జాజ్పూర్
జాజ్పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 20°51′N 86°20′E / 20.85°N 86.33°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | జాజ్పూర్ |
Founded by | జజాతి కేసరి |
Elevation | 8 మీ (26 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 37,458 |
• జనసాంద్రత | 620/కి.మీ2 (1,600/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | OD-04 &OD-34 |
Website | www.jajpur.nic.in |
జాజ్పూర్ ఒడిశా రాష్ట్రం, జాజ్‌పూర్ జిల్లాలోని పట్టణం. ఇది కేసరి రాజవంశం యొక్క రాజధానిగా ఉండేది. ఆ తరువాత దీని స్థానంలో కటక్, రాజధాని అయింది.[1][2] ఇది జాజ్‌పూర్ జిల్లాకు ముఖ్యపట్టణం. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పాణికోయిలిలో ఉంది. పట్టణ పరిపాలనను పురపాకల సంఘం నిర్వహిస్తుంది.
చరిత్ర
[మార్చు]జాజ్‌పూర్, పురాతన బిరాజా ఆలయం ఉన్న ప్రదేశం, దీనిని మొదట బిరాజా అని పిలిచేవారు. పురాతన గ్రంథాలలో ఈ పట్టణానికి విరంజ, వరంజ-నగర, వరాహ-తీర్థ అనే పేర్లు ఉండేవి. [3] భౌమ-కార రాజులు తమ రాజధానిగా గుహదేవపతాక (లేదా గుహేశ్వరపతాక) ను స్థాపించారు. ఇదే ఇప్పటి జాజ్‌పూర్ సమీపంలోని గోహిరతికార్ (లేదా గోహిరతిక్ర) అని గుర్తించారు. [4] తరువాతి సోమవంశీ రాజులు తమ రాజధానిని యయాతినగర (నేటి బింక) నుండి గుహేశ్వరపతాకకు మార్చారు. పట్టణానికి అభినవ-యయాతినగర అని పేరు పెట్టారు. [3]
తరువాత, జాజ్పూర్ [5] పట్టణం యజనగర అని పిలువబడింది. ఒక సిద్ధాంతం ప్రకారం, ఈ పేరు "యయాతినగర" నుండి వచ్చింది. మరొక సిద్ధాంతం ఏమిటంటే, ఇది గంగా - గజపతి కాలంలో (11వ-16వ శతాబ్దం) ప్రాచుర్యం పొందిన యజ్ఞాల నుండి ఉద్భవించింది. [6] తబకత్ -ఇ-నసిరి, తారిఖ్-ఇ-ఫిరుజ్షాహి వంటి ముస్లిం చరిత్రలలో, ఈ పట్టణం పేరును "జజ్‌నగర్"గా పేర్కొన్నారు. తరువాత, " -నగర్ " ("పట్టణం") ప్రత్యయం స్థానంలో " -పూర్ " చేరి, పేరు "జాజ్‌పూర్"గా మారింది. [3]
భౌగోళికం, శీతోష్ణస్థితి
[మార్చు]జాజ్పూర్[7] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
శీతోష్ణస్థితి డేటా - Jajpur | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 29.2 (84.6) |
32.3 (90.1) |
35.4 (95.7) |
37.0 (98.6) |
37.5 (99.5) |
34.7 (94.5) |
32.3 (90.1) |
31.8 (89.2) |
32.3 (90.1) |
32.0 (89.6) |
30.7 (87.3) |
29.0 (84.2) |
32.9 (91.1) |
సగటు అల్ప °C (°F) | 15.2 (59.4) |
18.7 (65.7) |
22.6 (72.7) |
25.0 (77.0) |
26.2 (79.2) |
26.1 (79.0) |
25.5 (77.9) |
25.3 (77.5) |
25.0 (77.0) |
23.3 (73.9) |
19.1 (66.4) |
15.0 (59.0) |
22.3 (72.1) |
సగటు అవపాతం mm (inches) | 41.3 (1.63) |
26.0 (1.02) |
27.8 (1.09) |
48.5 (1.91) |
130.6 (5.14) |
243.4 (9.58) |
340.6 (13.41) |
401.1 (15.79) |
269.5 (10.61) |
195.8 (7.71) |
37.2 (1.46) |
38.5 (1.52) |
1,800.3 (70.87) |
Source: Jajpur Weather |
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జాజ్‌పూర్ పట్టణ జనాభా 37,458. అందులో 19,216 మంది పురుషులు, 18,242 మంది మహిళలు. 6 సంవత్సరాల లోపు పిల్లలు 3,823. జాజ్‌పూర్‌లో అక్షరాస్యుల సంఖ్య 29,975, ఇది జనాభాలో 80.0%, పురుషులలో అక్షరాస్యత 83.5% కాగా, స్త్రీలలో ఇది 76.4%. ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 89.1%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 92.9%, స్త్రీల అక్షరాస్యత రేటు 85.1%. షెడ్యూల్డ్ కులాల జనాభా 6,363 షెడ్యూల్డ్ తెగల జనాభా 565. 2011లో జాజ్‌పూర్‌లో 8198 గృహాలు ఉన్నాయి [1]
విద్య
[మార్చు]పట్టణం లోని కళాశాలలు
[మార్చు]- NC అటానమస్ కాలేజ్, జాజ్‌పూర్ టౌన్
- SG కళాశాల, కనికపడ, జాజ్‌పూర్
- VN అటానమస్ కాలేజ్, జాజ్‌పూర్ రోడ్
దేవాలయాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Census of India: Jajpur". www.censusindia.gov.in. Retrieved 7 January 2021. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Census2011Gov" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Local Self-government in British Orissa, 1869-1935. Retrieved 21 June 2019.
- ↑ 3.0 3.1 3.2 Thomas E. Donaldson 2001, p. 51.
- ↑ Thomas E. Donaldson 2001, p. 6.
- ↑ Saran, Richard D.; Ziegler, Norman P. (2001), "THE TRANSLATIONS", The Mertiyo Rathors of Merto, Rajasthan, Select Translations Bearing on the History of a Rajput Family, 1462–1660, Volumes 1–2, University of Michigan Press, pp. 81–216, doi:10.3998/mpub.19305.15#metadata_info_tab_contents, ISBN 978-0-89148-085-3, retrieved 2021-05-06
- ↑ Kailash Chandra Dash 2010, p. 169.
- ↑ Chhotray, G. P.; Pal, B. B.; Khuntia, H. K.; Chowdhury, N. R.; Chakraborty, S.; Yamasaki, S.; Ramamurthy, T.; Takeda, Y.; Bhattacharya, S. K.; Nair, G. Balakrish (2002). "Incidence and Molecular Analysis of Vibrio cholerae Associated with Cholera Outbreak Subsequent to the Super Cyclone in Orissa, India". Epidemiology and Infection. 128 (2): 131–138. ISSN 0950-2688.