అర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోన్ నది, అర్వాల్

అర్వాల్, బీహార్ రాష్ట్రం అర్వాల్ జిల్లా లోని పట్టణం, ఆ జిల్లా ముఖ్యపట్టణం. ఇది గతంలో జెహనాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. ఈ ప్రాంతంలో నక్సలిజం నియంత్రణకు ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. జెహనాబాద్, ఔరంగాబాద్ జిల్లాల నుండి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. అర్వాల్ జనాభా 5,88,000. ఇది రాష్ట్ర రాజధాని పాట్నా నుండి దక్షిణంగా 80 కి.మీ. దూరంలో గంగా నదికి ఉపనది అయిన సోన్ నదికి కుడి ఒడ్డున ఉంది. [1]

భౌగోళికం

[మార్చు]

అర్వాల్ 25°15′N 84°41′E / 25.25°N 84.68°E / 25.25; 84.68 వద్ద, సముద్రమట్తం నుండి సగటున 67 మీటర్లు (220 అ.) ఎత్తున ఉంది. [2]

అధికారిక భాషలు హిందీ, ఉర్దూ . ఇక్కడ మాట్లాడే ప్రాంతీయ భాష మాగాహి. [3]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

మార్చి 2008లో బీహార్ ప్రభుత్వం రూ. 9,742 లక్షలతో భోజ్‌పూర్ జిల్లాలోని అర్వాల్ నుండి సహర్ వరకు సోన్ నదిపై వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. [4] అర్వాల్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. జనాభాలో ఎక్కువ మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. కుర్తా వంశీ, కర్పి వంటి ప్రాంతాలు మినహా జిల్లా అంతా కాలువల ద్వారా సాగునీరు లభిస్తోంది. పట్టణంలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏదీ లేదు. [5]'

రవాణా

[మార్చు]

అర్వాల్‌ గుండా వెళ్ళే జాతీయ రహదారి 110, బీహార్ షరీఫ్‌ వద్ద NH 31లో కలుస్తుంది. జాతీయ రహదారి 139 (పాత- NH 98) ఔరంగాబాద్ నుండి అర్వాల్ గుండా పాట్నా వెళ్తుంది. పట్టణానికి సమీపంలోని రైల్వే స్టేషను 35కి.మీ. దూరంలో ఉన్న జెహనాబాద్ (JHD) వద్ద ఉంది. ఔరంగాబాదు లోని అనుగ్రహ నారాయణ్ రోడ్ రైల్వే స్టేషన్ (AUBR) 60 కి.మీ. దూరంలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Arwal Bihar Pin code". citypincode.in. Retrieved 19 March 2014.
  2. "Arwal, India Page". Bihar. Falling Rain Genomics. Retrieved 10 March 2009.
  3. "About District - Arwal". Archived from the original on 31 March 2016. Retrieved 27 May 2019.
  4. "Archived copy". Archived from the original on 3 March 2016. Retrieved 12 December 2011.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Arwal Sahar bridge on Sone to come soon". Jai Bihar. Archived from the original on 15 December 2008. Retrieved 10 March 2009.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అర్వాల్&oldid=3946705" నుండి వెలికితీశారు