90ఎంఎల్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
90ఎంఎల్
90ఎంఎల్ సినిమా పోస్టర్
దర్శకత్వంశేఖర్‌రెడ్డి యెర్ర
రచనశేఖర్‌రెడ్డి యెర్ర
నిర్మాతఅశోక్ రెడ్డి గుమ్మకొండ
తారాగణం
ఛాయాగ్రహణంజె. యువరాజు
కూర్పుఎస్.ఆర్. శేఖర్
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
కార్తికేయ క్రియేటీవ్ వర్క్స్
విడుదల తేదీs
6 డిసెంబరు, 2019
సినిమా నిడివి
159 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్8.3 కోట్లు
బాక్సాఫీసు18 కోట్లు

90ఎంఎల్, 2019 డిసెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. కార్తికేయ క్రియేటీవ్ వర్క్స్ బ్యానరులో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాకు శేఖర్‌రెడ్డి యెర్ర దర్శకత్వం వహించాడు. ఇందులో కార్తికేయ గుమ్మకొండ, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో నటించగా,[1] అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు. అశోక్ రెడ్డి 2018లో ఆర్‌ఎక్స్ 100 అనే సినిమాను నిర్మించాడు.[2][3]

నటవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఆర్‌ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి, కార్తికేయను కలవడానికి శేఖర్ రెడ్డికి సహాయం చేశాడు.[4] టెలివిజన్ నటి నేహా సోలంకి హీరోయిన్ గా, రవి కిషన్, సత్య ప్రకాష్, రాపర్ రోల్ రైడా ఇతర పాత్రల్లో నటించడానికి అంగీకరించారు.[5][6] అజర్‌బైజాన్లో మూడు పాటలు చిత్రీకరించారు. 2019 సెప్టెంబరులో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది.[7] ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కారణంగా మీడియా కవరేజీ వచ్చింది.[8][9] అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. రోజూ తాగవలసిన వ్యాధి ఉన్న తాగుబోతు పాత్రలో కార్తికేయ నటించాడు.[10] సెప్టెంబరు 21న టీజర్ విడుదలయింది.[11] అక్టోబరు 20న ట్రైలర్ విడుదలయింది.[12] ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకావాల్సి ఉంది, అయితే కొన్ని దృశ్యాలను తొలగించమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, నిర్మాతలను కోరడంతో సినిమా డిసెంబరు 6న విడుదలయింది.[13][14]

పాటలు

[మార్చు]

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు.[15]

స్పందన

[మార్చు]

దక్కన్ క్రానికల్ పత్రిక ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చింది. "90ఎంఎల్ చెడ్డ పానీయం లాంటిది" అని రాసింది.[20] టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది. "సన్నివేశాలు ఏవీ ఒకదానితో ఒకటి మిళితం కాలేదు, ఈ సినిమా యాదృచ్ఛిక సన్నివేశాల కలయికలాగా అనిపిస్తోంది" అని రాసింది. "కార్తికేయ ప్రధాన పాత్రలో నటించడం కొంత ప్రశంసనీయం అయితే, మొత్తంగా ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు" అని తెలంగాణ టుడే పత్రిక రాసింది.[21]

మూలాలు

[మార్చు]
  1. Krishna, Murali (28 November 2019). "The ladies man". The New Indian Express. Retrieved 26 January 2021.
  2. "Karthikeya's 90 ML Movie Review & Rating". www.thehansindia.com. 6 December 2019.
  3. TV9 Telugu, TV9 (6 December 2019). "Karthikeya Latest movie review: Karthikeys's 90 ML movie review- 90ఎంఎల్ రివ్యూ.. కిక్ ఏ మేరకు ఎక్కిందంటే..!". TV9 Telugu. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Chowdhary, Y. Sunita (19 November 2019). "Telugu film '90 ML' has no connection to Oviya's Tamil film, says Shekar Reddy". The Hindu.
  5. "Kartikeya's 90ML TRAILER: Struggles of an Authorized Drinker to win his love - Times of India". The Times of India.
  6. "Kartikeya and Neha Solanki's '90 ML' has a release date! - Times of India". The Times of India.
  7. "Kartikeya's next is the 'authorised drinker' in '90ML' - Times of India". The Times of India.
  8. "90ml flows into Azerbaijan". Deccan Chronicle. 19 October 2019.
  9. "Concept poster of actor Kartikeya's next with the makers of RX 100 is intriguing - Times of India". The Times of India.
  10. Adivi, Sashidhar (1 December 2019). "90 ML does not preach about alcohol: Kartikeya Gummakonda". Deccan Chronicle.
  11. "Kartikeya's 90ML teaser to be released soon - Times of India". The Times of India.
  12. "90ML Teaser: Katikeya's character seems to be a high-functioning alcoholic - Times of India". The Times of India.
  13. "Kartikeya Gummakonda's 90ML release postponed to December 6 - Times of India". The Times of India.
  14. "Censor troubles for 90ML? - Times of India". The Times of India.
  15. "90ML Movie Review {2/5}: Kartikeya deserved better!". The Times of India.
  16. "Watch: Telugu Song Video 'Singilu Singilu' from '90ML' Ft. Kartikeya and Neha Solanki | Telugu Video Songs - Times of India". timesofindia.indiatimes.com.
  17. "'Yinipinchukoru' song promo from '90 ML' released - Times of India". The Times of India.
  18. "Natho Nuvvunte Chalu from 90ML - Times of India". The Times of India.
  19. "'వెళ్లిపోతుందే..' ఎమోషనల్ సాంగ్." Samayam Telugu.
  20. Kavirayani, Suresh (December 8, 2019). "90ML movie review: 90ML is a bad drink, after all". Deccan Chronicle.
  21. Kumar, P Nagendra. "90 ML, fails to give a high!". Telangana Today.

బయటి లంకెలు

[మార్చు]