Jump to content

ఐటీడీఏ

వికీపీడియా నుండి
(ఐటీడీఏ సమీకృత గిరిజనాభివృధ్ధి సంస్థ నుండి దారిమార్పు చెందింది)

ఐటీడీఏ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ITDA (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని తొమ్మిది జిల్లాలలో భారత ప్రభుత్వం కేంద్రంలో భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజనుల సంక్షేమం కోసం 1970 లో స్థాపించారు.ఈ ఐ.టి.డి.ఎ కు నిధుల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరుగుతుంది[1].

సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ
(ఐ.టి.డి.ఎ)
ఆశయంగిరిజనుల సంక్షేమం కోసం
స్థాపన1970
వ్యవస్థాపకులుకేంద్ర ప్రభుత్వం గిరిజన మంత్రిత్వ శాఖ
ప్రధాన
కార్యాలయాలు
మాసిబ్ ట్యాంక్ హైదరాబాద్,విశాఖపట్నం
సేవాఆంధ్రప్రదేశ్,తెలంగాణ
సేవలుగిరిజనుల అభివృద్ధికై
సభ్యులు4
అధికారిక భాషతెలుగు
అధ్యక్ష్యుడు/చైర్మన్జిల్లా కలెక్టర్
ప్రధాన కార్యనిర్వహకుడుప్రాజెక్టు ఆధికారి
ముఖ్యమైన వ్యక్తులుసెక్రటరీ,ట్రెజర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు సాంఘిక సాంక్షేమ శాఖలో భాగంగానే కొనసాగాయి.1974 లో గిరిజనులు అధికంగా ఉన్న 9 జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కొసం G.O.No 856 సాంఘిక సంక్షేమశాఖ తేది 29 అక్టోబరు 1974 ద్వారా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

క్రమసంఖ్య జిల్లా పేరు ఐటిడిఎ పేరు షెడ్యూలు, గ్రామాలు షెడ్యూలేతర గ్రామాలు మొత్తం గ్రామాలు
1 శ్రీకాకుళం సీతంపేట 108 240 348
2 విజయనగరం పార్వతీపురం 302 181 483
3 విశాఖపట్నం పాడేరు 3373 91 3464
4 తూర్పుగోదావరి రంపచోడవరం 559 40 599
5 పశ్చిమగోదావరి కోటరామచంద్రాపురం 102 1 1103
6 ఖమ్మం భద్రాచలం 891 3 8947
7 వరంగల్ ఏటూరు నాగారం 178 76 254
8 ఆదిలాబాద్ ఉట్నూరు 412 164 576
9 కర్నూల్ శ్రీశైలం

గిరిజన తెగలు

[మార్చు]

భారత రాజ్యాంగం లోని 336 ఆర్టికల్ లో షెడ్యూలు తెగల గురించి నిర్వచించడం జరిగింది. 342 ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ప్రకటించిన గిరిజన తెగలు కాని,సమాజాలు కాని,వాటిలో భాగాలు కాని గిరిజన తెగల గుంపులను షెడ్యూలు తెగలు గా గుర్తించారు. కొన్ని తెగలను గిరిజన తెగల జాబితాలో చేర్చడానికి కాని,తీసివేయడానికి కాని పార్లమెంట్ కు మాత్రమే అధికారం ఉంది.‌ వీరిని రాజ్యాంగ పరంగా షెడ్యూలు తెగలు అంటారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ వారి లెక్కల ప్రకారం మొత్తం దేశంలో 700 షెడ్యూలు తెగలు ఉన్నాయి. అందులో 75 షెడ్యూలు తెగలు ఇంకా పురాతన సాంకేతిక స్థాయిలో ఉండి ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాయి. వారినే పి.వి.టి.జి ప్రిమిటివ్ ట్రైబల్ గౄపుగా పిలుస్తారు.2011 జనాభా లెక్కల ప్రకారం 10.42 కోట్లు షెడ్యూలు తెగల జనాభా ఉంది. మధ్య,దక్షిణ భారత దేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది.ఈశాన్య భారత్ లో షెడ్యూలు తెగల జనాభా సాంద్రత ఎక్కువ మొత్తం దేశంలో గిరిజన జనాభాలో 89.96 % గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. షెడ్యూలు తెగలుగా గుర్తించేందుకు లోకూర్ కమిటీ కొన్ని ప్రామాణికాల్నీ నిర్దేశించింది అవి 1. ఆహార సేకరణ,పోడు వ్యవసాయంలో అతి పురాతన సాంకేతిక విధానం‌ అనుసరించుట. 2.ప్రత్యేక సంస్కృతి అనగా భాష,ఆచారాలు,కళలు,నమ్మకాలు లలో 3.ప్రత్యేక నివాస ప్రాంతం అనగా అడవి,కొండలు లాంటివి. 4. బయట వారితో కలవడానికి ఇష్టపడక పోవడం. 5. బాగా వెనుకబడి ఉండటం అనగా మానవాభివృద్ధి సూచికలు- విద్య,ఆరోగ్యం,ఆదాయం లాంటివి.

