నల్లపాటి వెంకటరామయ్య

వికీపీడియా నుండి
(నల్లపాటి వెంకటరామయ్యచౌదరి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నల్లపాటి వెంకటరామయ్య
నల్లపాటి వెంకటరామయ్య
జననంనల్లపాటి వెంకటరామయ్య చౌదరి
మార్చి 1,1901
పల్నాడు జిల్లా జొన్నలగడ్డ
మరణంజూన్ 28,1983
వృత్తిన్యాయవాది
1953 నుండి 1956 వరకు రాష్ట్ర శాసనసభ సభాపతి
ప్రసిద్ధిఆంధ్రరాష్ట్రం శాసనసభకు మొదటి సభాపతి
తండ్రిఅంకమ్మ
తల్లికోటమ్మ

నల్లపాటి వెంకటరామయ్య ( 1901 మార్చి 1 - 1983 జూన్ 28) న్యాయవాది, రాజకీయవేత్త, ఆంధ్రరాష్ట తొలి శాసన సభాపతి.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట సమీపంలోని జొన్నలగడ్డ గ్రామంలో అంకమ్మ, కోటమ్మ దంపతులకు 1901, మార్చి 1న జన్మించాడు. నరసరావుపేటలో ఎస్ ఎస్ యల్ సి, గుంటూరులో ఇంటర్ పూర్తి చేశాడు. మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బిఏ పట్టభద్రుడయ్యాడు. వినుకొండ రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా చేరి బ్రిటిష్ వారి కొలువులో ఇమడలేక ఉద్యోగం వదిలివేశాడు. తిరిగి మద్రాసు వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి న్యాయవాది అయ్యాడు. గుంటూరులో న్యాయవాది అన్నవరాజు సీతాపతిరావు వద్ద సహాయకునిగా కొంతకాలం పనిచేసి 1928లో నరసరావుపేటలో న్యాయ వాదిగా కొనసాగాడు. పల్నాడు ప్రాంతంలో న్యాయవాదిగా కీర్తిప్రతిష్ఠలను పొందాడు. 1932లో వెంకటరామయ్య తాలూకా బోర్డు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా నియమితులై విద్యావ్యాప్తికి కృషి చేశాడు. 1952లో నరసరావుపేట నియోజకవర్గం నుండి కాసు వెంగళరెడ్డిపై పోటీ చేసి శాసనసభ్యునిగా గెలిచాడు. 1953 అక్టోబరు 1న స్పీకర్ పదవికి ఎన్నిక జరగగా కండవల్లి కృషారావుపై వెంకటరామయ్య గెలుపొందాడు. వెంకటరామయ్య గెలుపును ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రతిషాత్మకంగా భావించాడు. తొలి శాసనసభ స్పీకర్ గా వెంకటరామయ్య చరిత్రలో నిలిచిపోయారు. శాసనసభను నిబంధనల మేరకు సజావుగా నడిపించి అన్ని పార్టీల వారి అభిమానాన్ని చూరగొన్నాడు. 1955లో కరణం రంగారావుపై ఐక్య కాంగ్రెస్ అభ్యర్థిగా, శాసనసభ్యునిగా గెలిచాడు. 1962లో రాజకీయాల నుండి వైదొలగి 1978వరకు న్యాయవాది వృత్తిలో కొనసాగాడు. 1983 జూన్ 28న నరసరావుపేటలో కన్నుమూశారు.

వృత్తి, రాజకీయం[మార్చు]

1929లో నరసరావుపేటలో న్యాయవృత్తి చేపట్టాడు.1932లో తాలూకా బోర్డు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ సెనేట్ సభ్యునిగా విశేష సేవలందించాడు. 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలలో నరసరావుపేట శాసనసభ స్థానంనుండి ఎన్నికయ్యాడు.1953 అక్టోబరు 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడి ప్రకాశం ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.1953 నవంబరు 23న వెంకటరామయ్య సభాపతిగా ఎన్నికయ్యాడు.25 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో కొనసాగిన వెంకటరామయ్య శాసనసభను కూడా న్యాయబద్ధంగా నడిపాడు.1955 నుండి 1962 వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగాడు. 1962లో రాజకీయాలనుండి వైదొలగి 1978 వరకూ న్యాయవాద వృత్తి కొనసాగించాడు.

మరణం[మార్చు]

1983, జూన్ 28 న స్వగృహంలో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. http://epaper.andhrajyothy.com/c/11770376[permanent dead link]
  2. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 221

వెలుపలి లంకెలు[మార్చు]