కూర్గ్ రాష్ట్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూర్గ్ రాష్ట్రం
The map of India showing కూర్గ్ రాష్ట్రం
Location of కూర్గ్ రాష్ట్రం in India
Country India
Regionదక్షిణ భారతదేశం
Government
Time zoneUTC+05:30 (IST)
Preceded by
Succeeded by
కూర్గ్ రాష్ట్రం
మైసూర్ రాష్ట్రం
1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కంటే ముందు దక్షిణ భారతదేశం మ్యాప్, కూర్గ్ రాష్ట్రం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంది

కూర్గ్ రాష్ట్రం, భారతదేశంలో 1950 నుండి 1956 వరకు ఒక పార్టు-సి రాష్ట్రంగా ఉండేది.[1] 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ప్రస్తుతం ఉన్న చాలా రాచరిక ప్రాంతాలను రాష్ట్రాలుగా పునర్నిర్మించారు. ఆ విధంగా, కూర్గ్ ప్రావిన్స్, కూర్గ్ రాష్ట్రంగా మారింది. కూర్గ్ రాష్ట్రాన్ని మెర్కా రాజధానిగా ఉన్న ఒక ప్రధాన కమిషనర్ పాలించారు. ప్రభుత్వానికి అధిపతి ముఖ్యమంత్రి. 1956 నవంబరు 1న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం,1956 ప్రకారం కూర్గ్ రాష్ట్రం రద్దుచేసారు. దాని భూభాగం మైసూర్ రాష్ట్రంలో విలీనం చేయబడింది (తరువాత 1973లో కర్ణాటకగా పేరు మార్చబడింది).[2] ప్రస్తుతం, పూర్వ కూర్గ్ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉంది.

చరిత్ర.

[మార్చు]

భారత రాజ్యాంగం ప్రకారం 1950 జనవరి 26న కూర్గ్ రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది.రాజ్యాంగం అమలుకు ముందు, కూర్గ్ భారత డొమినియన్‌లో ఒక ప్రావిన్స్‌గా ఉండేది. కూర్గ్ లో మొదటి శాసనసభ ఎన్నికలు 1952లో జరిగాయి.రాష్ట్రంలో సి. ఎం. పూనాచా నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్, గాంధీవాది పాండ్యంద బెల్లియప్ప నేతృత్వంలోని తక్కాడి పార్టీ ప్రధాన పోటీదారులు. పొరుగున ఉన్న మైసూర్ రాష్ట్రం విలీనం కావడానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా, తక్కాడి పార్టీ విలీన వ్యతిరేక సిద్ధాంతంపై ఎన్నికలలో పోరాడారు. భారత జాతీయ కాంగ్రెస్ 15 స్థానాలతో ఆధిక్యత సాధించగా, తక్కాడి పార్టీ మిగిలిన తొమ్మిది సీట్లను గెలుచుకుంది.

కూర్గ్ రాష్ట్ర కమీషనర్లు

[మార్చు]
  • దివాన్ బహదూర్ కెతోలిర చెంగప్ప, 1947-1949 మధ్య దాని మొదటి చీఫ్ కమీషనరుగా పనిచేసారు.
  • సిటి ముదలియార్ 1949–1950 [1] వరకు చీఫ్ కమీషనరుగా పనిచేసారు.
  • కన్వర్ బాబా దయా సింగ్ బేడీ, 1950-1956 వరకు ప్రధాన కమిషనరుగా పనిచేసారు [1]

కూర్గ్ ప్రభుత్వం

[మార్చు]

కూర్గ్‌లో 24 సీట్లలో 15 గెలుచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇద్దరు మంత్రులతో (ముఖ్యమంత్రితో సహా కలుపుకుని) మంత్రిమండలి ఏర్పడింది, ఇది 1956 నవంబరు 1న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వరకు కొనసాగింది.

ముఖ్యమంత్రి

[మార్చు]

బెర్రియత్‌నాడ్ నియోజకవర్గం నుండి గెలుపొందిన, చెప్పుదీర ముత్తన పూనాచ 1952 నుండి 1956 వరకు కూర్గ్ రాష్ట్రానికి పనిచేసిన మొదటి, చివరి ముఖ్యమంత్రి. [1]

క్యాబినెట్

[మార్చు]
  • ముఖ్యమంత్రిగా ఉన్న చెప్పుదీర ముత్తన పూనాచ కూర్గ్ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు.
  • కుత్తూరు మల్లప్ప (శనివర్షంతే నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై కూర్గ్ రాష్ట్ర హోంమంత్రిగా పదువీ బాధ్యతలు స్వీకరించారు అయ్యారు

రద్దు

[మార్చు]

1956 నవంబరు 1న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఫలితంగా, భారతదేశ రాష్ట్రాల సరిహద్దులు పునర్వ్యవస్థీకరించబడినప్పుడు, కూర్గ్ రాష్ట్రం అప్పటి మైసూర్ రాష్ట్రంలో విలీనమైంది. [1] [3] [4] ఆతరువాత మైసూర్ రాష్ట్రం కర్ణాటకగా పేరు మారింది.దానిలో కొంత భాగం కూర్గ్ చారిత్రక ప్రాంతం ఇప్పుడు కర్ణాటకలోని కొడగు జిల్లాగా ఏర్పడింది. [5]

ఇది కూడ చూడు

[మార్చు]
  • కొడగు చరిత్ర
  • సెరింగపట్నం వద్ద కూర్గిస్ బందిఖానా

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Cahoon, Ben. "Indian states since 1947". www.worldstatesmen.org.
  2. "When Kodagu merged with Mysore: A short political history of the region". 12 August 2020.
  3. Gayathri, M. B.; Mysore, University of (6 April 1997). "Development of Mysore state, 1940-56". University of Mysore – via Google Books.
  4. Ramaswamy, Harish (6 April 2018). Karnataka Government and Politics. Concept Publishing Company. ISBN 9788180693977 – via Google Books.
  5. Muthanna, I M. Coorg Memoirs (The story of the Kodavas).