గోలాఘాట్
గోలాఘాట్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°31′N 93°58′E / 26.52°N 93.97°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
ప్రాంతం | ఎగువ అసోం |
జిల్లా | గోలాఘాట్ |
సెటిల్ | 20వ శతాబ్దం |
ఏర్పాటు | 1839 జిల్లా |
ఏకీకృతం | 1987[2] |
Government | |
• Type | మున్సిపల్ కౌన్సిల్ |
• Body | గోలాఘాట్ పురపాలక సంస్థ |
• కమీషనర్ | ధిరేన్ హజరికా |
విస్తీర్ణం | |
• Total | 7.32 కి.మీ2 (2.83 చ. మై) |
Elevation | 95 మీ (312 అ.) |
జనాభా (2011) | |
• Total | 60,782 |
• జనసాంద్రత | 8,303.55/కి.మీ2 (21,506.1/చ. మై.) |
Demonym | గోలాఘాటియన్ |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్[3] | 5 ప్రాంతాలు
|
ప్రాంతపు కోడ్ | +91-3774 |
ISO 3166 code | IN-GG |
Vehicle registration | ఏఎస్ – 05 – XX – XXXX |
అసెంబ్లీ నియోజకవర్గం | పురపాలక సంస్థ |
వాతావరణం | సెమీ-అరిడ్ (కొప్పెన్) |
†India Post delivery offices. |
గోలాఘాట్, అసోం రాష్ట్రంలోని గోలాఘాట్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. రాష్ట్రంలోని అతిపెద్ద ఉపవిభాగాలలో ఒకటైన ఈ పట్టణం 1987, అక్టోబరు 5న పూర్తిస్థాయి జిల్లా ప్రధాన కార్యాలయంగా[4] ఒక నగరంగా, [5] పురపాలక సంఘంగా, పరిపాలనా కార్యకలాపాల స్థానంగా 55 కి.మీ దూరంలో ఉన్న జోర్హాట్ పట్టణానికి జంట నగరంగా ఉంది.[6][7] అస్సాంలోని పురాతన పట్టణ ప్రాంతాలలో ఇది ఒక పట్టణం.[8][9] బ్రహ్మపుత్రా నది ఉపనదులలో ఒకటైన ధన్సిరి ఈ పట్టణం మీదుగా వెళుతోంది. ఇది పట్టణ వాసులకు ప్రధాన నీటి వనరుగా ఉపయోగపడుతోంది.[10]
1839 నుండి 182–183 సంవత్సరాలకు పైగా పురాతన ఉపవిభాగానికి ప్రధాన కార్యాలయంగా ఉన్న అస్సాంలోని తొలి పట్టణ కేంద్రాలలో ఇది ఒకటి. 1920లో స్థానిక ప్రభుత్వ సంస్థ గోలాఘాట్ పురపాలక సంస్థ స్థాపించబడింది. 1876నాటికే గోలాఘాట్ పట్టణంలో పోస్టు/మెయిల్ సర్వీస్, టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. అస్సాం పురాతన సామాజిక - సాహిత్య సభకు చెందిన గోలాఘాట్ సాహిత్య సభ 1918లో ఇక్కడ ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రధాన నాటక సంస్థలలో ఒకటైన గోలఘాట్ అమెచ్యూర్ థియేటర్ సొసైటీ 1895లో స్థాపించబడింది. 1891లో స్థాపించబడిన గోలాఘాట్ బార్ అసోసియేషన్ (జిబిఎ), అస్సాంలోని పురాతన న్యాయ సంఘాలలో ఒకటి.
పద వివరణ
[మార్చు]20వ శతాబ్దం మధ్యలో ప్రస్తుత గోలాఘాట్ సమీపంలోని ధన్సిరి నది ఒడ్డున మార్వారీ వ్యాపారవేత్తలు స్థాపించిన దుకాణాల నుండి గోలాఘాట్ (గోలా అంటే షాప్, ఘాట్ అంటే నది ఫెర్రీ లేదా పడవలకు ఆవరణ) పదం వచ్చింది.[11] అహోమ్ రాజ్యయుగంలో, స్థానికంగా గోలా అని పిలువబడే ఫిరంగి బంతులను నిల్వచేసే కేంద్రం ఉంది, అవన్ని స్థానిక ఫెర్రీ ఘాట్ ద్వారా రవాణా చేయబడ్డాయి. దీని నుండి గోలఘాట్ అనే పేరు వచ్చింది.[12]
భౌగోళికం
[మార్చు]26°31′N 93°58′E / 26.52°N 93.97°E అక్షాంశరేఖాంశాల మధ్య ఈ గోలాఘాట్ పట్ణణం ఉంది.[13] దీని సగటు ఎత్తు 95 మీటర్లు (311 అడుగులు) గా ఉంది.