లక్ష్యం

[మార్చు]

గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను సమర్థవంతంగా అమలు చేసెందుకు కృషి చేయడం. గిరిజనుల సర్వతో ముఖాభివృధ్ధికి పాటుపడుతు కృషి చేసి విజయం సాధించడం[2].

ఐ.టి.డి.ఎ ప్రాంతాలు

[మార్చు]

గిరిజనుల జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న షెడ్యూలు ప్రాంతాలే కాకుండా వాటిని ఆనుకుని 50 శాతం పైగా గిరిజన జనాభా ఉన్న గ్రామాలు కూడా కలిపి ఈ ప్రాంతాలను గుర్తించారు.ఒక్కొక జిల్లాల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని గుర్తించారు. అవిశ్రీకాకుళం సీతంపేట[3],విజయనగరం పార్వతీపురం[4],విశాఖపట్నం పాడేరు[5],తూర్పుగోదావరి రంపచోడవరం[6],పశ్చిమ గోదావరికోట రామచంద్రాపురం[7] ,ఖమ్మం భద్రాచలం[8], వరంగల్ఏటూరు నాగారం[9],ఆదిలాబాదు ఉట్నూరు[10],కర్నూల్ శ్రీశైలం[11] జిల్లాల్లో గుర్తించి అచట గిరిజనాభివృద్ధికై సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలను 1975లో (ఐ.టి.డి.ఎ) స్థాపించారు.నల్లమల్ల అడవుల్లో నివసిస్తున్న వెనుకబడిన గిరిజన జాతి చెంచుల కొసం ప్రత్ర్యేకంగా మరో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థను స్థాపించారు.

5 వ. షెడ్యూలు

[మార్చు]

భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలును రాజ్యంగంలో రాజ్యాంగం గా వర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని (35) షెడ్యూలు తెగలలో (31) షెడ్యూలు తెగలు షెడ్యూలు ప్రాంతాలలో ఎక్కువగా నివశిస్తున్నారు.అలాగే 59 లక్షల షెడ్యూలు తెగల జనాభాలో 48 % షెడ్యూలు ప్రాంతాలన్న జిల్లాలలోనే నివశిస్తున్నారు.గిరిజన జనాభా సాంద్రత 50 శాతం కంటే ఎక్కువగా ఉండడం, కంపాక్టు గాను సరియైన సైజు కలిగి ఉండడం, పరిపాలన సౌకర్యంగా ఉండడం,ఆర్థికంగా వెనుకబడి ఉండడం.

•ముఖ్యాంశాలు

•వార్షిక నివేదిక

•గిరిజన సలహా మండలి

•షెడ్యూలు ప్రాంతాలకు వర్తించే చట్టాలు

•ఆంధ్రప్రదేశ్ షెడ్యూలు ప్రాంతాల భూమి బదలాయింపు చట్టం (LTR)-1959

•1996పీసా చట్టం

•మైదానం ప్రాంత గిరిజనుల కొరకు ఐటిడిఎలు

•ట్రైకార్

•గిరిజన సహకార సంస్థ GCC

గిరిజన సహకార సంస్థ గిరిజనులను వ్యాపారస్థుల దోపిడీ నుంచి రక్షించి సహకారం చేసే సంస్థ.

