విజయవాడ పర్యాటక ఆకర్షణల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయవాడ, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు, కృష్ణా జిల్లాలో కృష్ణానది ఒడ్డున కల ఒక వాణిజ్య నగరం.

నగర దృశ్యం[మార్చు]

విజయవాడ నగర దృశ్యం

విజయవాడలో చూడదగిన ప్రదేశాలు[మార్చు]

విజయవాడలో చూడదగిన ప్రదేశాలు లేదా మైలురాళ్లు అని అనవచ్చును.

లెనిను విగ్రహం (విజయవాడ ప్రముఖ కమ్యూనిస్టు కేంద్రం)
విక్టోరియా మ్యూజియం

కృష్ణవేణి మంటపం[మార్చు]

కృష్ణా నది ఒడ్డున కృష్ణవేణి ప్రతిమ

ఇది నది మ్యూజియం అని పిలుస్తారు, ప్రకాశం బ్యారేజ్ వైపు వద్ద ఉంది. దీనిని కృష్ణా పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్ సొసైటీ వారు నిర్మించారు. ఇందులో కృష్ణా నది భౌగోళిక మార్గం పటం, ప్రపంచ కరెన్సీ, కృష్ణవేణి ప్రతిమ మొదలైనవి ఉన్నాయి.

గాంధీ కొండ[మార్చు]

  • గాంధీ కొండ లేదా ఒర్ కొండ అని పిలిచే ఈ కొండ మీద 1968లో మహాత్ముడి సంస్మరణార్ధం ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఈ స్తూపం 15.8 మీటర్లు (52 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇక్కడ ఒక గాంధీ స్మారక గ్రంథాలయం, "సౌండ్ అన్డ్ లైట్ షో", నక్షత్రశాలలు ఉన్నాయి. ఈ కొండపై నుండి దాదాపు విజయవాడ మొత్తం కనిపిస్తుంది. కొండ మొత్తం చూపించడానికి ఒక బొమ్మ రైలు కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ స్తూపం మహాత్ముని సంస్మరణార్ధం భారతదేశములో నిర్మించిన మొదటి స్తంభం. దీనిని అక్టోబరు 6 1968 న అప్పటి అధ్యక్షుడు స్వర్గీయ డా. జాకిర్ హుసేన్ ఆవిష్కరించి, జాతికి అంకితమివ్వడం జరిగింది.[1]

ప్రకాశం బ్యారేజి[మార్చు]

కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి, రైలు వంతెన
ప్రకాశం బ్యారేజి
  • కృష్ణా నదిపై ఇక్కడ ఒక ఆనకట్ట కట్టే ఆలోచన మొదట 1798లో వచ్చింది. తరువాత 1841లో కేప్టెన్ బకుల్ చేతులలో ఒక రూపాన్ని సంతరించుకుంది. 1852లో ఆనకట్టను నిర్మించడం మెదలుపెట్టి 1855లో పూర్తి చేసారు. వందేళ్ళ పాటు ఉపయోగపడిన ఆనకట్ట కొట్టుకొని పోవడంతో, 1954 మార్చి 1ఆంధ్ర రాష్ట్రపు మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఒక కొత్త రెగ్యులేటరు, వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. 1957లో బారేజి పూర్తి అయింది. 1223.5 మీటర్ల పొడవు కలిగిన ఈ బారేజీ వలన మొత్తం 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీని వలన కృష్ణా డెల్టా రాష్ట్రం లోనే పెద్ద ధాన్యాగారంగా మారింది. ప్రకాశం బారేజి వలన ఏర్పడిన సరస్సు నలుదిక్కులా కనిపిస్తూ చాలా మనోహరంగా ఉంటుంది.[2]

రాజీవ్‌ గాంధీ పార్కు[మార్చు]

  • ఈ పార్కును విజయవాడ మునిసిపల్ కార్పోరేషను ప్రత్యేక శ్రద్ధ తీసికొని నిర్మించింది. ఇక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు పెంచబడుతున్నాయి. సంగీతాన్ని వినిపించే ఫౌంటేను, ఒక మినీ జూ ఈ పార్కుకు ప్రత్యేక ఆకర్షణ.