జనాభా
[మార్చు]2001 జనాభా లెక్కల ప్రకారం, గోలాఘాట్ జనాభా 33,021 గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 53 శాతం పురుషులు, 47 శాతం స్త్రీలు ఉన్నారు. జనాభాలో 11 శాతం మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 82% కాగా, జాతీయ సగటు 59.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ పురుషుల అక్షరాస్యత 84 శాతం, స్త్రీ అక్షరాస్యత 79 శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, గోలాఘాట్ పట్టణంలో స్త్రీ పురుష నిష్పత్తి 1000:884 గా ఉంది. జిల్లాలో అత్యధిక గృహ-పరిశ్రమ కార్మికులు 4.98 శాతం ఉన్నారు.
రవాణా
[మార్చు]విమానయానం
[మార్చు]గోలఘాట్ సమీపంలో రౌరియా విమానాశ్రయం ఉంది.
రైలుమార్గం
[మార్చు]బెట్ మహల్ వద్ద గోలఘాట్ రైల్వే స్టేషన్ ఉంది. రోజువారీ, వారపు రైళ్ళు ఫుర్కేటింగ్ జంక్షన్ ద్వారా దేశంలోని ఇతర నగరాలకు నడుస్తున్నాయి.
రోడ్డుమార్గం
[మార్చు]అస్సాంలోని అన్ని నగరాలు, పట్టణాలకు రహదారి మార్గాల ద్వారా ఈ గోలఘాట్ పట్టణం కలుపబడి ఉంది. జాతీయ రహదారి 39 (ఎన్‌హెచ్ 39) నుమాలిగ నుండి మొదలై దాని నైరుతి మూలలో గోలాఘాట్‌ను కలుస్తుంది. రాష్ట్ర రహదారి-1 ధోదర్ అలీ గోలాఘాట్ గుండా వెళుతుంది.
చిత్రమాలిక
[మార్చు]-
Doss & Co., CIRCA 1930
-
Christian High School, ESTD 1919
-
British Cemetery, ESTD 1876
-
Bezbaruah H.S. School, ESTD 1886
-
Baptist Church, ESTD 1898
-
Golaghat Gymkhana ESTD 1910
-
Circuit House, CIRCA 1900
-
Stone plaques of Deopahar Ruins, AD 900
-
Queen's Arts & Cultural Complex
మూలాలు
[మార్చు]- ↑ Swati Mitra (2011). Assam Travel Guide. Goodearth Publications. p. 106. ISBN 9789380262048.
- ↑ Brief History of The District, page12 (PDF). Directorate of Census Operations. 16 June 2014.
- ↑ "Find Pin Code". Department of Posts. Retrieved 18 November 2020.
- ↑ Brief History of The District, page12 (PDF). Directorate of Census Operations. 16 June 2014. Retrieved 18 November 2020.
- ↑ " "Central Pollution Control Board (CPCB), Ministry of Environment & Forests". Government of India. August 2014.[permanent dead link]
- ↑ "Assam Hooch tragedy: Death toll rises to 124, over 300 undergoing treatment". The Financial Express. 2019-02-23. Retrieved 18 November 2020.
- ↑ "'Want to Give BJP a Chance': Assam's Tea Tribes Back Modi". The Quint. 2019-04-03. Retrieved 18 November 2020.
- ↑ K. M. Mittal (1921). Report on the Administration of North East India.
- ↑ Rinku Manta; Dr. Jnanshree Borah (2005). "Urbanisation and Growth of Small Towns in Assam, India" (PDF). Archived from the original (PDF) on 2020-10-26. Retrieved 2020-11-18.
- ↑ Milli, Nitashree; Acharjee, Shukla; Konwar, M. (September–December 2013). "Impact of Flood and River Bank Erosion On Socio-economy: A Case Study of Golaghat Revenue Circle of Golaghat District, Assam". Geography. International Journal of Geology, Earth & Environmental Sciences. III (3): 180–185. ISSN 2277-2081.
- ↑ "Brief History of The District, page9" (PDF). Directorate of Census Operations. October 2011. Retrieved 18 November 2020.
- ↑ Sharma, Anil Kumar (2007). Quit India Movement In Assam. Mittal Publications. ISBN 978-81-8324-242-4.
- ↑ Falling Rain Genomics, Inc – Golaghat