వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2021

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2003 డిసెంబరు 10 న తెలుగు వికీపీడియా పుట్టింది. తెవికీకి 18 సంవత్సరాలు నిండి, 19వ ఏట అడుగు పెట్టే సందర్భంలో తెవికీ జన్మదిన వేడుకలను జరుపుకోవాలని రచ్చబండలో జరిగిన చర్చలో నిర్ణయించుకున్నాం. తదనుగుణంగా 2021 డిసెంబరు 19 ఆదివారం రోజున రవీంద్రభారతి 2వ అంతస్తులోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఉదయం గం. 10 నుండి సాయంత్రం గం. 5 వరకు తెవికీ జన్మదిన వేడుకలు (సముదాయ సభ్యులతో కొత్త వాడుకరుల పరిచయ వేదికగా, తెవికీ శిక్షణ కార్యక్రమం) జరుపబడుతున్నాయి.

దస్త్రం:Telugu Wikipedia 18th Anniversary Invitation.jpg

కార్యక్రమ వివరాలు[మార్చు]

ఆహ్వానితులు

తెలుగు వికీపీడియన్లు

  • తేది: డిసెంబరు 19 (ఆదివారం)
  • సమయం: ఉదయం గం. 10 నుండి సాయంత్రం గం. 5 వరకు
  • ప్రదేశం: పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు, రవీంద్రభారతి. హైదరాబాదు.

కార్యక్రమ సరళి[మార్చు]

(ప్రతిపాదితం, చర్చాపేజీలో చర్చించండి.)

  1. ఆఫ్‌లైన్‌, ఆన్లైన్ వేదికల్లో పాల్గొన్న తెవికీ సభ్యుల పరిచయం, వారివిరి వ్యక్తిగత కృషి గురించి చర్చ క్లుప్త వివరణ
  2. తెవికీ ప్రస్తుత పరిస్థితి, లోటుపాట్లపై చర్చ
  3. గతంలో కంటే తెవికీ పరంగా వేటిల్లో ప్రగతి ఏమేరకు సాధించగలిగామో తరచి చూసుకోవడం. వాటి విషయంలో పురోగతి ఎలా సాధించాలో చర్చించడం.
  4. భవిష్యత్తు వ్యూహాలు నిశ్చయించుకోవడం
  5. వికీ రచనలో సందేహాల నివృత్తి, శిక్షణా కార్యక్రమం.

పాల్గొనేవారు[మార్చు]

సమావేశం సమర్ధవంతంగా జరపటానికి, ఆసక్తి గల వారు సంబంధిత విభాగంలో పేరు చేర్చవలసినది

ప్రత్యక్షంగా[మార్చు]

  1. మ్యాడం అభిలాష్
  2. కుమ్మరి నరేష్
  3. ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 05:55, 8 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  4. 10, 11, 25, 26 తేదీలు నేను ఊరిలో ఉండను. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 20:44, 8 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --స్వరలాసిక (చర్చ) 16:29, 9 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Kasyap (చర్చ) 05:22, 10 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Thirumalgoud (చర్చ) 07:23, 10 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Nagarani Bethi (చర్చ) 17:09, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  9. Batthini Vinay Kumar Goud -- (చర్చ) 06:12, 16 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  10. Mouryan (చర్చ)

పరోక్షంగా[మార్చు]

  • 11,12 శనాది వారాల్లో బహుశా ఊళ్ళో ఉండను. అయినా వీలును బట్టి పాల్గొంటాను. చదువరి (చర్చరచనలు)

పాల్గొన వీలు కాని వారు[మార్చు]

నిర్వహణ సమన్వయ జట్టు[మార్చు]

పనులు, బాధ్యతలు[మార్చు]

  • వాడుకరులకు ఆహ్వానం (ప్రస్తుత క్రియాశీల వాడుకరులకు) - ప్రణయ్
  • ఆఫ్‌లైన్‌, ఆన్లైన్ వేదికగా పాల్గొనే తెవికీ సభ్యుల సమన్వయం
  • ఫ్లెక్సీలు (రెండు బ్యానర్లు 6x3) - ప్రణయ్
  • కార్యక్రమ ఆన్లైన్ ప్రసారం -
  • భోజనాలు, టీ, కాఫీలు - ఆరోజే
  • ప్రెస్ నోటు - ప్రణయ్

నివేదిక[మార్చు]

2021 డిసెంబరు 19 ఆదివారం రోజున రవీంద్రభారతి 2వ అంతస్తులోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఉదయం గం. 10 నుండి సాయంత్రం గం. 5 వరకు ఆఫ్‌లైన్‌, ఆన్లైన్ వేదికగా తెవికీ జన్మదిన వేడుకలు (సముదాయ సభ్యులతో కొత్త వాడుకరుల పరిచయ వేదికగా, తెవికీ శిక్షణ కార్యక్రమం) జరుపబడ్డాయి. ఇందులో పాల్గొనే తెవికీ సభ్యుల సమన్వయంలో భాగంగా వికీ సభ్యుల పరిచయం, తెలుగు వికీలో వారి అనుభవాలు, కొత్తవారికి తెవికీ శిక్షణ కార్యక్రమం జరిగింది.