మొగల్రాజపురం గుహలు[మార్చు]

మొగల్ రాజపురం గుహల వద్ద బోర్డు
విజయవాడలో మొఘల్ రాజపురం గుహలు
  • ఈ గుహలను క్రీశ ఐదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. వీటిలో నటరాజ స్వామి, వినాయకుడు, మొదలగున వారి విగ్రహాలు చూడవచ్చు. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వరుని విగ్రహం దక్షిణ భారతదేశంలో మరెక్కడా కనిపించదు.[3]

ఉండవల్లి గుహలు[మార్చు]

  • కీ.శ. 7వ శతాబ్దంలో నిర్మితమయిన ఈ గుహలు విజయవాడకు 8 కీ.మీ.ల దూరంలో ఉన్నాయి. రెండంతస్తుల ఈ గుహారూపాలను బౌద్ధ సన్యాసులు వానా కాలంలో తమ విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారు. పడుకున్న భంగిమలో ఉన్న "అనంతశయన విష్ణువు" భారీ ఏకశిలా విగ్రహం ఇక్కడ ఉంది. ఈ కొండ నుండి కృష్ణా నది మనోహరంగా కనిపిస్తుంది.ఈ కొండపైన రాళ్ళమీద విగ్రహ ప్రతిమల మాదిరిగా చెక్కిన చిత్రాలు కూడా చూడ వచ్చు.[2][4]

భవానీ ద్వీపం[మార్చు]

  • ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకీ పెద్దదని చెప్పుకోవచ్చు. ఇది విజయవాడ నగరానికి 4 కి.మీ.ల దూరంలో ఉంటుంది. 133 ఎకరాల ఈ దీవిని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు గొప్ప పర్యాటక ప్రదేశంగా మలచారు. ఇక్కడ ఒక రిసార్టు కూడా ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది చాలా గొప్ప విహారక్షేత్రం. దీవి వద్దకు వెళ్ళేందుకు పడవ వసతి కల్పించారు.[2]

కొండపల్లి కోట, బొమ్మలు[మార్చు]

ప్యాలెస్ వద్ద సింహాసనము, కొండపల్లి, కృష్ణా జిల్లా
  • కొండపల్లి గ్రామం విజయవాడ నగరానికి వాయవ్యాన 14 కి.మీ.ల దూరంలో ఉంది. కొండపల్లి కలపతో తయారుచేసే బొమ్మలకు పెట్టింది పేరు. "పొనికి" అనే తేలికయిన చెక్కమీద లక్కపూతతో అందమయిన రంగులలో ఈ బొమ్మలను తయారుచేస్తారు. గ్రామాలలోని జీవన శైలిని, పురాణ గాథలలోని పాత్రలను, జంతువులను, పక్షులను, పండ్లను, కాయగూరలను, మొదలైనవాటిని వర్ణిస్తూ తయారవుతాయి. ఏడవ శతాబ్దంలో నిర్మించిన మూడు అంతస్తుల కోటను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ కోట ఎన్నో రాజ వంశాల పాలనలో ఉండేది. అంతేకాదు, ఇది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడింది. బ్రిటిషు పాలకులు తమ సైన్యానికి రక్షణలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కోటను వాడుకునేవారు. వనవిహారానికి ఇది చాలా అనువైనది.[5]

విక్టోరియా మ్యూజియం[మార్చు]

పురావస్తు శాఖవారి మ్యూజియము. బందరు రోడ్డులో ఉంది. ఇందులో విగ్రహాలు, వర్ణచిత్రాలను భద్రపరచారు. ఇక్కడ రాతి యుగానికి చెందినవిగా భావిస్తున్న ఎన్నో రాతి పనిముట్లను కూడా ఉన్నాయి. ఇక్కడ అల్లూరు నుంచి తెచ్చిన బ్రహ్మాండమయిన బుద్ధుని నల్లరాతి (గ్రానైటు) విగ్రహము, ఇంకొక పాలరాతి విగ్రహము ఉన్నాయి. ఇవి మూడు లేదా నాలుగవ శతాబ్దమునకు చెందినవిగా భావిస్తున్నారు.[6]

