Jump to content

తెలుగు సినిమా పేలిన డైలాగులు

వికీపీడియా నుండి

ఒక్కో సినిమాలో కొన్ని డైలాగులు బాగా జనాదరణ పొందుతాయి. అప్పుడు డైలాగు పేలింది అని సినిమా పరిభాషలో అంటారు. ఆ డైలాగులు నెలలు తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ప్రజల నోట్లలో నానుతుంటాయి. భాషలో భాగాలైపోతాయి. మాటలకు అందాన్ని తెచ్చిపెడతాయి. వ్యంగ్యంగా మాట్లాడడానికి క్రొత్త మార్గాలను చూపెడతాయి. అటువంటి కొన్ని డైలాగులను పొదుపరచడం ఈ వ్యాసం లక్ష్యం.

అటువంటి డైలాగులు సందర్భాన్ని బట్టీ, చెప్పిన వారి ప్రతిభను బట్టీ హిట్టవుతాయి. కొన్ని డైలాగులు పొడవైనవి కావచ్చు. కొన్ని చాలా చిన్న వాక్యాలు కాని ("వెళ్ళవయ్యా వెళ్ళు"), కేవలం పదాలు గాని ("సుత్తి"), ఊత పదాలు గాని కావచ్చును.

పాతాళభైరవి లోఎస్.వి. రంగారావు
  • (ఎస్.వి. రంగారావు) సాహసము సేయరా డింభకా! రాకుమారి దక్కునురా!
  • నరుడా ఏమి నీ కోరిక
  • నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?
  • (ఎస్.వి. రంగారావు) ఎవరూ పుట్టించకుండా పదాలు ఎలా పుడతాయి? వెయ్యి వీరతాడు.
  • చిన్నమయ్య - శిష్యుల సంభాషణలో అసమదీయులు, తసమదీయులు- ఇవి రాజకీయాల్లో పాపులర్ అయి ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి

ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఒకటి కాదు. దాదాపు అన్నీను. వాటిని తూర్పు గోదావరి యాసలో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.

  • అల్లొల్లొల్లో - జోగినాధం గారా
  • సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
  • అబ్బో ముసలాడు రసికుడేరా!
  • సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
  • ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా
  • ఆ ముక్క నేను లెక్కెట్టుకోక మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త
  • ‘భజంత్రీలు ’ అనేది పొగడ్తలకు ఈ సినిమాతోనే సింబాలిక్‌గా మారింది.

అయితే ఒక్కసారి వచ్చిన మాడా "డవలాగులు" ఊరూరా మోగిపోయాయి

  • మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెసను ఉందా? ఈ విసయంలో మీకు నాకు ఒక కాంప్రొమైజైషన్ కుదిరితే నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను.
  • చరిత్ర అడక్క చెప్పింది విను
  • ఇందులో అనేక డైలాగులలో వాడిన "సుత్తి" అన్న పదం బాగా హిట్టయ్యింది. ఆ డైలాగుల్లో ఉన్న పాత్రధారులు సుత్తి వీరభద్ర రావు - సుత్తి వేలుగా ప్రసిద్ధులయ్యారు
  • అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా..కరిస్తే నిష్క్రమిస్తా!
  • (సదా) వెళ్ళవయ్యా వెళ్ళూ
  • (బాలకృష్ణ): నేనిక్కడ తొడగొడితే నువ్వక్కడ గుండె ఆగి ఛస్తావ్!
  • (బాలకృష్ణ) నీవూరికొచ్చా! నీవీధిలోకొచ్చా! నీ యింటికొచ్చా!
  • (బాలకృష్ణ) కత్తులతొ కాదురా! కంటి చూపుతొ చంపేస్తా!

(మహేష్ బాబు)

