వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 149: పంక్తి 149:


నేను, మా కళాశాలలోని కొంతమంది విద్యార్థులు క్రిందటి రెండు సంవత్సరాల నుండి తెలుగు వికీపీడియా లో అనువాదం చేస్తున్నాము. డిసెంబర్,2019 లో మేము ఒక తెలుగు వికీపీడియా కార్యక్రమం లో పాల్గొన్నాము. కానీ మాకు తెలుగు భాష లో అంత అవగాహన లేకపోవడం చేత కొన్ని తప్పులు జరిగాయి. అందుచేత మేము అనువాదం చేసిన వాక్యాలు తెలుగు వికీపీడియా లో నుంచి తొలగించబడ్డాయి. అదే ఆ సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే మా వ్యాసాలు పూర్తి నాణ్యతతో ప్రసురించబడేయి. ఈ నిబంధన వాళ్ళ వ్యాసాల యొక్క నాణ్యత పెరగడం తో పాటు, కొత్తగా అనువాదం చేసేసవాళ్ళకి చాల ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కావున ఈ నిబంధన తొలగించేందుకు నేను వ్యతిరేకత తెలుపుతున్నాను. --[[వాడుకరి:Mekala Harika|Mekala Harika]] ([[వాడుకరి చర్చ:Mekala Harika|చర్చ]]) 13:07, 20 సెప్టెంబరు 2020 (UTC)
నేను, మా కళాశాలలోని కొంతమంది విద్యార్థులు క్రిందటి రెండు సంవత్సరాల నుండి తెలుగు వికీపీడియా లో అనువాదం చేస్తున్నాము. డిసెంబర్,2019 లో మేము ఒక తెలుగు వికీపీడియా కార్యక్రమం లో పాల్గొన్నాము. కానీ మాకు తెలుగు భాష లో అంత అవగాహన లేకపోవడం చేత కొన్ని తప్పులు జరిగాయి. అందుచేత మేము అనువాదం చేసిన వాక్యాలు తెలుగు వికీపీడియా లో నుంచి తొలగించబడ్డాయి. అదే ఆ సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే మా వ్యాసాలు పూర్తి నాణ్యతతో ప్రసురించబడేయి. ఈ నిబంధన వాళ్ళ వ్యాసాల యొక్క నాణ్యత పెరగడం తో పాటు, కొత్తగా అనువాదం చేసేసవాళ్ళకి చాల ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కావున ఈ నిబంధన తొలగించేందుకు నేను వ్యతిరేకత తెలుపుతున్నాను. --[[వాడుకరి:Mekala Harika|Mekala Harika]] ([[వాడుకరి చర్చ:Mekala Harika|చర్చ]]) 13:07, 20 సెప్టెంబరు 2020 (UTC)
:గతంలో చేసిన గూగుల్ అనువాద వ్యాసాలను, ట్రాన్సలేషన్ టూల్ తో అనువాదం చేసిన వ్యాసాలను నేను కూడా చూశాను. అందులో భాష సరిగా లేదు. మరి అలాంటప్పుడు ప్రస్తుతం ట్రాన్సలేషన్ టూల్ లో ఉన్న 30 శాతంని తగ్గిస్తే అప్పుడు రాసే వ్యాసాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఓటింగ్ పద్ధతిలో, ఓటింగ్‌ కి పెట్టిన విషయంలో [[వాడుకరి:Meena gayathri.s|Meena gayathri.s]] గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ట్రాన్సలేషన్ టూల్ అనుభవం ఉన్న వికీ సభ్యులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అయినా ఓటింగ్ పెట్టారు. ఆ ప్రతిపాదనకు, ఈ ఓటింగ్ కు నేను కూడా వ్యతిరేకమే. కాబట్టి, ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే, ప్రతిపాదన గెలవకుండా వ్యతిరేక ఓటు వేయాలనుకుంటున్నాను.--[[వాడుకరి:Nagarani Bethi|Nagarani Bethi]] ([[వాడుకరి చర్చ:Nagarani Bethi|చర్చ]]) 14:05, 20 సెప్టెంబరు 2020 (UTC)

14:06, 20 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ఇదేంటిది?

  • చర్చలో ప్రతిపాదన చేసినదేంటి? "ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి." అని. దాన్ని మాత్రమే చర్చకు పెట్టారు.
  • ఇక్కడ వోటింగుకు పెట్టిందేంటి? దాంతో పాటు, "కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు." అని కూడా చేర్చారు. దాన్ని చర్చకు పెట్టలేదు.

ఇదేం పద్ధతి అసలు? రెండు వేరువేరు అంశాలను వోటింగుకు పెట్టి ఒకే వోటు ఎలా వేస్తారు? చర్చలో దేన్ని ప్రతిపాదించారో దాన్ని మాత్రమే వోటింగుకు పెట్టాలి. చర్చకు పెట్టిన అంశాన్ని మారుస్తారా? చర్చలో మధ్యలో అంశాన్ని చేరిస్తే దానిపై మళ్ళీ చర్చకు పెట్టాలి కదా. అక్కడి చర్చ పేజీని అర్థం కాకుండా గందరగోళం చెయ్యడం, ఇక్కడేమో వోటింగులో రెండు వేరువేరు అంశాలను కలిపేసి అసలు ప్రతిపాదనను పలచన చెయ్యడం అంతా ఏదో గందరగోళంగా ఉంది. ఏమాత్రం పారదర్శకంగా లేదు. ఈ వోటింగు వ్యవహారాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. పై రెండు అంశాల్లో రెండోదాన్ని వోటింగుకు తీసుకోకూడదు. మొదటి దాన్ని మాత్రమే వోటింగుకు తీసుకోవాలి. __చదువరి (చర్చరచనలు) 01:54, 6 సెప్టెంబరు 2020 (UTC) [ప్రత్యుత్తరం]

చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుతం వాడుతున్న పద్ధతి మీరు చురుకుగా లేని కాలంలో సముదాయంతో చర్చల ఫలితంగా తయారైనది. దీనిని ఒక్క విధానం రూపొందించడానికే గతంలో వాడినప్పుడు కూడా మీరు చురుకుగా లేనందున పాల్గొనవీలుకాలేదు. ఆ తరువాత పద్ధతి గురించి చర్చలో పాల్గొన్నందున కొంతవరకు మీకు అవగాహన వచ్చినా, మీకు కొంత కొత్తగా అనిపించివుండవచ్చు. వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి#వోటింగు ప్రక్రియ పద్ధతి లో తొలి అంశం "చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి. దీనికి కనీస కాలపరిమితి వారం రోజులు." అని వుంది. దాని ప్రకారమే చిత్తు ప్రతిపాదనలు, వాటికి సవరణలు గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుత ప్రతిపాదనలో రెండవ అంశం గురించిన చర్చ విభాగం 2020 ఆగస్టు 30 నాడు ప్రారంభమైంది. అయితే దానికి గాని, లేక అంతకుముందు పరస్పర విరుద్ధమైన అమలుచేయలేని అభిప్రాయాలు తెలిపిన సభ్యులను, వారి అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేసేవిధంగా, వున్న ప్రతిపాదనలు సవరించడానికి లేక కొత్త ప్రతిపాదనలు చేయమని కోరినా చాలామంది స్పందించలేదు. నిర్వహణ భారం గురించి సభ్యుల ఆందోళన చర్చలలో వ్యక్తమైంది, దీనిని తగ్గించడానికి సవరణ ఉపయోగపడుతుంది కావున దీనిని ప్రతిపాదనలో 2020 సెప్టెంబరు 1 నాడు చేర్చడమైనది. అసలు ఈ అంశం 2020 ఆగస్టు 22 నాడే తొలగింపులు తగ్గింపుకు చర్యలలో సూచించబడింది. ఆ విధంగా తొలి ప్రతిపాదన మెరుగుచేయడమైనది. కావున ఓటు ప్రక్రియలో ప్రవేశపెట్టబడినది.
"చర్చపేజీని గందరగోళం చెయ్యడం" అని వికీలో ఎంతో అనుభవమున్న మీరు ఎందుకంటున్నారో అర్ధం కావడంలేదు. సమస్య గురించి రచ్చబండలో తొలి చర్చ ప్రారంభించినపుడు మీ స్పందనలో "ఇప్పుడు మీరు ఆ నిబంధనలను ఎందుకు సడలించదలచుకున్నారో నాకు అర్థం కాలేదు. వివరంగా, వీలైతే ఒక్కొక్కటే బులెట్ పాయింట్లతో రాయగలరు. ఒకవేళ సడలిస్తే ఆ నిబంధనలను విధించడానికి దారితీసిన పరిస్థితులు తిరిగి తెలెత్తకుండా ఎలా నివారిస్తారో, తలెత్తితే ఎల ఎదుర్కొంటారో కూడా రాయండి" అని కోరారు. మీ కోరిక ప్రకారమే చర్చ అర్ధవంతంగా సాగటానికి విభాగాలుగా ప్రారంభించాను. సభ్యులు తమ వ్యాఖ్యలను ఆయా విభాగాలలో లేక కొత్త విభాగాలలో రాయమని కోరాను. కొంతమంది సభ్యులు పాటించగా మరికొంతమంది పాటించలేదు. వారిని మార్చమని కోరినా స్పందనలేదు. కావున స్పందనలను తగిన విభాగాలకు మార్చాను. ఇక సభ్యులు తొలిగా ప్రస్తుత విధాన సమీక్షలో తమ వ్యక్తిగత అభిప్రాయాలను ప్రస్తుత విధానానికి అనుకూలంగానో ప్రతికూలంగానో తటస్థంగానో రాస్తారనుకుంటే అవి సభ్యులు పాటించలేదు, కొంతమంది సభ్యులు అమలు చేయవీలుకాని పరస్పర విరుద్ధ అభిప్రాయాలు చర్చలలో వ్యక్తంచేశారు. అందువలన ఆ విభాగాల శీర్షికలను చర్చను అర్ధంచేసుకోవటానికి సహకరించుటలేదని తొలగించాను. సభ్యుల స్పందనలలో భాషా సవరణలు, సరియైన విభాగాలలో చేర్చటం తప్ప వారి వ్యాఖ్యలను పెడర్ధాలు వచ్చేటట్లుగా ఏమాత్రం చేయలేదు. చర్చలోని విషయసూచిక ద్వారా సభ్యులు తమ వ్యాఖ్యలున్న భాగాలకు చేరుకోవటానికి, అలాగే ఇతర సభ్యులు చర్చను అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం ఇబ్బందిలేదు.
కావున మీరు, ఇతర సభ్యులందరూ ఓటు ప్రక్రియలో పాల్గొని అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలపవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:42, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
"చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి" చర్చల దశలోనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఏకాభిప్రాయం వచ్చింది. అత్యధికులైన సభ్యులు ఆ చిత్తు ప్రతిపాదన ప్రాతిపదికతో సహా తిరస్కరించినప్పుడు మీరు ఆ ప్రాతిపదికకే విరుద్ధంగా (ఎలా విరుద్ధమో కింద వివరంగా రాశాను) రెండవ అంశం తెచ్చి పెట్టేశారు. దాదాపు 8 వేల పదాలు (ఖచ్చితంగా చెప్పాలంటే 7,934 పదాలు) ఉన్న చర్చా పేజీ, అది చదవాలంటేనే సాధారణమైన వేగం కలిగినవారికి అరగంట పడుతుంది. అందులో చర్చ దాదాపు ఏకాభిప్రాయానికి వస్తున్నప్పుడు హఠాత్తుగా రెండు లైన్ల మేరకు మార్పులు చేశారు మీరు. పాల్గొన్న సభ్యులెవరినైనా అడిగి చూడండి నాతో సహా, చాలామందికి అసలు మీరు ఆ వాక్యమే చేర్చారని తెలియదు. అలాంటి ఓ ప్రతిపాదన తెచ్చి, అంతకుముందే వీగిపోయిన మరో ప్రతిపాదన పట్టుకుని ఓటింగ్‌కి ఎలా వచ్చేస్తారు? చిత్తు ప్రతిపాదనల్లో ఒక ప్రతిపాదనపై చర్చలే జరగలేదని మీరే చెప్తున్నారు, రెండవ దానిని సభ్యులు తిరస్కరించారు. ఇప్పుడు ఈ ఓటింగ్‌ ఎందుకు? మీకు అంతగా ఆ చిత్తు ప్రతిపాదన చర్చించదగినది అనిపిస్తే అప్పటికే వేలాది పదాల పొడవు స్పందనలు చెప్పిన మమ్మల్ని ఎందుకు టాగ్ చేసి పిలవలేదు? అన్నిటికన్నా ముఖ్యంగా "ఎవరైనా పాల్గొనగలిగే వీలున్న నియమాన్ని" గౌరవించడం కోసమే ఈ ప్రతిపాదనలు చేసినట్టు చెప్పిన మీరు అందుకు భంగకరంగా ఉన్న రెండవ ప్రతిపాదన ఎవరి ప్రోద్బలమూ లేకుండా ఎందుకు చేశారు? అర్జున గారూ, ఇప్పటికైనా జరిగిన ప్రక్రియలో తప్పొప్పులు పరిశీలించుకుని తిరగదోడి, నిర్ణయాన్ని వేరే సభ్యులకు అప్పగించి గౌరవప్రదంగా ముగించే అవకాశం మనకు ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 01:48, 8 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, వేరే విభాగంలో మీ వివరమైన వ్యాఖ్యకు నా స్పందన చూడండి. మీ వాదన అవగాహన లోపం వలనే అని నా కనిపిస్తున్నది. చర్చలలో మూడు ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు ప్రతిపాదన 1 నే అందరూ వ్యతిరేకించినట్లు ఎలా అవుతుంది. ప్రతిపాదనలో రెండవ అంశం అని ఒకసారి అంటారు, రెండవ ప్రతిపాదన అని ఇంకొకసారి అంటారు. రెండవ అంశం ప్రతిపాదనకు సవరణ మాత్రమే, వేరే ప్రతిపాదన కాదు. చర్చలో నాణ్యతలేని వ్యాసాల వలన నిర్వహణభారం ఎక్కువవుతుందనే అభిప్రాయం, మీరు ఇతరులు వ్యక్తం చేశారు. కాని ఆ అభిప్రాయాలు సమర్ధవంతంగా నిర్వహించని గూగుల్ ప్రాజెక్టు లేక పోటీ ప్రాజెక్టులవలన ఏర్పడిందన్న విషయం తెలిపాను. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు తెలిపిన వారిని సవరణ గురించి, వారి అభిప్రాయం స్పష్టంచేయమని స్పందన కోరినా, కొంతమంది స్పందించలేదు. కావున ఆ నిర్వహణభారం తగ్గించటానికి సవరణగా తొలిప్రతిపాదనలో తొలగింపులు తగ్గించడానికి చర్యలు అన్న విభాగంలో వున్నదానినే కొత్త వాడుకరులు ప్రధానపేరుబరిలో ముద్రించడాన్ని నిరోధించే వడపోత అమలుగా చేర్చాను. అనగా కొత్త వాడుకరులు అనువాద ఉపకరణం వాడవచ్చు, వారి వాడుకరిపేరుబరిలో ముద్రించుకోవచ్చు. కొత్త చర్చ ప్రారంభించినపుడు వ్యక్తులను టేగ్ చేయటం నాకు అలవాటే. చర్చలలో స్పందించినపుడు టేగ్ చేసినా కొంతమంది స్పందించనప్పుడు,ఈ సవరణ గురించి నా స్పందనలలో ప్రస్తావించినపుడు, మరల టేగ్ చేయవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:48, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ప్రతిపాదనలో నైతికత అంటూ ఉంటే వోటేస్తాను. అనుకూలంగానో వ్యతిరేకంగానో వోటేస్తాను. కానీ అందులో అసలు నైతికతే లేదు, ఇది వికీ వ్యతిరేకం అని భావిస్తున్నపుడు అసలు వోటెలా వేస్తాను? కింద #మీ వాదన స్వీయవిరుద్ధం, మీ ప్రతిపాదన వికీవిరుద్ధం, మీ వోటింగు ధర్మవిరుద్ధం విభాగంలో నా అభిప్రాయం వివరంగా రాసాను, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 07:27, 8 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాతిపదిక లేని ఈ ఓటింగుపై చర్య అవసరం

