Coordinates: 17°31′29″N 78°39′07″E / 17.5247017°N 78.6520331°E / 17.5247017; 78.6520331

కీసర మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీసర మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, కీసర మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, కీసర మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, కీసర మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°31′29″N 78°39′07″E / 17.5247017°N 78.6520331°E / 17.5247017; 78.6520331
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా
మండల కేంద్రం కీసర
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 141 km² (54.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 71,301
 - పురుషులు 36,322
 - స్త్రీలు 34,979
పిన్‌కోడ్ {{{pincode}}}

కీసర మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా లోని మండలం.[1]

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 1,77,288 - పురుషులు 90,006 - స్త్రీలు 87,282

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 141 చ.కి.మీ. కాగా, జనాభా 71,301. జనాభాలో పురుషులు 36,322 కాగా, స్త్రీల సంఖ్య 34,979. మండలంలో 16,986 గృహాలున్నాయి.[3]

రాజకీయాలు[మార్చు]

ఈ మండలం మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక భాగం. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది.[4] కాంగ్రెస్ పార్టీకి 11313 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 10875 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి 4661 ఓట్లు వచ్చాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అహ్మద్‌గూడా
  2. బోగారం
  3. చీర్యాల్
  4. ధర్మారం
  5. గోదుమకుంట
  6. హరిదాస్‌పల్లి
  7. కుందన్‌పల్లి
  8. నర్సంపల్లి
  9. తిమ్మాయిపల్లి
  10. యాద్గార్‌పల్లి (తూర్పు)
  11. యాద్గార్‌పల్లి (పడమర)
  12. కీసర
  13. కీసర దాయిరా
  14. నాగారం
  15. రాంపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009

వెలుపలి లంకెలు[మార్చు]