తెలంగాణలోని జలపాతాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణలో పర్యాటక రంగంలో జలపాతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. తెలంగాలోని అద్భుతమైన జలపాతాల్లో రామాయణ కాలపు నేపథ్యమున్న జలపాతాలు కూడా ఉన్నాయి.[1][2]

కుంటాల జలపాతం

జలపాతాలు

[మార్చు]
గుండాల జలపాతం

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న జలపాతాలు[3]

  1. అజలాపురం జలపాతం: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజలాపురంలో ఉంది. [4]
  2. కనకాయ్ జలపాతం: దీనిని కనకదుర్గ జలపాతం అనికూడా అంటారు. ఇది కుంటాల జలపాతంకు 35 కిలోమీటర్ల దూరంలో గిర్నూర్ సమీపంలో ఉంది.
  3. కుంటాల జలపాతం: ఇది తెలంగాణలోనే అతి ఎత్తయిన జలపాతం. ఆదిలాబాదు జిల్లా లోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉంది.
  4. గాయత్రి జలపాతాలు (లేదా) ముక్తిగుండం జలపాతం: నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న అనేక జలపాతాల్లో ఒకటైన ఈ గాయత్రి జలపాతం ఆదిలాబాద్ జిల్లా లోని నేరడిగొండ మండలంలో ఉంది.[5]
  5. గుండాల జలపాతం: ఇది మహబూబ్ నగర్ జిల్లా, ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామ సమీపంలో ఉంది.
  6. గౌరీగుండాలు: ఇది పెద్దపల్లి జిల్లాలో గుండారం-సబ్బితం సరిహద్దుల్లోని గుట్టపై గౌరీగుండం ఉంది.
  7. పొచ్చెర జలపాతం: ఇది ఆదిలాబాదు జిల్లాలో బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి 6 కి.మీ దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంది.[6]
  8. బోగత జలపాతం: ఇది జయశంకర్ జిల్లా, వాజేడు మండలంలోని బోగత గ్రామంలో ఉంది.
  9. భీముని పాదం: ఇది వరంగల్ పట్టణానికి 51 కిలోమీటర్ల దూరంలో గూడూరు నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  10. మల్లెలతీర్థం: ఇది మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది.
  11. రాయికల్ జలపాతం: ఇది కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని రాయికల్ అనే గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  12. సప్తగుండాల జలపాతం: ఇది కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలంలోని పిట్టగూడకు రెండు కిలో మీటర్ల దూరంలో అడవుల్లో ఉంది.[7]
  13. సబితం జలపాతం: ఇది పెద్దపల్లి జిల్లా లోని రామగుండం మండలంలోని సబితం గ్రామంలో ఉంది.
  14. సిర్నాపల్లి జలపాతం: ఇది నిజామాబాదు జిల్లా లోని ధరపల్లి మండలం లోని సిర్నాపల్లి గ్రామంలో ఉంది.
  15. మొలాల్ గుట్ట జలపాతం: ఇది ఆదిలాబాద్ జిల్లా లోని ఆదిలాబాద్ గ్రామీణ మండలం లోని ఖండాల గ్రామ పంచాయితీలో ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (20 July 2018). "మన తెలంగాణ జలపాతాల వీణ!". Archived from the original on 7 September 2018. Retrieved 8 September 2018.
  2. నవ తెలంగాణ (18 November 2015). "అందాల జ‌ల‌పాతాలు". Archived from the original on 7 September 2018. Retrieved 7 September 2018.
  3. నమస్తే తెలంగాణ. "తెలంగాణ నయాగరాలు". Archived from the original on 8 September 2018. Retrieved 8 September 2018.
  4. అజలాపురం జలపాతం. "అజలాపురం జలపాతం". నమస్తే తెలంగాణ. Archived from the original on 10 జూలై 2017. Retrieved 8 September 2018.
  5. TelanganaToday (29 July 2018). "Get wooed by wonderful waterfalls of Telangana". Archived from the original on 18 మే 2019. Retrieved 8 September 2018.
  6. నమస్తే తెలంగాణ (11 November 2017). "Waterfalls in Telangana State". Archived from the original on 8 September 2018. Retrieved 8 September 2018.
  7. నమస్తే తెలంగాణ (18 November 2015). "ఆదిలాబాద్‌ అడవుల్లో సప్తగుండాల జలపాతం!". Archived from the original on 7 September 2018. Retrieved 8 September 2018.