చదువరి గారు చెప్పినట్టు ఓటింగ్ పెట్టడం అన్నది సరిగా లేదు.

  • ప్రతిపాదనకు ఒక ప్రాతిపదిక ఉంటుంది. అర్జున రావు గారు ప్రస్తుతం అనువాద ఉపకరణంలో చేసిన అనువాదాలకు కనీసం 30 శాతం మార్చిన పాఠ్యం ఉండాలి అన్న పరిమితిని తొలగించాలని లేదంటే సడలించాలని ప్రతిపాదన చేసినప్పుడు ఆయన ప్రధానంగా చెప్పిన ప్రాతిపదిక కొత్త సభ్యులు చేరడానికి ఇదొక అడ్డంకి అవుతోందని, అలాంటి అడ్డు లేకుండా ఉంటే కొత్తవారు తెవికీలో రావడానికి వీలు పెరుగుతుందని సముదాయమే వారికి నేర్పిస్తూ పోవచ్చనీ, వగైరాలన్నీ ఆ వాదనలో ఇమిడి ఉన్నాయి. "నా వంటి అనుభవజ్ఞుడికే ఈ అనువాద ఉపకరణంలో ఆ పరిమితులు వాడి ప్రచురించడం కుదరకపోతే" అన్నప్పుడు కూడా ఫోకస్ కొత్తవారిపైనే. అలాంటప్పుడు హఠాత్తుగా - కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచి, 500 మార్పులు చేసేదాకా అనువాద ఉపకరణంపై చేసిన పనులు ప్రచురించే వీలు లేకుండా చేద్దామన్న ప్రతిపాదనకు పై ప్రాతిపదికకు పొంతన ఏదీ? 70 శాతం అలానే ఉంచినా 30 శాతం మార్పులు చేసి కొత్తవారు ప్రచురించగల వీలు ఇప్పుడు ఉంది. వాళ్ళు 500 మార్పులు చేసేంతవరకూ అనువాద ఉపకరణం ప్రచురించనివ్వదు అన్న ఈ ప్రతిపాదనే కొత్తవారిని చేరనివ్వడానికి వీలు కల్పించనివ్వదు.
  • చర్చలో దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చింది. ఒక్క అర్జున రావు గారు, దేవుడు గారు తప్ప వచ్చినవారందరూ దాదాపుగా కనీసం 30 శాతం మార్చిన పాఠ్యం ఉండాలన్న పరిమితిని తొలగించాలని/సడలించాలని తెచ్చిన ప్రతిపాదనను ఏదోక రూపేణా వ్యతిరేకించినవారే. 70% యాంత్రిక అనువాద విధాన సమీక్షలో సభ్యులు, కొత్త సభ్యుల యాంత్రిక అనువాదాలపై నియంత్రణ వుండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అని ఆ చర్చ ముగింపులో అర్జునరావుగారే పేర్కొన్నారు. అంటే అదే అందరి అభిప్రాయం. వెనువెంటనే ఎక్కడినుంచో కావున, ఆంగ్ల వికీపీడియాలో అమలు చేసినట్లు దుశ్చర్యల వడపోత ద్వారా కొత్త సభ్యులు నెల రోజులు, 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించడాన్ని నిరోధించే పద్ధతి అమలు చేయాలి అని మరో కొత్త ప్రతిపాదన తెచ్చి ఈ ఓటింగ్ సముదాయంపై రుద్దుతున్నారు.

ఇంత విస్తృతంగా చర్చ జరిగి దాదాపు ఏకాభిప్రాయం వచ్చిన విధానాన్ని ఇప్పుడు మళ్ళీ ఓటింగ్‌ పెట్టి ఏం చేద్దామనుకుంటున్నారో నాకు తెలియాలి? ఐనా ప్రతిపాదకుడు చర్చను ముగించేప్పుడు ఎవరైనా అనుభవజ్ఞులైన నిర్వాహకులు వచ్చి సమీక్షించి ముగిస్తారేమోనన్న సంప్రదాయం కూడా పాటించకుండా, జరిగిన చర్చలో లేని తన ఆలోచనల్లో ఉన్న విషయాన్ని తెచ్చి ఎడాపెడా మళ్ళీ ఇలా ఓటింగ్‌కు పెట్టడాన్ని తిరస్కరిస్తున్నాను. పదిమంది వరకూ వివిధ అనుభవ స్థాయిలు ఉన్న వికీపీడియన్లు చర్చించిన ఆ చర్చను తుంగలో తొక్కారు. "తెలుగు వికీపీడియాలో విధానాలు మార్గదర్శకాలను నిర్ణయించడానికి ఏకాభిప్రాయం ప్రాతిపదిక ముఖ్యమైనది. ఏకాభిప్రాయం అంటే పూర్తి సమ్మతి కాదు. విధానాల నిర్ణయంలో ఏకాభిప్రాయానికి ప్రయత్నించటం, భిన్నాభిప్రాయాలు వున్నప్పుడు వోటు ప్రక్రియద్వారా వ్యతిరేకత ను అంచనావేసి అది తక్కువగా ఉన్నప్పుడు ప్రతిపాదన విజయవంతమైందని భావించి నిర్ణయం తీసుకోవటానికి ఈ విధానం కీలకం." అని ఆ వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి అన్న పేజీలోనే ఉంది. ఆ ప్రకారం ఆ చర్చను ముగించే అవకాశం ఉన్నా ఎందుకు ముగించకుండా ఈ ఓటింగ్ తెచ్చిపెట్టారన్నది సంతృప్తికరంగా వివరించలేని పక్షంలో ఈ ఓటింగ్ ప్రక్రియను ముగించి, ఆ చర్చను వేరెవరైనా సభ్యులు చూసి ముగించేలా తన మార్పులను ఎందుకు ఇతర నిర్వాహకులెవరైనా తిరగగొట్టకూడదో @Arjunaraoc: గారు తెలియజేయాలి. నా ఉద్దేశంలో ఇది మొత్తం ప్రక్రియను, సభ్యులు సంయమనాన్నీ పరీక్షించడమే అవుతోంది. --పవన్ సంతోష్ (చర్చ) 11:34, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది గమనించి స్పందించాల్సిందిగా ఆ చర్చలో పాల్గొన్న నిర్వాహకులు వాడుకరి:Chaduvari, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:యర్రా రామారావు గార్లను ఆహ్వానిస్తున్నాను. అలానే ఆ పేజీ ఇప్పుడున్న స్థితి చూసేందుకు వీలుగా లింక్ ఇదిగో: వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ --పవన్ సంతోష్ (చర్చ) 13:49, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రక్రియను బలహీనపరచేటట్లుగా వున్న మీ వ్యాఖ్యవెనుక కొంత అవగాహన లోపాలున్నందున, అవి తెలియజేయటం బాధ్యతగా భావించి ఈ స్పందన రాస్తున్నాను.
ఓటింగుకు పెట్టిన ప్రతిపాదన కొత్తవారు యాంత్రిక అనువాద ఉపకరణాన్ని వాడడం నిరోధించదు. కేవలం వారు ప్రధానపేరుబరిలో ముద్రించటం మాత్రమే నిరోధిస్తుంది. అంటే వారు అనువాదవ్యాసాలను వారి వాడుకరిపేరుబరిలో ముద్రించుకోవచ్చు. ఇతరులను సమీక్ష చేయమని కోరి, ఆ తరువాత అటువంటి వ్యాసాలకు సవరణలు చేసి ప్రధానపేరుబరికి తరలించనూవచ్చు.
సమీక్ష ప్రారంభంలోనే స్పందన అభ్యర్ధన అన్న పేరాలో వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి వాడి నిర్ణయం చేయబడుతుందని స్పష్టంగా తెలపబడింది. ఆ పద్ధతిలో కేవలం పరిచయ వాక్యమే పై వ్యాఖ్యలో మీరు పేర్కొన్నారు. దానిలో  వోటింగు ప్రక్రియ పద్ధతి విభాగంలో సవివరంగా ఎలా అంచనా వేయాలో వివరించబడింది. ఆ ఓటు పద్ధతిలో ఆ విధంగానే ఓటింగ్ జరుగుతున్నది. కావున మీ అభ్యంతరాలకు ఆధారమేమి లేదు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:07, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున రావు గారూ, ఇప్పటికే పలుమార్లు చెప్పాను, ఇంకోసారి కూడా చెప్తాను.

