Jump to content

వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2022

వికీపీడియా నుండి

2003 డిసెంబరు 10 న తెలుగు వికీపీడియా పుట్టింది. తెవికీకి 19 సంవత్సరాలు నిండి, 20 వ ఏట అడుగు పెట్టే సందర్భంలో మన ప్రస్థానాన్ని ఒకసారి సమీక్షించుకుని, రాబోవు కాలంలో ఎలా నడవాలో నిర్ణయించుకునేందుకు గాను, తెవికీ వాడుకరులు, కొత్త వాడుకరులు కలిసి నిర్వహించే ఒక సమావేశం.

నిర్వహణ

[మార్చు]

తెలుగు వికీపీడియన్లు

కార్యక్రమ వివరాలు

[మార్చు]
పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్రభారతి, హైదరాబాదు
ఆహ్వానితులు

తెలుగు వికీపీడియన్లు

కార్యక్రమ సరళి

[మార్చు]
  1. పరిచయ కార్యక్రమం, తెవికీ జన్మదిన వేడుక కేకు కటింగ్ - (అరగంట)
  2. తెవికీలో మన విజయాలు, సాధించిన ప్రగతి, సాధించలేకపోయినవి, మన వైఫల్యాలు, మన సమస్యలు -వీటిని సమీక్షించుకోవాలి. ఇకపై మనం చెయ్యాల్సినదేంటి అనేది చర్చించాలి. (గంట)
  3. యూజరు గ్రూపు గురించి చర్చ. ఎలా ఏర్పాటు చెయ్యాలి, ఎవరెవరు బాధ్యత తీసుకుంటారు వగైరాలు. అక్కడ ప్రాథమికంగా చర్చ జరిగిన తరువాత దాన్ని తెవికీలో సముదాయంలో చర్చ కోసం పెట్టి, తుదిరూపు నివ్వడం. (అరగంట)
  4. కొత్త వాడుకరులకు గురువు కేటాయింపు జరిగిన తరువాత ఏం జరగాలి అనేదానిపై చర్చ (అరగంట)
  5. భోజనాలు, పిచ్చాపాటీ (గంట)
  6. తెవికీ ఆఫ్‌లైను పనులు: తెవికీ సముదాయం ఆఫ్‌లైనులో ఏమేం పనులు చెయ్యవచ్చు, చెయ్యాలి (శిక్షణ, వాడుకరులు కలవడాలు, వగైరాలు), ఎలా చెయ్యాలి అనే సంగతులు. కొత్త వాడుకరులను తీసుకురాటానికి ఇప్పటి వరకూ అనేక స్థాయిల్లో ప్రయత్నాలు జరిగాయి. పెద్దపెద్ద సంస్థలు కూడా ధన సంపత్తులతో రంగం లోకి దిగాయి గానీ పెద్దగా ప్రయోజనం కలగలేదు. కొత్త వాడుకరులను తీసుకురావడం అనేది అంత తేలిక కాదని పదేపదే తేలింది. దీనికి ఇతర మార్గాలు/పద్ధతులూ ఏమైనా ఉన్నాయా, కొత్తవారిని ఎలా నిలుపుకోవాలి, అసలు వికీపీడియా చెపుతున్న మార్గదర్శకాలు ఎమిటి అన్న వాటిమీద చర్చ (గంట)
  7. మధ్యాహ్నం 3 గంటలకు సమాప్తి

నేరుగా సమావేశ స్థలంలో పాల్గొనేవారు

[మార్చు]
  1. నేను పాల్గొంటాను. __చదువరి (చర్చరచనలు) 01:37, 18 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నేను పాల్గొంటాను.--Pranayraj1985 (చర్చ) 08:47, 18 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  3. NskJnv 12:56, 23 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  4. నేను పాల్గొంటాను.--యర్రా రామారావు (చర్చ) 13:13, 23 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Mothiram 123 (చర్చ) 09:17, 20 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  6. నేను పాల్గొంటాను కానీ భోజన సమయం వరకే ఉండగలను! --Kasyap (చర్చ) 09:37, 20 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  7. నేను పాల్గొంటాను.--Nagarani Bethi (చర్చ) 10:37, 20 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  8. నేను పాల్గొంటాను.-అభిలాష్ మ్యాడం (చర్చ) 11:44, 21 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  9. Batthini Vinay Kumar Goud (చర్చ) 06:44, 22 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  10. Vadanagiri bhaskar (చర్చ) 06:57, 22 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  11. నేను పాల్గొంటాను.-- బెజ్జంకి జగన్నాథాచార్యులు (చర్చ) 17:28 , 23 డిసెంబరు 2022 (UTC)
  12. నేను పాల్గొంటాను ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 04:34, 24 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  13. ఆన్లైన్లో అయితే పాల్గొనగలను. ప్రభాకర్ గౌడ్చర్చ 16:15, 24 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక

[మార్చు]

డిసెంబరు 25న జరిగిన తెవికీ 19న జన్మదిన వేడుకలో ముందుగా పరిచయ కార్యక్రమం, తెవికీ జన్మదిన వేడుక కేకు కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చదువరి, ప్రణయ్‌రాజ్ వంగరి, సాయికిరణ్, కృపాల్ కశ్యప్, అభిలాష్ మ్యాడం, వందనగిరి భాస్కర్, బెజ్జంకి జగన్నాథాచార్యులు, ఆదిత్య పకిడే, పవన్ సంతోష్ సూరంపూడి, రామకృష్ణ ఎడుకుళ్ళ హాజరయ్యారు.