•గిరిజన ఉప ప్రణాళిక

గిరిజన సలహా మండలి

[మార్చు]

షెడ్యూలు ప్రాంతం ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ గిరిజన సలహామండలి (టి.ఎ.సి) ఉండాలి.గిరిజన జనాభా ఉండి షేడ్యూలు ప్రాంతాలు లేని రాష్ట్రాల్లో కూడా భారత రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం గిరిజన సలహామండలి ఏర్పాటు చేస్తారు.ఈ గిరిజన సలహా మండలిలో 20 వరకు సభ్యులు ఉండి మూడు వంతులు అంటే 15 మంది శాసనసభకు ఎన్నికైన గిరిజన శాసన సభ్యులు ఇందులో ఉంటారు. గవర్నరుచే పంపబడిన గిరిజన సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సలహాలు ఇస్తారు.గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఈ సలహా మండలికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

గవర్నరు అధికారాలు

[మార్చు]

షెడ్యూలు ప్రాంతంలో భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రకారం రాష్ట్ర గవర్నరుకు పూర్తి అధికారాలు ఉంటాయి. భూమి బదలాయింపు,వడ్డీ వ్యాపారులు విషయంలో చట్టం ప్రతిపాదన గిరిజన సలహా మండలి లో ఆమోదంతో రాష్ట్రపతికి పంపే అధికారం ఉంటుంది. స్థానిక గిరిజనులకు ఏజెన్సీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ జారి చేసే అధికారం ఉంటుంది.

గిరిజన ఉప ప్రణాళిక నిర్దేశికాలు

[మార్చు]

1973 డిసెంబర్ లో గిరిజన ఉప ప్రణాళిక ప్రారంభమైనది.గిరిజన ప్రాంతాలు బయటి ప్రాంతాల అభివృద్ధిలో ఉన్న అంతరాలను తగ్గించటం.గిరిజనుల జీవన సూచికల్లో గుణాత్మక మార్పులు తీసుకురావటం. అన్ని రకాలైన దోపిడీలను రూపుమాపడం. సామాజిక,ఆర్ధిక అభివృద్ధిని వేగవంతం చేయటం.గిరిజనుల్లో ఆత్మస్థైర్యాన్నిపెంచి, నైపుణ్యాలను,పాలనా సామర్ధ్యాలను పెంచటం.

1/70 చట్టం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ షెడ్యూలు ప్రాంతపు భూమి బదలాయింపు చట్టం,1959ను 1970 లో 1/70 చట్టంగా మార్పు‌ చేయటం జరిగింది.ఈ చట్టం ప్రకారం షెడ్యూలు ప్రాంతంలో గిరిజనులకు 100% ,గిరిజనులు సభ్యులుగా ఉండే కో-ఆపరేటివ్ సొసైటీకి తప్ప వేరెవారికి భూమి (స్థిరాస్తి )బదలాయింపు అనగా అమ్మకం ,కోనడం,బహుమతి లాంటివే కాక మరే విధమైన బదలాయింపు చెల్లదు. షెడ్యూలు ప్రాంతాలలో గిరిజనేతరులు ఎవరి దగ్గరైనా స్థిరాస్తి ఉంటే అది గిరిజనుల దగ్గర నుండి కాని వారి పూర్వీకుల నుండి కాని తీసుకున్నదే ఆ స్థిరాస్తి చట్టపరంగా తమదే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత గిరిజనేతరులదే అనమాట. గిరిజనేతరుల మధ్య కూడా భూమి బదలాయింపు నిషేధించబడినది.ఈ చట్టం ప్రకారం సహకార సంసచథలకు ఋణాలాలకై తాకట్టు పెట్టవచ్చు.1978లో చేసిన మార్పు ప్రకారం భూమి బదలాయింపు చట్ట ఉల్లంఘన చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపవచ్చు.