  1. మీ విధానం కొత్తవారు నేరుగా ప్రధాన పేరుబరిలో యాంత్రికానువాదం వాడి ప్రచురించడాన్ని అడ్డుకుంటుంది. నేను మీరు చేసిన పది పైచిలుకు అనువాద వ్యాసాలను గతంలో విశ్లేషించి తేల్చిందేమిటంటే - పదుల వేల మార్పులు చేసిన మీరు చేసిన వాటిలోనూ దారుణమైన అనువాద లోపాలు ఉంటాయని. మీరూ హుందాగా "మీరు ఆశించే నాణ్యత నా అనువాద వ్యాసాలలో కనబడకపోవటాన్ని నేను అంగీకరిస్తాను. నేను మరల పరిశీలించినపుడు నా అనువాదంలోగల సమస్యలు మరింతగా తెలిశాయి. వాటిని అనువాద సమస్యల పరిష్కరణ ఉపకరణం వాడి కొంతవరకు సవరించాను." అనీ అంగీకరించారు. అంటే - 500 మార్పులు కాదు సరికదా మీలా పదుల వేల సంఖ్యలో మార్పులు చేసినా అనువాదం చేయడంలో నైపుణ్యం వచ్చెయ్యదు. కాబట్టి, ప్రయత్నపూర్వకంగా "ముందు చేయబోయే అనువాదాలు మరింత నాణ్యతగా చేయదలుచుకున్నాను." అని మీరే అన్నట్టు, కృషిచేసి నాణ్యంగా చేయాలి. అలాగే, కొత్త సభ్యులు చెత్త అనువాదాలే చేస్తారనీ మీరేమీ నిరూపించలేరు. కాబట్టి, మీ అంత అనుభవం ఉన్న మీరు కూడా నియంత్రణ లేకపోతే, ఎత్తిచూపకపోతే నాణ్యమైన అనువాదాలు చేయలేరు, కొత్త సభ్యులు అనగానే వారేమీ అనువాదంలో తప్పులు చేస్తారన్న ఖచ్చితమైన సూచిక ఏమీ లేదు, అలాంటప్పుడు ముందు "అనువాద వ్యాసాలు సృష్టించే సభ్యులపై ప్రస్తుతం వున్న వివక్ష పోతుంది. కొత్త వ్యాసాలు సృష్టించే సభ్యులకు లభించే అనుభవమే వీరికి అందుతుంది." అంటూ నియంత్రణ తొలగించమని, ఆ ప్రాతిపదికకు మీరే దెబ్బకొడుతూ ఈ రెండవ సవరణ ఎందుకు తెచ్చిపెట్టారో ఇప్పటికీ సంతృప్తికరంగా చెప్పలేకపోయారు.
  2. మీరిప్పుడు చేసిన సవరణ ప్రకారం - అర్జున రావు గారనే మీరు 500 ఎడిట్లు పైచిలుకు మార్పులు చేసిన కారణంగా అసహజమైన వాక్యాలతో, అనువదించని ఇంగ్లీషు పదాలతో, మరీ నిర్లక్ష్యపూరితమైన ధోరణిలో 30 శాతం కూడా మార్పుచేర్పులు చేయకుండా అనువాద వ్యాసాన్ని అచ్చంగా మొదటి పేరుబరిలో ప్రచురించేయవచ్చు, అదే కొత్తగా బయట అనువాదాల్లో ఆరితేరి, ఇక్కడ చక్కగా నేర్చుకుని యాంత్రికానువాదాలు చేయబోయిన కొత్త సభ్యులు కేవలం మీకున్న 500 ఎడిట్లు లేవన్న కారణంగా తీసుకుపోయి సాండ్‌బాక్సులో పెట్టుకోవాలి. ఇది సహజ న్యాయ సూత్రానికే వ్యతిరేకం. మీరు చేసిన ఈ సవరణ నిజానికి సవరణ కాదు, మీరు మొదట తీసుకువచ్చిన ప్రాతిపదికకే విరుద్ధంగా ఉన్న కొత్త ప్రతిపాదన. ఈ విధంగా చూస్తే, ప్రాతిపదిక సరిపోనప్పుడు కొత్త పాయింట్ సవరణ కాబోదనీ, కొత్త ప్రతిపాదన అవుతుందని గ్రహించడానికి సుముఖంగా లేని మీదే అవగాహన లోపమైనా మరోటైనా!

చర్చలో నేను గమనించినంతవరకూ వాడుకరి:Chaduvari, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గార్లు మీరు తీసుకువచ్చిన ప్రతిపాదన (భాష పరంగా యాంత్రిక అనువాద స్థాయి తొలగింపు) అన్నదాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కాబట్టి, ఇందరి సమయాన్ని వెచ్చించి 8 వేల పదాల పైచిలుకు చర్చ జరిగి, ఆ చర్చలోనే వీగిపోయిన ప్రతిపాదనను తీసుకువచ్చి ఓటింగ్‌కు పెట్టడం, "పై చర్చలో నిలిచిన ప్రతిపాదన" అని ఈ వీగిపోయిన ప్రతిపాదనను మీరే నిర్ణయించేసెయ్యడం - మీ హక్కులను దుర్వినియోగం చేయడం, తోటి వాడుకరుల సమయంపై అగౌరవం చూపించడమే అవుతోంది. నేను ఇప్పుడే పై వాడుకరులను అడుగుతున్నాను, వారే చెప్తారు - చర్చలో మీరు తీసుకువచ్చిన ప్రతిపాదనను వారు ఆమోదించారో, తిరస్కరించారో --పవన్ సంతోష్ (చర్చ) 03:23, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారి ప్రతిపాదన చర్చలో తిరస్కరించారా లేదా?

వాడుకరి:Chaduvari, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల ఇప్పటికే ఈ చర్చతో మీరందరూ విసిగిపోయారని నాకు తెలుసు, ఆమాటకు వస్తే ఏనాడో ముగించేయాల్సిన చర్చను ఈనాటికీ లాగుతూ విలువైన కాలాన్ని, ఏకాగ్రతను వ్యర్థం చేస్తూ సాగుతున్న ఈ చర్చతో నేను విసిగిపోయాను. కానీ, ఇక్కడ నిజానిజాలు నిగ్గుతేలాల్సిన సమయం వచ్చింది. అర్జున గారు "భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి. అనగా ఉపకరణంలో అప్రమేయంగా వున్న నాణ్యత పరిరక్షణ క్రియలు తెలుగు వికీకి సరిపోతాయి." అన్న తన ప్రతిపాదన, దానికి ఆయన చివర్లో హడావుడిగా చేర్చేసిన సవరణతో సహితంగా "చర్చలో నిలిచిన ప్రతిపాదన" అని ఆయనే నిర్ణయించేశారు. అందుకు భిన్నంగా లేదని నేను అభిప్రాయపడుతున్నాను. మీరు చర్చలో దీన్ని ఆమోదించారా (అర్జున గారు పదే పదే వెంటపడి ఇచ్చిన వివరణలతో కలిపి చూసి) లేదా అన్నది ఈ కింద తెలియజేయగలరు.మరోమారి ఇబ్బందిపెడుతున్నందుకు క్షమాపణలు, ఈ స్థితి తీసుకువచ్చింది నేను కాదని గ్రహించి మీ అభిప్రాయం చెప్పగలిగితే చెప్పగలరు:

  1. నేను నిర్ద్వంద్వంగా ఆయన ప్రతిపాదనను తిరస్కరించాను. ఇప్పటికీ నాది ఒకటే సూత్రం "అనువాద ఉపకరణం 90 శాతానికి పైగా మెరుగుపడిందని నిక్కచ్చిగా నిరూపించితే తప్ప, నిజంగా అనువాదం చేస్తే అందుకోగలిగే ఈ కాస్త నియంత్రణలూ (30 శాతం మార్చాలన్నది) తొలగించకూడదు" అలాగే, "అర్జున వంటి అనుభవజ్ఞులే ఇంగ్లీషు పదాలు, వాక్యాలు విడిచిపెట్టేసి అనువాదాలు ప్రచురించేస్తున్నప్పుడు, 500 మార్పులు చేసినవారు అనువాదాల్లో నిష్ణాతులని వారికి మినహాయింపు ఇవ్వడం, కొత్తగా వచ్చేవారు ఎంతటి పండితులో, ఎంత గట్టివారో తెలియకుండానే కొత్తవారు కాబట్టి నియంత్రించడం సరికాదు". చర్చలో కూడా నేను అర్జున గారి వాదన ఏకీభవించలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 03:23, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నేను అర్జున గారి ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. 30% మానవిక అనువాద పరిమితి ఉండాల్సిందేనని హేతువుతో సహా చెప్పాను. ఇది తెవికీ నాణ్యతను దిగజార్చే ప్రతిపాదన. అసలు ఈ వోటింగు అనేది వికీ విరుద్ధం. వికీలో అభిప్రాయాలే ముఖ్యం, వోట్లు కాదు. ప్రతిపాదనపై జరిగున చర్చలో మెజారిటీ సభ్యులు దీన్ని తిరస్కరించారు. __చదువరి (చర్చరచనలు) 04:15, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. అనువాద ఉపకరణం ద్వారా వచ్చే పాఠ్యం నాణ్యత ప్రశ్నార్థకం. దాన్ని కనీసం 30% మానవికంగా మార్చనిదే ప్రచురించడం మంచిది కాదని నా అభిప్రాయం. కాబట్టి దీన్ని అంతకంటే తగ్గించే ప్రతిపాదనకు నేను వ్యతిరేకం. - #రవిచంద్ర (చర్చ) 04:56, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  4. నేను అర్జునగారి ప్రతిపాదనను ఖచ్చితమైన అభిప్రాయంతో తిరస్కరించాను. తెవికీ నాణ్యత దృష్ట్యా 30% మానవిక అనువాద పరిమితి ఉండాల్సిందేనని తగిన కారణాలుతో వివరించాను.నాతో సహ ఇదే అభిప్రాయాలు చర్చలో పాల్గొన్న మెజారిటీ గౌరవ వికీపీడియన్లు ముక్తకంఠంతో నిర్ద్వంద్వంగా అర్జునగారి ప్రతిపాదనను తిరస్కరించారు.వికీలో ఓటింగుకన్నా, చర్చలో జరిగిన మెజారిటీ సభ్యుల అభిప్రాయాలే ముఖ్యం. ఇది తెవికీ నాణ్యతను దిగజార్చే ప్రతిపాదన. అసలు ఈ వోటింగు అనేది వికీ విరుద్ధం.--యర్రా రామారావు (చర్చ) 05:23, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  5. అర్జున గారి ప్రతిపాదనను నేను కూడా తిరస్కరించాను, ఇప్పటికీ తిరస్కరిస్తూనే ఉన్నాను. తెవికీ నాణ్యతను దృష్టిలో ఉంచుకొని 30% మానవిక అనువాద పరిమితి ఉండడమే సరైనది. ఈ ప్రతిపాదనకు నేను వ్యతిరేకం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:37, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  6. అర్జున గారి ప్రతిపాదనను నేను తిరస్కరిస్తున్నాను. యాంత్రికానువాదాలపై తమ అభిప్రాయాలు, అనుభవాలు చర్చించకుండా ఓటు వేసారనే ఒక్క కారణంతో అమలుచేసే ఈ విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ వోటుంగు వికీ విరుద్ధం. తెవికీ నాణ్యతను దృష్టిలో ఉంచుకొని 30% మానవిక అనువాద పరిమితి ఉండడమే సరైనది. ఈ ప్రతిపాదనకు నేను వ్యతిరేకం.--కె.వెంకటరమణచర్చ 09:35, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటింగ్ అనవసరం

@Arjunaraoc: గారూ, తెలుగు వికీలో ఒక పక్క వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో సభ్యులు పాల్గొని వేల మొలక వ్యాసాలను విస్తరణ చేస్తున్న సమయంలో మీరు కూడా అందులో పాల్గొని కనీసం ఒక వ్యాసమైనా విస్తరణ చేయకుండా, మీకు మీరుగా వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి అనే మరో ప్రాజెక్టును ప్రారంభించి, సభ్యుల అభిప్రాయాలు కోరారు. సరే అనుకొని, ఆ ప్రాజెక్టును కొనసాగిస్తూనే మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టులో సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసి, కొత్త సభ్యుల యాంత్రిక అనువాదాలపై నియంత్రణ వుండాలని అన్నారు. కానీ, మీరు మళ్ళీ ఇప్పుడు ఓటింగ్ పద్ధతిని తీసుకొచ్చి, సభ్యులు తెలియజేసిన అభిప్రాయాలకు విలువ లేకుండా చేస్తున్నారు. అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి అని పేరు పెట్టి నాణ్యతలేని వ్యాసాలను తెవికీలో ఎక్కించడానికి చూస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు చర్చలో ఒక సభ్యుడు రాసిన అభిప్రాయాన్ని, మళ్ళీ మరోసారి చూద్దామంటే అది ఆ స్థానంలో ఉండడంలేదు. ప్రాజెక్టు పేజీని మీకు ఇష్టమున్నట్టుగా మారుస్తూ, సభ్యులు రాసిన అభిప్రాయాలను ఎక్కడెక్కడో తరలించి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదంతా అవసరమా, మీకు అనువాద ఉపకరణంతో రాయడం ఇష్టంలేకపోతే రాయడం మానేయండి, అంతేకాని మీకు ఇష్టమున్నట్టుగా చేసి సభ్యుల సమయాన్ని వృధా చేయకండి.

అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చర్చలో పాల్గొన్న సభ్యులలో అధికశాతం మంది అర్జున గారి ప్రతిపాదనను వ్యతిరేకించారు. కాబట్టి ఓటింగ్ పద్ధతి ఇక అనవసరం. ఈ ప్రతిపాదన చేసినవారు, ఈ చర్చలో పాల్గొన్నవారు కాకుండా వేరే నిర్వాహకులెవరైనా ముందుకువచ్చి చర్చలో పాల్గొన్న సభ్యుల అభిప్రాయాలను బట్టి నిర్ణయం చేసి, చర్చను ముగించాలి. లేకపోతే ఇది ఇలాగే కొనసాగి, వికీ ఇతర పనులకు ఆటంకంగా మారే అవకాశం ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:30, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నేను పవన్ సంతోష్, ప్రణయరాజ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. వికీపీడియా నాణ్యతాభివృద్ధి కొరకు కృషిచేస్తూ ప్రాజెక్టులను చురుకుగా నిర్వహిస్తూ, నిరంతరం శుద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్న క్రియాశీల వాడుకరులెవరూ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపలేదు. మీరు ఈ అనువాద పరికరంతో వ్యాసం అనువాదం చేసినపుడు అది 30% శుద్ధి చేయనిదే అడ్డుకుందని వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి పేజీ ప్రారంభించారా? లేక ఎవరైనా 30% న్ని తగ్గించమని ఎక్కడైనా కోరారా? క్రియాశీలక వాడుకరులెవరూ చర్చలో ఈ ప్రతిపాదనకు మద్దతునివ్వనప్పుడు ఓటింగ్ అవసరం లేదు. ఒక అంశంపై చర్చ జరిగి రెండు అంశాలను ఓటింగ్ లో ఎలా చేర్చారు? సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేసినా సభ్యులు తెలియజేసిన అభిప్రాయాలకు విలువ లేకుండా చేస్తున్నారు. దీనిపై చర్చలో పాల్గొనని నిర్వాహకుడైవరైనా చర్చను ముగిస్తే బాగుంటుంది. K.Venkataramana(talk) 02:30, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్, వెంకటరమణ గారల అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.ఇది ఒటింగ్ పెట్టడం ఎలా ఉందంటే వెనకటికి ఒక ఆడపిల్లల తండ్రి "చస్తే మేనరికం ఇవ్వను, కాకపోతే సోలుపున బొందలన్నా పెడతానుకానీ" అన్నాడట.ఇది సామెత.ఎందుకు ఉదహరించానంటే అర్జునరావు గారు అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చర్చను చాలా గంధరగోళంకల్పించే విధంగా శ్రమపడి ప్రవేశపెట్టబడిన చర్చపై అనువాదయంత్రం వాడిన వాడుకరులు, సుదీర్ఘ చర్చలో పాల్గొని వారి అభిప్రాయాలు వ్యక్తీకరించారు.ఆ చర్చలో పాల్గొన్న 10 మందిలో ఒకళ్లు ఇద్దరు తప్ప మెజారిటీ వాడుకరులు యాంత్రిక అనువాదం స్థాయి 70 శాతానికి మాత్రమే ఉండటానికి మద్దతు తెలుపుతూ, దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చారు.అలాంటిదాన్ని వికీ సంప్రదాయం ప్రకారం, ఆ చర్చలో పాల్గొనని వాడుకరి ఎవరైనా నిర్ణయం ప్రకటించేంతవరకు వేచిచూడాలి. పోనీ నిర్ణయం ప్రకటించమని అర్దునగారు ఎవరినైనా అభ్యర్థించారా అంటే అదిలేదు.నాకు తెలిసినంతవరకు 2013లో మొలకల నియంత్రణ విధానానికి మాత్రమే ఓటింగు ప్రక్రియ జరిగింది.ఏడు సంవత్సరాల నుండి ఓటింగు ప్రక్రియ దేనికి జరుగకుండా, దీనిని మాత్రమే ఓటింగుకు ప్రవేశపెట్టటం అర్జున గారు దురభిప్రాయం ప్రస్పుటంగా అర్థమవుతుంది.లేచిందే లేడికి ప్రయాణం అన్న చందంగా ఓటింగుకు పెట్టారు.ఇది ఎలా ఉందంటే ఎన్నికల ప్రకటన లేకుండా, రేవు పోలింగు జరుగుతుంది.ఓటుహక్కు ఉపయోగించుకోండి అన్న చందంగా ఉంది.ఇంకొకటి బాటన (త్రోవన) ప్రయాణించినవారు ఎవరూ ఆబాట బాగాలేదని అనలేదు. బాటను అసలు ఉపయోగించనివారు అబ్బే ఆ బాట బాగలేదన్నట్లుగా ఉంది.అంటే యాంత్రిక అనువాద యంత్రం ఉపయోగించినవారు 70 అనువాద శాతానికి కుదించినదానిమీద ఎవ్వరూ అభ్యంతరం లేవనెత్తలేదు. యాంత్రిక అనువాదం మెరుగుపడాలంటే ఈ రకంగా కుదించుకుంటూ, దానిలో మానవీయశాతం పెరుగుదల పెరిగినప్పుడే, ఆ యంత్రం పూర్తిస్థాయిలో మెరుగవుతుంది.ఇది అందరికి తెలిసిన విషయమే.దానిలో మనం మార్పులు చేసేటప్పుడు క్షణ, క్షణానికి 'save' చేస్తుంది.ఆరకంగా అనువాద స్థాయి మెరుగవుతుంటుంది.అర్జున గారి ప్రతిపాదన ప్రకారం అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్న చందంగా ఉండేమాట వాస్తవం.చర్చ జరిగింది ఒకదానికి, ఓటింగులో ఇంకొక పిల్ల సబ్జెక్టును ప్రవేశపెట్టారు.ఏ రకంగా చూసినా ఓటింగు ప్రక్రియ అంతా తప్పుడు ప్రక్రియలో ప్రవేశపెట్టబడింది.కావున ఓటింగు ప్రక్రియను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.కాబట్టి ఓటింగ్ పద్ధతి ఇక అనవసరం. వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ ప్రతిపాదన చేసినవారు, చర్చలో పాల్గొన్నవారు కాకుండా, వేరే నిర్వాహకులెవరైనా ముందుకువచ్చి చర్చలో పాల్గొన్న సభ్యుల అభిప్రాయాలను బట్టి నిర్ణయం చేసి, చర్చను ముగించాలి.దీనిలో ఉపయోగించిన సామెతలు కేవలం భావన అర్థం కావటానికి ఉపయోగించాను.ఎవ్వరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దు.--యర్రా రామారావు (చర్చ) 14:56, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
User:Pranayraj1985,User:K.Venkataramana,యర్రా రామారావు గార్లకు, ప్రస్తుత విధానం సమీక్షలో మీ విలువైన సమయం వెచ్చించి పాల్గొన్నందులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాటివలన యాంత్రికఅనువాద ఉపకరణం వాడుక గురించి, సమస్యల గురించి మరింత అర్ధమైంది. తొలి ప్రతిపాదనను సవరణద్వారా మెరుగుచేయడానికి తోడ్పడింది. మీ అభ్యంతరాలు అవగాహన లోపంవలనే అని నేను భావిస్తున్నాను. మరిన్ని వివరాలకు నా స్పందన 1, స్పందన 2, స్పందన 3 లు చూడండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:00, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండీ అర్జున గారు, అవగాహన లోపం ఉన్నవాళ్ళమేమో వికీపీడియా వ్యాసాల నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నాం, చాలా అవగాహన ఉన్నమీరేమో వికీపీడియా వ్యాసాల నాణ్యతను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ఇది మాత్రం స్పష్టం. ఇలా సభ్యుల సమయం వృధా చేయకుండా, వికీ నాణ్యతకు ఉపయోగపడేలా వేరే ఏదన్నా పనికొచ్చే పని చేయండి సార్.౼౼ ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 02:53, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండీ అర్జున గారు నిజమే మాకు అవగాహనలేదు.ఈ మాట చాలామంది అన్నారు.పైన మీరు రాసిన అభిప్రాయంలో ఈ వాక్యం చూడండి. "వాటివలన యాంత్రికఅనువాద ఉపకరణం వాడుక గురించి, సమస్యల గురించి మరింత అర్ధమైంది. తొలి ప్రతిపాదనను సవరణద్వారా మెరుగుచేయడానికి తోడ్పడింది. మీ అభ్యంతరాలు అవగాహన లోపంవలనే అని నేను భావిస్తున్నాను" అని అన్నారు.దీనిలోనే మీ అహగాహనలోపం ఎంతవరకు ఉందో అర్థమవుతుంది. నిశితంగా పరిశీలించండి.మీకే అర్థమవుతుంది.ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి.అందరికి అన్నీ తెలియవు.నాకు తెలిసినవి మీకు తెలియవు.మీకు తెలిసినవి నాకు తెలియవు.మా అహగాహన సంగతి మీరు చెప్పనవసరంలేదు.నావరకు నాకు నాఅవగాహన గురించి మీ దృవపత్రం అక్కరలేదు.నేనే చెప్పుకుంటాను,నాకు అవగాహనలేదని.ఇకముందు పదేపదే అలాంటి పదాలతో తోటి వికీపీడియన్లను చిన్నబుచ్చకండి.ప్రణయరాజ్ గారు చెప్పినట్లు మీరు వికీ నాణ్యతపట్ల, భాష పట్ల సరియైన శ్రద్దచూపండి.--యర్రా రామారావు (చర్చ) 03:57, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మేము అనేక వ్యాసాలను యాంత్రికానువాదాల ద్వారా మానవీయ మార్పులు అనేకం చేస్తూ నాణ్యమైన వ్యాసాలు తయారు చేస్తున్నాం. మేము అందులో గల లోపాలను తెలియజేస్తే వాటిని పరిగణించకుండా మాకు అవగాహన లేదని అంటారా? మీరు ఒక యాంత్రికానువాదం దోషాలు లేకుండా వికీ విధివిధానాల ప్రకారం రాయండి. ప్రయోగాత్మకంగా మీకు అందులో దోషాలు తెలుస్తాయి. ఆ పరికరం వాడని/తక్కువ వాడిన ఓటింగులో పాల్గొన్న వాడుకరులు, 70% తొలగించడం వల్ల వికీ నాణ్యతాభివృద్ధి ఎలా జరుగుతుందో, ప్రస్తుతం వారు అనువదిస్తున్న నాణ్యమైన వ్యాసాలకు ప్రస్తుత విధానం ఏ విధంగా నష్టం కలిగిస్తుందో వారి అభిప్రాయాలను తెలియజేయకుండా వారు ఓటు వేసారనే ఒకే కారణంతో, మీరు చాలా అనుభవమున్న తెవికీ అధికారిగా ఎలా ఆమోదిస్తారు? ఆ పరికరం వాడుతున్న, అందులోని లోపాలను తెలియజేసిన మా వంటి వాడుకరులను అవగాహన లేదని ఎలా అంటారు? మీరెన్ని అనువాదాలు చేసారు? వాటిలో నాణ్యత ఎంత? మీరు నాణ్యమైన అనువాదం గల వ్యాసాలు తెవికీలోకి రావాలన్న విషయంపై దృష్టి పెట్టడం లేదు. ఎలాగైనా మీ విధానం నెగ్గించుకుని విపరీతమైన వ్యాసాలు (నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నా సరే) పెంచడానికి ఒక అధికారిగా కృషి చేస్తున్నట్లుంది. ఒక సారి యాంత్రికానువాదం చేసే అనుభవజ్ఞులైన వాడుకరుల అబిప్రాయాలను పరిగణన లోకి తీసుకోండి. వికీ అభివృద్ధికి దోహదపడండి.--కె.వెంకటరమణచర్చ 05:28, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వాదన స్వీయవిరుద్ధం, మీ ప్రతిపాదన వికీవిరుద్ధం, మీ వోటింగు ధర్మవిరుద్ధం

అర్జున గారూ, పైన నాకు మీరిచ్చిన ప్రత్యుత్తరంలో మిమ్మల్ని మీరే తప్పు పట్టుకున్నారు. మీరు ఒక ప్రతిపాదన పెట్టారు, దాన్ని మెజారిటీ సభ్యులు వ్యతురేకించారు. "చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి. దీనికి కనీస కాలపరిమితి వారం రోజులు." నే మీరు చెప్పిన సూత్రం ప్రకారం అసలు వోటుంగుకే రాకూడదు. అయినా మీరు వోటింగు పెట్టారు. మీరు చెప్పిన పద్ధతిని మీరే అతిక్రమించారు. చర్చను కలగాపులగం చేసేసి, వాడుకరుల అభిప్రాయాలను చీలికలు పేలికలు చేసి ఆ గందరగోళంలో ప్రతిపాదనలోకి ఓ కొత్త ఎమెండుమెంటును చేర్చి ఆ రెంటినీ కలిపేసి వోటింగుకు పెట్టారు.

  1. మీరు పెట్టిన రెండు ప్రతిపాదనల్లో ఒకదానికి వ్యతిరేకంగా రెండో దానికి అనుకూలంగా ఉన్నవారు వోటు ఎలా వెయ్యాలి? రెండు ప్రతిపాదనలు పెట్టి ఒకే వోటు వెయ్యడమేంటసలు?
  2. వికీపీడియాలో అభిప్రాయాలు ప్రధానం, వోటింగు కాదు అనే మౌలిక సూత్రానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు?
  3. మీ ప్రతిపాదనపై జరిగిన చర్చలో దాన్ని నిష్కర్షగా వ్యతిరేకించి, నిర్ద్వంద్వంగా తిరస్కరించిన వారు అనేకులు ఉన్నారు. ఇక్కడ ఈ చర్చ లోనూ వ్యతిరేకించారు. అసలు ఈ వోటింగుకు నైతికతే లేసు పొమ్మన్నారు. ఇప్పుడు వాళ్ళు వోటేస్తారని మీరు అనుకుంటున్నారా? మరప్పుడు, ఇక్కడ ఈ వోటింగుకు మద్దతుగా కొన్ని వోట్లు, వ్యతిరేకంగా అసలేమీ రాకపోతే, మీ ప్రతిపాదన నెగ్గినట్టా? అలా భావిస్తే అందులో నైతికత ఉందా?
  4. అలా భావించి దాన్ని తెవికీ సముదాయం అభిప్రాయంగా మీరు ప్రకటించగలరా?
  5. మా సముదాయం నిర్ణయం ఇదీ అని అనువాద పరికరం డెవలపరుకు చెప్పి మీరు చెయ్యదలచుకున్న మార్పులు వారి చేత చేయించగలరా?
  6. అంతెందుకు సార్.., మీ ప్రతిపాదనను వ్యతిరేకించేవాళ్లంతా ఇక్కడ ఈ చర్చా పేజీలో ఒక వోటింగు పెట్టి మీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.

మీరు తలపెట్టిన ఈ ప్రతిపాదనలో మీ మోటివేంటో నాకు తెలవదు గానీ సహేతుకత మాత్రం లేదు అర్జున గారూ.

