Jump to content

నగ్మా

వికీపీడియా నుండి
నగ్మా
జననం
నందిత అరవింద్ మొరార్జీ

(1974-12-25) 1974 డిసెంబరు 25 (వయసు 49)
ఇతర పేర్లునగ్మా సదనాహ్
వృత్తినటి, రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు1990—2007
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
బంధువులురోషిణి (half-sister)
జ్యోతిక (half-sister)
తరుణ్‌పర్సి (half-sister)
వెబ్‌సైటుhttps://vipbhojpuri.com/

నగ్మా (జ.1974 డిసెంబరు 25) భారతీయ రాజకీయ నాయకురాలు, సినిమా నటి. ఆమె జన్మనామం నందిత అరవింద్ మొరార్జీ. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలలో కథానాయకిగా నటించింది. ఆమె ఘరానా మొగుడు, కథలన్, భాషా మొదలైన సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.[1] ఆమె బాలీవుడ్లో తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి భారీ సినిమాలలో నటించింది. ఆమె వివిధ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, బోజ్‌పురి, పంజాబీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించింది.[2]


ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె తండ్రి అరవింద్ "ప్రతాప్‌సింహ్ మొరార్జీ" జైసల్మేర్ రాజరిక నేపథ్యం గల పూర్వీకులు గల కుటుంబానికి చెందినవాడు. తరువాత వారు గుజరాత్ లోని పోర్‌బందర్, ముంబయి లకు వలస వెళ్లారు. ఆమె తాతమ్మ గోకుల్‌దాస్ మొరార్జీ వ్యాపారవేత్త. ఆమెకు షిప్పింగ్, వస్త్ర, వ్యవసాయ, ఫార్మాసిటికల్ పరిశ్రమలు ఉండేవి.

నగ్మా తల్లి మహారాష్ట్రకు చెందిన కొంకణ్ ప్రాంతానికి చెందినది. ఆమె కాజీ స్వాత్రంత్రోద్యమకారుల కుటుంబానికి చెందినది. ఆమె అసలు పేరు షమా కాజీ కానీ ఆమె "సీమ"గా సుపరిచితురాలు. ఆమె 1969లో మొరార్జీని ముంబైలోని సి.సి.ఐ క్లబ్ లో వివాహమాడింది. కానీ ఆమె 1974లో విడిపోయిందని నగ్మా పాస్ పోర్టు ఆధారంగా తెలుస్తుంది. నగ్మా జన్మనామం నందిత అరవింద్ మొరార్జీ. తరువాత ఆ పేరును "నగ్మా అరవింద్ మొరార్జీ"గా మార్చుకుంది. ఆమె బాల్యనామం నందిత. 1974 ఆగస్టులో నగ్మా తల్లి మొరార్జీతో విడాకులు తీసుకున్న తరువాత చందన్ సదనాహ్ తో మరల వివాహం చేసుకుంది. అతడు సినిమా నిర్మాత. అతడిని ముగ్గురు కుమార్తెలున్నారు. వారు రోషిణి , జ్యోతిక.

నగ్మా తన తండ్రితో 2005 డిసెంబరు 31న అతడు మరణించే వరకు సన్నిహితంగా ఉండేది. ఆమె ముబై రిపోర్టరుతో " నేను గౌరవమైన కుటుంబానికి చెందినదానినని గర్వపడుతున్నాను. నా తల్లి చట్టపరంగా నా తండ్రి అయిన శ్రీ అరవింద్ మొరార్జీని ముంబైలోని సి.సి.ఐ క్లబ్ లో వివాహం చేసుకుంది." అని తెలిపింది. నగ్మా తల్లి ఆమెను సినిమా నటి కావడానికి ప్రోత్సాహాన్ని అందించింది.[3]

ఆమెకు గల వ్యాపార నేపథ్య ప్రేరణతో ఆమె ముంబయిలోని బాంద్రా వెస్ట్ లో "నగ్మాస్" అనే పేరుతో దుస్తుల వ్యాపారాన్ని సెప్టెంబరు 2000 లో స్థాపించి అక్షయ్ కుమార్ చే ప్రారంభోత్సవం చేయించింది.[4]

ఆమె ప్రారంభించిన వస్త్ర దుకాణం విజయవంతమైనప్పటికీ, ఆమె 2003 దానిని మూసివేసింది. ఆమె అనారోగ్యంతో కూడిన తండ్రి పక్కనే ఉండవలసి వచ్చింది. అదే సమయంలో ఆమె ఆధ్యాత్మిక తపనతో భోజ్‌పురి, ఇతర భాషా చిత్రాలలో పనిచేసింది. ఆమె ఆర్ట్ ఆఫ్ లివింగ్ గూర్చి బోధించేది.[5] ప్రస్తుతం ఆమె క్రిస్టియన్.[6]