  • నేనెంత యదవనో నాకే తెలవదు.
  • ఒకసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను.
  • ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దో......వాడే పండుగాడు.నేనే.
  • ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా .
  • అన్నయ్యా ఈ తొక్కలో మీటింగ్‌లు ఏమిటో అర్థంకావట్లేదు.
  • చెయ్యి చూసావా ఎంత రఫ్ గా వుందో.. రఫ్ఫాడిస్తా...
  • అంతొద్దు..ఇది చాలు..
  • ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో...
  • బాక్సు బద్దలౌద్ది
  • మొక్కే కదా అని పీకేస్తే........ పీక కోస్తా....
  • షౌకత్ ఆలీ ఖాన్... తప్పు నా వైపు ఉందని తల వంచుకు వెళ్తున్నాను, అదే నీ వైపు ఉండి ఉంటే ఇక్కడి నుండి తలలు తీసుకెళ్ళేవాడిని. మా వాడు ఫోన్ చేసేదాకా వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడిదాకా వచ్చిందో నేనడగను. పెళ్ళి కావలసిన అమ్మాయిని నలుగురిలోకి పిలిచి పంచాయితీ చేయకు, తన మనసు తెలుసుకొని నిఖా పక్కా చేసుకో
  • రాననుకున్నారా... రా...లేననుకొన్నారా???అదే రక్తం... అదే పౌరుషం...
  • సింహాసనం పై కూర్చొండే హక్కు అక్కడ ఆ ఇంద్రునిది, ఇక్కడ... ఈ ఇంద్రసేనుడిది!!!
  • నాన్నా చిట్టీ!
  • వెయిట్ ఎ నిమిట్ ఫర్ ఫైవ్ నిమిట్స్
  • మహేశ్: నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం
  • మహేశ్:నాకు బ్రతకటం రాదు పూరీ, ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నాను.
  • మహేశ్:నువ్వడిగావు కాబట్టి కాదు, నేను నమ్మాను కాబట్టి చెప్పాను.
  • త్రిష: వీడు చూడటానికి కాంప్లాన్ బాయ్ లా ఉన్నాడు, కాని చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని ఎవరికీ తెలియదు.
  • గిరిబాబు: దేవుడా, కూతుర్నివ్వమంటే క్వశ్చన్ బ్యాంక్ ని ఇచ్చావా?
  • త్రిష: బయట ఉన్న చపాతీ మొహాలు కావాలి, ఇంట్లో ఉన్న పూరీ మాత్రం అక్కర లేదు
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం: వాడంటే తెలివిగల వాడు కాబట్టి పెళ్ళి కాక ముందే ఆడాళ్ళు అందంగా ఉండరని తెలుసుకొన్నాడు. మా పెళ్ళాళ్ళు అందంగా ఉన్నారా, మాకు కాలా పెళ్ళిళ్ళూ, మేం చేయట్లేదా కాపురాలు?
  • మహేశ్: గన్ చూడాలనుకో, కాని బుల్లెట్ చూడాలనుకోకు.. చచ్చిపోతావు
  • తనికెళ్ళ భరణి: సమాధానం చెబితే తెలివితేటలంటారు, చెప్పకపోతేనేమో పొగరంటారు, చాదస్తం.
  • నాని: శిలవూ నీవే, శిల్పివీ నీవే, నిన్ను నీవు మలుచుకో ప్రపంచం అదే మారుతుంది....
  • వెంకీ: దణ్ణం పెట్టుకొంటున్నారా?

ఎం. ఎస్. నారాయణ: నువ్వన్నం పెట్టుకో బాబు!

  • వెంకీ: ప్రార్థనా? తప్పదా!

ఎం. ఎస్: ఏ రాదా?

  • వెంకీ: మీరేం చేస్తుంటారు?

ఎం. ఎస్: ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను. తొందరపడి ఏదో ఒకటి చేయటం నాకిష్టం ఉండదు.

  • ఎం. ఎస్. నారాయణ: ఏం చేస్తావ్.. ఏం చేస్తావ్ అని మాటిమాటికీ అడగొద్దు.. ఏదో ఒకటి చేసేయగలను.
  • హేమ: మీరా దిక్కుమాలిన ముక్కలను పక్కన పడేసి వస్తే నేను మీ కాళ్ళకి దణ్ణం పెట్టుకొంటాను

ఎం. ఎస్: పిచ్చిదానా! కాళ్లకి దణ్ణం పెట్టుకోవటానికి చేతిలో ముక్కలని ఎందుకే పడేయటం, ఇవిగో కాళ్ళు, విచ్ఛలవిడిగా పెట్టుకో దణ్ణాలు.

  • ఎం. ఎస్. నారాయణ: అమ్మా .. నీ కళ్ళు ఎక్కడికి పోయాయ్?

సునీల్: ఆవిడే పోయి 20 సంవత్సరాలు అయ్యింది.

