కూకట్‌పల్లి (బాలానగర్)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కూకట్ పల్లి బోర్డు

కూకట్‌పల్లి, రంగారెడ్డి జిల్లా, బాలానగర్ (రంగారెడ్డి) మండలానికి చెందిన నగర ప్రాంతము. ఇది ప్రస్తుతం హైదరాబాదు నగరంలో ఒక భాగంగా ఉంది గనుక గ్రామం అనడం సబబు కాదు. ఇది హైదరాబాదుకు పశ్చిమోత్తరంగా ఉంది. 1990 దశకంనుండి బాగా జనావాసాలు పెరగడం వలన, చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా వాణిజ్యకేంద్రాలుగా అభివృద్ధి చెందడం వలన ప్రస్తుతం కుకట్‍పల్లి అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశాలలో ఒకటి అయ్యింది. 1980 దశకంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు వారు నిర్మించిన పెద్ద రెసిడెన్షియల్ టౌన్‌షిప్[1] తో మొదలుకొని ఈ ప్రాంతం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద ఎపార్టుమెంటులు, మధ్య తరగతి ఇళ్ళు, రద్దీగా ఉండే వాణిజ్య సెంటర్, విజయవాడ వైపు ప్రయాణానికి మొదలయ్యే బస్సులు కూకట్‌పల్లిలో ప్రముఖంగా కనిపించే అంశాలు.

కె.పి.హెచ్.బి. కాలనీ షాపింగ్ ఏరియా

జన విస్తరణ[మార్చు]

(జనాభా వివరాలు)

వాణిజ్య ప్రదేశం[మార్చు]

కె.పి.హెచ్.బి. కాలనీ ఆరంభంలో మెయిన్ రోడ్ మీద ఉన్న షాపింగ్ ప్రాంతంలో అనేక షోరూములు, ఇతర కమర్షియల్ కాంప్లెక్సులు ఉన్నాయి. పెద్ద పెద్ద బట్టల దుకాణాలు ఇక్కడి ప్రత్యేకత. అనేక బ్యాంకులు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. సమీపంలోనే ఒక రైతు బజారు ఉంది. దగ్గరలోని మూసాపేటలో "మెట్రో" అనే మెగామార్కెట్ ఉంది. అపోలో, రెమిడీ, ప్రసాద్, ప్రైమ్, టాడ్లా వంటి ఆసుపత్రులున్నాయి.

రవాణా[మార్చు]

హైదరాబాదు నగరంలో భాగంగా అన్ని ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులున్నాయి. ఆటోలు కూడా సర్వసామాన్యం. హైవే గాను, నగరంలోపలి రోడ్డుగానూ ఉన్నందున ఇక్కడ ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువ. ఇది హైదరాబాదును పటాన్ చెరువు, బి.హెచ్.ఇ.ఎల్. కు కలిపే రోడ్డు. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులు, మరియు అనేక ప్రైవేటు బస్సులు కె.పి.హెచ్.బి. కాలనీ నుండి విజయవాడవైపు నిత్యం బయలుదేరుతుంటాయి.

హైదరాబాదు ఎమ్.ఎమ్.టి.ఎస్. రైలు స్టాపు కూడా సమీపంలో ఉంది. ప్రస్తుతం హై-టెక్ సిటీకి కుకట్‌పల్లి నుండి ఉన్న రోడ్డు విస్తరణ జరిగింది. క్రొత్త బ్రిడ్జి నిర్మించారు. మలేషియన్ టౌన్‌షిప్ మీదుగా హై-టెక్ సిటీకి ఈ దారి వెళుతుంది.

విద్య[మార్చు]

హైదరాబాదులోని JNTU ముఖ ద్వారము.

నారాయణ, చైతన్య వంటి అనేక జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విద్యాలయం ప్రధాన కాంపస్ ఇక్కడే ఉంది.

కాలనీలు[మార్చు]

కూకట్‌పల్లిలోని కాలనీలు

కుకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న కాలనీలు - గణేష్ నగర్, వివేకానంద నగర్, ఎ.ఎస్.రాజు నగర్, ఆల్విన్ కాలనీ, కమలప్రసన్న నగర్, మాధవరాం నగర్, వెంకటరావు నగర్, సుమిత్రానగర్, సంగీతనగర్, ధర్మారెడ్డి కాలనీ, బాగ్ అమీర్, భాగ్యనగర్ కాలనీ, జయనగర్, మాధవీనగర్, హెచ్.ఎమ్.టి. హిల్స్, తులసినగర్, జలవాయు విహార్, హెచ్.ఎమ్.టి. శాతవాహన, కె.పి.హెచ్.బి. కాలనీ, వసంతనగర్, సర్దార్ పటేల్ నగర్, భగత్ సింగ్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, మయూరినగర్, జగద్గిరి గుట్ట, రామ్ నరేష్ నగర్ (హైదర్ నగర్), విజయనగర్, బాలాజీ నగర్ వంటివి

ఇతర ప్రాంతాలకు దూరాలు[మార్చు]

Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

బయటి లింకులు[మార్చు]