పాంచరాత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

పాంచరాత్రమనగా, శ్రీవైష్ణవులు పరమపవిత్రంగా భావించే ఆగమ శాస్త్రం.[1] ఐదు రాత్రులనే అర్థం వచ్చే ఈ పాంచరాత్రం వెనుక ఎన్నో కథలూ, కథనాలూ కనిపిస్తాయి. ఈ పదం శతపథ బ్రాహ్మణంలోని 12వ సర్గలో కనిపిస్తుంది - మహావిష్ణువు ఐదు రాత్రుల పాటు బలి క్రతువును నిర్వహించి సర్వశక్తులను పొందడం. రామానుజులు ప్రతిపాదించిన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ ఆగమం ముఖ్య పాత్రను వహిస్తుంది. 200కు పైగా గ్రంథాలు ఇందులో భాగం. ఇందులో సా.శ.పూ. 3వ శతాబ్దానికి చెందినవి, సా.శ. 6 నుండి 9 మధ్య రాయబడినవి కనిపిస్తాయి.[2]

చరిత్ర

[మార్చు]

పాంచరాత్ర ఆగమం ఉదహరించిన కథనాలలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. హయవదనుడనే రాక్షసుడు వేదాలకు విధియయిన బ్రహ్మ నుండి తస్కరించి సముద్రగర్భానికి వెళ్ళి దాక్కున్నప్పుడు వేద క్రతువులు జరగక దేవతల శక్తులు తగ్గిపోసాగాయి. అప్పుడు అయిదు రాత్రుల పాటూ దేవర్షులంతా కలిసి అయిదు రాత్రుల పాటు మంత్రం లేనందువలన (వేదాలు లేవు కనుక మంత్రం లేదు) తంత్రంతో పూజ చేస్తారు. ఆ విధంగా విష్ణువు శక్తిమంతుడై మత్స్యావతారం దాల్చి హయవదనుణ్ణి చంపి వేదాలను రక్షిస్తాడు. తిరిగి హయగ్రీవ మూర్తిగా మారి వాటిని బ్రహ్మకు ఉపదేశిస్తాడు.అలా వేదాలు పోయి మరలా తిరిగి వచ్చిన వ్యవధి అయిదు రాత్రులలో భగవదారాధన వైదిక పద్ధతిలో కాకుండా తంత్రంలో జరిగింది. అందువలన ఆ పంచరాత్రుల పేరు మీద పాంచరాత్రం అని ఈ ఆగమశాస్త్రానికి పేరు పడింది.ద్వాపరయుగమంతా భగవదారాధనకు మూలం పాంచరాత్ర ఆగమశాస్త్రమే అని మనకు తెలుస్తున్నది. ద్వాపర యుగంలో నారదుడు తిరిగి ఈ శాస్త్రాన్ని రుక్మిణికి ఉపదేశించి శ్రీకృష్ణుని మూర్తిని పాంచరాత్ర ఆగమశాస్ర్తయుతంగా పూజించమని చెబుతాడు. ఆపై రుక్మిణి నుండి అందరికీ ఈ విషయం వ్యాప్తి చెందుతుంది. గౌడీయ సాంప్రదాయంలో కూడా ఈ పూజా పద్ధతి కనిపిస్తుంది.చారిత్రక ఆధారాల ప్రకారం రామానుజుల వారి కాలంలో ఈ ఆగమ శాస్త్రం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ఇది నేడు ప్రామాణికం.[3]

పదానికి అర్థం

[మార్చు]

పాంచరాత్రమనే పదానికి అర్థం - ఐదు రాత్రులతో సంబంధం ఉందని అర్థాన్ని సూచిస్తుంది.ఒక కథ ప్రకారం కేశవుడు (విష్ణువు లేదా నారాయణుడు) ఈ పరమరహస్యమయిన తాంత్రిక విద్యను మొటమొదటగా ఐదు రాత్రుల పాటూ అనంతుడికీ (ఆదిశేషుడు), గరుత్మంతుడికీ, విష్వక్సేనుడికీ, విధికారకుడైన బ్రహ్మకూ, రుద్రునికీ నేర్పిస్తాడు.
మరొక కథనం ప్రకారం రాత్రం అనే పదానికి జ్ఞానం, జ్ఞప్తి, తెలివి మొదలగు అర్ధాలు ఉన్నాయి. ఐదు రకాల తత్వ జ్ఞానాలను ప్రసాదిస్తుంది కాబట్టీ ఇది పాంచరాత్రమయింది. ఈ ఐదు జ్ఞానాలు:

 1. తత్వం
 2. ముక్తిప్రథం
 3. భక్తిప్రథం
 4. యౌగికం
 5. వైషాయికం

ఇంకొక కథనం ప్రకారం ఇది భగవంతుని ఐదు తత్వాలను బోధించే శాస్త్రం కాబట్టీ పాంచరాత్రమయింది. ఇవి:

 1. పర
 2. వ్యూహ
 3. విభవ
 4. అంతర్యామి
 5. అర్చ

దైవ దర్శనం

[మార్చు]

పదకొండవ శతాబ్దిలో రామానుజులు ఆది శంకరుల అద్వైతాన్ని తిరస్కరిస్తూ వైష్ణవులకు పాంచరాత్ర పద్ధతిని ఏర్పరచారు. పాంచరాత్రాగమనానికి అనువుగానే నారాయణుణ్ణి పరమాత్మగా నమ్మడం, దేవాధిదేవుడిగా కొలవడం కనిపిస్తుంది. రామానుజుల ప్రకారం పరమాత్మ ఐదు రూపాల్లో అవతరిస్తాడు: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. మనుషులు భగంతుణ్ణి చేరేందుకు ఈ ఐదు రూపాల్లో ఏదో ఒకటి లేదా ఎక్కువ రూపాలను ఆరాధించవచ్చు.

