ధుబ్రి
ధుబ్రి | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°01′N 90°00′E / 26.02°N 90°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
Government | |
• Body | ధుబ్రి పురపాలక సంస్థ |
• వార్డుల సంఖ్య | 16 |
విస్తీర్ణం | |
• Total | 31.5 కి.మీ2 (12.2 చ. మై) |
• Water | 4.9 కి.మీ2 (1.9 చ. మై) |
• Rank | 8వ (అసోం) |
జనాభా (2011) | |
• Total | 63,338 |
• Rank | 8వ (అసోం) |
భాషలు | |
• అధికారిక | బెంగాళీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 783301 |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్-17 |
Website | http://dhubri.gov.in/ |
ధుబ్రి, అసోంలోని ధుబ్రి జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. ఈ పట్టణం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఉంది. 1883లో బ్రిటిష్ పాలనలో ఈ పట్టణం పురపాలక సంస్థగా ఏర్పడింది. ఈ పట్టణం అసోం రాష్ట్ర రాజధాని డిస్పూర్ కు పశ్చిమాన నుండి 277.4 కి.మీ. (172 మైళ్ళు) దూరంలో ఉంది.
జనపనారకు ఈ పట్టణం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ పట్టణం ఓడరేవును కలిగి ఉంది. ఈ పట్టణానికి మూడు వైపులా బ్రహ్మపుత్ర, గదధర్ నదులు ఉండడంవల్ల దీనిని నదుల భూమి అని పిలుస్తారు.[1]
భౌగోళికం
[మార్చు]ధుబ్రి 89.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 26.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉంది. ఇది సముద్రమట్టానికి 34 మీటర్లు (110 అడుగుల) ఎత్తులో ఉంది. ధుబ్రి మూడు వైపులా నదులతో ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] ధుబ్రి జనాభా 63,388 మంది ఉండగా, ధుబ్రి- గౌరిపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో జనాభా 1,22,400 గా ఉంది. ఈ జనాభాలో పురుషులు 51% మంది, స్త్రీలు 49% మంది ఉన్నారు. ధుబ్రి సగటు అక్షరాస్యత రేటు 74% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 79% గా, స్త్రీ అక్షరాస్యత 68%గా ఉంది. ధుబ్రి జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. జనాభాలో 75% ముస్లింలతో ఉన్న ఈ పట్టణం భారతదేశంలోని మైనారిటీ జిల్లాలలో ఒకటి.
వీరిలో ఎక్కువమంది మియా, కోచ్-రాజ్‌బోంగ్షి ప్రజలు ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా అస్సామీ, గోల్పారియా, బెంగాలీ భాషలో మాట్లాడుతారు.
సంస్కృతి & పండుగలు
[మార్చు]ప్రతి ఏటా డిసెంబరు నెలలో 50,000 మందికిపైగా హిందువులు, సిక్కులు, ముస్లింలు ఒక చారిత్రాత్మక మందిరంలో కలుస్తారు. గురు తేగ్ బహదూర్ బలిదానానికి గుర్తుగా ఇది డిసెంబరు 3న ప్రారంభమవుతుంది.
పర్యాటకం
[మార్చు]ధుబ్రిలో ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. పచ్చని పొలాలు, నీలి కొండలు, కొండలతో కూడిన బ్రహ్మపుత్ర నది ఒడ్డు ఆకర్షణీయంగా ఉంటాయి. గురుద్వారా తేగ్ బహదూర్ షైబ్జీ, రంగమతి మసీదు, మహామయ ధామ్, చక్రసిల వన్యప్రాణుల అభయారణ్యం, మాటియాబాగ్ హవా మహల్, సత్రశాల్ ధామ్, పంచ్ పీర్ దర్గా, ఇతర రాజభవనాలు వంటి ప్రత్యేకమైన నిర్మాణాలు, మత పవిత్రత, పౌరాణిక ప్రాముఖ్యత గల ప్రాంతాలు ఉన్నాయి.
రాజకీయాలు
[మార్చు]ధుబ్రి పట్టణం ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[3]
మీడియా
[మార్చు]ధుబ్రిలో ఆల్ ఇండియా రేడియో రిలే స్టేషను ఉంది. దీనిని ఆకాశవాణి ధుబ్రి అని పిలుస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ "Priceless heritage gets funds to survive". The Telegraph. Calcutta. 13 October 2007. Retrieved 21 November 2020.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 21 November 2020.
- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 21 November 2020.