జాతీయ రహదారి 3 (పాత సంఖ్య)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 3
3
National Highway 3
పటం
Interactive Map of Old National Highway 3 in red
Nashik Mumbai NH3.jpg
పాత ఎన్‌హెచ్ 3 నాసిక్ - ముంబై
మార్గ సమాచారం
Part of AH43 AH47
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరఆగ్రా, ఉత్తర ప్రదేశ్
Major intersections
దక్షిణ చివరముంబై
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఉత్తర ప్రదేశ్: 26 కి.మీ.
రాజస్థాన్: 32 కి.మీ.
మధ్య ప్రదేశ్: 712 కి.మీ.
మహారాష్ట్ర: 391 కి.మీ.
ప్రాథమిక గమ్యస్థానాలుఆగ్రాగ్వాలియర్ఇండోర్–ధూలే–నాసిక్ముంబై
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 2A ఎన్‌హెచ్ 4

జాతీయ రహదారి 3 (పాత సంఖ్య), లేదా పాత ఎన్‌హెచ్ 3, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల గుండా వెళ్ళే ఒక ప్రధాన భారతీయ జాతీయ రహదారి.[1] సాధారణంగా దీన్ని ఆగ్రా - బొంబాయి రోడ్ లేదా బొంబాయిలోని ఆగ్రా రోడ్ అని అంటారు. ఈ జాతీయ రహదారి ఇప్పటికీ ఉంది గానీ, దాని వివిధ భాగాలకు కింది విభాగంలో పేర్కొన్న విధంగా కొత్త నంబర్లు కేటాయించారు.

జాతీయ రహదారి 3A రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ధోల్‌పూర్‌లో మధ్య ఉన్న ఒక శాఖామార్గం.

మార్గం

[మార్చు]

ఈ రహదారి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉద్భవించింది. ఇది రాజస్థాన్‌లోని ధోల్‌పూర్, మోరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, బియోరా, మక్సీ, దేవాస్, ఇండోర్, జుల్వానియా & సెంద్వా, మధ్యప్రదేశ్‌లోని జుల్వానియా, సెంద్వా, షిర్పూర్, నార్దానా, ధులెగాన్‌ల మీదుగా నైరుతి దిశగా ప్రయాణించి, ముంబైలో థానే, వద్ద ముగుస్తుంది. పాత ఎన్‌హెచ్-3 పొడవు 1,260.25 కిలోమీటర్లు (783.08 మై.)

ఆగ్రా, గ్వాలియర్ల మధ్య ఉన్న భాగాన్ని, భారత జాతీయ రహదారుల అధికార సంస్థ ఉత్తర-దక్షిణ కారిడార్ / ఎన్‌హెచ్-44 గా గుర్తించింది. గ్వాలియర్ & బయోరా మధ్య ఉన్న భాగాన్ని ఎన్‌హెచ్-46 గా, బియోరా ధూలే మధ్య ఉన్న భాగాన్ని ఇప్పుడు ఎన్‌హెచ్-52 గా గుర్తించింది. ముంబై నుండి నాసిక్ వరకు ఉన్న భాగాన్ని ఇప్పుడు ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వే అంటారు. ఈ రహదారి బొంబాయిలోకి ప్రవేశించిన తరువాత, దీన్ని తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే అని అంటారు. ఆగ్రా, గ్వాలియర్ల మధ్య ఈ రహదారి నాలుగు వరుసలతో ఉంది. గ్వాలియర్ నుండి శివపురి, గుణ, మక్సీ మీదుగా దేవాస్ ఉన్న మార్గం ఇప్పుడు నాలుగు వరుసలతో ఉంది. శివపురి, మక్సీ మధ్య ఉన్న మార్గాన్ని కొత్తగా నిర్మించారు. దేవాస్ నుండి ఇండోర్ వరకు ఉన్న రహదారి ఆరు వరుసలతో ఉంది. ఇది రౌ (ఇండోర్) వరకు కొనసాగుతుంది. రౌ (ఇండోర్) నుండి ముంబైకి వెళ్లే రహదారికి నాలుగు వరుసలతో ఉంది. అయితే ఈ రహదారి రద్దీగా ఉండే నాసిక్ నగరం గుండా వెళ్తుంది. ఈ రద్దీ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు 25.27 కిలోమీటర్లు (15.70 మై.) ఎలివేటెడ్ రహదారిని నిర్మించారు. నాసిక్ నుండి ముంబై వరకు సాగే 4-వరుసల రహదారిని ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్ వే అంటారు. పింపాల్‌గావ్ బస్వంత్ - నాసిక్ - గోంధే వరకు ఉండే రహదారి 6 వరుసల ఎక్స్‌ప్రెస్ వే. పద్ఘా నుండి థానే వరకు 8 వరుస్ల దారి పనులు పురోగతిలో ఉన్నాయి.

ఆగ్రా బొంబాయి రహదారి కొత్త ఎన్‌హెచ్ నంబర్లు

[మార్చు]

2010లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని జాతీయ రహదారుల సంఖ్యలను పునర్వ్యవస్థీకరించినపుడు, మునుపటి ఎన్‌హెచ్ 3 ని అనేక కొత్త జాతీయ రహదారులుగా విభజించారు. పాత ఎన్‌హెచ్ 3 ప్రస్తుతం ఉనికిలో లేదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 10 April 2009. Retrieved 2011-07-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Details of National Highways in India-Source-Govt. of India