పెద్దకొత్తపల్లి మండలం
పెద్దకొత్తపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
పెద్దకొత్తపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°17′59″N 78°22′23″E / 16.29971°N 78.372917°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | పెద్దకొత్తపల్లి |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 267 km² (103.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 56,461 |
- పురుషులు | 28,853 |
- స్త్రీలు | 27,608 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 34.31% |
- పురుషులు | 45.72% |
- స్త్రీలు | 22.16% |
పిన్కోడ్ | 509412 |
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 44 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొల్లాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. ఈ మండలం మామిడి తోటలకు ప్రసిద్ధి. జిల్లాలోనే అత్యధికంగా ఈ మండలంలో మామిడి తోటలున్నాయి.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 56,461 - పురుషులు 28,853 - స్త్రీలు 27,608. అక్షరాస్యుల సంఖ్య 23614.[3]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 267 చ.కి.మీ. కాగా, జనాభా 56,461. జనాభాలో పురుషులు 28,853 కాగా, స్త్రీల సంఖ్య 27,608. మండలంలో 11,973 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.