యల్లాయపాళెం

వికీపీడియా నుండి

యల్లాయపాళెం, నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము.


అక్షాంశరేఖాంశాలు: 14°32′N 79°57′E / 14.537768, 79.951544

మహాత్మా గాంధీ గాంధీ, యల్లాయపాళెం వచ్చినప్పుడు పందిపాటి సుబ్బరామిరెడ్డి గారి కిచ్చిన ఉత్తరం

విషయ సూచిక

పుట్టుక [మార్చు]

ఆ రోజు వాతావరణం కొద్దిగా మబ్బులు పట్టి వుంది. ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా, 'ఆ, ఈ మబ్బులు కాసేపే' అంటూ రోజూ లాగే పశువులు తోలుకుని అడవిలోకి బయలుదేరాడు. వాతావరణం బావుందేమో! తెలీకుండానే పశువులతో పాటుగా చాలా దూరం వచ్చేశాడు. దారిలో చిన్న వాగు, వాగు కి అవతల వృక్షాలు, పచ్చటి ప్రాంతం చూసి నెమ్మదిగా వాగు దాటి అక్కడికి చేరాడు. ఇక ముందుకు కదలాలనిపించలేదు. అక్కడ పశువులని మేతకి వదలి, తను కూడా తనతో పాటే తెచ్చుకున్న చద్దన్నం తిని, వాగు లోని నీళ్ళు తాగాడు. ఇక్కడ నీళ్ళకి ఇంత రుచి ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ ఓ చెట్టు కింద నిద్ర లోకి జారి పోయాడు.

ముసురు పట్టిన మబ్బు ఇంకాస్త తీవ్ర రూపం దాల్చింది. ఒక్క సారి గా పెద్ద వర్షం. దాంతో ఒక్కసారిగా నిద్రలోంచి మేల్కొన్న అతను పశువులని హడావిడి గా తోలుకుంటూ కాస్త ఎత్తైన ప్రదేశం చేరాడు. సరేలే, ఈ వాన తగ్గాక, ఇక ఇంటికి వెల్లిపోదాం అనుకుంటున్నాడు. వర్షం తగ్గక పోగా ఇంకాస్త భీకరంగా మారింది. ఈ రాత్రికి ఇక ఇక్కడే, ఒక్కడినే ఎలానో అనుకుంటూ చాలా సేపటికి నిద్ర లోకి జారుకున్నాడు. రాత్రంతా కుండపోత గా కురిసిన వాన తెల్లవారేసరికి మందగించింది.

దాంతో పశువులను తోలుకుని తిరుగుముఖం పట్టాడు. తీరా వాగు దగ్గరికి వచ్చేసరికి... నిన్నటి దాకా ప్రశాంతంగా వున్న పిల్ల వాగు ఉగ్ర నాగు లాగా వుంది. నిన్నంతా కురిసిన భారీ వర్షానికి వాగు పొంగింది. అది ఎప్పటికి తగ్గుతుందో తెలీని పరిస్ఠితి? అతనికేం తెలుసు, అక్కడే ఇంకొద్ది రోజులు గడపాలని... అలా వాగు మామూలు పరిస్ఠితి కి వచ్చేవరకు, ఆ ప్రాంతం లో నే ఫలాలు తింటూ, పశువుల పాలు తాగుతూ కొద్దిరోజులు గడిపాడు. ఆశ్చర్యకరమేమిటంటే, ఆ ప్రాంతం లో మేత తిన్నాక పశువులు అంతకుముందెన్నడూ లేనట్లు గా విపరీతంగా పాలివ్వడం ప్రారంభించాయి. అతనికి కూడా అక్కడ వున్నన్ని రోజులు తిండి కి ఇబ్బంది కాలేదు.

కొద్దిరోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరిన అతను ఈ విషయాలన్నీ తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చెప్పాడు. దాంతో వారందరికీ కూడా ఆ ప్రాంతం చూడాలని అనిపించడంతో అందరూ కలిసి ఆ ప్రాంతం వచ్చి అంత మంచి ప్రాంతం వదలివెళ్ళడం ఇష్టం లేక అక్కడే స్ఠిర పడి పోయారు. ఇలా వారంతా స్థిర పడడానికి కారకుడైన 'ఎల్లయ్య' పేరుతో ఆ ప్రాంతం 'ఎల్లయ్య పాలెం' క్రమేణా 'యల్లాయపాళెం' గా ప్రసిద్ధి పొందింది.

ఇలా... యల్లాయపాళెం- కాకతీయ రాజులు , తిక్కన కాలంలో 13-14 శతాబ్దంలో ఏర్పడింది అని గ్రామస్తులు ఊరి పుట్టుక గురించి చెప్పుకునే విషయాలలో ఇది ఒకటి.