  • వెంకీ: మల్లీశ్వరిని మీరు పని మనిషంటున్నారు, నేను
  పని తెలిసిన మనిషి అంటాను. 
  • కత్రినా: నీకు అసలు బుద్ధి లేదా?
  • వెంకీ:ఉంది.కాని ఎక్కువగా వాడను.
  • వెంకీ:అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు కానీ హెల్ప్ చేసి థాంక్స్
  అడక్కూదు..
  • బ్రహ్మీ:ఇన్నేళ్లనుండి ఈ ప్యాలస్ లో పనిచేస్తున్న కానీ
 రాజు ని ఇప్పుడే చూస్తున్నా సర్..
  • వెంకీ:నీతో ఇదేరా ప్రాబ్లం సెంటిమీటర్ చనువిస్తే
 కిలోమీటర్ దూసుకెళ్తావ్..
  • ముఖేష్ ఋషి: బెదిరింపుకి భాష అక్కర లేదు
  • పవన్ కళ్యాణ్: సిగ్గు లేక కాదు సార్, ఇన్ ఫర్మేషన్ లేక, ఇన్ ఫర్మేషన్ ఉంటే ఇవన్నీఎందుకు చేస్తాం?
  • పవన్ కళ్యాణ్:ఏదో కంట్రోల్ లో పెడదామని రెండు మూడు దెబ్బలేస్తే ఏడుపులు, పెడబొబ్బలు, డొమెస్టిక్ వయొలెన్స్, TV9
  • పవన్ కళ్యాణ్:వీడి పర్సు కొట్టేసినా వీడు బిల్లెలా కడతాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి, నిరంతర వార్తాస్రవంతి, TV9
  • మహేష్ బాబు:పంటకి పురుగు పట్టకుండా మందు చల్లాడు, పని చేయలేదు, తను తాగాడు, పనిచేసింది.
  • పవన్ కళ్యాణ్:నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఒక గన్ను కొనుక్కున్నాను.
  • సునీల్: నాకెప్పుడూ తొందర, పది నిముషాల ముందర, అందుకే నా జీవితమంతా చిందరవందర
  • పవన్ కళ్యాణ్: యుద్ధంలో గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం.
  • పవన్: మీకిలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి..
  • బ్రహ్మీ:దరిద్రులం కదండి మాకిలాంటివే వస్తాయి
  • పవన్:నీకు గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల్లో ఇస్తా భయం భయం
  • నీ యంకమ్మా!
  • ఇదంతా మట్టా అండీ! బావుందండీ మీ మట్టీ!
  • హోడెమ్మా జీవితం!రేయ్..ఆంబోతుకు ముందునడవకూడదు కుమ్ముద్ది, గాడిదకు ఎనకాల ఉండకూడదు తన్నుద్ది .నీలాంటి ఎడవకు ఏపక్క ఉండకూడదు..

నువ్వుకుడా ఒకటి గుర్తుపెట్టుకో పెరుగన్నంలో పెరుగుంటుంది కానీ పులిహోర లో పులిఉండదు.

  • కరెంటు తీగ కూడా నా లా సన్నగా ఉంటది. కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే../
  • అరె కోటీ ఇంకో టీ......
  • నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది.
  • నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా...
  • నాకు నేనే పోటీ! నాతో నాకే పోటీ!
  • అరె వో గబ్బర్ సింగ్ కే ఫౌజియో!
  • నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా...
  • అబ్బబ్బబ్బబ్బా... ఏం సెప్తిరీ ఏం సెప్తిరీ...
  • న స్త్రీ, న ఎక్స్ట్రార్డ్నరీ!
  • అమ్మాయిలంతా సర్వమంగళ మేళమే!
  • బాద్‍షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది
  • బ్రతకాలంటే బాద్‍షా కింద ఉండాలి, చావాలంటే బాద్‍షా ముందుండాలి
  • గాలిని ముట్టుకోలేరు, మంటని తట్టుకోలేరు, షాడోని పట్టుకోలేరు
  • మాటల్లేవ్... మాటాడుకోవటాల్లేవ్...
అత్తారింటికి దారేది లో పవన్ కళ్యాణ్
  • (పవన్ కళ్యాణ్ సమంతతో) నువ్వు ఐస్ క్రీం తినేటప్పుడు నేను కళ్ళు మూసుకొంటాను, నేను సిగరెట్ కాల్చేటప్పుడు నువ్వు ముక్కు మూస్కో
(సమంత క్యాషియర్ తో) నువ్వు పని చూస్కో
  • ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు.
  • చూడప్పా సిద్ధప్పా, నేను సింహం లాంటోణ్ణి. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకొంటాను. అంతే తేడా. మిగతాదంతా సేం టు సేం. అహ్, ఆహ్! ఏమైనా లాస్ట్ పంచ్ మనదే అయితే, దానికొచ్చే కిక్కే వేరప్పా!
  • పవన్:కష్టం నీ కాంపౌండ్ వాల్ దాటకుండా
చూసుకుంటాం అత్త
  • పవన్:కంటికి కనపడని శత్రువుతో బయటకు కనపడని యుద్ధం చేసేవాడిని..
  • నేను గానీ ఒక వీలగానీ వేశానంటే..
  • నాలుక బైట పెట్టి ఆలీ అనే నటుడి అభినయం (ఊత పదం కాదు కానీ నటనకి ఊతం అనుకుందాం)
  • ఏమిటో..
  • అబ్బ.. దబ్బ.. జబ్బ
  • హిమక్రీములు
  • అక్కుం.. బక్కుం
  • డిసైడ్ చేస్తా
  • ధూంతత
  • రంగు పడుద్ది.
  • బబతి...బబతి
  • తద్ధిత..
  • రక్తకోలా
  • నేనసలే గడుసుదాన్ని
  • లెంగ్త్ ఎక్కువైంది
  • అనుకుంటాం గానీ
  • కాదనలేను