అమరావతి[మార్చు]

  • ఇది విజయవాడకు 68 కీ.మీ.ల దూరంలో కృష్ణా నది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నపట్టణం. అమరావతి దక్షిణభారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బౌద్ధారామం. క్రీ.పూ. మూడు లేదా రెండవ శతాబ్దాలలో ఆచార్య నాగార్జునుడు ఇక్కడ అతిపెద్ద స్థూపాన్ని నిర్మించాడు. కల్నలు మెకెన్జీ 1797లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన పురావస్తు అవశేషాలు చాలావరకు మద్రాసు, కోల్కతాలలో ఉన్న మ్యూజియంలలో భద్రపరిచారు. ఇక్కడి ప్రాంతంవారు దీనిని దీపాల దిన్నె అని పిలిస్తారు. ఇక్కడ ఒక పురావస్తు మ్యూజియం ఉంది. అందులో అప్పటి నాణేలు, గాజులు, బోధి వృక్షం యొక్క శిల్పాలు, విరిగిన కమ్మీలు మొదలయినవాటిని చూడవచ్చు.

మతపరమైన పర్యాటకం[మార్చు]

దేవాలయాలు[మార్చు]

కనకదుర్గ అమ్మవారి దేవాలయం[మార్చు]

విజయవాడ – కనక దుర్గ అమ్మ వారి దేవాలయం
కనక దుర్గ అమ్మ వారి దేవాలయం
కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువున్న అలయం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.


శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (పాత శివాలయం)ఇంద్ర కీలాద్రి పాదాల చెంత ఉన్న శివాలయం కనుక పాద(త) శివాలయం అని పేరు ఈ ఆలయం ధర్మరాజు గారిచే ప్రతిష్ఠ చేసిన ఆలయం 1000 స్తంభాల ఆలయం అని కూడా పురాణంలో తెలియచేసి ఉన్నది మల్లేశ్వర స్వామి అనుగ్రహం వలన ఇక్కడ కనక వర్షం కురిసింది అని కూడా శాసనం ఉన్నది


మరకత రాజరాజేశ్వరీ దేవాలయం - పటమట[మార్చు]

ఆధునిక యుగంలో అపురూపమైనశిల్పకళతో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో (పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమారు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002లో గణపతి సచ్చిదానంద స్వామీజీచే ఈ గుడి కుంభాభిషేకం, ప్రతిష్ఠ జరుపబడింది.

వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం - లబ్బీపేట[మార్చు]

  • విజయవాడలో పేరుగాంచిన దేవాలయం. ఇందిరా గాంధీ స్టేడియం దగ్గరగా ఉంది. బెంజి సర్కిల్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • ఇది బందరు రోడ్డులో ఉంది. విజయవాడలో 3 ముఖ్యమయిన రోడ్లు మర్చిపోకూడనివి. 1 - ఏలూరు రోడ్డు, 2 - బందరు రోడ్డు, 3 - 5వ నంబరు రూట్ రోడ్డు. వేంకటెశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే, బందరు రోడ్డులో, పశువుల ఆస్పత్రి దగ్గరనుంచి వెళ్ళాలి.

ఆంజనేయస్వామి వారి దేవాలయం - మాచవరం[మార్చు]

ప్రసన్న గణపతి దేవాలయం - పటమట[మార్చు]

త్రిశక్తి పీఠం[మార్చు]

విజయవాడ కొత్త బస్టాండు దగ్గరగా ఉంది. శ్రీ మహా సరస్వతి దేవిని ఆవాహన చేశారు.

రామలింగేశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు[మార్చు]

స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉంది. బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉందీ విజయవాడలో పేరుగాంచిన దేవాలయము.శీవిరాత్రి పర్వదినాన ఘనంగా స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజు జరిగే ఉత్సవాలులో ఉ౦డే ప్రభలు చుడడానికి చుట్టుపక్కల గ్రామాల ను౦చే గాక రాష్ర్ట౦ నలుమూలల ను౦చి జన౦ వస్తారు.

నరసింహస్వామి ఆలయం[మార్చు]

  • విజయవాడకు దక్షిణాన 12 కి.మీ.ల దూరములో ఉన్న మంగళగిరిలో ఈ ఆలయము ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒకటైన నరసింహ స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది, అదేమిటంటే, భక్తులు ఎంత పానకం సమర్పించినా అందులో సగం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. ఈ ఆలయమును 14వ శతాబ్దములో నిర్మించారు, మరల 17, 18వ శతాబ్దాలలో నమూనాను మార్చారు. ఆలయానికి వెలుపల రథాకారములో ఉన్న గరుక్మంతుని కోవెల ఉంది.

సత్యనారాయణస్వామి ఆలయం[మార్చు]

  • ఇది గాంధీ నగర్లో ఉంది. సత్యనారాయణ స్వామి పేరు మీద ఎన్ని ఆలయాలున్నా, ఈ ఆలయం విజయవాడ వాసులకు ఒక తీర్థం లాంటిది.

హ్రీంకార తీర్థ (జైనుల ఆలయం)[మార్చు]

  • మంగళగిరిలో ఉన్న ఇంకో ఆకర్షణ ఈ జైన దేవాలయం. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని జైన ఆలయాలలోకి ఇదే అతి పెద్దదని ప్రతీతి. ఈ ఆలయము కళాఖండాలకు పెట్టింది పేరు.

చర్చీలు[మార్చు]

గుణదల మేరీమాత చర్చి[మార్చు]

  • విజయవాడకు తూర్పున ఉన్న ఈ చర్చఇని 1925లో రెవ.ఆర్లాటిగారు - గుణదలలోని సెయింట్‌ జోసెఫ్ అనాధాశ్రయంలో అప్పటి అధికారి - ఇక్కడ మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, తరువాత చర్చీని నిర్మించారు. 1971లో దీనిని పవిత్రపరిచారు. ఇప్పుడు మేరీ మాత చర్చీగా ప్రసిద్ధి చెందింది. ప్రతీ సంవత్రరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. దానిని వేల సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారు.

మసీదులు[మార్చు]

హజరత్‌బల్ మస్జిద్ (విజయవాడ) / హజరత్‌బల్‌ మసీదు[మార్చు]

  • విజయవాడలో ఈ మస్జిద్ (మసీదు) మతపరమయిన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో ఇంకోటి. ఇక్కడ ఉన్న మహమ్మదు ప్రవక్త యొక్క పవిత్రమయిన కేశాన్ని సంవత్సరానికి ఒకసారి చూపిస్తారు. ఈ పండుగలో ముస్లిమేతరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

సమీప దేవాలయాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Gandhi Hill". vijayawadaonline. Archived from the original on 4 జూలై 2014. Retrieved 4 June 2014.
  2. 2.0 2.1 2.2 "Tourism in Vijayawada". aptdc.gov.in. Archived from the original on 29 జూన్ 2014. Retrieved 4 June 2014.
  3. "Mogalarajapuram Caves". vijayawadaonline. Archived from the original on 4 జూలై 2014. Retrieved 4 June 2014.
  4. "Undavalli Caves". ecoindia. Retrieved 4 June 2014.
  5. "Kondapalli Fort". indiantravels. Archived from the original on 6 జూన్ 2014. Retrieved 4 June 2014.
  6. "Victoria Jubilee Museum". myvijayawada. Archived from the original on 6 జూన్ 2014. Retrieved 4 June 2014.

వెలుపలి లంకెలు[మార్చు]