సినిమా జీవితం

[మార్చు]

నగ్మా సినిమా ప్రస్థానాన్ని హిందీ సినిమా "బాగీ: ఎ రెబల్ ఆఫ్ లవ్" చిత్రంతో ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె సల్మాన్ ఖాన్ తో నటించింది. ఈ సినిమా 1990 లో అత్యధిక వసూళ్ళు చేసిన ఏడవ చిత్రంగా గుర్తింపు పొందింది.[7] ఆమె కరిష్మా కపూర్తో పాటు 1994లలో అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్ లతో కలసి "సుహాగ్" చిత్రంలో నటించింది. ఈ చిత్రాల తరువాత తన స్నేహితురాలైన దివ్యభారతి కోరిక మేరకు ఆమె దక్షిణాదికి వెళ్ళి తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. ఆమె మాట్లాడుతూ "భాష ఎప్పుడూ నటనకు అవరోధం కాదు. సాహసం , సంస్కృతిని నేను ఇష్టపడుతున్నాను , భారతీయ సంప్రదాయంపై గొప్ప గౌరవం కలిగి ఉన్నాను." అని పేర్కొంది.

ఆమె తెలుగు చిత్రసీమలో 1992లో చిరంజీవితో ఘరానా మొగుడు, అక్కినేని నాగార్జునతో అల్లరి అల్లుడు, నందమూరి తారక రామారావు,మంచు మోహన్ బాబు లతో మేజర్ చంద్రకాంత్ చిత్రాలలోనటించింది. ఆమె తమిళంలో రజినీకాంత్తో "భాషా", 1994లో ప్రభుదేవాతో "కదలన్" చిత్రాలలోనటించింది.

తిరిగి ముంబై వచ్చిన తరువాత 2001 లో ఒక ఇంటర్వ్యూలో ఆమె " తమిళంలో నెంబర్ ఒన్ నటిగా నేను ఒత్తిడి ఎదుర్కొన్నాను. నేను చేస్తున్న చిత్రాల రకానికి నేను అసంతృప్తిగా ఉన్నాను. నటీమణుల నుండి ప్రేక్షకులు ఆశించిన అంశాలు చేయమనే డిమాండ్ వలన నేను కోరుకున్న నటనను నేను చేయలేకపోయాను. కనుక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను." అని తెలిపింది.[8]

తరువాత ఆమె హిందీ చిత్ర సీమలో 2000లో "చల్ మేరే బాయీ" వంటి చిత్రాలలో సహాయనటిగా నటించింది. ఒక యేడాది లోపు ఆమె ఆధ్యాత్మిక ఆధారితమైన "ఆర్ట్ ఆఫ్ లివింగ్" కోర్సులో చేరింది.[9]

ముంబైలో ఉండగా ఆమె తెలుగు, తమిళ సినిమాలలో నటనను కొనసాగించింది. ఆమె అల్లరి రాముడు,, "సిటిజన్" వంటి చిత్రాలలో నటించింది. అదే విధంగా మలయాళ చిత్రాలలో ప్రధాన పాత్రలను పోషించింది. ఆమె బోజ్‌పురి చిత్రాలలో కూడా నటించింది. వాటిలో "బిగ్ బాస్" కార్యక్రమంలో పాల్గొన్న "రవికిషన్"తో నటించింది. ఆమె నటించిన భోజ్ పురి చిత్రం "దుల్హా మిలాల్ దిల్దార్"లో ఆమె నటనకు గానూ 2005 భోజ్ పురి ఫిలిం పురస్కారాలలో ఉత్తమ నటి పురస్కారాన్నిపొందింది. ఆమె భోజ్‌పురిలో చేసిన మొదటి చిత్రం "పండిత్‌జీ బటాయిన బియాహ్ కబ్ హోలీ" హిట్ అయినది.[10]

2006లో ఆమె పంజాబ్ సినీ పరిశ్రమలో ప్రవేశించి రాజ్ బబ్బర్ తో కలసి "ఏక్ జింద్ ఏక్ జాన్" చిత్రంలో నటించింది. 2017, 2018 సంవత్సరాలకు ‘టీఎస్‌ఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’లో నగ్మాకు లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు వచ్చింది.