పర రూపం

పరమాత్ముడి రూపమే ఈ పర.

వ్యూహ రూపం

ఆరు గుణాలతో కూడుకుని ఉన్న వాసుదేవుడే మొదటి వ్యూహ మూర్తిగా గుర్తించబడ్డాడు. వాసుదేవుడి నుండి ఉద్భవించిన సంకర్షణుడిలో జ్ఞానము, బలము అనే గుణాలు ఉంటాయి. సంకర్షణుడి నుండి ఉద్భవించిన ప్రద్యుమ్నుడిలో ఐశ్వర్యము, వీర్యము (వీరత్వము) అనే గుణాలు ఉంటాయి. ప్రద్యుమ్నుడి నుండి ఉద్భవించిన అనిరుద్ధుడిలో శక్తి, తేజస్సు అనే గుణాలు ఉంటాయి. ఇలా ఈ రూపాలను ఆయా గుణాలకు అధిదేవతలుగా కీర్తిస్తూ పూజించడం పాంచరాత్రుల సంప్రదాయం.

అవతార రూపం

వ్యూహ రూపం యొక్క సిద్ధాంతానికి దగ్గరగా ఉండేదే ఈ రూపం. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యూహ రూపంలో పేర్కొన్న నలుగురూ వేరు వేరు సమయాలలో అవతారాలుగా ఈ భూమిపైకి వస్తారు.

అంతర్యామి రూపం

ఈ రూపం ప్రతీ మనిషిలోనూ ఉంటుందనేది నమ్మిక. ఈ నాలుగో రూపం ప్రతి మనిషిలోనూ అనిరుద్ధుడి ద్వారా నియంరించబడుతుంది. ఈ శక్తి ప్రతి ఒక్కరి హృదయంలో హృదయకమలంగా స్థాపించబడి ఉంటుంది. ఇది వ్యూహంలోని ఒక్కడయిన అనిరుద్ధుడే కానీ పరమాత్మ కాదన్నది పండితుల వాదన.

అర్చ రూపం లేదా అర్చావతారం

నారాయణీయం లోలా కాకుండా పాంచరాత్ర సంహితాలలో అర్చ రూపాన్ని భగవంతుని యొక్క స్వరూపంగా నమ్ముతారు. ఏదయిన జడ వస్తువు (విష్ణువు విగ్రహం లేదా పటం) ను సరియయిన పద్ధతిలో పాంచరాత్ర సంహితల ప్రకారం పూజించి, ప్రాణ ప్రతిష్ఠ చేస్తే, అందులోకి అద్భుతమయిన శక్తులు వచ్చి, విష్ణువు యొక్క శక్తిని ఆ వస్తువు సంతరించుకుంటుంది. ఆ విధంగా ప్రతిష్ఠించిన ఆ వస్తువుకు అనుదినం నిత్యపూజ చేయాల్సి ఉంటుంది. ఈ అర్చ ఆరాధనకూ మూర్తిపూజకూ చాలా తేడా ఉంది. మూర్తిపూజలో ఆరాధకుడికి విగ్రహం యొక్క అంగములపై దృష్టి ఉంటుంది (అంగ పూజ మొ॥). అలా చేయటం ద్వారా కొద్ది కాలానికి ఆరాధకుడి దృష్టి ఒక బిందువుకు కుచించుకుంటుంది, ఆపై మూర్తి అవసరం ఉండదు. కానీ అర్చ పద్ధతిలో విగ్రహంలో భగవంతుడిని ఆరాధకుడు అనుభవిస్తాడు. ఈ విధంగా పన్నిద్దరు ఆళ్వారులూ వివిధ దివ్య దేశాలలో భగవంతుని అనుభవించారు.

ఆగమ శాస్త్రాన్నిపాటించే దేవాలయాలు

[మార్చు]

ఈ ఆగమం ప్రకారం మంత్రం కన్నా భగవంతునిపై భక్తి పెక్కు రెట్ల ప్రభావం కలిగి ఉంటుంది. సంస్కృతంకన్నా ఆరాధకుడి మాతృభాషలో పూజలు చేయటం ఉత్తమంగా ఈ మతం నమ్ముతుంది. ఈ మతాన్ననుసరించి పూజలు జరిగే ఆలయాలు:

 1. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో నివేదన
 2. యాదగిరిగుట్ట నరసింహాలయం
 3. భద్రాచలం శ్రీరామ ఆలయం
 4. శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణువు ఆలయం
 5. కడప దేవునికడప ఆలయం
 6. అహోబిలం ఆలయాలు
 7. శ్రీరంగం ప్రధాన ఆలయం
 8. వంగిపురం శ్రీ వల్లభరాయ స్వామి ఆలయం
 9. srirangapuram Sri Mohana Ranganadha Swamy Alayam
 10. ఇతర దివ్యడేశాలన్నీ

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. edukondalu (2019-11-23). "పాంచరాత్ర ఆగ‌మం అంటే ఏమిటి..? దానివలన లాభం ఏమిటి?". ఏడుకొండలు. Archived from the original on 2020-07-21. Retrieved 2021-09-28.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-03-15. Retrieved 2014-01-05.
 3. స్వామి హర్షానంద, ది పాంచరాత్ర ఆగమాస్, ఎన్ ఇంట్రొడక్షన్

వెలుపలి లంకెలు

[మార్చు]