ఆంధ్ర క్రైస్తవ కళాశాల
ఎ సి కాలేజ్ | |
లాటిన్: Collegium Andhra Christianus | |
నినాదం | మీరు సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం మీకు స్వేచ్ఛను కలిగిస్తుంది. |
---|---|
రకం | కళాశాల |
స్థాపితం | 1885 |
ఛాన్సలర్ | అధ్యక్షుడు, ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చి (AELC) |
ప్రధానాధ్యాపకుడు | డాక్టర్ పి ముత్యం |
చిరునామ | Sambasivapet, Guntur 522 001, India, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం 16°17′47.8″N 80°26′33.1″E / 16.296611°N 80.442528°E |
కాంపస్ | పట్టణ |
అనుబంధాలు |
|
జాలగూడు | http://www.accollegeguntur.com/ |
ఆంధ్ర క్రైస్తవ కళాశాల అన్నది భారతదేశంలోని పురాతన కళాశాలలో ఒకటి, ఇది 1885లో ప్రారంభించబడింది. ఆంధ్రా క్రైస్తవ కళాశాల ప్రొటెస్టంట్ చర్చిల విద్యా సంస్థ యొక్క భాగం. ఈ కళాశాల ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విద్యార్థులను అనుమతించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీలను ప్రధానం చేస్తుంది, ఈ కళాశాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. సెయింట్ జార్జ్ ఈ కళాశాలకు పోషకుడిగా ఉండేవాడు. ఈ కళాశాల ప్రవేశ ద్వారం వద్ద ఈయన విగ్రహం ఉంటుంది. ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చి ద్వారా ఎన్నుకోబడిన అధికారులు ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు.
చరిత్ర
[మార్చు]1885లోనే గుంటూరులో తొలి కళాశాల, భారతదేశంలో తొలి పాశ్చాత్య కళాశాలల్లో ఒకటి అయిన ది అమెరికన్ ఇవాంజికల్ లూథరన్ మిషన్ కళాశాల స్థాపించారు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాయానికి అనుబంధంగా మారేవరకూ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇది పనిచేసేది. 1928లో దీన్ని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల (ఏ.సి.కాలేజి) గా పేరు మార్చారు.[1]
ఈ కళాశాల అందిస్తున్న కోర్సులు
[మార్చు]ఇంటర్మీడియట్
[మార్చు]ప్రీ-యూనివర్సిటీ లేదా ఇంటర్మీడియట్ కోర్సులు ఈ కళాశాలచే అందించబడుతున్నాయి. ఈ కళాశాల ఆంధ్ర ప్రదేశ్లో పూర్వ-విశ్వవిద్యాలయ కోర్సుల (పియుసి) కోసం నియంత్రణ అధికారమున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్కు అనుబంధంగా ఉంది.
ఈ కళాశాలయందు అందుబాటులో ఉన్న కోర్సు కలయికలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
- మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
- చరిత్ర, ఎకనామిక్స్, కామర్స్
- పౌరశాస్త్రం, ఎకనామిక్స్, కామర్స్
గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లు
[మార్చు]- బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A.)
- బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (B.Sc.)
- బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com.)
పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లు
[మార్చు]- మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (M.A) ఆంగ్లము, చరిత్ర
- మాస్టర్ ఆఫ్ సైన్స్ (M.Sc.) కెమిస్ట్రీ, జువాలజీ
ఈ కళాశాలలో చదివిన ప్రముఖులు
[మార్చు]చలనచిత్రరంగం
నాటకరంగం
సాహిత్యం
- జంధ్యాల పాపయ్య శాస్త్రి - పుష్ప విలాపం వ్రాసిన కవి
- కుందుర్తి ఆంజనేయులు - వచన కవి. ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపకుడు.
- నరిశెట్టి ఇన్నయ్య
రాజకీయరంగం
- భవనం వెంకట్రామ్
- కాసు బ్రహ్మానందరెడ్డి
- ఎన్.జి.రంగా
- నందమూరి తారక రామారావు
- ఎస్.వి.ఎల్.నరసింహారావు
- యడ్లపాటి వెంకట్రావు
- జేసుదాసు సీలం
వేదాంతశాస్త్రం
- Rev. Dr. P. Victor Premasagar
- Rev. Dr. B. V. Subbamma[2]
- Rev. Dr. Dass Babu[3]
- Rev. Dr. N. V. Luther Paul[4]
షూటింగ్ లలో
[మార్చు]తెలుగులో తీసిన హాస్య ప్రధాన చిత్రం పిల్లజమీందార్ను ఈ కళాశాలలో షూటింగ్ చేశారు, అయితే ఈ సినిమాలో మంగమ్మ స్మారక కళాశాల (మంగమ్మ మెమోరియల్ కాలేజ్), సిరిపురం అనే పేరుతో చూపించారు.
మూలాలు
[మార్చు]- ↑ ఐ., ప్రసాదరావు. సహాయ నిరాకరణోద్యమంలో గుంటూరు జిల్లా పాత్ర. p. 11.
- ↑ The Story of Serampore and its College [1] Archived 2003-10-22 at the Wayback Machine IVth edition 2006, Appendix VI, pp. 177-179
- ↑ "Rev. Dr. Dass Babu is a disciple of Premasagar". Archived from the original on 2007-10-08. Retrieved 2015-02-01.
- ↑ Dr. Luther Paul presently heads a Seminary in Hyderabad Andhra Christian Theological College
ఇవి కూడా చదవండి
[మార్చు]- Luther Richardson, Kolluri Rev. (2003). "Towards Self-Reliance : A historical survey of the programmes and efforts of Andhra Evangelical Lutheran Church from 1927-1969, Published by Christopher and Kanakaiah, Vijayawada".
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - Senftleben, Martin (1992). "Influences of Hinduism on Christianity in Andhra Pradesh. Unpublished Ph.D. thesis, Sri Venkateshwara University, Tirupati" (PDF). I. Archived from the original (PDF) on 2008-12-09. Retrieved 2015-02-01.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - _______________, (1992). "Influences of Hinduism on Christianity in Andhra Pradesh. Unpublished Ph.D. thesis, Sri Venkateshwara University, Tirupati" (PDF). II. Archived from the original (PDF) on 2008-12-09. Retrieved 2015-02-01.
{{cite journal}}
:|author=
has numeric name (help); Cite journal requires|journal=
(help)CS1 maint: extra punctuation (link)