హిప్పోక్రేట్స్
హిప్పోక్రటిస్ (ప్రాచీన గ్రీకు) | |
---|---|
జననం | క్రీ.పూ. 460 కోస్, గ్రీసు |
మరణం | క్రీ.పూ. 370 లారిస్సా, గ్రీసు |
జాతీయత | గ్రీసు |
రంగములు | శరీర ధర్మ శాస్త్రము,వైద్య శాస్త్రము |
పరిశోధనా సలహాదారుడు(లు) | డెమోక్రటిస్ |
ప్రసిద్ధి | పైద్యవేత్త.శరీర స్వభావ విజ్ఞానమూర్తి |
హిప్పోక్రేట్స్ లేదా హిప్పోక్రేట్స్ ఆఫ్ కోస్-2 (ఆంగ్లం : Hippocrates of Cos II or Hippokrates of Kos) (క్రీ.పూ. 460 – 370 BC) - (ప్రాచీన గ్రీకు: పాలీటోనికి - Ἱπποκράτης ) ; ఇతను ప్రాచీన గ్రీకు పెరికల్స్ యుగానికి చెందిన వైద్యుడు, వైద్య చరిత్రలో ప్రముఖ, ప్రసిద్ధమైన పేరు గలవాడు. ఇతనికి "వైద్యశాస్త్ర పితామహుడు" అనే బిరుదు గలదు.[1][2][3] ఇతను "హిపోక్రటీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్" స్థాపించి వైద్యశాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు, ప్రపంచం ఇతడిని ఈ గౌరవం ప్రసాదించింది. ఈ వైజ్ఞానిక పాఠశాల ప్రాచీన గ్రీకు వైద్యవిజ్ఞానంలో విశేషాత్మక మార్పులను తీసుకొచ్చింది. ప్రాచీన గ్రీకుదేశంలో సాంప్రదాయక శాస్త్రాలతో (ముఖ్యంగా థియర్జీ, తత్వశాస్త్రం తో) వైద్యశాస్త్రం ముడిపడి యుండేది, తదనుగుణంగా వైద్యవృత్తి నిర్వహింపబడేది.[4][5]
బాల్యం-విద్యాభ్యాసం
[మార్చు]ఈయన గ్రీసుకు దగ్గరగా ఉన్న కాస్ ద్వీపంలో క్రీ.పూ 460 లో జన్మించాడు. తండ్రి హేరాక్లెడెస్, తల్లి ఫైనరెటి బాల్య దశలో తండ్రి వద్దనుండి వైద్య విద్యను నేర్చుకున్నాడు. తరువాత గొప్ప మేధావిగా కీరించబడే డెమోక్రటిస్ వద్ద ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఏథెన్స్ వెళ్ళి వైద్య విద్య సాధన, శోధన మొదలు పెట్టాడు. సోక్రటీసు యొక్క శిష్యుడైన ప్లేటో హిప్పోక్రటిస్ గురించి చాలా గొప్పగా వ్రాసాడు. గొప్ప వైద్య వేత్త అనీ, శరీర స్వభావ విజ్ఞానమూర్తి అనీ ప్రశంశించాడు.
భావనలు
[మార్చు]రోగాన్ని గురించి తెలుసుకోవడమే కాదు, రోగి లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. రోగం ఏదో నిర్ణయించి ముందు రోగికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. రోగి వయస్సు, చేసే పని, ఉండే స్థలం, కుటుంబ చరిత్ర తెలియాలి. పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తే సగం రోగం మాయమపుతుంది. రోగిలో విశ్వాసం కలుగుతుంది. ఆ తరువాతే అసలైన చికిత్స ప్రారంభమవ్వాలి --- అదీ హిప్పోక్రటిస్ భావన. దీనిని కాదనేవారు ఎవరైనా ఉన్నారా? దైవాధీనం అనటం అర్థంలెని విషయమన హెచ్చరించినవాడు కూడా హిప్పోక్రటిస్సే!
అభిప్రాయాలు
[మార్చు]శారీరక ద్రవాల శీతోష్ణ స్థితిని బట్టి రోగుల మానసిక, శారీరక స్వభావాలు ఆధారపడి ఉంటాయని అతని అభిప్రాయం.ఆ తరువాత క్లాటి బెర్నాడ్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త శ్లేష్మం, పిత్తం వంటి శారీరక ద్రవాల పాత్ర ఎంతో ఉందని హిప్పోక్రటిస్ చెప్పిన మూడు శతాబ్దాల తర్వాత ఋజువు చేశాడు.
గ్రంధములు
[మార్చు]హిప్పోక్రటిస్ కు ఎముకల గురించి, కండరాలగురించి, నరాల గురించి, రక్త నాళాల గురించి ఎంతో తెలుసు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈయన రాసిన "ఎములు విరుగుట,బెణుకుట" అనే గ్రంథమే, అలెగ్జాండ్రియా గ్రంథాలయంలో 3 వ శతాబ్దంలో పొందపరచిన హిప్పోక్రటిస్ వ్రాత ప్రతులు వైద్య ప్రపంచానికి తలమానికాల వంటివి. ఈ వ్రాత ప్రతుల సంపుటిలో రమారమి 87 గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు కొన్ని శతాబ్దాల వరకు వైద్య విజ్ఞాన వేత్తలందరికీ శిరోధార్యంగా ఉండెడెవి.
