Jump to content

మధ్య భారత్

అక్షాంశ రేఖాంశాలు: 26°13′N 78°10′E / 26.22°N 78.17°E / 26.22; 78.17
వికీపీడియా నుండి
మధ్య భారత్
భారతదేశం
[[సెంట్రల్ ఇండియా ఏజెన్సీ|]]
 

1948–1956
Location of మధ్య భారత్
Location of మధ్య భారత్
భారతదేశంలో మధ్య భారత్ స్థానం, 1951
చరిత్ర
 -  సెంట్రల్ ఇండియా ఏజెన్సీ రద్దు 1948
 -  మధ్యప్రదేశ్ రాష్ట్ర సృష్టి 1956
విస్తీర్ణం
 -  1881 1,94,000 km2 (74,904 sq mi)
జనాభా
 -  1881 92,61,907 
Density 47.7 /km2  (123.7 /sq mi)

మాల్వా యూనియన్ అని కూడా పిలువబడే మధ్యభారత్,[1] పశ్చిమ-మధ్య భారతదేశం లోని ఒక రాష్ట్రం. ఇది 1948 మే 28న[2] ఇరవైఐదు రాచరిక రాష్ట్రాల నుండి సృష్టించబడింది.1947 వరకు ఇది సెంట్రల్ ఇండియా ఏజెన్సీలో భాగంగా ఉంది.[3]దీనికి జివాజీరావు సింధియా రాజప్రముఖ్‌గా ఉన్నారు.

ఈ యూనియన్ 46,478 చదరపు మైళ్ళు (1,380 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంతో కలిగి ఉంది.[4] గ్వాలియర్ శీతాకాల రాజధానిగా, ఇండోర్ వేసవి రాజధానిగా ఉండేది. దీనికి సరిహద్దులుగా బొంబాయి రాష్ట్రాలు (ప్రస్తుతం నైరుతి దిశలో గుజరాత్, మహారాష్ట్ర, వాయువ్య దిశలో రాజస్థాన్, ఉత్తరాన ఉత్తర ప్రదేశ్, తూర్పున వింధ్య ప్రదేశ్, ఆగ్నేయంలో భోపాల్ రాష్ట్రం, మధ్యప్రదేశ్ ఉన్నాయి. మధ్య భారత్ జనాభాలో ఎక్కువగా హిందువులు, హిందీ మాట్లాడేవారు ఉన్నారు.1956 నవంబరు 1న, మధ్య భారత్, వింధ్య ప్రదేశ్, భోపాల్ రాష్ట్రాలతో కలిపి మధ్యప్రదేశ్లో విలీనం చేయబడింది

జిల్లాలు

[మార్చు]

మధ్యభారత్ లో పదహారు జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలను మొదట్లో మూడు కమిషనర్ల విభాగాలుగా విభజించారు. తరువాత వాటిని రెండు విభాగాలకు తగ్గించారు.

జిల్లాల జాబితా

  1. భిండ్ జిల్లా
  2. గర్డ్ జిల్లా
  3. మొరెనా జిల్లా
  4. గుణ జిల్లా
  5. శివపురి జిల్లా
  6. రాజ్గఢ్ జిల్లా
  7. భిల్సా జిల్లా
  8. షాజాపూర్ జిల్లా
  9. ఉజ్జయిని జిల్లా
  10. ఇండోర్ జిల్లా
  11. దేవాస్ జిల్లా
  12. రత్లాం జిల్లా
  13. ధార్ జిల్లా
  14. ఝాబువా జిల్లా
  15. నిమార్ జిల్లా
  16. మంద్‌సౌర్ జిల్లా

రాజకీయం

[మార్చు]

మధ్య భారత్ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి రాజప్రముఖ్. దీనికి ఉప రాజప్రముఖ పదవి కూడా ఉండేది. రాష్ట్రంలో 99 మంది శాసనసభ్యులు ఉన్నారు. వీరు 79 నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యారు (59 మంది ఏక సభ్యులు, 20 మంది ద్వంద్వ విధానసభ సభ్యులు).[5] రాష్ట్రంలో 9 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి (7 ఏక సభ్యులు, 2 ద్వంద్వ సభ్యులు).[6]

జీవాజీ రావు సింధియా 28 మే 1948 నుండి 31 అక్టోబరు 1956 వరకు రాష్ట్రానికి రాజప్రముఖ్‌గా ఉన్నారు. లీలాధర్ జోషి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసారు. అతని తరువాత 1949 మే లో గోపీ కృష్ణ విజయ వర్గియా అధికారంలోకి వచ్చారు.1950 అక్టోబరు 18న తఖత్మల్ జలోరి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రి అయ్యారు.

1952 మధ్య భారత శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ 75 స్థానాలను, హిందూ మహాసభ 11 స్థానాలను గెలుచుకున్నాయి.[7] భారత జాతీయ కాంగ్రెస్ చెందిన మిశ్రీలాల్ గంగ్వాల్ 1952 మార్చి 3న ముఖ్యమంత్రి అయ్యారు. అతని రాజీనామా తరువాత, తఖత్మల్ జైన్ (జలోరి) 1955 ఏప్రిల్ 16న మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.[8] అతను 1956 అక్టోబరు 31 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసారు.

భౌగోళికం

[మార్చు]

మధ్య భారత్ రాష్ట్రం మధ్య భారత్ పీఠభూమిలో ఉంది. (ప్రస్తుతం ఇది వాయువ్య మధ్య ప్రదేశ్ రాష్ట్రంగా, మధ్య రాజస్థాన్ చాలా భాగం క్రింద ఉంది). ఈ పీఠభూమికి ఉత్తరాన ఇండో-గంగా మైదానం,తూర్పున బుందేల్ఖండ్ ఎత్తైన ప్రాంతం, దక్షిణాన మాల్వా పీఠభూమి, పశ్చిమాన తూర్పు రాజస్థాన్ ఎత్తైన ప్రాంతాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. India States
  2. "Bhind-History". Bhind district website. Archived from the original on 19 జూన్ 2009.
  3. Chisholm, Hugh, ed. (1911). "Malwa" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 17 (11th ed.). Cambridge University Press. p. 518.
  4. Bhattacharyya, P. K. (1977). Historical Geography of Madhya Pradesh from Early Records. Motilal Banarsidass. pp. 53–4. ISBN 9788120833944.
  5. "Statistical Report on General Election, 1951 to the Legislative Assembly of Madhya Bharat" (PDF). Election Commission of India website.
  6. "Statistical Report on General Elections, 1951 to the First Lok Sabha" (PDF). Election Commission of India website. Archived from the original (PDF) on 9 April 2009.
  7. "Statistical Report on General Election, 1951 to the Legislative Assembly of Madhya Bharat" (PDF). Election Commission of India website.
  8. "This Day That Age - April 18, 1955: Madhya Bharat CM". The Hindu. 18 April 2005. Archived from the original on 20 April 2005. Retrieved 2009-08-16.

26°13′N 78°10′E / 26.22°N 78.17°E / 26.22; 78.17