  1. మీరు చేసిన అనువాదాలు 11. నేను 200 పైచిలుకు అనువాదాలు చేసాను. అవి కాకుండా సుమారు 70 లక్షల బైట్లు అనువదించి కాపీ పేస్టించి ప్రచురించాను. అత్యధిక అనువాదాలు చేసిన తొలి నలుగురిలో ముగ్గురు మీ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయినా మేమంతా పరికరంపై పరిమితి అలానే ఉంచాలని అన్నాం. అనుకూలంగా ఎవరూ మాట్టాడలేదు. ఇతర వాడుకరులు కూడా మీ ప్రతిపాదనను తిరస్కరించారు.
  2. మీరు అనువాదాల్లో వచ్చిన దోషాలను ఎన్నడూ సవరించింది లేదు. నేను అనేక వందల అనువాద దోషాలను సవరించాను, ఎత్తిచూపాను. దోషాల గురించి ఆయా వాడుకరులకు సూచనలిచ్చాను. సరిచేయించాను. అనేక మంది ఇతర వాడుకరులు కూడా ఈ పనులన్నీ చేసారు. మీరు ఇవేమీ చెయ్యలేదు. కానీ మీరు దోషాలకు అనుకూలంగా ప్రతిపాదన చేసారు, మేం వ్యతిరేకించాం. అయినా..
  3. కొన్ని పేజీల్లో అనువాదాలు దోషభూయిష్టంగా ఉన్నాయని, వాటి సరిచెయ్యలేమని, తొలగించాలనీ నేను చర్చకు పెట్టాను. అనేక మంది ఇతరులు కూడా తొలగింపు ప్రతిపాదనలు చేసారు. ఈ చర్చల్లో పాల్గొన్నాం. నిర్ణయాలు తిసుకుని కొన్నిటిని తొలగించాం. అలాంటి వాళ్ళం మేం మీ ప్రతిపాదనను వ్యతిరేకించాం. మీరు మాత్రం..
  4. 1700 పైచిలుకు యాంత్రికానువాదాలపై అనేక సంవత్సరాల పాటు చర్చలు జరిగాయి. తొలగించాలని అనేక మంది చెప్పారు, నిర్ణయించారు. చివరికి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తొలగించాం. ఆ చర్చల్లో నేనూ చురుగ్గా పాల్గొన్నాను. ఇతరులూ పాల్గొన్నారు. మీరు పాల్గొనలేదు. అయినా..
  5. అంతెందుకూ.., మీరు ఈ ప్రతిపాదన తెచ్చిన తరువాతనే అనేక మంది వాడుకరులు అనువాద పేజీలను సృష్టించారు. వాటిలో అనేక అనువాద దోషాలు ఉన్నాయి. ఒక్కటైనా మీరు సవరించారా? ఒక్కదాని గురించైనా చర్చకు పెట్టారా? వాళ్లకు సూచనలిచ్చారా? లేదు. మీ ప్రతిపాదన చర్చ పేజీలో ఇక్కడి దాన్ని అక్కడికీ అక్కడి దాన్ని ఇక్కడికీ మార్చుకుంటూ గందరగోళం చేస్తూ ఉండగా, మేం ఆయా పేజీల్లో దోషాలను సవరించడం, వాడుకరులకు సూచనలివ్వడం, తొలగింపుకు ప్రతిపాదించడం వంటివి చేస్తున్నాం.

ఇందరు వ్యతిరేకించినా, మీ ప్రతిపాదనను వోటింగుకు పెట్టారు. ఇది ధర్మవిరుద్ధం.

ఇక పోతే, నేను చురుగ్గా లేని రోజుల గురించి మీరు మాట్టాడారు. ఏం జరిగింది అనేది ముఖ్యం, అప్పుడు ఎవరున్నారు, ఎవర్లేరు అనేది అప్రస్తుతం. మీకు తెలీదేమో.. నేను చురుగ్గా లేని రోజుల్లో చాలానే జరిగాయి. నేను చురుగ్గా పనిచెయ్యడం మొదలయ్యాక వాటి గురించి నేను మాట్టాడాను కూడా. అప్పుడు జరిగిన గొప్ప సంగతుల గురించీ మాట్టాడాను, అప్పుడు జరిగిన తప్పుల గురించీ మాట్టాడాను. అవి జరిగిన రోజుల్లో నేను చురుగ్గా లేకపోయినా మీరు చురుగ్గానే ఉన్నారు. మీరు అప్పుడూ మాట్టాడలేదు, తరవాతా మాట్టాడలేదు. మనకు అనుకూలంగా లేకపోతే నోరు మెదపక పోవడం, అనుకూలంగా ఉంటే మాత్రం అనుభవం పేరుతో ఉచిత సలహాలు ఇవ్వడం.. ఇట్టాంటివి చెయ్యకూడదు. __చదువరి (చర్చరచనలు) 07:23, 8 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, ఎంతో అనుభవమున్న మీరు పై విధంగా వ్యాఖ్యలు చేయటం నాకు బాధ కలిగించింది. మీరు ప్రస్తావించిన కొన్ని అంశాలకు నా ఇటీవలి స్పందన 2, స్పందన 3 లు ఉపయోగపడవచ్చు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:13, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మీ బాధేంటో, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇకపోతే అనుభవం అంటారా.. మీ అనుభవం ముందు నాదెంత లెండి. నేను చేసే అనువాదాల్లో ఇంకా అనేక దోషాలు దొర్లుతూనే ఉంటాయి. అనువాద పరికరంలో 30% మానవిక స్థాయి ఉండాల్సిందే అనేంత వెనకబడిన వాడుకరిని. __చదువరి (చర్చరచనలు) 00:26, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటింగ్ అనేది నియమంలోనే ఉంది

ఇక్కడ ఏమి జరుగుతోందన్నది సెలవులో ఉన్నందున నాకు పూర్తిగా తెలియదు కాని ఈ చర్చాపేజీని గమనిస్తే ఇదివరకే చర్చ జరిగిందనీ దాన్నే ఫలితంగా ప్రకటించాలనీ ప్రధాన అభ్యంతరం ఉన్నట్లుగా గమనించాను. సుమారు ఏడేళ్ళ క్రితం ఓటింగ్ మార్గదర్శకాలపై చర్చ జరిగి ఒక పద్దతి రూపుదిద్దుకుందనీ తత్ప్రకారంగా ముందుగా చర్చ జరిపి ఆ తర్వాత ఓటింగ్ చేపట్టవచ్చుననీ నియమం స్పష్టంగా చెబుతోంది. అమలులో ఉన్న నియమం ప్రకారమే అర్జునగారు చర్చ తర్వాతే ఓటింగ్ పెట్టారనీ తెలుస్తోంది. కాబట్టి ఆ చిత్తుచర్చను ఫలితంగా ప్రకటించే అవసరం ఉండదు. ఓటింగే ప్రధానం కాబట్టి నియమం ప్రకారం రెండు వారాలపాటు కొనసాగిన ఓటింగే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఓటింగును వ్యతిరేకించే అవసరం నాకైతేలేదు మరియు ఓటు వేయడానికి నాకు అభ్యంతరమూ లేదు. భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలనే ప్రతిపాదన నాకు సమ్మతమే. నేను అనువాద వ్యాసాలేమీ చేయకున్ననూ యాంత్రిక అనువాదాల గురించి పూర్తిగా తెలుసు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:55, 9 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుడు:C.Chandra Kanth Rao గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:00, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, నాకు సమయం లభించనందున వివరంగా నా అభిప్రాయాలు వ్రాయలేకపోతున్నాను కాని ఈ ఓటింగ్ జర్పుటకు మరియు ఫలితం వెలిబుచ్చుటకు ఎలాంటి అభ్యతరం ఉండదు. అలాగే కొందరు అనుమానిస్తున్నట్లుగా నాణ్యతపై కూడా దీని ప్రభావమేమీ ఉండదు. ఎలా అన్నది త్వరలోనే పూర్తిగా తెల్పగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:34, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వోటింగులో నైతికత ఉందా..?

ఈ వోటింగును వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి అనే విధానం ప్రకారం ఈ వోటింగు పెట్టారు. అందులో ఒకటి కంటే ఎక్కువ ప్రతిపాదనలను వోటింగుకు పెడితే ఏంచెయ్యాలి అనే సంగతిని ఆ విధానం చెప్పలేదు. ఏం చెయ్యాలో తెలియక ఆయన, అక్కడి చర్చలో అడిగారు గానీ ఎవరూ దానికి సమాధానం చెప్పకపోవడంతో అది విఫలమై పోయింది. ఆయనే దాన్ని విఫలం చేసారు. తనకే స్పష్టత లేని విషయాన్ని పట్టించుకోకుండా ఈ వోటింగును మాత్రం తీసుకువచ్చారు. __చదువరి (చర్చరచనలు) 04:28, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటుకు అనుకూలమే

అర్జున గారు, ఎందుకు అంత పట్టుపడుతున్నారు. అనేది అర్థం కాని విషయం పూర్తిగా వ్యతిరేకించాను. అయిన గురువు గారికి ఓటు అనుకూలమే, అందరూ వ్యతిరేకించిన అనుభవజ్ఞులు అంత పట్టుబట్టడం వెనక ఏదో ఉంది, ఓటింగ్ కు మందు విషయం చెప్పకపోయినా ఓటింగ్ గడువు తర్వాత వివరిస్తారా ఆశిస్తూ... ఓటింగ్ విఫలమైతే 70శాతం యధావిధి సఫలమైతే చూడాలి అక్షర కాలుష్యం ఆరంభమవుతుందా లేక మంచి వ్యాసాలు కొత్తగా తేవి లోనికి చేరుతాయా... కాలచక్రం నిర్ణయం చేస్తుంది. చదువరి, వెంకటరమణ,పవన్ సంతోష్, అర్జున, రామారావు, ప్రణయరాజ్, రవిచంద్ర, మీరంటే అంటే నాకు చాలా ఇష్టం... వికీలో మీ శ్రమ, మీ స్పీడు, మీ అంకితభావం...మీ సహనం సామాన్యమైనది కాదు. ఈ విషయంలో క్షమించండి. గురువుగారికి విధేయత చూపించవలసిన సమయం తరుణం ఇదే కావచ్చు...నా ఓటు అనుకూలమే. ప్రభాకర్ గౌడ్ నోముల 06:26, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. అనువాద వ్యాసాల నాణ్యత ప్రాజెక్టు పేజీ తయారైన పిదప ప్రస్తుత విధానంపై సమీక్షను, కొత్త ప్రతిపాదనలను మూడువారాలపాటు చర్చించడం జరిగినది. చర్చను నిర్మాణాత్మకంగా జరపటంలో సహకరించని కొంతమంది సభ్యులు ఓటు ప్రక్రియను బలహీనపరచేవిధంగా ఓటు ప్రక్రియ కాలంలో వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఓటు ప్రక్రియ ముగిసిన తరువాత కూడా అభ్యంతరాలు తెలపవచ్చు. నా ఆసక్తి ప్రతిపాదన ఓడిందా, గెలిచిందా అన్నది కాదు. ఒకవేళ వోడితే 60 రోజుల తరువాత ఇంకొక కొత్త ప్రతిపాదన మొదలు పెట్టవచ్చు. గెలిచినా ప్రతికూలాలు ఎక్కువగా కనబడితే ప్రస్తుత విధానాన్నే మరల తేవాలని కొత్త ప్రతిపాదన చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వికీ చర్చలు, విధానాల నిర్ణయంలో ఎక్కువమంది సభ్యులు పాల్గొనేలా చేయడం, వికీచర్చలు సామరస్యంగా, అందరికీ అర్ధవంతమయ్యేలాగా జరపటం. వాటిలో ఎక్కువమంది సభ్యులు పాల్గొంటేనే వికీ ఎక్కువకాలం అభివృద్ధి దిశగా కొనసాగగలుగుతుంది. ఎంతో మంది వికీకృషిని ప్రభావితం చేసే విధానం, ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వని కొద్దిమంది తమ అభిప్రాయాల అధారంగా చేయాలనడానికి నేను విరుద్ధం. విస్తృత సముదాయ చర్చల ఫలితంగా ఏర్పడిన పద్ధతులను గౌరవించడం కూడా చాలా ముఖ్యం. --అర్జున (చర్చ) 00:21, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాఖ్యలు నొప్పిస్తున్నాయి