వైద్య శాస్త్రమునకు చేసిన సేవలు
[మార్చు]హిప్పోక్రేట్స్, అతని శిష్యగణం, అనేక రకాల రోగులను వారి రోగాలను, వాటి నివారణోపాయాల కొరకు వైద్యవిధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. చేతివేళ్ళ క్లబ్బింగ్ చేయుటలో ఇతను మొదటి సారిగా సఫలీకృతుడయ్యాడు, దీర్ఘకాలిక రోగాలైన ఊపిరితిత్తుల కేన్సర్, సయానోటిక్ గుండె జబ్బు లను నిర్ధారించుటలోనూ, వాటికొరకు వైద్యవిధానాలను రూపొందించాడు. చేతివేళ్ళను జోడించడంలో సఫలుడైనందు వలన ఈ వేళ్ళను "హిప్పోక్రటిక్ ఫింగర్స్" అనికూడా వ్యవహరిస్తారు.[6] హిప్పోక్రటిక్ ముఖం (ఇదోరకం జబ్బు) గురించి ప్రోగ్నోసిస్లో మొదట ప్రస్తావించిందీ, ప్రకటించిందీ ఇతనే.[7][8]
సమాజ సేవ
[మార్చు]హిప్పోక్రటిస్ సామాజిక సేవ తత్పరుడు. మూర్ఖపు ఆచారాలను దుయ్య బట్టే వాడు. ఈయన వృత్తి ధర్మాలు, నీతి నియమాలు పేర్కొంటూ ఒక గ్రంథం కూడా రాసాడు. ఇప్పటికీ వైద్య విద్యార్థులు హిప్పోక్రటిస్ ప్రమాణాన్ని చేస్తున్నారు. పాటించాలి కూడా
- "నేను నా ప్రమాణాన్ని మనస్ఫూర్తిగా పాటించినచో దైవము నాకు శాశ్వత కీర్తి ప్రసాదించును గాక,
- అట్లు గాక నేను నా ప్రమాణాన్ని ఏ కొంచెమైననూ ఉల్లంఘించినచో నాకు తగిన శాస్తి జరుగును గాక"
ఇలా ఆయన ప్రమాణం చేయడంలో ఎంత సంస్కారం ఉన్నదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముగింపు
[మార్చు]ఈయన క్రీ.పూ 370 లో థెస్సాలీ అనే చోట 90 యేండ్ల వయస్సులో మరిణించాడు.గిర్టాన్, లరిస్సా అనే ప్రాంతాల మధ్య ఈయనకు సమాధి కట్టబడింది.ఈ సమాధి మీద తేనెపట్టు వెలసింది. రోగ గ్రస్థులు ఈ తేనెను త్రాగితే స్వస్థత పొందే వారట. ఇది నమ్మినా నమ్మక పోయినా హిప్పోక్రటిస్ సిద్ధాంతాలు నమ్మితే మాత్రం రోగాలేవీ దరి చేరలేవు. "జీవితం స్వల్పం, వైద్యకళ అనంతం. ఈ కళ ద్వారా మానవ సేవ చేయటమే మహాభాగ్యం" అన్న ఆయన మాటలు మరపురానివి. మరువలేనివి.ము
మూలాలు
[మార్చు]- ↑ Useful known and unknown views of the father of modern medicine, Hippocrates and his teacher Democritus., U.S. National Library of Medicine
- ↑ Hippocrates Archived 2009-10-29 at the Wayback Machine, Microsoft Encarta Online Encyclopedia 2006. Microsoft Corporation.
- ↑ Strong, W.F.; Cook, John A. (July 2007), "Reviving the Dead Greek Guys", Global Media Journal, Indian Edition, ISSN: 1550-7521, archived from the original on 2007-12-07, retrieved 2009-01-13
- ↑ Garrison 1966, p. 92–93
- ↑ Nuland 1988, p. 5
- ↑ Schwartz, Richards & Goyal 2006
- ↑ Singer & Underwood 1962, p. 40
- ↑ Margotta 1968, p. 70
బాహ్య లంకెలు
[మార్చు]- Adams, Francis (1891), The Genuine Works of Hippocrates, New York: William Wood and Company.
- Boylan, Michael (2006), Hippocrates, Internet Encyclopedia of Philosophy [September 28 2006].
- Britannica Concise Encyclopedia (2006), Soranus of Ephesus, Encyclopædia Britannica, Inc. [December 17 2006].
- Encyclopedia Britannica (1911), HIPPOCRATES, Encyclopedia Britannica, Inc. [October 14 2006].
- Garrison, Fielding H. (1966), History of Medicine, Philadelphia: W.B. Saunders Company.
- Shah, J. (2002), "Endoscopy through the ages", BJU International, vol. 89, no. 7.
- Singer, Charles & Underwood, E. Ashworth (1962), A Short History of Medicine, New York and Oxford: Oxford University Press, Library of Congress ID: 62-21080.
- Smith, William (1870), Dictionary of Greek and Roman Biography and Mythology, Boston: Little, Brown, and Company [December 23 2006]
- ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
- ప్రపంచ ప్రసిద్ధులు
- శాస్త్రవేత్తలు
- AC with 17 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- క్రీ.పూ. 460 జననాలు
- క్రీ.పూ. 370 మరణాలు
- ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు
- గ్రీకు శాస్త్రవేత్తలు