తల్లే చల్లని దైవం
తల్లే చల్లని దైవం (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.ఎస్.గోపీనాథ్ |
తారాగణం | మురళీమోహన్, ప్రభ, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, రాజబాబు, నగేష్ |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | రాజేశ్వరి చిత్ర కంబైన్స్ |
భాష | తెలుగు |
తల్లే చల్లని దైవం ఎం.ఎస్.గోపీనాథ్ దర్శకత్వంలో ఎం.రాధాదేవి, బి.కృష్ణమూర్తి రాజేశ్వరి చిత్ర కంబైన్స్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1978, ఫిబ్రవరి 9న విడుదల అయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- మురళీమోహన్ - రఘునాథరావు
- ప్రభ - సీత
- ప్రభాకర రెడ్డి
- అల్లు రామలింగయ్య
- రాజబాబు
- నగేష్
- కె.వి.చలం
- గిరిబాబు
- త్యాగరాజు
- రావి కొండలరావు
- భీమరాజు
- అర్జా జనార్ధనరావు
- సురేంద్ర
- సత్తిబాబు
- చిట్టిబాబు
- మోదుకూరి సత్యం
- చిడతల అప్పారావు
- జి.వరలక్ష్మి - అన్నపూర్ణమ్మ
- విజయలలిత
- మమత
- హలం
- అపర్ణ
- సునందిని
- కల్పనా రాయ్
- బేబీ రోహిణి - సురేష్
- ముక్కామల
- సాక్షి రంగారావు
- గిరిజ
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: ఎం.ఎస్.గోపీనాథ్
- మాటలు: కృష్ణమోహన్
- పాటలు: సి.నారాయణ రెడ్డి, కొసరాజు, రాజశ్రీ
- సంగీతం: టి.చలపతిరావు
- కూర్పు: ఇ.వి.షణ్ముగం
- నృత్యాలు: చిన్ని - సంపత్
- కళ: బి.ఎన్.కృష్ణ
- స్టంట్స్: రాఘవులు
- ఛాయాగ్రహణం: జి.కె.రాము
- నిర్మాతలు: ఎం.రాధాదేవి, బి.కృష్ణమూర్తి
కథ
[మార్చు]లక్షాధికారి ఐన రఘునాథరావు తన తల్లి అన్నపూర్ణమ్మను ప్రాణప్రదంగా చూసుకునేవాడు. ఆమెను తన భార్య సీత హత్యచేసిందనే నేరంతో నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటివేశాడు. అప్పటికి ఆ దంపతులకు సురేష్ పది సంవత్సరాల కొడుకు ఉన్నాడు. ఇంటి నుండి గెంటి వేయబడిన సీతకు రాముడు భీముడు అనే ఇద్దరు అమాయకులు తోడయ్యారు. ఇంతలో రఘునాథరావు తన కొడుకు సురేష్ ఆలనాపాలనా చూసుకోవడానికి ఒక ఆయా కోసం పేపర్‌లో ప్రకటన ఇస్తాడు. అది చూసి సీత నర్సు వేషంలో వచ్చి ఆయాగా చేరుతుంది. సురేష్ ఆయా వేషంలో ఉన్న తల్లిని గుర్తు పడతాడు. తల్లీబిడ్డలిద్దరూ ఒకర్నొకరు ఆనందభాష్పాలతో పరామర్శించుకుంటారు. నర్సు సంరక్షణలో సురేష్ చక్కని క్రమశిక్షణలో చదువుకుంటున్నాడని రఘునాథరావు మురిసిపోయాడు. అప్పుడప్పుడు ఆ యింట్లో నర్సు తన ఉనికిని మరిచిపోయి సీతలాగే తన భర్తకు ఇష్టమైనవి అమర్చిపెట్టేది. మొదట్నుంచీ ఇది గమనిస్తూ వచ్చిన రఘునాథరావుకు నర్సుపై సందేహం కలిగి ఆవిడ్ని ప్రశ్నించేవాడు. ఆమె తడబడుతూ ఉంటే సమయానికి సురేష్ వచ్చి ఏదో చెప్పి ఆపద్బాంధవుడిలా ఆమెను విషమపరిస్థితి నుండి రక్షించేవాడు. ఒక అర్ధరాత్రి నర్సు బిరబిరా గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. నిద్రపోతున్న సురేష్ లేచి తన తల్లిని సమీపించి ఆవిడ్ని తన ఒళ్ళో పడుకోబెట్టి ఓదారుస్తూ "ఈ తల్లే చల్లని దైవం ఈ ఇల్లే అనురాగ మందిరం" అంటూ తన