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
మ్యాడం అభిలాష్, కుమ్మరి నరేష్, ఆదిత్య పకిడే, రాజశేఖర్, కశ్యప్, బత్తిని వినయ్, మౌర్య
పరోక్షంగా పాల్గొన్నవారు
చదువరి, పవన్ సంతోష్, శశి, వీవెన్, సాయికిరణ్, రమేష్, ప్రభాకర్ గౌడ్, సుజాత, శ్రీరామమూర్తి,

సభ్యుల అభిప్రాయాలు[మార్చు]

  • చదువరి: తెవికీ తొలినాళ్ళలో వచ్చానని, తాను ఎక్కువగా నాణ్యత వ్యాసాల మీద దృష్టి పెట్టానని అన్నారు. మధ్యలో కొన్ని సంవత్సరాలు వికీలో చురుకుగా లేనని, 2016 నుండి వికీ అభివృద్ధిలో భాగమయ్యానని, సముదాయ సభ్యుల సహకారంతో మొలక వ్యాసాల విస్తరణలో విశేష కృషి చేయడంలో కీలక పాత్ర పోషించానని తెలిపారు.
  • రాజశేఖర్: ప్రస్తుత కాలంలో అందరూ మొబైల్ ఉపయోగిస్తున్నారు కాబట్టి మొబైల్ లో వికీ రచన గురిచి శిక్షణ ఇవ్వాలి. వికీ నెలవారి సమావేశాలు నిర్వహించుకోవాలి. వికీడాటా, వికీకామన్స్ లో కూడా చురుగ్గా పాల్గొనాలి.
  • పవన్ సంతోష్: వికీ రచనల వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. గ్రామ వ్యాసాలలో మంచి ఫ్రేమ్ వర్క్ జరిగింది. అందుకు రామారావుగారు విశేష కృషి చేశారు. ఆ స్థాయిలో కొత్తవాళ్ళు కూడా కృషి చేయాలి. కొత్తవాళ్ళు వస్తున్నారు కానీ వికీలో ఎక్కువకాలం నిలబడడడంలేదు, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. వికీలో నియమనిబంధనలు కొంచెం సులభంగా ఉండాలి. కొత్తవాళ్ళని ఆహ్వానించి వారికి కొన్ని నియమనిబంధనలు చెప్పి వారిచే రాయించాలి. మొబైల్ ఎడిట్ గురించి నేర్పించాలి.
  • శశి: తెవికీలో కళా సమహారం అనే ప్రాజెక్టు నిర్వహిస్తున్నాను. దానికి కాలవ్యవధిలేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవచ్చు.
  • వీవెన్: 2008లో మొదటిపేజీ ఒక రూపానికి వచ్చింది. మీడియావికీ, వికీడాటాలో చేర్చడం ద్వారా అన్ని సోదర ప్రాజెక్టుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.
  • సాయికిరణ్: వికీ ఏషియన్ మంత్ ప్రాజెక్టు, 100వికీడేస్ లలో పాల్గొన్నాను.
  • రమేష్: ఆజాదీ కా అమృతమహోత్సవ్ ఎడిటథాన్, వికీ ఏషియన్ మంత్ ప్రాజెక్టులలో పాల్గొన్నాను.
  • అభిలాష్: తెవికీ పరిచయంతో నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. వికీ అభివృద్ధిలో భాగస్వామ్యమవడం నా అదృష్టం.
  • ప్రభాకర్ గౌడ్: మొదట ఇంగ్లీష్ వికీలో రచనలు ప్రారంభించాను. 2020 వరకు అప్పుడప్పుడు తెవికీలో కూడా రాసేవాడిని. ఆ తరువాత నుండి ఎక్కువగా తెవికీలోనే రాస్తున్నాను. సముదాయ సభ్యుల సహకారం బాగుంది. వికీలో వ్యాసం రాస్తే సంతృప్తిగా ఉంటుంది.

భోననానంతరం, కొత్త వాడుకరులకు వికీ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.

చిత్రాలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]