చరిత్ర [మార్చు]

1946 ముoదు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మేటి గ్రామాలలో ఒకటి. ఊళ్ళో పంట రెడ్లు ఎక్కువ. వీరు భూస్వాములూ వ్యవసాయదారులూ కూడా. వీరు కాక దేవాంగులూ(చేనేత పనివారు), ముస్లిం లు, బలిజ వారు, హరిజనులు, ఇతర చేతి వృత్తుల వారు ఉండేవారు. చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు ఈ గ్రామం కేంద్రంగా ఉండేది. అప్పటికే చాలాకాలంగా పంచాయతీ బోర్డు ఉండేది. దీని ఆధ్వర్యంలో కిరోసిన్ లైట్లు, వాలు పాఠ్యంపెట్రో మాక్స్ లైట్లు వీధిలో ఏర్పాటు చేసారు. రేడియో గూడా ఉండేది. ఊళ్ళో ఒక శివాలయం, మహలక్షమ్మ గుడి ఉంది.

1946 తర్వాత

చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ మేటి గ్రామం గానే వెలుగొందుతోంది. గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందిస్తున్నారు. గ్రామస్తుల సహకారం తో మంచి పాఠశాలలు, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి.

1950 దశకంలొ[ఆధారం కోరబడినది] అప్పుడు నేను పది సం.వాడిని .నాకు నాకంటే పెద్దవారికి ఈసంగతులన్ని తెలుసు.ఇప్పుదు నేను అమెరికాలో ఉన్నాను.ఆధారాలు కోసం ప్రయత్నిస్తాను.

గ్రామం లొ తగాదాలు వుండేవి.రైతులు హరిజనులు మధ్య కొట్లాటలు జరిగాయి. ఇరువురు కొన్నిసార్లు కర్రలతోను,కొన్నిసార్లు కత్తులతో కొట్లాడుకొన్నారు. చాలా మంది పెద్ద గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇరువురు పోలీసు కేసులు పెట్టుకున్నారు.ఈ జామీనుకేసుల్లో జిల్లాలోని వివిధ కోర్టుల చుట్టూ తిరిగారు. అలిసిపోయారు.తిరిగి ప్రశాంతత నెలకొన్నది.

1960 దశకంలో

భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామంలోని యువత పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసారు. యువత విజయం సాధించింది.గండవరపు బాలక్రిష్ణా రెడ్డి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

1970 దశకంలో

గ్రామంలో కమ్యూనిస్టు ఉద్యం మొదలయింది.మళ్ళీ కొంతకాలం తగాదాలు,కొట్లాటలు జరిగాయి. ఒక రైతు కూడ చనిపోయాడు. ప్రస్తుతం పెద్ద తగాదాలు లేవు.కాని సదవగాహన కూడ లేదు.

గ్రామం లోని వివిధ ప్రాంతాలు [మార్చు]

గ్రామములోని వివిద ప్రాంతాలను గ్రామవాసుల పిలుపులలో ఈ విదంగా పలుకుతారు -

చావిడి సెంటర్, మిషను వీధి, గొల్లపాళెం(యాదవ పాళెం), దేవాంగ పాళెం, బజారు, తూర్పు వీధి, హరిజన వాడ, అరుంధతీయ వాడ, పొగతోట, కుమ్మరిపాళెం(రామ మందిరం వీధి), హౌసు, గిరిజన కాలనీ.

వాడుక పదాలు ప్రాంతాలు

చావిడి, బొడ్డు బావి, పుట్టా వారి మిట్ట, కమారాయి (కంభం రాతి) సెంటర్,మిట్టతోట, గంగబాయి తోట, మిషను వీధి, జారుడు అట్టెడ, మలిదేవి, లోతుకాలవ, మాంజేలు

గ్రామములో సౌకర్యాలు [మార్చు]

యల్లాయపాళెం ప్రాధమిక పాఠశాల విద్యార్ధులు
1977లో పదవ తరగతి చదివిన యల్లాయపాళెం విద్యార్ధులు
  • 1-5 తరగతుల వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలదు.
  • 6-10 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలదు.
  • తేజ్ నికేతన్ కాన్వెంట్.
  • అంగన్ వాడి బడి.
  • బలహీన, వెనుకబడిన వర్గాల పిల్లలకు వసతి గృహాలు.
  • పంచాయితీ కార్యాలయం.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
  • పశువుల ఆస్పత్రి.
  • పోస్ట్ ఆఫీస్.
  • టెలిఫోన్ ఎక్స్ఛేంజ్.
  • పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం.
  • వ్యవసాయదారుల సహకార సంఘం.
  • ఆంధ్రా బ్యాంక్.
  • జిల్లా గ్రంథాలయం.
  • బాపూజీ విజ్ఞాన కేంద్రం.
  • కంప్యూటర్ మరియు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు

దేవాలయాలు [మార్చు]

  • మహలక్ష్మమ్మ గుడి.
  • కంభం రాతి ఆంజనేయ స్వామి గుడి
  • సాయి బాబా గుడి.
  • కుమ్మరివీధి రామ మందిరం
  • గంగమ్మ గుడి
  • బ్రహ్మం గారి గుడి.
  • మసీదు.
  • శివాలయం.
  • తూర్పు వీధి రామ మందిరం.
  • శివబాబా ఆలయం(ఓం శాంతి)
  • చర్చి.
  • చెన్నకేశవ స్వామి ఆలయం.
  • గ్రామ పొలిమేరలలో గ్రామ దేవతలు

వ్యవసాయం [మార్చు]

ఒకప్పుడు వరి, చెరకు ప్రధాన పంటలు గా ఉండేవి. ప్రస్తుతం రొయ్యల సాగు కూడా ప్రధాన పాత్ర పొషిస్తోంది. అక్కడక్కడా ప్రత్తి కూడా సాగవుతోంది.

  • ఇప్పుడు రొయ్యలసాగు ఆగిపోయింది.ఆ మాటకొస్తె జిల్లాలో కూడ సాగుబడి చాలవరకు తగ్గిపోయింది.ఒకప్పుడు 1,50,000 ఎకరాలు సాగులోవుండేవి.

ఇప్పుడు 50,000.ఎకరాలు కంటే సాగు తగ్గిపోయింది.రొయ్యల గుంటలన్ని పూడ్చి మళ్ళి వరి సాగుమొదలు పెట్టారు. గ్రామంలో దాదాపు 3,000ఎ.సాగుబడి పొలం వున్నది.పడమరనున్న అడివి పొలం తప్పితే మిగిలిన పొలానికి చాలవరకు బోరు బావులున్నాయి. మొదటి కారు,అప్పుడప్పుడు రెండొ కారు కనిగిరి చెరువు నీటితో సాగు అవుతున్నాయి. 20సం:ముందు ప్రధాన పంటగా మొలగొలుకులు, రెండో పంటగా దొంగ నెంబర్లు(అంతకుముందు ఎర్రకేసర్లు)పండించేవారు.ఇప్పుడు మొలగొలుకులు కనుమరుగయినాయి.మూడు పిడికిళ్ళులాంటి హైబ్రిడ్ రకాలు సాగుచేస్తున్నారు. పొలాల ధరలు కూడ బాగా పెరిగాయి.ఒక ఎకరం రూ.పది లక్షలు. గతంలో 200-300 ఎకరాల కమతాలు కొన్ని వుండేవి.ఇప్పుడు 30 ఎ.మించి ఎవరికి లేవు. గతంలో ఎద్దులు,బండ్లు,నాగళ్ళు,తదితర పరికరాలతో వ్యవసాయం చేసేవారు.ఇప్పుడు ట్రాక్టర్లు,వరికోత మిషన్లు. వ్యవసాయ కూలీలు బాగా తగ్గిపోయారు.సేద్యం చేయించడం చాలా కస్టంగా వుంది.

  • పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిచెందినది.పాలు గతంలో బస్సులోను,సైకిళ్ళలోను నెల్లూరుకు తీసికెళ్ళి అమ్మేవారు.ఇప్పుడు పాల సొసైటీలు వున్నాయి.

రవాణా సౌకర్యాలు [మార్చు]

మొదట్లో మోటారు వాహనాలు అంతగా అభివృద్ది చెందని కాలంలో ప్రజలు దగ్గర్లోని రాజుపాలెం, బుచ్చిరెడ్డిపాలెము లకు కాలి నడకన పొలాల వెంబడి వెళ్ళి పోయే వారు. కొద్దిగా స్థితి మంతులైతే బండ్లు కట్టించుకునే వారు. చాలా కొద్ది మంది కి మాత్రమే గుర్రపు బగ్గీలుండేవి. ఆ రోజుల్లో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం కావడం తో మేలు జాతి ఎద్దులు, పశువులను కొనుక్కుని వందల కి.మీ. దూరం వాటిని తోలుకుంటూ కాలినడకనే వచ్చేసేవారు.