నాయనమ్మ ఉండే రోజుల్లో అందరూ పాడుకునే పాటను పాడాడు. మేడ మీద గదిలో మానసిక సంక్షోభంలో సతమతమౌతున్న రఘునాథరావు ఈ పాట విని తనూ పాట అందుకుని పాడుతూ సురేష్, నర్సు ఉన్న గదిలోకి ప్రవేశిస్తాడు. సురేష్‌ను దగ్గరకు తీసుకుని ఎంతో ఆప్యాయతతో గుండెలకు హత్తుకుంటాడు. సురేష్ కూడా పాడుతూ తల్లిదండ్రులిరువురి చేతులు కలుపుతాడు. నిజంగానే తన భర్త తనను క్షమించి చేరదీసుకోబోతున్నాడనే ఆనందంలో నర్సు వేషంలో ఉన్న సీత చివరిసారిగా "నా జీవితం కలకాలం మీ సేవకే అంకితం" అని పాడుతూ భర్త పాదాలపై వాలుతుంది. రఘునాథరావు తన భార్యను ఎంతో ప్రేమతో లేవనెత్తి, ఒక్కసారిగా అంతవరకూ తానాడిన నాటకం బయటపెట్టి రాక్షసీ అంటూ ఆవిడను కొట్టి ఇంటిలోనించి బయటికి గెంటివేస్తాడు. బయటికి గెంటి వేయబడిన సీత ఎక్కడికి వెళ్ళింది? ఎవరి రక్షణ కోరింది? తల్లి కోసం అలమటించిపోతున్న సురేష్ పరిస్థితి ఏమిటి? తల్లిని చూడగలిగాడా? రాముడు భీముడు అనే అమాయకులు ఎవరు? ఎక్కణ్ణించి వచ్చారు? వాళ్ళు సాధించిన ఘనకార్యాలు ఏమిటి? సీత రఘునాథరావు మళ్ళీ కలుసుకున్నారా? మొదలైన ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.[2]
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలకు టి.చలపతిరావు సంగీతాన్ని సమకూర్చాడు.[2]
క్ర.సం. | పాట | రచయిత | గాయనీగాయకులు |
---|---|---|---|
1 | అందగాడా శ్యామల్ శ్యామల్ అందుకోరా కోమల్ కోమల్ | సినారె | పి.సుశీల, వి.రామకృష్ణ, జి. ఆనంద్ |
2 | ఈ తల్లే చల్లని దైవం ఈ ఇల్లే అనురాగ మందిరం నా జీవితం కలకాలం మీ సేవకే అంకితం | సినారె | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
3 | రా... రా... రావోయి మస్తాను నువ్వంటే పడి చస్తాను అడిగావంటే అంతే చాలు ఏదైనా సరే ఇస్తాను మస్తాను | కొసరాజు | పి.సుశీల |
4 | చెలినిగని నిజమిదనీ తెలుపుమ ఓ జాబిలీ నిరతమని తలచిన ప్రేమ సుధా వాహినీ | రాజశ్రీ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, విజయలక్ష్మీ శర్మ, ఎల్.ఆర్.అంజలి |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Thalle Challani Dhaivam (M.S. Gopinath) 1978". ఇండియన్ సినిమా. Retrieved 5 December 2022.
- ↑ 2.0 2.1 ఈశ్వర్ (1978). Thalle Challani Dhaivam (1978)-Song_Booklet (1 ed.). విజయవాడ: రాజేశ్వరి చిత్ర కంబైన్స్. p. 12. Retrieved 5 December 2022.
బయటిలింకులు
[మార్చు]- 1978 తెలుగు సినిమాలు
- ప్రభ నటించిన సినిమాలు
- మురళీమోహన్ నటించిన సినిమాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- నగేష్ నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- త్యాగరాజు నటించిన సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- రోహిణి నటించిన సినిమాలు
- విజయలలిత నటించిన సినిమాలు
- హలం నటించిన సినిమాలు
- కల్పనా రాయ్ నటించిన సినిమాలు
- ముక్కామల నటించిన సినిమాలు
- సాక్షి రంగారావు నటించిన సినిమాలు
- టి.చలపతిరావు సంగీతం అందించిన సినిమాలు