గుల్జారీలాల్ నందా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి వర్గం:1వ లోకసభ సభ్యులు తొలగించబడింది; వర్గం:1వ లోక్‌సభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగ...
పంక్తి 11: పంక్తి 11:
[[వర్గం:1998 మరణాలు]]
[[వర్గం:1998 మరణాలు]]
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:1వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:1వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:2వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:2వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:3వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:3వ లోకసభ సభ్యులు]]

17:04, 26 మే 2014 నాటి కూర్పు

గుర్జారీలాల్ నందా

గుర్జారీలాల్ నందా (జూలై 4, 1898 - జనవరి 15, 1998) భారత జాతీయ రాజకీయనాయకుడు. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణము తరువాత. రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణము తర్వాత. రెండు సందర్భములలో ఈయన నెల రోజుల లోపే, భారత జాతీయ కాంగ్రేసు కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. 1997లో ఈయనకు భారత రత్న పురస్కారం లభించింది.

తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము

నందాజూలై 4, 1898న అవిభాజిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్) లో ఉన్నది) లో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసము లాహోర్, ఆగ్రా మరియు అలహాబాద్ లలో జరిగినది. 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవి పొందాడు. అదే సంవత్సరము సహాయనిరాకరణోద్యమములో చేరాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్టైల్ కార్మిక సంఘము కార్యదర్శి అయ్యి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి జైలు కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు.