అక్షాంశ రేఖాంశాలు: 16°47′N 80°51′E / 16.78°N 80.85°E / 16.78; 80.85

నూజివీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 16°47′N 80°51′E / 16.78°N 80.85°E / 16.78; 80.85
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండలంనూజివీడు మండలం
విస్తీర్ణం
 • మొత్తం31.69 కి.మీ2 (12.24 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం58,590
 • జనసాంద్రత1,800/కి.మీ2 (4,800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1012
ప్రాంతపు కోడ్+91 ( 8656 Edit this on Wikidata )
పిన్(PIN)521201 Edit this on Wikidata
Websitehttp://www.talk2nuzvid.com Edit this on Wikidata

నూజివీడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లా లోని ఒక ముఖ్య పట్టణం. మామిడి తోటలకు, వీణలకు ప్రసిద్ధి.

చరిత్ర

[మార్చు]
దస్త్రం:APtown Nuzividu 1.JPG
నూజివీడు సెంటర్

పూర్వం రాజుల పరిపాలనలో ఈ పట్టణం ఉండేది. నూజివీడు రాజుల కోట నుండి విజయనగర ఆస్థానం వరకు ఒక సొరంగం ఉండేది.అది ప్రస్తుతం కరెంటు ఆఫీసుగా ఉన్న రాజుల కోటకు ఆగ్నేయంగా ఉండేది.ఈ కోట కోడిగుడ్డు సొన, మినుప పిండి, సున్నం వేసి నిర్మించారు. తరువాత ఆ కోటలో ఆ.ప్ర సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలగా ఏర్పాటు చేసింది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా కేంద్రమైన ఏలూరుకు వాయవ్యంగా 32 కి.మీ దూరంలో ఉంది. విజయవాడకి 50 కి.మీ దూరములో ఉంది. సముద్రమట్టానికి 28 మీ. ఎత్తు.[2]

జనగణన వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం జనాభా 58,590.

పరిపాలన

[మార్చు]

నూజివీడు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

విజయవాడ, ఏలూరు నుండి రహదారి వ్యవస్థ ఉంది. సమీప రైల్వేస్టేషన్ ఏలూరులో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]
  • ఐ.ఐ.ఐ.టి నూజివీడు:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, వై.యస్.రాజశేఖర రెడ్డిచే పేద విద్యార్థుల కోసం స్థాపింపబడిన ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ గాంధీ సాంకేతిక వైఙ్ఞానిక విశ్వవిద్యాలయం.
  • దర్మా అప్పారావు కాలేజీ:- ప్రతి యేడూ డీఏఆర్ కాలేజీలో బాస్కెట్ బాల్ పోటీలు, బాయ్స్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ పోటీలు చాలా పెద్ద స్థాయిలో జరుగుతాయి.
  • కృష్ణ యునివర్శిటీ ఉన్నత విద్యా కేంద్రం
  • సారథి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
  • శ్రీ దత్తాత్రేయ యోగ, వ్యాయామ పాఠశాల

దర్శనీయ ప్రదేశాలు

[మార్చు]
  1. కుక్కల గేటు, గుర్రం గేటు: నూజివీడు జమీందారులచే నిర్మించబడినవి
  2. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరస్వామివారి ఆలయం: గొడుగువారిగూడెంలో వున్నది
  3. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయం: బస్సుస్టాండ్ రహదారిలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
  4. కోట శివాలయం: డి.ఏ.ఆర్.రహదారిపై ఉన్నది
  5. శ్రీ ధన్వంతరీస్వామివారి ఆలయం: నూజివీడు పట్టణ శివారులలో ఉన్నది
  6. సరస్వతి దేవాలయం: ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు సరస్వతీదేవి ఆలయాలు మాత్రమే వున్నవి, ఒకటి బాసర అయితే రెండవది నూజివీడు.

ఉత్పత్తులు

[మార్చు]

నూజివీడు మామిడి తోటలకు బాగా పేరున్న ప్రదేశం. పలు వందల రకాల మామిడి పళ్ళు ఇక్కడ లభించును. ప్రసిద్ధి చెందిన "నూజివీడు చిన్న రసం" పళ్ళకు నూజివీడు పుట్టినిల్లు.

నూజివీడు వీణలు

[మార్చు]

పట్టణంలోని వెంకటేశ్వర కోవెల ప్రాంతములో వీణల తయరీ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ తయారుచేసిన వీణలకు, దేశంలోనే కాదు విదేశాలలో గూడా ప్రాచుర్యం ఉంది. రాజులకాలంలో ప్రారంభించిన వీణల తయారీదారులు ఇప్పటికీ తమ వృత్తిని కొనసాగించుచున్నారు. సరస్వతి, మయూర, విపంచి, డ్రాగన్, ఫోల్డింగ్, గోటు, మధుర వీణల తయారీలో షేక్ మాబు షేక్ మీరాసాహెబ్ నిష్ణాతులు. ఈ తండ్రీకొడుకులు రూపొందిన వీణలను ప్రముఖ వీణ చిట్టిబాబు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం భవన్నారాయణ, డాక్టర్ పినాకపాణి, శ్యాంసుందర్ వంటి విద్వాంసులు తమ కచేరీలకు కొనుగోలు చేసేవారు.

నూజివీడు పట్టణ ప్రముఖులు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "onefivenine.com/india/villages/Krishna/Nuzvid/Nuzvid". Retrieved 20 June 2016.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నూజివీడు&oldid=4086803" నుండి వెలికితీశారు