సీసము (పద్యం)

వికీపీడియా నుండి
(సీస పద్యము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (సా.శ.850 సం) లో చూశారు. అంతకు ముందే ఎన్నో సవంత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. ఈ పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఇచ్చారు.

సీస పద్యం వరుస

[మార్చు]

"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..

ఈ పద్యంలో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే "గునుగు సీసం" కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా. కొమర్రాజు లక్ష్మణరావు నన్నయ యుగానికి చెందిన ద్రాక్షారామంలోని సీసపద్యశాసనాన్ని ప్రకటించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రకటించిన దీర్ఘసీసపద్యశాసనం మరొకటి నన్నయ కాలం నాటిదే అయివున్నది.[1]

ఉదాహరణ 1:

[మార్చు]

కలుగడే నాపాలి కలిమి సందేహింప
గలిమిలేములు లేక కలుగువాడు;
నా కడ్డపడ రాడె నలి న సాధువులచే
బడిన సాధుల కడ్డపడెడువాడు
చూడడే నా పాటు జూపుల జూడక
చూచువారల గృపజూచువాడు;
లీలతో నా మొఱాలింపడే మొఱగుల
మొఱ లెఱుంగుచు దన్ను మొఱగువాడు;

లక్షణములు

[మార్చు]

క.
నల నగ సల భ ర త ల లో
పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం
బులఁ దగి నాలుగు పదములఁ
జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా !

  • పాదముల సంఖ్య = 4
  • ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.
  • ప్రతి పాదంలోనూ 6 ఇంద్ర గణాలు, + 2 సూర్య గణాలు కలిపి మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి.
  • ఈ పద్యాలు పెద్దవి కావడం చేత ప్రతి పాదాన్నీ రెండు భాగాలుగా చూపుతారు.
  • ఈ నాలుగు పాదాలకూ చివర ఆటవెలది కానీ, తేటగీతి గానీ ఉండవలెను, ఇది తప్పనిసరి.
  • ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
  • రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.
  • మూడు నాలుగూ... ఐదూ ఆరు... ఏడు ఎనిమిది.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..
  • ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.


  • యతి
    • 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ,
    • 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ మైత్రి కుదరాలి.
    • ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
  • ప్రాసయతి ఉండ వచ్చు.
    • అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే).
    • ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక

ప్రాస

[మార్చు]

ప్రాస నియమం లేదు.

ఉదాహరణ 2:

[మార్చు]

వరధర్మకామార్థ వర్జితకాములై
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతి బొందుదురు? చేరి కాంక్షించువారి క
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?
రానందవార్ది మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియు గోరక
భద్రచరిత్రంబు బాడుచుందు?

ఉదాహరణ 3:

[మార్చు]

సీసపద్యం ఎట్లా ఉండాలనేది ఒక ఆటవెలది పద్యంలో ఈ విధంగా చెప్పబడింది.


ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు
పాదపాదమందు పల్కుచుండు
ఆటవెలదినైన తేటగీతియు నైన
చెప్పవలయు మీద సీసమునకు


సీస పద్యాన్ని ఒకేలాగా ఉండే నాలుగు పెద్ద పాదాలుగా కాని (1,1,1,1), ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1,2,1,2,1,2,1,2) - మొత్తం ఎనిమిది పాదాలుగా - గాని వివరించవచ్చు. సీస పద్యంలో భాగం కాకపోయినా, సీస పద్యం తరువాత ఒక గీత పద్యం ("ఆటవెలది" లేదా "తేటగీతి") వస్తుంది.

  1. ఒక పెద్ద పాదంలో వరుసగా 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వస్తాయి.
  2. ప్రాస నియమం లేదు.
  3. యతి: 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోను, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోను మైత్రి కుదరాలి.
  4. ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే)

ఈ అచ్చ తెనుగు పద్యరీతులలో కచ్చితమైన గణాలు చెప్పకపోవటం వల్ల అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలు) ఒకే లయలో ఉండనవసరం లేదు. కాని వీటి లయను గుర్తించడం అంత కష్టం కాదు. పద్యాలు పైకి చదువుతుంటే లయ దానంతటదే అవగతం అవుతుంది.

ఉదాహరణ
సీసము
తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి
కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ?
కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి?
లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి?
ఆటవెలది
మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక?
బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు

సర్వలఘు సీసము

[మార్చు]

నవవికచసరసిరుహనయన నిజయుగచరణ గగనచరనదిజనిత నిగమవినుత ఙలధిసుతకుశకలశ లలితమృగమదరుచిర

మూలాలు

[మార్చు]
  1. ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Retrieved 7 December 2014.