షెడ్యూలు ప్రాంతపు భూమి బదలాయింపు చట్టం(LTR) -1959

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ భూమి బదలాయింపు చట్టం అమలులో ఉన్న ఏ చట్టమైనా,రూల్సు అయినా ఈ చట్టం ముందు నిలవవు. షెడ్యూలు ప్రాంతంతో స్థిరాస్తి నూటికి నూరు శాతం గిరిజనులే సభ్యులుగా ఉన్న సహకార సంఘాలకు తప్పించి ఎవరికి బదిలీ చేయడానికి వీలు లేదు. గిరిజనేతరుల మధ్య భూమి బదలాయింపు షెడ్యూలు ప్రాంతంలో చెల్లదు.షెడ్యూలు ప్రాంతంలో గిరిజనేతరులకు ఏదైనా భూమి ఉంటే అటువంటి భూమి చట్టబద్దంగా తమదేనని ఋజువు చేసుకోవాల్సిన బాధ్యత వారిదే.ఋజువు చేసుకోలేకపోతే గిరిజనుల నుండి అక్రమంగా సంపాదించిందేనని భావించాలి.ఈ చట్టానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న వారందరూ శిక్షార్హులే.

1977అసైన్డు భూములు చట్టం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ అసైన్డు భూములు చట్టం ప్రకారం భూమిలేని నిరుపేదలకు పంచినవి అస్సైన్డు భూములను పై బదిలీ నిషేధం అమ్మకం ,బహుమానం ఇచ్చి పుచ్చుకోవడం ,కైలుకు ఇవ్వడం చేయరాదు. అలాంటి భూముల రిజిస్ట్రేషన్ చెల్లదు.

1996 పీసా చట్టం

[మార్చు]

PESA (Panchayats,Extension to Scheduled Areas ) పీసా చట్టం భారత రాజ్యాంగం 73 వ సవరణ చట్టం, 1992 యొక్క ముఖ్య ఉద్ధేశం స్థానిక పంచాయితీల ద్వారా స్వపరిపాలన కు కావలసిన అధికారాలు బదిలీ చేయటం.షెడ్యూలు ప్రాంతాలలో స్వపరిపాలన తరతరాలుగా వారి సంస్కృతిలో ముఖ్య భాగమైంది.బయటి సమాజంలో ఉత్పన్నమయ్యే సందర్భాలలో గిరిజన గ్రామపంచాయితీలు పనిచేయలేదు పోతున్నాయి. ఎందుకంటే గిరిజనుల వి సాంప్రదాయిక న్యాయం,మౌఖికమైన చట్టం పంచాయితీరాజ్ చట్టం షెడ్యూలు ప్రాంతాలకు వర్తించేముందు అక్కడి పంచాయితీలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలి. కాని ఈ చట్టన్ని షెడ్యూలు ప్రాంతాలకు విస్తరణ చేయకూడదు అని నిర్ణయించారు. ఈ విషయాలు పై సూచనలు చేసేందుకు దిలీప్ సింగ్ భూరియా నాయకత్వంలో కమిటీని 10 జూన్ 1994 లో కేంద్రప్రభుత్వం గ్రామీణాభీవృద్ధి శాఖ నియమించింది.వారి రిపోర్టు ప్రకారం కేంద్రప్రభుత్వం 1996లో ఈ యాక్ట్ ద్వారా 40 పంచాయితీరాజ్ షెడ్యూలు ప్రాంతాలకు విస్తరించింది.

2006అటవీ హక్కుల చట్టం

[మార్చు]

ప్రభుత్వం షెడ్యూలు తెగలు, సాంప్రదాయకంగా అటవీ నివాసులు ఉండే వారికి ఈ అటవీ హక్కు చట్టం వర్తిస్తుంది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 29 డిసెంబర్ 2006 లో ఈ చట్టం అమల్లో వచ్చింది. ఈ చట్టం లక్ష్యం అడవుల్లో నివశించే గిరిజనుల హక్కులను గుర్తించడం. సామాజిక అడవులను కాపాడే సంరక్షించే,నిర్వహించేందుకు హక్కులు ఉంటాయి.గ్రామ వనరులు పై ఆదిమ జాతి గిరిజనులు పి టి జి పోడు వ్యవసాయం చేసే హక్కులు పోడు భూమి పట్టాలు పోందే హక్కులు