తెలుగు వికీపీడియాలో ఉన్న ప్రదాన సమస్య ఏమిటి? అని చర్చలో సభ్యుల అభిప్రాయాలు
  • సాయికిరణ్: ప్రస్తుతకాలంలో అందరూ మొబైల్ వాడుతున్నారు. మొబైల్ ఎడిటింగ్ క్లిష్టంగా ఉంది. దాన్ని సులభతరంగా మార్చాలి.
  • ఆదిత్య: కొత్తవాడుకరులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వారిని నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి.
  • అభిలాష్: తెవికీలో కొన్ని వ్యాసాలలో భాష సరిగా ఉండడంలేదు, భాషా దోషాలు ఉన్నాయి. సరైన వర్గీకరణ లేదు.
  • చదువరి: చురుగ్గా ఉన్న వాడుకరులు కూడా అవసరమైన చర్చల్లో పాల్గొనడంలేదు. గూగుల్ అనువాద ఉపకరణంతో అనువదించిన వ్యాసాన్ని ఇంకాస్త మెరుగ్గా అనువాదం చేయడానికి ఒక ఉపకరణం తయారుచేసుకోవాలి. దానికి అవసరమైతే ఐఐఐటి వారి నుండి సహకారం తీసుకోవాలి. బాట్ అభ్యర్ధనలను పరిష్కరించుకోవాలి, వాడుకరి గుంపులను దిగుమతి చేసుకోవాలి.
  • భాస్కర్: వర్ధమాన సంఘటనలు, కరెంట్ అఫైర్స్ విషయంలో అప్డేట్ ఆసల్యం అవుతోంది.
  • గుళ్ళపల్లి: సభ్యుల మధ్య పరస్పర సహకారం ఉండడంలేదు, అఫ్ వికీ సహకారం కావాలి. నెలకొకసారి వీలున్న వాళ్ళు వికీ సమావేశాలలో పాల్గొనాలి.
  • కశ్యప్: వికీలో ఖాతా తెరవడం సులభతరం చేయాలి. నోటబులిటి విషయంలో లిబలర్ ఉండాలి. సభ్యులందరూ మొబైల్ యాప్ ఉపయోగించాలి, అప్పుడు మొబైల్ ఎడిటింగ్ పై అవగాహన వస్తుంది. కొత్తవాడుకరులు వచ్చీరాగానే వారి గురించో లేదా ఇతరుల గురించో వ్యాసాలు రాస్తున్నారు. అలాంటి సమయంలో వికీ నియమాలకు అనుకూలంగా లేని వ్యాసాలను వెంటనే తొలగిస్తున్నారు. అలాకాకుండా ఆంగ్లవికీలో మాదిరిగా వాటిని డ్రాఫ్ట్ పేజీకి తరలించి, వ్యాసాన్ని అభివృద్ధి చేయడానికి ఆ వాడుకరికి కొంత సమయం ఇచ్చి, ఆ సమయం దాటిన తరువాత వ్యాసంపై చర్య తీసుకోవాలి. వ్యాసంపై చర్య తీసుకునే గడువును సముదాయం నిర్ణయించుకోవాలి.
  • ప్రణయ్: కొత్తవాడుకరులు వచ్చి వారిపేజీని వారు రాసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో వ్యాసాన్ని తొలగించకుండా వికీ నియమాలను పరిశీలించి, నియమాలకు అనుగుణంగా ఉంటే ఆ వ్యాసం పైన 'ఇది వాడుకరి సొంతంగా రాసుకున్న పేజీ' అని ఒక మూస లాంటిది పెట్టోచ్చేమో ఆలోచించాలి.

పైన తెలిపిన అభిప్రయాల గురించి వికీపీడియాలో చర్చించి సాధ్యాసాధ్యాలను బట్టి పరిష్కరించుకుందామని సభ్యులు సూచించారు.

యూజర్ గ్రూపు ఏర్పాటు

తెలుగు వికీపీడియాకు ఒక యూజర్ గ్రూపు ఉండాలన్న అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో యూజర్ గ్రూప్ ఎందుకు? దాని వల్ల ప్రయోజనం ఏంటి అన్న ప్రశ్నలు లేవనెత్తగా వాటికి సంబంధించి పవన్ సంతోష్ గారు వివరణ ఇచ్చారు. ఈ యూజర్ గ్రూపు విషయంలో స్పష్టమైన బైలాస్ ఉండాలని, యూజర్ గ్రూపులో అందరికి ప్రాతినిధ్యం ఉండాలని కశ్యప్ గారు సూచించారు.

పాల్గొన్న సభ్యుల మధ్య యూజర్ గ్రూపు అవసరాలపై చర్చలు జరిగిన తరువాత, యూజర్ గ్రూపు ఏర్పాటుకు సభ్యుల సముఖత తెలియజేస్తూ తెలుగు వికీ సముదాయానికి ఒక యూజర్ గ్రూపు ఏర్పాటుచేసుకోవాలని తీర్మానించడం జరిగింది.

చిత్రాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

దినపత్రికలలో వ్యాసాలు

[మార్చు]
  1. 20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా (ఈనాడు మెయిన్, 23.12.2022) వ్యాసం ఆర్కైవ్ లింకు
  2. Telugu Wikipedians to celebrate 19th anniversary of its founding on December 25 (TelanganaToday, 24.12.2022) Archive Link