నవరంగపూర్
నవరంగపూర్ నబరంగ్‌పూర్ |
|
---|---|
— పట్టణం — | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Odisha |
జిల్లా | నవరంగపూర్ |
జనాభా (2011) | |
- మొత్తం | 36,945 |
భాషలు | |
- Official | ఒరియా |
Time zone | IST (UTC+5:30) |
PIN | 764059 |
Telephone code | 06858 |
Vehicle registration | OD 24 |
నవరంగపూర్ ఒడిషా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలోని పట్టణం. ఇది నవరంగపూర్ జిల్లాకు ప్రధాన కేంద్రం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
భౌగోళికం, శీతోష్ణస్థితి
[మార్చు]నవరంగపూర్ 19.23 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.55 డిగ్రీల తూర్పు రేఖాంశాల వద్ద ఉంది. ఇది సముద్ర మట్టానికి 582 మీటర్ల ఎత్తులో ఉంది.
ఒడిశాలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే నవరంగపూర్‌లో కూఝ్డా ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి ఉంటుంది. వర్షాకాలం ప్రధానంగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలలో ఉంటుంది. వర్షాలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్నంత ఎక్కువగా ఉండవు, ఒక మోస్తరు వర్షపాతం వస్తుంది.
నవరంగపూర్‌లో వేసవికాలం కొద్దిగా వేడిగా, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉంటుంది. వేసవి నెలలలో సగటు ఉష్ణోగ్రత 31.0 °C ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 24.9 °C, గరిష్ఠ ఉష్ణోగ్రత 37.1 °C ఉంటుంది. శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రత సుమారు 19.2 °C, కనిష్ఠ ఉష్ణోగ్రత 12 °C, గరిష్ఠ ఉష్ణోగ్రత 26.5 °C ఉంటుంది.
జనాభా
[మార్చు]2011 జనగణన ప్రకారం, నవరంగపూర్ జనాభా 36,945. ఇందులో పురుషులు 49.53% కాగా, స్త్రీలు 50.47% ఉంటారు.
నవరంగపూర్ సగటు అక్షరాస్యత 82.4%. ఇది జాతీయ సగటు 74.0% కంటే ఎక్కువ.
రవాణా సౌకర్యాలు
[మార్చు]నవరంగపూర్ పత్తణం రోడ్డు మార్గం ద్వారా మాత్రమే అనుసంధానించబడి ఉంది.
రహదారి దూరాలు
[మార్చు]- భువనేశ్వర్ నుండి - 580 కి.మీ.
- విశాఖపట్నం నుండి - 280 కి.మీ
- రాయ్‌పూర్ నుండి - 320 కి.మీ
సమీప రైల్వే స్టేషన్లు
[మార్చు]- జైపూర్ - 40 కి.మీ
- కోరాపుట్ - 66 కి.మీ
- కేసింగ ౧౭౦ కి.మీ
సమీప విమానాశ్రయాలు
[మార్చు]- భువనేశ్వర్ నుండి - 580 కి.మీ
- విశాఖపట్నం నుండి - 280 కి.మీ
- రాయ్‌పూర్ నుండి - 320 కి.మీ