సర్, ఒక పక్క చర్చ ముగిసిపోయిన తరువాత, సదరు ప్రతిపాదనపై వోటింగ్ ప్రక్రియ కొనసాగుతూ వున్నప్పుడు ఓటింగులో పాల్గొన్న కొంతమందిని చిన్న చూపు చూడటం బాగోలేదు. రచ్చబండలో చేస్తున్న వ్యాఖ్యలు నొప్పిస్తున్నాయి. వోటింగ్ మధ్యలో వున్నప్పుడు ప్రతిపాదనకు మద్దతుగా నిలిచిన వారిని, ఓటువేసిన వారిని ఉద్దేశిస్తూ కేవలం 11 అనువాదాలు మాత్రమే చేసిన వ్యక్తులుగా...., అనువాద దోషాలను ఓరకంటా కూడా చూడని వ్యక్తులగా...., ఈగోతో హుంకరించే స్థాయి వ్యక్తులగా...... పరికరం వాడని/తక్కువ వాడిన ఓటింగులో పాల్గొన్న వాడుకరుల.....ఇలా నిర్వాహకులే ఒక ప్రతిపాదనకు మద్దతుగా ఓటు వేసినవారిని పేర్కొంటూ చులకన చేస్తే ఏలాగండి? పైగా నిర్వాహక స్థాయిలో వున్న అనుభవజ్ఞులు కనీసం వోటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకైనా రచ్చబండలో "వోటింగ్ లో పాల్గొన్న సభ్యుల"పై కామెంట్స్ పాస్ చేయకుండా, కాస్త సంయమనం పాటించండి. సభ్యులుగా కొన్ని నిర్దిష్ట అర్హతలున్నవారు ఓటింగులో పాల్గొనవచ్చు. అలా ఓటు వేసే అవకాశం ఉందనుకొనే వచ్చాం. తీరా ఓటింగులో పాల్గొనేసరికి ఒకసారి కూడా అనువాదం చేయనివారు, కొన్ని అనువాదాలు చేసినవారు అంటూ చిన్నబుచ్చినట్టు మాట్లాడడటం భావ్యం కాదు. మీరు 10 లక్షల బైట్లుకు పైగా అనువాదం చేసి ఉండవచ్చు. నిస్సందేహంగా గొప్ప అనుభవజ్ఞులు మీరు. తెలుగు వికీలో అందరూ గుర్తించే స్థాయి మీది. అంగీకరించాల్సిన విషయాన్ని అంగీకరిస్తున్నాం. కానీ అది చర్చలో అభిప్రాయాలు ఎక్స్చేంజి చేస్తున్నప్పుడు మాత్రమే పరిగణించండి. అక్కడ మమ్మలి కావచ్చు. మాబోటి తక్కువ అనుభవం వున్న వారిని కావచ్చు. చర్చలో భాగంగా చెప్పండి. ఒప్పుకుంటాం. కానీ చర్చ ముగిసిపోయి ఓటింగు క్యూ లో వున్నప్పుడు అందరూ సమాన ప్రతిపత్తులతో ఓటు వేస్తాము. అక్కడ అనుభవజ్ఞులకని 10 అదనపు ఓట్లు కానీ, అనుభవం లేని మా వంటివారికి ఒక ఓటు అని ఉండదు. నిర్దిష్ట అర్హత వున్న ప్రతీ సభ్యుడూ సమాన ప్రతిపత్తితో ఓటు హక్కు కలిగివుంటారు కాబట్టి ఈ టైం లో ఓటు వేసినవారిని అనుభవం లేనివారని, కొద్ది అనువాదాలు మాత్రమే చేసినవారని చులకనగా చూడవద్దు. ఒకవేళ అనువాదాలు గురించి మీకు మాత్రమే తెలుసు, మాకు తెలియవు కావున మావంటివారు వోటింగ్ ద్వారా అనువాద విధానాన్ని ప్రభావితం చేస్తున్నారు అనే అభిప్రాయాలు వంటివి ఏమైనా ఉంటే, మాబోటివారిని ముందుగానే వోటింగ్ అర్హతలు తొలగించండి. మీరు కోరుకున్న సంఖ్యలో అనువాదాలు చేసిన వారికి మాత్రమే, అనువాదంలో విశేష అనుభవం వున్న సభ్యులకే ఓటు హక్కు ఉండాలనే నియమం పెట్టండి. సలక్షణంగా తప్పుకొనిపోతాం సర్. ఇక్కడ సెకండ్ గ్రేడ్ ఓటర్ స్థాయిలో గుర్తిస్తున్నప్పుడు, ఓటు వేయడం మాకు నొప్పిస్తున్నది. కొద్దిగా గుర్తించండి. --Vmakumar (చర్చ) 01:24, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఏ వ్యాఖ్య గురించి ప్రస్తావిస్తున్నారు? ఓటింగ్ ప్రక్రియ సరిగా ప్రారంభం కాలేదని 8 వేల పదాల సుదీర్ఘ చర్చలో పాల్గొని సమయం వెచ్చించినవారిలో అత్యధికుల అభిప్రాయం. మిమ్మల్ని వ్యక్తిగతంగా నొప్పించిన వ్యాఖ్య ఏమిటో, ఎవరిదో సూటిగా చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:15, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vmakumar గారూ, మీరు పొరబడ్డారు. "ఓటువేసిన వారిని ఉద్దేశిస్తూ" నేనా మాటలు అనలేదు. అనలేదు. అనలేదు. వోటేసిన వాళ్ళపై అసలు నాకు అలాంటి ఉద్దేశమే లేదు. రచ్చబండలో నేను రాసిన మూడూ పాయింట్లనూ మళ్ళీ చదవండి. నేను రాసినది వోటర్లను అన్నట్టు ఎక్కడ అనిపించిందో చెప్పండి.
అలాగే మీరు ఈ వోటింగుకు మూలమైన చర్చను మళ్ళీ చదవండి. ఆ చర్చలో నేను రాసినది (చదువరి స్పందన) చదవండి.. 30% మంచిదే అనే నా వాదనను నేను చేసిన లక్షలాది బైట్ల అనువాదాల నేపథ్యంలో చెప్పాను. 30% మంచిది కాదని ప్రతిపాదకుడు ఏ అనుభవంతో చెబుతున్నారు అని అడిగాను. యాంత్రికానువాదాలు, కృత్రిమ అనువాదాల గురించి అనేక చర్చల్లో నేను పాల్గొన్నాను. అనేక పేజీల్లో సవరణలు చేసాను, సవరణలు సూచించాను. ఆ అనుభవ నేపథ్యంలో చెప్పాను 30% తగ్గిస్తే వికీకీ మేలు జరగదు అని. ఏ అనుభవంతో దాన్ని తగ్గిస్తే వికీకి మేలు జరుగుతుందని ఏ అనుభవంతో చెబుతున్నారు అని ప్రతిపాదకుణ్ణి అడిగాను నాకు సమాధానం రాలేదు. అనుభవం గల సభ్యుని నిర్ణయాన్ని పరికరం గౌరవించడం లేదు అని ప్రతిపాదకుడు అంటే అనుభవానికీ అనువాదానికీ సంబంధం లేదని ఆయన చేసిన అనువాదాల్లోనే తెలిసిపోయిందని చెప్పాను. ఈ చర్చనంతా పక్కన పెట్టేసి నేను రాసిన దాన్ని అపార్థం చేసుకుని, వక్రీకరిస్తున్నారు.
అనుభవజ్ఞుణ్ణని నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. చెప్పుకోను కూడా. నాకు ఎవరూ మేకతోలు కప్పనక్కర్లేదు. ఆ భేషజాలు నాకక్కర్లేదు. పై మీ వ్యాఖ్య అంతా నాగురించి పొరబడి రాసినట్టుగా ఉంది.
ఒకసారి మీరు నా వ్యాఖ్యలు - రచ్చబండలోది, చర్చలో, ఇక్కడా - అన్నీ మళ్ళీ చదవండి. ఎక్కడా "వోటింగ్ లో పాల్గొన్న సభ్యుల"పై నేను ఏ వ్యాఖ్యలూ చెయ్యలేదు. ఒకవేళ నేను రాసిన మాటలు వోటేసిన వాళ్ళను అన్నట్టుగా అనిపిస్తే ఎక్కడ అలా అనిపించిందో చెప్పండి. మీకు అలా అనిపించకుండా ఉండేలా రాయలేకపోయినందుకు - నా ఉద్దేశం అది కాకపోయినా సరే - బేషరతుగా క్షమాపణ చెబుతాను.
ఇక మీ పై వ్యాఖ్యలో మీరు రాసిన మిగతాదంతా మీ పొరపాటుకు పొడిగింపే కాబట్టి దాన్ని నేను పట్టించుకోవడం లేదు. __చదువరి (చర్చరచనలు) 05:00, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vmakumar గారూ, ఈ గూగుల్ అనువాదాలను చేస్తున్నప్పుడు అది చేసిన దోషపు అనువాదాలను, వాటిని శుద్ధిచేసే క్రమంలో కలిగే యిబ్బందులను గూర్చి చర్చింది 30% మానవీయ అనువాదం చేస్తే మంచిదనే అభిప్రాయంతో ఒక విధానాన్ని ఇదివరకు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చాలంటే, మానవీయ అనువాదం 30% పరిమితి తొలగించాలంటే ఓటింగులో పాల్గొన్న వ్యక్తులలోని వారు గూగుల్ అనువాద పరికరాన్ని ఉపయోగించేటప్పుడు వారికి గల అసౌకర్యాలను, లోటుపాట్లను చర్చించాలనే ఉద్దేశ్యంతో వ్యాఖ్య చేసాను. నా వ్యాఖ్య మీకు నొప్పించి ఉంటే క్షమించగలరు.--కె.వెంకటరమణచర్చ 06:05, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నేను పైన రాసిన వ్యాఖ్యకు "తెలిసిపోయిందని చెప్పాను" అనే చోట చిన్న సవరణ చేసాను. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 06:16, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
K.Venkataramana గారు, మన మధ్య, ఆత్మీయుల మధ్య "క్షమిం ...." లాంటి పదాలు ఎంతమాత్రం అవసరం లేదు. చక్కని అంకితభావంతో పనిచేస్తున్న మీ వంటి సహృదయుల నోటి వెంట క్ష..వంటి పదాలు వస్తే అప్పుడు నిజంగానే ఫీల్ అవుతాను. చిన్న చిన్న తప్పులు మనం కావాలని చేయకపోయినా ఒకొక్కప్పుడు అనుకోకుండా అలా దొర్లిపోతాయి. ఇదీ అంతే. తప్పొప్పులు అందరం చేస్తాం. నేను కూడా చేస్తాను. సరిదిద్దుకొంటూ ఫీడ్ బ్యాక్ చేసుకొంటూ మరింత మెరుగుగా వెళ్లడానికి ప్రయత్నం చేద్దాం. అది చాలు. అంతే. నేను కూడా ఎక్కువ రియాక్ట్ అయినట్లు వున్నాను. నిజం చెప్పాలంటే నాకు తెలుగు వికీలో తొలి గురువు, మార్గదర్శకులు మీరే. అలాంటి మీ నుంచి ప్రోత్సాహక పదాలు కోరుకొంటానే గాని, క్ష ...లాంటి పదాలు ఎంతమాత్రం కాదు. మీవంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్, ఆత్మీయునితో కలసి వికీలో పనిచేస్తున్నందుకు really I proud of you. కలసి ఆత్మీయంగా పనిలో తిరిగి నిమగ్నమవుదాం.
చదువరి గారు, పవన్ సంతోష్ గారు నా ఫీలింగ్స్ తో మిమ్మల్ని కూడా నొప్పించి ఉంటే క్షమించగలరు. దీనిని పాజిటివ్ గా తీసుకొంటే--- ఎన్నో కొన్ని అనువాద వ్యాసాలు నేను కూడా చేసివుండాల్సింది అనిపించింది. చిన్నప్పటినుంచి ఫస్ట్ బెంచ్ వాడిని. తెలుగువికీలో మాత్రం లాస్ట్ బెంచ్‌లో ఉంటున్నాను అని అర్ధమవుతుంది. నిజంగా స్పీడ్ అప్ చేసుకొంటాను. దీనికి చర్చ, చదువరి, పవన్ సంతోష్ తదితరుల సహకారం కావలిసి ఉంటుంది. ఇప్పటివరకూ 1,2 తప్ప చర్చలలో పాల్గొనలేదు. అది నా సబ్జక్ట్ కాదేమో అనిపించేది. అయితే మన డెసిషన్స్ మారినా, మారకపోయినా, డిబేట్ లలో మన ఒపినిఒన్స్ ఎక్స్చేంజి అవుతాయి. ఇక నుంచి ఎంతో కొంత వరకైనా చర్చలలో పాల్గొనే ప్రయత్నం చేస్తాను. అలాగే "చర్చలో పాల్గొనడంతోనో, వోటు వెయ్యడం తోనో, మన బాధ్యత తీరిపోదని మాత్రం మనందరం గుర్తించాలి." నిజంగా మంచి మాట చెప్పారు. అనువాదాలు, మొలకలు విస్తరణలలో నావరకూ నేను నాకున్న పరిధిలో ఎంతో కొంత అయినా ఇకనుంచి క్రియాశీలకంగా వుండాలని నిర్ణయం తీసుకొంటున్నాను.