మైదాన ప్రాంత గిరిజనుల కొరకు ఐటి డిఎ లు

[మార్చు]

గిరిజనులలో మైదాన ప్రాంత గిరిజనుల కొరకు ప్రభుత్వం ప్రత్యేక ఐటిడిఎ లు ఏర్పాటు చేయడం జరగింది.నెల్లూరు జిల్లా కేంద్రంగా 2001 లో ఏర్పాటు చేశారు. నెల్లూరు,ప్రకాశం,చిత్తూరు,కడప జిల్లాల పరిధిలోని యానాదులు మాత్రమే ఈ సంస్థ పరిధిలోకి వస్తారు.మైదాన ప్రాంతంలో దాదాపు 30 లక్షల మంది గిరిజనులు ఉన్నారు.వీరి జనాభా అణుగుణంగా ఐటిడిఎ లను ఏర్పాటు చేశారు. 2009 హైదరాబాద్ కేంద్రంగా మైదాన ప్రాంత గిరినాభి వృధ్ధి సంస్థ ITDA ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ITDA లు ఉన్నందున వారిని మానహాయించి 12 జిల్లాల పరిధిలోని గిరిజనులను ఈ సంస్థ పరిధిలోకి తెచ్చింది. గిరిజన ఉప ప్రణాళిక నుండి ప్రతి ఏటా 500 కోట్లు కేటాయించి ఆ ప్రాంత గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేయడం ప్రారంభించింది[12].

ట్రైకార్ సంస్థ

[మార్చు]

1976 లో ట్రైకార్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్ధేశం నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు వలసలు పోకుండా స్వయం ఉపాధి పొందేలా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించడం.

మూలాలు

[మార్చు]
  1. "ఐటీడీఏలు ఎదగాలి.. గిరిజనం మురవాలి". EENADU. Retrieved 2024-07-08.
  2. "గిరిజనుల అభ్యున్నతి.. సాకారమయ్యేనా..?". EENADU. Retrieved 2024-07-08.
  3. Pativada, Sreenu Babu (2021-11-02). "ITDA Seethampeta Super-60 proves a boon to Srikakulam tribal students". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-07-10.
  4. ABN (2022-10-09). "పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణుచరణ్‌". Andhrajyothy Telugu News. Retrieved 2024-07-10.
  5. ABN (2023-04-11). "పాడేరు ఐటీడీఏ సేవలకు గుర్తింపు". Andhrajyothy Telugu News. Retrieved 2024-07-10.
  6. ABN (2022-04-13). "రంపచోడవరం ఐటీడీఏ పీవోగా ధనుంజయ బాధ్యతల స్వీకారం". Andhrajyothy Telugu News. Retrieved 2024-07-10.
  7. "Education Schemes: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆరోగ్యానందిస్తున్న ప్రభుత్వ పథకాలు". Sakshi Education. Retrieved 2024-07-10.
  8. "Integrated Tribal Developmental Agency". Integrated Tribal Developmental Agency (in ఇంగ్లీష్). Retrieved 2024-07-10.
  9. "Integrated Tribal Development Agency Eturnagaram, ITDA eturnagaram, Tribal welfare department government of telangana,Trible people warangal, ITDA warangal". itdaeturnagaram.com. Retrieved 2024-07-10.
  10. Today, Telangana (2024-01-26). "Efforts being made to transform lives of tribals: ITDA Utnoor PO". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-10.
  11. "చెంచు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి కృషి | - | Sakshi". www.sakshi.com. Retrieved 2024-07-10.
  12. "మైదాన ప్రాంతంలోనూ 'సమీకృత గిరిజనాభివృద్ధి' | Peedika Rajanna Dora On ITDA Andhra Pradesh | Sakshi". www.sakshi.com. Retrieved 2024-07-12.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐటీడీఏ&oldid=4340959" నుండి వెలికితీశారు