రాజకీయ రంగం

[మార్చు]

ఆమె భారత జాతీయ కాంగ్రెస్కు మద్దతుదారు అయినందున న్యూఢిల్లీలో ఆమె పార్టీలోనికి చేరింది. "లౌకికవాదం , పేద , బలహీన వర్గాల సంక్షేమం వైపు నిబద్ధత" నే నినాదం ప్రేరణతో ఆమె ఆ పార్టీలోనికి చేరినట్లు తెలిపింది.[11] ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీసు రిపోర్టు ప్రకారం ఆమె సర్వత్రిక ఎన్నికలలో హైదరాబాదు లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసినట్లు తెలుస్తుంది.[11]

రాజీవ్ గాంధీని ప్రశంసించడానికి కాంగ్రెస్ పార్టీలోనికి మొట్టమొదట చేరి సహాయాన్నందించినట్లు ఆమె తెలిపింది.[12]

2006 లో ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబ చరిత్ర, రాజకీయ ప్రవేశానికి గల సంబంధం గురించి ఈ విధంగా తెలిపింది: "నా తల్లి ముస్లిం, తండ్రి హిందువు. మేము అన్ని మతాలను గౌరవిస్తూ పెరిగాము. సామాజిక హక్కులు మమ్మల్ని బాధించాయి. అందువల్ల ఏమైనా చేద్దామనుకున్నాను. కనుక రాజకీయాలలోనికి చేరాను." ఆమె అనేక చలన చిత్రాలలో నటించడానికి జరిగిన ఒప్పందాల కారణంగా 2003 లో భారతదేశ లోక్‌సభకు పోటీ చేయటానికి తిరస్కరించింది. "పార్లమెంటు సభ్యుడిగా ఉండాలని నేను కోరుకుంటే, నా నియోజకవర్గానికి 100 శాతం కృషిచేయాల్సి ఉంటుంది - ఆ సమయములో నాకు అది సాధ్యం కాలేదు." అని పేర్కొంది.[13]

2009 లో జనరల్ లోక్‌సభ ఎన్నికలకు ఆమె తన సీటు కోసం తీవ్రమైన వివాదాలను ఎదుర్కొంది. ఇది ముంబై నుంచి స్టార్ న్యూస్ లో కూడా హైలైట్ చేయబడింది.

నగ్మా నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Hindu : Nagma plays mother". Hinduonnet.com. Archived from the original on 2011-06-06. Retrieved 2018-04-27.
  2. "டோடோவின் ரஃப் நோட்டு". டோடோவின் ரஃப் நோட்டு. Archived from the original on 2010-01-31. Retrieved 2018-04-27.
  3. "For Indophiles and Those Who Crave Bollywood". I Crave Bollywood. Archived from the original on 2013-07-29. Retrieved 2013-08-17.
  4. ""Akshay inaugurates Nagma's boutique"". Archived from the original on 2008-12-24. Retrieved 2018-04-27.
  5. "Ganguly?s career was at stake, so we parted: Nagma". Rediff.com.
  6. REJOICE FOR INDIA (14 July 2017). "Hindi Christian Testimony by Nagma (Bollywood Actress)- 2017" – via YouTube.
  7. [1] Archived 7 ఏప్రిల్ 2007 at the Wayback Machine
  8. Filmfare interview, May 2001 "Clean Bowled – Match-fixing... and much more with Nagma" at [2] Archived 2007-10-13 at the Wayback Machine
  9. "Nagma practices the art of living!" ApunKaChoice.com (19 April 2003) at Cinema/20030419-0.html[permanent dead link][నమ్మదగని మూలం?]; and "Venky and Nagma's Art of Living!" at [3] Archived 2006-05-27 at the Wayback Machine
  10. ZeeNews.com "Racism, controversies forced Nagma to quit Hindi Cinema" (15 March 2007) [4]; and IndiaInfo.com (IANS), "Racism, controversies forced Nagma to quit Hindi Cinema" (16 March 2007) [5] Archived 2007-03-28 at the Wayback Machine
  11. 11.0 11.1 ""Film actress Nagma joins Congress" Indo-Asian News Service (16 April 2004)". Yahoo.com. Archived from the original on 6 మే 2006. Retrieved 27 ఏప్రిల్ 2018.
  12. "See, e.g., "Government office for Nagma?" (10 Nov. 2006) at". Archived from the original on 2007-05-28. Retrieved 2018-04-27.
  13. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; You need అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  14. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 February 2019). "మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?". www.andhrajyothy.com. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నగ్మా&oldid=3721430" నుండి వెలికితీశారు