1980-85 ప్రాంతం లో అనికేపల్లి బస్సు, అగ్గిపెట్టె బస్సు అని ఉండేవి. వీటిని ప్రైవేటు వారు నడిపేవారు. వీటిని నడిపిన డ్రైవర్లకి ఆ పేర్లే ఇంటి పేర్లుగా మారిపోయాయి. (ఉదా:అనికేపల్లి శీనయ్య)

తర్వాతి కాలంలో గ్రామస్తుల కోరిక మేరకు RTC కూడా ఒక బస్సు నడపడం ప్రారంభించింది. దీనిని డేవుడ్ బస్సు (Day-Out) గా వ్యవహరించే వారు. ఇది బుచ్చి కి, రాజుపాళెం మీదుగా నెల్లూరు, ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు నడిచేది.

తర్వాత 90 ల ప్రాంతం లో జరిగిన శ్రీ రామ సేతు (మలిదేవి బ్రిడ్జి) నిర్మాణం తో పాటూరు, గుమ్మళ్ళదిబ్బ ల మీదు గా బస్సులు నడపడానికి వీలు కుదిరింది. ఈ మార్గం లో RTC రెండు బస్సులు నడిపేది. వీటి ని Flight, Cheeta లు గా వ్యవహరించేవారు. Flight బుచ్చి నండి అయ్యప్ప గుడి వరకు, Cheeta రాజుపాళెం నుండి ఆమంచర్ల వరకు నడిచేవి. తర్వాత కొద్ది కాలం లో నే ఈ మార్గం లో 3-4 ప్రైవేటు బస్సు లు కూడా నడవడం ప్రారంభించాయి.

ప్రస్తుతం అనేక ఆటోలు కూడా అందుబాటు లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్.టి.సి.బస్సులు ఏమీ లేవు.మూడు ప్రైవేటు బస్సులు మాత్రం వున్నాయి.

గ్రామ సర్పంచులు [మార్చు]

  • ప్రస్తుత సర్పంచ్ - దేవిరెడ్డి శ్రీలక్ష్మి
  • గతంలోని సర్పంచులు

_______________________

  • " - చేవూరు సుబ్బరామి రెడ్డి
  • " - పందిపాటి రామిరెడ్డి
  • " - రేబాల వేణు గోపాల క్రిష్ణారెడ్డి
  • " - గండవరపు బాలక్రిష్ణా రెడ్డి " -రామిరెడ్డి
  • " - బడుగు శ్రీనివాసులు

గ్రామం నుంచి ప్రముఖులు [మార్చు]

  • చింతా మోహన్ (ఎమ్.పి)
  • మేడా ఆదిశేషమ్మ/ఎన్.రాజ్యలక్ష్మి(మాజీమంత్రి)
  • పందిపాటి లచ్చా రెడ్డి(మొదటి ఇంజనీరు)
  • మందిపాటి వెంకట క్రిష్ణారెడ్డి (ఇంజనీరు)
  • సర్యాభొట్ల సీతారామయ్య ( " )
  • దేవిరెడ్డి రామిరెడ్డీ ( " )
  • తమ్మిరెడ్డీ రాధాక్రిష్ణా రెడ్డీ ( " )
  • కట్టా పరంధామి రెడ్డి ( " )
  • యేకొల్లు శ్రీనివాసులు రెడ్డి ( " )
  • పెనుమల్లి మస్తాన్ రెడ్డి ( " )
  • చలమ్చర్ల భాస్కర రెడ్డి ( " )
  • మేడా వెంకట సుబ్బా రెడ్డి (డిజిఎం,రిటైర్,ఆప్ కాబ్)

ఇరుగు పొరుగు గ్రామాలు [మార్చు]

రెడ్దిగుంట(2 కి.మీ.), రామచంద్రా పురం(దాసరి పాళెం) (1.5 కి.మీ.), తాటాకుల దిన్నె(2 కి.మీ.),మిక్కిలిం పేట(4 కి.మీ.), గ్రామనత్తం(4 కి.మీ.), పల్లెపాళెం(1 కి.మీ.), పాటూరు(4 కి.మీ.)

బుచ్చిరెడ్ది పాళెం(8 కి.మీ.),గండవరం(6 కి.మీ.), రాజుపాళెం(5 కి.మీ.), కోవూరు(8 కి.మీ.), దామర మడుగు(6 కి.మీ.), రేబాల (5 కి.మీ.)

ముఖ్యమైన ఫోన్ నంబర్లు [మార్చు]

  • టెలిఫోను ఎక్స్చేంజి : +91-8622-277798
  • పంచాయితి కార్యాలయం : +91-8622-277702
  • సహకారసంఘం (వ్యవసాయం) : +91-8622-277778
  • ఆంధ్రాబ్యాంక్ : +91-8622-278734

ముఖ్య ఘటనలు [మార్చు]

చిత్రమాలిక [మార్చు]