చెందాల్సినదేమీ లేనప్పటికీ, మనం అవలంబించాల్సిన కొత్త పద్ధతులు, మన చేసుకోవాల్సిన మార్పుచేర్పులూ వగైరాల గురించి మాట్టాడుకోవాల్సిన సమయం ఇదని నేను భావిస్తున్నాను. గురువులు తమ తమ అభిప్రాయాలను చెప్పవలసినదిగా కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 09:38, 27 ఏప్రిల్ 2021 (UTC)
వ్యాసాల్లో బొమ్మలు చేర్చే పోటీకి మన శిష్యులను ఆహ్వానిద్దామా?
[మార్చు]వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Svpnikhil, వాడుకరి:Kasyap, వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల, వాడుకరి:B.K.Viswanadh, వాడుకరి:Nskjnv లకు ఒక ప్రతిపాదన:
వ్యాసాల్లో బొమ్మలను చేర్చే రెండు నెలల ప్రాజెక్టు ఇవ్వాళే మొదలైన సంగతి మీరు గమనించే ఉంటారు. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు.
- కొత్తవారు కూడా తేలిగ్గా చెయ్యగలిగే పని ఇది.
- ఇది ఒక పోటీ కాబట్టి ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంది.
- ఉత్తమమైన కృషి చేసినవాళ్ళకు బహుమతులు కూడా ఇవ్వడం దీనిలో ఉన్న అదనపు ఆకర్షణ.
ఈ కారణాల వలన కొత్తవారు కూడా ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉంది. పోటీ ముగిసాక వారిలో కొందరైనా వికీలో రచనలను కొనసాగించే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా ఈ పోటీని వికీ అభివృద్ధికి వినియోగించుకోవచ్చు.
మన గ్రోత్ ప్రాజెక్టు మొదలుపెట్టాక ఇప్పటి దాకా దాదాపు 400 మంది కొత్తవాడుకరులు చేరారు. వీరందరూ మనలో ఎవరో ఒకరికి శిష్యులే. అయితే వీళ్ళలో రాస్తున్నది పెద్దగా ఎవరూ లేరు. వీళ్ళకి బొమ్మల పోటీ గురించి చెబితే కొంతమందైనా పాల్గొనే అవకాశం ఉంది. మనందరం మనమన శిష్యులకు ఈమెయిలు రాసి, వాళ్ళను ఈ పోటీలో పాల్గొనమని ఆహ్వానించుదామా? ఒక ఆహ్వాన ఈమెయిలును రాసి వాళ్ళవాళ్ళ వాడుకరి పేజీ నుండి ఈమెయిలు పంపించవచ్చు. అవసరమైతే బొమ్మలు చేర్చే విషయమై వాళ్ళందరికీ చిన్నపాటి శిక్షణా కార్యక్రమం కూడా పెడదాం. ఒక్కసారి శిక్షణ ఇస్తే చాలదనుకుంటే మరిన్ని సార్లు ఇద్దాం. ఏమంటారు? చర్చ పేజీలో ఉన్న శిష్యుల జాబితాను తాజాకరించాను, చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 05:58, 1 జూలై 2021 (UTC)
- ఈ ప్రతిపాదన బాగుంది, దీని ద్వారా వికీలో క్రియాశీల వాడుకరుల సంఖ్య పెంచవచ్చు. నేను ఈ పనికి సిద్దంగా ఉన్నాను. ధన్యవాదాలు Nskjnv (చర్చ) 06:01, 1 జూలై 2021 (UTC)
- సరేనండి, నేనుకూడా సిద్ధం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:52, 1 జూలై 2021 (UTC)
- మంచి ప్రయత్నం.బాగుంది.పంపిద్దాం. యర్రా రామారావు (చర్చ) 03:48, 3 జూలై 2021 (UTC)
- వాడుకరి:Nskjnv, User:Pranayraj1985 గార్లకు, కింది నమూనా మెయిలును పంపిద్దాం.
- "______గారికి,వికీపీడియాలో రచనలు చేసే ఉత్సాహంతో మీరు వాడుకరిగా నమోదు చేసుకున్నారు. అందుకే మీకు ఈ మెయిలు రాస్తున్నాను. వ్యాసాల్లో బొమ్మలను చేర్చే పోటీ ఒకటి ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో జరుగుతోంది. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు జరిగే ఈ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎప్పుడైనా పాల్గొనవచ్చు, ఎన్నాళ్ళైనా పని చెయ్యవచ్చు. ఎక్కువ కృషి చేసినవారికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉన్నాయి. ఇది సుళువుగా చేసే పని కావడం వలన ఈ పోటీ కొత్తవారికి అనుకూలంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను మీకీ మెయిలు రాస్తున్నాను. పోటీ వివరాల కోసం ఈ పేజీ చూడండి. ఈ పని ఎలా చెయ్యాలనే విషయమై ఏమైనా సందేహాలుంటే నా చర్చ పేజీలో రాయండి. నేను మీకు సాయం చేస్తాను. ఉంటానండి."— ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Chaduvari (చర్చ • రచనలు)
- కొద్దిపాటి మార్పుచేర్పులతో నేను పై పాఠ్యాన్ని ఈమెయిళ్ళు పంపించాను. నా శిష్యుల్లో కేవలం ఆరుగురే ఈ మెయిలు ఇచ్చారు. వారికే పంపించాను. __చదువరి (చర్చ • రచనలు) 04:00, 3 జూలై 2021 (UTC)
- అలాగేనండి, ఈ మెయిలు ఇచ్చినవారికి మెయిల్ పంపించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 10:52, 3 జూలై 2021 (UTC)
- కొద్దిపాటి మార్పుచేర్పులతో నేను పై పాఠ్యాన్ని ఈమెయిళ్ళు పంపించాను. నా శిష్యుల్లో కేవలం ఆరుగురే ఈ మెయిలు ఇచ్చారు. వారికే పంపించాను. __చదువరి (చర్చ • రచనలు) 04:00, 3 జూలై 2021 (UTC)
- సరేనండి, నేనుకూడా సిద్ధం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:52, 1 జూలై 2021 (UTC)
గురువు కేటాయింపు
[మార్చు]కొత్తగా చేర్చే స్వాగత సందేశంలో కొన్నింటిలో గురువు కేటాయింపు జరగట్లేదు.. చదువరి, వాడుకరి:Pranayraj1985 గార్లు ఇతరులెవరైనా ఒకసారి పరిశీలంచగలరు.
ఇదుగో ఈ కింది పేజీల్లో చూడండి సమస్యేంటో అర్థమవ్వలేదు .. ఇక్కడ గురువు పేరు రాలేదు ..
ధన్యవాదాలు Nskjnv ☚╣✉╠☛ 11:44, 3 అక్టోబరు 2021 (UTC)
- ఖాతాను సృష్టించినది తెవికీలో అయితేనే వస్తుంది. అవి ఎక్కడ సృష్టించారు?__ చదువరి (చర్చ • రచనలు) 13:10, 3 అక్టోబరు 2021 (UTC)
- తెవికీలో సృష్టించినవాటికి కూడా కొన్నిటికి రావట్లేదండి. Nskjnv ☚╣✉╠☛ 14:26, 3 అక్టోబరు 2021 (UTC)