--Vmakumar (చర్చ) 16:23, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మహెష్ కుమార్ గారూ, మీరు క్రియాశీలకంగా వుండాలని నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నాను. మీరు ఎక్కువగా చర్చలలో పాల్గొనలేరంటున్నారు కాని ఈ చర్చలో మీ అభిప్రాయాలు చూస్తే పూర్తి తెవికీ పరిపక్వత కలిగి హుందాతనంతో ఉన్నాయి. మీ రాకతో చర్చలలో ఇదివరకున్న ధోరణులు నశిస్తాయనీ, హుందాతనం పెరుగుతుందనీ ఆశిస్తున్నాను. ఈ చర్చలో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో కూడా నేను ఏకీభవిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:28, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావు గారికి మీ అభిమానానికి కృతజ్ఞతలు. ప్రజాస్వామిక స్ఫూర్తితో మరింతగా కృషి చేస్తాను. --Vmakumar (చర్చ) 02:50, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vmakumar గారూ, మీరు నన్ను నొప్పించలేదు. నేను వోటేసిన వాళ్ళను ఏమీ అనలేదు అన్న సంగతి మీరు గ్రహిస్తే అది చాలు నాకు. కానీ గొప్పవిషయమేంటంటే సార్..
"ఎన్నో కొన్ని అనువాద వ్యాసాలు నేను కూడా చేసివుండాల్సింది అనిపించింది." అని అన్నారు చూసారూ.. అది చాలా ఆదర్శవంతమైన మాట. చప్పట్లు! అందరూ ఆచరించాల్సిన మాట అది. పరికరం చేసే అనువాదం ఎలా ఉంటుందో, అవి సరిచెయ్యకుండా ప్రచురించేస్తే ఎంత అపరిపక్వంగా ఉంటుందో ఆ పరికరాన్ని వాడితే బాగా తెలుస్తుంది. (మచ్చుకు ఇది చూడండి సార్. 1% మాత్రమే మానవికంగా చేసారు, మిగతా 99% యాంత్రికానువాదమే. ఇది 30% పరిమితి విధించడానికి ముందు చేసిన అనువాదం.) __చదువరి (చర్చరచనలు) 04:18, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Vmakumar: గారూ, అనువాద ఉపకరణాన్ని వాడతానని మీరు ముందుకు రావడం, విషయాన్ని సరళంగా, అర్థం చేసుకోవడం చాలా చాలా బావుందండీ. ఇక్కడ నేను అనువాద ఉపకరణంతో వ్యాస రచన చేసేందుకు ఒక ఋతువు ప్రారంభించుకోవాలన్న ఆలోచన పంచుకున్నాను. మీరూ చూసి ఓ ముక్క రాస్తారని, భవిష్యత్తులో ఆ అనువాద ఉపకరణపు వ్యాస రచన ఋతువులో భుజం భుజం కలిపి చక్కని అనువాదాలు మనం చేస్తామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:22, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Vmakumar: గారూ, ఎక్కడైనా ఏదేని విషయంలో ఇరుపక్షాల మధ్యన జరిగిన చర్చల్లో సయోధ్య కుదరకపోతే, ఇరువురికి సంబంధించిన మధ్యవర్తులు నిర్ణయం ప్రకటిస్తారన్న విషయం మనందరికీ తెలుసు. ఇక మీరు తెవికీ చర్చలను పార్లమెంట్ చర్చలతో పోల్చారు, బాగుంది. కానీ ఇక్కడ మీకో విషయం గుర్తు చేయదలచాను. పార్లమెంటులో ఇరు సభలకు సభాపతులు ఉంటారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత సభాపతి నిర్ణయం తీసుకుంటారు కానీ, ప్రతిపాదన చేసినవారే నిర్ణయం ప్రకటించి ఓటింగ్ కు వెళ్ళరు. కానీ ఇక్కడ ప్రతిపాదన చేసినవారే నిర్ణయం ప్రకటించి ఓటింగ్ కి వెళ్ళారు. మరి ఇదేం విధానమో మీరే చెప్పాలి. ఇదంతా తెలుసుకోకుండా సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొనడం ఏంటి అనేదే మా వాదన. అంతేకానీ, ఓటింగ్ లో పాల్గొన్న సభ్యులను చిన్నచూపు చూడలన్నా ఉద్దేశ్యంకాదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:23, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలో పాల్గొనలేనపుడు తరువాత దశలో ఓటు వేయడాన్ని పాయింట్ అవుట్ చేయవచ్చా?

చర్చలు ముగిసిపోయాయి. ఓటింగు ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. దీనిపై అప్పడు జరిగిన చర్చలో వీలుని బట్టి కొందరు సభ్యులు పాల్గొంటారు. కొందరు పాల్గొన లేకపోవచ్చు. చర్చలో పొల్గొనలేకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి కదా. దానిని పాయింట్ అవుట్ చేయడం భావ్యం కాదు. ఒక చర్చలో ఎవరెవరు ఏ, ఏ అభిప్రాయాలు వెలిబుచ్చారు. వాద ప్రతివాదనలను ఆ చర్చ ముగిసిన తరువాత అయినా సభ్యులు తెలుసుకొనే అవకాశం వుంది. ఓటింగు ప్రక్రియలో పాల్గొనే వారు ఆ విధంగా తెలుసుకొని కూడా ఓటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే తీరా వోటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నప్పుడు, చర్చలో అప్పుడు వాళ్ళు participate చేయలేదు అనే పాయింట్ రాకూడదు. ఉదాహరణకు పార్లమెంట్ చర్చలు చూడండి. ఒక అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు, అనుభవజ్ఞులు, ఆ సబ్జెక్టు మీద కమాండ్ వున్న సభ్యులు మాత్రమే చర్చలో వాడి,వేడిగా పాల్గొనడం చూస్తాం. మిగిలిన సభ్యులు తమకు ఆశక్తి ఉన్నమేరకు మాత్రమే చర్చలో పాల్గొంటారు. లేదా సభకు గైరుహాజరు కూడా అవుతారు. అయితే చర్చానంతరం వోటింగ్ నిర్వహించినపుడు సభ్యులందరికి (చర్చలో పాల్గొన్న వారికి, పాల్గొనని వారికి కూడా) సమానస్థాయిలో వోటింగ్ హక్కు ఉంటుంది. చర్చలో పాల్గోలేదని, అనుభవం లేదని, కొద్ధి అనుభవం వున్న సభ్యులు కూడా ఓటింగులో పాల్గొన్నారని ... సంబంధిత టెక్నాలజీ పరికరం వాడని/తక్కువ వాడి ఓటింగులో పాల్గొన్న వారని ... ఇలా ఓటింగులో పాల్గొన్నందుకు తోటి సభ్యులను అనుభజ్ఞులైన నిర్వాహకులు చిన్న చూపుగా చూడటం.... ఇబందిగా వుంది.

సర్ చర్చలో పాల్గొనడం వేరు. ఓటింగులో పాల్గొనడం వేరు. ఈ విషయం మీద నాకు తెలిసిన రెండు విషయాలు చెపుతాను. చర్చ (డిబేట్) అనేది ప్రాధమికంగా Exchange of different opinions. కానీ ఓటింగ్ అనేది choosing of a particular opinion. డిబేట్ లో అంతిమంగా వెలువడేది కేవలం ఒపీనియన్ మాత్రమే. ఏకాభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం, భిన్నాభిప్రాయం ... ఇలా ఏదైనప్పటికీ, చర్చలో వెలువడేది అభిప్రాయం మాత్రమే. అభిప్రాయాలను ఎక్స్చేంజి మాత్రమే చేయగలం కానీ ఒక నిర్ణయంగా ప్రకటించలేము. డిబేట్ లో ఒక అభిప్రాయం కేవలం వోటింగ్ తోనే నిర్ణయంగా మారుతుంది. చట్టబద్దత అనేది నిర్ణయాలకు ఉంటుంది కానీ అభిప్రాయాలకు ఉండదు. అందుకే డిబేట్ లో అంతిమంగా వెలువడిన ఏ అభిప్రాయానికి అయినా చట్టబద్దత కలిగించడానికి, ఆ డిబేట్ చివరలో వోటింగ్ నిర్వహిస్తారు. ఒక చర్చలో మొత్తం సభ్యులందరు పాల్గొన్నప్పటికీ ఆ చర్చా ఫలితం మొత్తం సభ్యులందరికీ శిరోధార్యం కాబోదు ఎందుకంటే ఆ చర్చా ఫలితం ఏదో ఒక రూపంలో వున్న ఒపీనియన్ మాత్రమే. ఒక చర్చానంతరం ఓటింగులో కొద్దిమంది మాత్రమే (Quorum ఉండాలి) పాల్గొని ఓటు వేసినప్పటికీ ఆ ఓటింగ్ ఫలితాన్ని (ఓటు వేసిన, వేయని సభ్యులతో సహా) మొత్తం సభ్యులందరూ శిరసావహించాల్సిందే. ఎందుకంటే అది నిర్ణయం రూపంలోకి మారిపోయింది కాబట్టి. వికీపీడియాలోనే కాదు, ఎవరైనా సామరస్యంగా ఉంటుందని డిబేట్ వరకూ సూచిస్తారు. చర్చ వాడి, వేడిగా కొనసాగినపుడు మాత్రం వోటింగ్ ను సూచిస్తారు. అయితే law of natural justice ప్రకారం వోటింగ్ కు ముందు ఒక చర్చ జరగడం తప్పనిసరి చేస్తారు. వికీలో కూడా చర్చ జరిపి ఆ తర్వాత ఓటింగ్ చేపట్టవచ్చు అనే నియమం ఉందని పెద్దలు కూడా చెపుతున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న వోటింగ్ కు ముందుగా ఒక చర్చ జరిగింది. అయితే చర్చలో విస్తృతంగా పాల్గొన్న అనుభవజ్ఞలైన సభ్యులు ఇది చర్చతోనే ఆగిపోవాలని ఎందుకు అంతగా కోరుకుంటున్నారు? వోటింగ్ కు ఎందుకు కాదంటున్నారు. --Vmakumar (చర్చ) 01:42, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, మీ అభిప్రాయంతో చాలావరకు ఏకీభవిస్తున్నాను. ఒకే ఒక్క విషయంలో మీ అభిప్రాయంతో విభేదిస్తాను. వికీపీడియా ఫక్తు ప్రజాస్వామ్యం కాదు.. పార్లమెంటులో జరిగే డిబేట్లు, వోట్లూ.. పద్ధతి ఇక్కడ అనువైనది కాదు. ఇక్కడ మనం వెలిబుచ్చే అభిప్రాయాలే ప్రధానం. అభిప్రాయంతో కూడిన వోటుకు ఎప్పుడూ విలువ ఎక్కువే. అభిప్రాయం లేని వోటు కంటే అభిప్రాయానికే విలువ ఎక్కువ. (నేను ఇక్కడ వోటేసిన వాళ్లను ఏమీ అనడంలేదు. నాకు వాళ్లపై దురభిప్రాయమేమీ లేదు) __చదువరి (చర్చరచనలు) 05:14, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక మార్పు-సామరస్యంగా, పూర్తి ఆశావాదంతో పయనిద్దాం

సర్, ఓటు హక్కు సభ్యులకు కల్పించబడినప్పుడు, మన అభిప్రాయాలు మనకు వున్నట్లే, ఇతర సభ్యులకి కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్లకి ఉంటాయి. మన అభిప్రాయాన్ని మనం ఎంత విలువ ఇస్తున్నామో, ఎంత బలంగా నమ్ముతున్నామో, ఇతరులు కూడా తమ అభిప్రాయాలని అంతే బలంగా నమ్ముతారు. వారి వారి అభిప్రాయాలకి తగ్గట్లే ప్రతీ సభ్యుడు ఓటు వేస్తాడు. మెజారిటీ బట్టి గెలుపోటములు నిర్ణయమవుతాయి. డెమోక్రసీ లో ఇంత సింపుల్ గా ఉండాల్సిన విషయంలో చర్చ జరిగిపోయి వోటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు sarcastic comments దేనికి అనేదే నా బాధ? రచ్చబండలో ఇలాంటివి తప్పుగాకపోవచ్చు. సాధారణ సభ్యులు ఆవేదనతో ఆక్రోశంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఒకలా అర్ధం చేసుకోవచ్చు. అయితే మార్గదర్శకులుగా ఉండాల్సిన నిర్వాహకులు కూడా సంయమనం కోల్పోతున్నారు అన్నదే నా అభిప్రాయం. ఒకవైపు ప్రతిపాదకుడు నిదానంగా, హుందాగా తన పని చేసుకుపోతున్నారు. సందేహాలకు సమాధానాలిస్తూ వున్నారు. చర్చ ముగిసిన తరువాత ఎవరినీ నొప్పించే వ్యాఖ్యలు చేయలేదు. ఆవేశాలకు, భావోద్వేగాలకు అసలు లోను కాలేదు. తాను నమ్మిన ఒక విధానం తెలుగు వికీకి మంచి చేస్తుంది అనే అభిప్రాయంతో చర్చకు పెట్టారు. చర్చలో లేవనెత్తిన ఒకానొక అభ్యంతరాన్ని కూడా పరిగణించి, దానిని సవరణగా ప్రతిపాదనలో భాగంగా చేశారు. చర్చలో పాల్గొన్న 10 మంది సభ్యులలో అత్యధికం ఆయనకు మద్దతు పలకక పోవచ్చు. కానీ ఒక ప్రతిపాదకుడు తాను నమ్మిన ప్రతిపాదన తెలుగు వికీకి మంచి చేస్తుంది అని త్రికరణశుద్ధిగా నమ్మినపుడు, అతని ప్రతిపాదనకు చర్చలో మద్దతు దొరకనప్పుడు ప్రతిపాదకునిగా ఆయనకు వున్న ఆప్షన్ ఏమిటి? మరింత విస్తృత స్థాయిలో (ఓటింగు స్థాయిలో) మద్దతు కోరడం తప్ప. డెమోక్రాటిక్ వే లోనే వోటింగ్ లో పెట్టారు. అయితే అది టెక్నికల్ గా తప్పు అని కొందరికి అనిపించవచ్చు. కాదనలేము. ఎవరి అభిప్రాయం వారిది. అయితే ఇంతకూ ముందు చెప్పినట్లుగా "అభిప్రాయం" (opinion), "నిర్ణయం" రెండూ వేర్వేరు. నావరకూ "నిర్ణయమే" శిరోధార్యం. ఆ స్టేటస్ రావాలంటే చర్చ అనంతరం వోటింగ్ జరిగి తీరాలి. అయితే ప్రతిపాదకుడు natural justice పాటించారా లేదా అని చూసినపుడు అదీ పాటించారు. టెక్నికల్ aspects అనేవి మధ్యవర్తి, లేదా విశేష అనుభవజ్ఞులు తేల్చుకోవాలి. అది ఓటర్ల సమస్య కాదు. ఇద్దరూ (ప్రతిపాదకుడు, వ్యతిరేక అభిప్రాయకులు) నిర్వాక స్థాయిలో విశేషమైన అనుభవజ్ఞులే. ఒక rule position మీద వివాదం వచ్చినపుడు, తటస్థంగా వున్నవారు, ఆయా రూల్స్ గురించి ఎక్కువ అవగాహన వున్నవారు, ఒకప్పుడు నిర్వాహకులుగా వున్న అనుభవజ్ఞులు చెప్పినదే మిగిలిన సభ్యులకు, ముఖ్యంగా మాబోటివారికి ఆమోదయోగ్యంగా కనిపిస్తుంది. అనుభవజ్ఞులైన చంద్రకాంతరావుగారు ఓటింగుకు ముందు చర్చ జరపడం ముఖ్యం అని, చర్చ జరిపి ఆ తర్వాత ఓటింగ్ చేపట్టవచ్చుననీ నియమం స్పష్టంగా ఉందని చెప్పడం జరిగింది.

సర్, ప్రతీ ప్రతిపాదన తప్పనిసరిగా ఒక మార్పును కొనితెస్తుంది. అయితే భవిష్యత్తులో అది మంచికా చెడుకా ఎలా పరిణమిస్తుంది అనేది ముందుగా ఎవరూ చెప్పలేరు. పాత అనుభవం మీద అనుభవజ్ఞులు అది తప్పనిసరిగా చెడు చేస్తుందేమో అని ఆందోళన చెంది మద్దతు తెలపలేదు. కానీ ప్రతిపాదకునికి తన ప్రతిపాదన ఒక మంచి చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. అటువంటప్పుడు తన ప్రతిపాదనను ఓటింగుకు ప్రవేశపెట్టడం ద్వారా మరింత విశాల పరిధి ముందుంచి తీర్పును కోరుతున్నారు అనిపిస్తుంది. అభిప్రాయాలూ అవతలివాళ్లకూ గట్టిగానే ఉండవచ్చు. అయితే ఎవరి ప్రతిపాదనకు ఎంత మద్దతు వుంది అన్నది వోటింగ్ లోనే కదా తేలుతుంది. ఈ రోజు వోటింగ్ ప్రక్రియ బట్టి ఒక ప్రతిపాదన గెలవవచ్చు లేదా వీగిపోవచ్చు. ఏది ఏమైనా దానివలన వికీలో ఎంతో కొంత మార్పు తప్పనిసరిగా వస్తుంది. అది వికీకి మున్ముందు లాభదాయకంగాను ఉండవచ్చు. లేదా నష్టదాయకంగాను ఉండవచ్చు. అయితే అలా సంభవించే మార్పు ఏ విధంగానూ తెలుగు వికీకి లాభదాయకంగా ఉండదు అని ముందుగానే అనుకొంటే ఎలా? అన్నదే నా ప్రశ్న వచ్చే కొత్త మార్పు వికీకి నష్టంగానే పరిణమిస్తుందేమో? నాణ్యత లేని వ్యాసాలూ అసాంఖ్యకంగా వెల్లువెత్తుతాయేమో? దాని నుంచి మనం ఇక కోలుకోలేం. ఇతర వాడుకరులు ఎవరూ మనకు సాయం రారు. దానికి పరిష్కారాలు వెతుక్కోవడంలోనే మా పుణ్యకాలం గడిచిపోతుంది. చురుగ్గా వున్న మాపైనే భారం పడుతుంది. ఎవరూ భారం వహించరు. వికీ వ్యాస నాణ్యతా భారం మేమే మోయాల్సి ఉంటుంది. మాకు పనిభారం పడుతుంది. ...... ఇలా పరిపరివిధాల ముందే భావించుకొని, ఆ మార్పుకి వ్యతిరేకంగా ఉన్నచోటనే కోట కట్టుకొని ఉండిపోతామంటే, అటువంటిది పిస్సిమిస్టిక్ ధోరణి అవుతుంది. నా వరకు నేను, అటువంటి ధోరణికి ఆమడదూరం వుంటాను. ఆ ధోరణిలో ఆలోచిస్తూ పొతే ఇక మనం సరిగ్గా ముందుకి అడుగులు వేయలేం. ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంటాం. మహా కృషి చేస్తే బోదకాలుతో పరుగెడుతున్నట్లు, ఇసుకలో నడుస్తున్నట్లు తెలుగు వికీ పరుగు ఉంటుంది అన్నది నా నిశ్చితాభిప్రాయం. అంతే తప్ప ఎవరినీ ప్రత్యేకంగా నొప్పించాలని కాదు. ఎవరికీ మద్దతుగా కాదు. ఎవరినీ విమర్శిస్తూ కాదు.

The debate on the subject is already over. Therefore let the voters assess the situation with a free mind so that they arrive at the right decisions. Whatever may be the result, a good policy for the wiki will be adopted by voting in a democratic way.

The current proposal may or may not succeed. No one can predict the result but no need to worry about this result. The policy now decided by the majority can be reviewed at any time in the future depending upon the merits and demerits. There is always a chance to review a policy again and again in the future depending on its outcome. There is no hurdle for it. But ఐ personally request the Senior Wikipedians not to hurt those who stand in support of a particular proposal by passing sarcastic comments.

Finally, No one can predict the voting result. No one can predict whether the change comes or not. But if the change is inevitable and it is standing before us, everyone must have the mental maturity to welcome such change with an OPTIMISTIC approach. నమస్తే --Vmakumar (చర్చ) 03:01, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఖచ్చితంగా Vmakumar గారూ, ఆశావాదంతో ముందుకు పోదాం. నేను నిరాశావాదిని కాను, ఆశావాదిని. వాస్తవిక వాదిని. చుట్టూ ఏం జరుగుతోందో చూసి వాటి వెనక ఏముందో, అది ఎందుకు జరుగుతోందో అవగాహన చేసుకోగలిగిన వాణ్ణి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించుకోవాలి - "మార్పు ఏ విధంగానూ తెలుగు వికీకి లాభదాయకంగా ఉండదు అని ముందుగానే అనుకొంటే ఎలా?" అనే మీ ప్రశ్నకు అసలు అస్కారమే లేదు. ఎందుకంటే, 30% పరిమితి తీసేస్తే అది వికీని ఎలా ప్రభావితం చేస్తుంంది అనేది ఊహించనక్కర్లేదు. మన ముందు ఉండగా ఊహించడమెందుకు?
  • మనం 30% పరిమితి విధించక ముందున్న పరిస్థితిని చూసాం. ఆ అనుభవం మీకు ఎలా ఉందో వెనక్కి తిరిగి చూసుకోండి. (మచ్చుకు కావాలంటే రచ్చబండలో నేను పెట్టిన జాబితాను పరిశీలించండి.)
  • 30% పరిమితి విధించాక ఉన్న పరిస్థితిని కూడా చూసాం. ఈ రెండో అనుభవం మీకు ఎలా ఉందో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. (మచ్చుకు కావాలంటే రచ్చబండలో నేను పెట్టిన జాబితాను పరిశీలించండి.)
ఈ రెంటినీ బేరీజు వేసుకోండి, చాలు. ఏదేమైనప్పటికీ, సముదాయ నిర్ణయం మనందరికీ శిరోధార్యం. ఆ నిర్ణయం ప్రతికూల ప్రభావం కలిగిస్తే ప్రతికూలతను తగ్గించుకుని దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కోర్స్ కరెక్షను చేసుకుందాం (ఒకవేళ ఆ పరిమితిని ఇప్పుడు తొలగిస్తే, మళ్ళీ ఆ పరిమితిని విధించుకోవాలి అనేది నా ఉద్దేశం కానే కాదు. ఉన్న పరిస్థితిని మెరుగు పరచుకునే మార్గాలను చూసుకోవాలి.) ప్రతిపాదన పెట్టడం తోనో, దానిపై చర్చలో పాల్గొనడంతోనో, వోటు వెయ్యడం తోనో, మన బాధ్యత తీరిపోదని మాత్రం మనందరం గుర్తించాలి. __చదువరి (చర్చరచనలు) 05:47, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటింగ్ పద్ధతి సరిగా లేదు, ఓటింగ్‌ కి పెట్టిన విషయమూ సరిగాలేదు

నేను ఎన్నో అనువాదాలను ఈ ట్రాన్సలేషన్ టూల్ వాడి చేశాను. అనువాదం చేసేప్పుడు యాంత్రిక అనువాదం మీద ఆధారపడకూడదని చెప్పను కానీ వాక్యాలను చాలా వరకూ మార్చేయవలసి వస్తుంది. గూగుల్ అనువాదం ఎంత తప్పుల తడకతో ఉంటుందో గతంలో గూగుల్ అనువాద వ్యాసాల్లో చూడడమే కాదు ఈనాటికీ ఎవరైనా అనువాదం చేసుకుని గమనించవచ్చు. చదువరి గారు కనీసం 30 శాతం మార్చితే కానీ ఆ అనువాదాన్ని టూల్ నుంచి ప్రచురించలేమన్న నియమం పెట్టడం చాలా అనుభవంతో చేసిన సరైన పని అని నా అభిప్రాయం. అటువంటిది ఆ నిబంధన తొలగించాలనడం ఒక పొరబాటు, అది తీసేసి కొత్తగా వచ్చిన వాడుకరులకు మాత్రమే ట్రాన్సలేషన్‌ టూల్ తో చేసిన అనువాదాలు నేరుగా మొదటి పేరుబరిలో ప్రచురిచనివ్వకూడదనడం మరో పొరబాటు. ఎందుకంటే, నేను 2015లో ఇక్కడికి వచ్చాను. వచ్చేనాటికే నేను ఎంతో భాష నేర్చుకునే వచ్చాను. అదే 2020లో వస్తే ఈ నిబంధన ప్రకారం నాకు భాష రాదన్నట్టు, నేను నేరుగా ప్రచురించకూడదన్నట్టు అవుతుంది కదా. అలాగే ఎందరో అనుభవజ్ఞులు తప్పులు చేయవచ్చు. ఇక చర్చ ఆసాంతం చదివితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికే తిరస్కరణ పొందాయని తెలుస్తోంది. అలాంటప్పుడు ఓటు ఎందుకు వేయాలంటూ ఓటింగ్ ప్రక్రియను తిరస్కరిస్తున్న సభ్యుల నిర్ణయం చాలా సముచితం, న్యాయం. కానీ, అలాగని ఊరుకుంటే ఈ ప్రతిపాదనలు గెలుస్తాయి. కాబట్టి, నేను ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే ప్రతిపాదనలో వ్యతిరేక ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. ఆలస్యంగా ఈ చర్చ చూడడం చాలా పెద్ద పొరబాటయింది. కనీసం, ఇప్పటికైనా నా వ్యతిరేకతను నమోదు చేయగలగడం సంతోషంగా ఉంది. --Meena gayathri.s (చర్చ) 11:11, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నేను, మా కళాశాలలోని కొంతమంది విద్యార్థులు క్రిందటి రెండు సంవత్సరాల నుండి తెలుగు వికీపీడియా లో అనువాదం చేస్తున్నాము. డిసెంబర్,2019 లో మేము ఒక తెలుగు వికీపీడియా కార్యక్రమం లో పాల్గొన్నాము. కానీ మాకు తెలుగు భాష లో అంత అవగాహన లేకపోవడం చేత కొన్ని తప్పులు జరిగాయి. అందుచేత మేము అనువాదం చేసిన వాక్యాలు తెలుగు వికీపీడియా లో నుంచి తొలగించబడ్డాయి. అదే ఆ సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే మా వ్యాసాలు పూర్తి నాణ్యతతో ప్రసురించబడేయి. ఈ నిబంధన వాళ్ళ వ్యాసాల యొక్క నాణ్యత పెరగడం తో పాటు, కొత్తగా అనువాదం చేసేసవాళ్ళకి చాల ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కావున ఈ నిబంధన తొలగించేందుకు నేను వ్యతిరేకత తెలుపుతున్నాను. --Mekala Harika (చర్చ) 13:07, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గతంలో చేసిన గూగుల్ అనువాద వ్యాసాలను, ట్రాన్సలేషన్ టూల్ తో అనువాదం చేసిన వ్యాసాలను నేను కూడా చూశాను. అందులో భాష సరిగా లేదు. మరి అలాంటప్పుడు ప్రస్తుతం ట్రాన్సలేషన్ టూల్ లో ఉన్న 30 శాతంని తగ్గిస్తే అప్పుడు రాసే వ్యాసాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఓటింగ్ పద్ధతిలో, ఓటింగ్‌ కి పెట్టిన విషయంలో Meena gayathri.s గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ట్రాన్సలేషన్ టూల్ అనుభవం ఉన్న వికీ సభ్యులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అయినా ఓటింగ్ పెట్టారు. ఆ ప్రతిపాదనకు, ఈ ఓటింగ్ కు నేను కూడా వ్యతిరేకమే. కాబట్టి, ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే, ప్రతిపాదన గెలవకుండా వ్యతిరేక ఓటు వేయాలనుకుంటున్నాను.--Nagarani Bethi (చర్చ) 14:05, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]